{"title":"కోస్తాంధ్ర కథలు","description":"","products":[{"product_id":"yaradakonda-ata-award-winning-novel","title":"YaradaKonda - ATA Award Winning Novel","description":"\n\u003cp\u003eజాలరుల కుగ్రామంగా మొదలైన విశాఖపట్నం , రెండో ప్రపంచ యుద్ధం తరువాత మహానగరంగా అవతరించడానికి మూలకారణమైన భౌగోళిక విశేషం యారాడ కొండ. విశాఖపట్నం ఎదుగుదలకు అదొక కొండగుర్తు. ఎంతో మందికి ఉపాధినీ, కొంత మందికి సంపదనూ ప్రసాదించిన బంగారు కొండ అది. ఆ కొండ విశాఖపట్నం కథను చెప్పుకొస్తే అది ఎలా ఉంటుంది? గడచిన వందేళ్ల కాలంలో అక్కడి మనుషులూ, వాళ్ల ఆశలు, ఆశయాలూ, వ్యధలూ, బాధలూ, సుఖ సంతోషాలనూ, అలాగే వీటన్నింటినీ నడిపించిన శక్తులనూ యారాడ కొండ నమోదుచేసి వినిపించిన గాథకు నవలా రూపం ఈ రచన. మూలాలను తెలుసుకున్నప్పుడే ఎదుగుదల అర్థవంతం కాగలదనే నమ్మికతో ఏరికూర్చిన సృజన ఈ 'యారాడ కొండ' నవల.\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44397769392175,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/yarada-konda-front-cover.webp?v=1754490206"},{"product_id":"amma-diarylo-konni-pageelu","title":"Amma Diarylo Konni Pageelu","description":"\n\u003cp\u003eAmma Diarylo Konni Pageelu - Novel by Ravi Mantri\u003c\/p\u003e\n\u003cp\u003eనాకో సంగతి చెప్పు... అసలు ఎవరైనా నీకు ఇంతకు ముందు ఉత్తరం రాశారా? ప్రేమలేఖలో, మామూలు లేఖలో. పోనీ నువ్వెప్పుడైనా రాశావా? మామూలుగా మనం రోజూ మాట్లాడుకునే మాటల్నే పొందిగ్గా పేర్చి కాయితం మీద పెడితే ఉత్తరం అయిపోతుందనుకునే అల్పసంతోషిని నేను. ఇవాళెందుకో ఇప్పటికిప్పుడే నీకో ప్రేమకథ చెప్పాలనిపించి, నీకు ఉత్తరాలు చదివే అలవాటుందో లేదో తెలీకుండానే రాసేస్తున్నాను.\u003cbr\u003e\nబహుశా నేను అమ్మకథని చెప్పాలనుకోవడం దగ్గర, అమ్మకి కూడా ప్రేమకథ ఉంటుందనుకోవడం దగ్గర ఈ ప్రయాణం మొదలై ఉండొచ్చు. వెన్నెల రాత్రుల్లో అలల్ని లెక్కపెడుతూ, కలల్ని దాచుకుంటూ నేను ఇష్టంగా రాసిన ప్రేమలేఖే నా ఈ అమ్మడైరీలో కొన్నిపేజీలు.\u003cbr\u003e\nఇది అమ్మ ప్రేమకథ.\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397795115055,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/adkp-front.webp?v=1754490236"},{"product_id":"kalavapudi-kathalu","title":"Kalavapudi Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eకలవపూడి కథలు  - గోదావరి జిల్లాల్లోని చిన్నిచిన్ని కథలు\u003cbr\u003eby Samba Shiva Thadavarthi A.K.A. @Kataari__\u003cbr\u003e\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఅప్పుడెప్పుడో చిన్నప్పుడు ప్రతి వేసవికి మీరంతా అమ్మమ్మ గారి ఊరికి వచ్చిపోయేవాళ్లు; ఆ ఊరు ఇంకా గుర్తుందా? ఆఁ గుండె లోతుల్లో ఏదోక మూలన ఉండే ఉంటుందిలే.... నేనే ఆ ఊరిని.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈ మధ్యన అసలు ఇటువైపు రావడమే మరిచిపోయారు కదా, అందుకే ఈసారి నేనే మీ ఇంటికొద్దామని ఇలా బయలుదేరాను. వస్తూ వస్తూ ఉట్టిచేతుల్తో వస్తే ఏం బాగుంటుందని, మన ఊరి మునసబు గారింటి దగ్గర నుండి మొదలుపెట్టి తూరుపు వీధి మీదగా బడి అవతల పిల్లకాలువ వరకు ఉన్న కథలు, ప్రేమకథలు, చిన్ని చిన్ని వ్యధలన్నీ కలిపి మూటకట్టి ముచ్చటగా ఇరవై కథల్తో ఇలా మీ చేతుల్లోకి చేరా. పదండి, ఈ గజిబిజి జీవితం నుండి కాసేపలా బయటకి వెళ్లి... చుక్కలు కురిసే రాత్రుల్లో మేడ పైనో, నిశ్శబ్దం నిండిన నదీ తీరాల్లోనో, ఊరంతా నిద్దురపోయినా మేల్కొని ఉండే గది వెలుతురులోనో కూర్చుని మాటాడుకుందాం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e- మీ సాంబశివ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397795180591,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kalavapudi-kathalu-front-1.webp?v=1754490240"},{"product_id":"nallavanthena-kathalu","title":"Nallavanthena Kathalu","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415934857263,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nalla_vanthena_front_cover.jpg?v=1754708302"},{"product_id":"kgh-kathalu","title":"KGH Kathalu","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416048988207,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kghfront.jpg?v=1754708100"},{"product_id":"burma-campu","title":"Burma Campu","description":"\u003cp\u003e\u003cspan\u003eBURMA CAMPU TELUGU STORIES - హరి వెంకటరమణ చదువరుల గుండెల్లోకి అడుగుపెట్టి, వాళ్ళకి అసలేమీ తెలియని జీవితపు లోతుపాతులు చెప్తూ, కొత్త అనుభవాల తడితో ఆకట్టుకున్నాడు. ఈ అనుభవాలు తెలియకపోతే, మన తెలుగు జీవితాల స్థానికతలో పెద్ద వెలితి వుండేదన్న చేదునిజాన్ని గ్రహించేలాగా చేశాడు. చమత్కారాలేమీ చేయకుండా, తిన్నగా కథ చెప్పడం రమణ శిల్పవిన్యాసం. అంతిమంగా అనుభవం గొప్పదనే స్పృహ కలిగించడం ఈ కథల విజయం. - అఫ్సర్(కవి, కథకుడు, సంపాదకుడు)\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Regi Achhulu","offers":[{"title":"Default Title","offer_id":44464970006575,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/burmacampkathalufront.jpg?v=1756397123"},{"product_id":"swatantra-స్వతంత్ర","title":"Swatantra (స్వతంత్ర)","description":"\u003cp\u003e\u003cspan\u003e“ఒకసారి చెప్తే అర్థం కాదూ? నీలాంటి ఆడాళ్ళు ఉన్నంతలో ఉంటే మంచిది” అతడి మాట కచ్చితంగా అతడి హృదయం నుండి ప్రతిధ్వనిస్తుంది. ‘నా లాంటి ఆడాళ్ళా? అంటే నేనేం చేసాను? ఈయన ఎందుకిలా అంటున్నారు? ఉన్నట్టుండి ఇంత చిత్రమైన మాటెందుకు పలికారు. ఆయన ఉద్దేశ్యమేమిటి? ఇష్టం లేకుంటే లేదని చెప్పాలిగానీ ఈ మాట ఊరికే ఎలా అనగలిగారు?’ ఆమెలో ఆవేదన తన్నుకొస్తూ “నేనేం చేశాను? ఎందుకలా అంటున్నారు?” అడిగింది కన్నీళ్ళ భారానికి బరువైన గొంతు సరిచేసుకుంటూ. “మీ ఆడాళ్లకు పాపులారిటీ పెరిగితే కళ్ళు నెత్తికెక్కుతాయి. మొగుడూ పిల్లలూ ఇవేం మీకు అవసరం ఉండదు. అందుకే ఈ చెత్త ఐడియాలు పక్కన పెడితే మంచిది. లేకుంటే అనవసరంగా నీ గొయ్యి నువ్వు తీసుకుంటావు” అతడి మాటలు కటువుగా ఆమె హృదయంలోకి చేరుకున్నాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Godavari Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44718602977327,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/swathantrafront.jpg?v=1764327261"},{"product_id":"agraharam-kathalu","title":"Agraharam Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan\u003eపుట్టినది గోదారొడ్డున - అమలాపురంలో, నాన్నగారి బదిలీల వల్ల చదువు చాలా చోట్లే జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీల్లో జెనెటిక్స్ లో పిహెచ్ డి., దాకా. ప్రస్తుతం బెంగుళూరులో నివాసం ఉద్యోగం. సంగీతమన్నా, సాహిత్యమన్నా ప్రాణం - రెండింటిలోనూ పెద్దగా ప్రావీణ్యం లేకపోయినా సరే! అడపా తడపా కథలంటూ నేనేవో రాసినా, పంపినవీ, ప్రచురించబడినవీ తక్కువే! గతంలో ఒకటి రెండు కథలూ, కవితలూ చిన్న చిన్న బహుమతులూ, ప్రశంసలూ పొందాయి. 'రచన' పత్రికలో వసుంధర దంపతుల చేత అభినందనలు అందుకోవడం ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e            కౌముది ఇంటర్నెట్ పత్రికలో మూడు సంవత్సరాలు ధారావాహికంగా ప్రచురించబడిన ఈ 'అగ్రహారం కథలు' నాకెంతో ప్రత్యేకమైనవి. నెలనెలకీ పెరిగిన ఆదరణతో నాకెంతో పేరు, ఎందరో అభిమానులని సమకూర్చాయి. పేరులో ఒకరకమయిన రాజసాన్నీ, కొంత గాంభీర్యాన్నీ సంతరించుకుని ఆంద్రదేశమంతటా ఉన్న చిన్న చిన్న గ్రామాలే అగ్రహారాలు. ఎదురెదురుగా చిన్నదీ, పెద్దదీ రెండు రాములవారి గుళ్ళూ ఆ ఊరి దేవుడి కాళ్ళు నిత్యమూ కడుగుతూ అప్పుడప్పుడు ఒద్దికగానూ, మరొకప్పుడు కాస్త ఉగ్రంగానూ ప్రవహించే కౌశికగా పిలవాడే గోదావరి. వెనకే పచ్చదనాల నెచ్చెలులు వరిచేలూ. వాటికి కాపలాగా నిలుచున్న అన్నదమ్ముల్లాంటి కొబ్బరిచెట్లూ.. ఇలా ఎంతో మనోహరంగా ఉన్నచోట ఎదురెదురుగా రోడ్డు కిరువైపులా ఉన్న పాతిక ఇళ్ళని కలిపి ఒక ఊరుగా కట్టేస్తే అదే ఈ అగ్రహారం. \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057884782639,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/agraharamkathalu.jpg?v=1773675981"},{"product_id":"ma-diguva-godavari-kathalu","title":"Ma Diguva Godavari Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eఈ దిగువ గోదారి కథలు రాయడానికి ముందు వంశీగారు అధ్యయనం చేసుకోవడం కోసం కొన్ని నెలల పాటు కారుల్లోనూ, పడవల మీదా ప్రయాణం చేసి ఇక్కడున్న గ్రామాలు, పల్లెలు, లంకల్లో మకాం చేసి ఇక్కడి జీవితాన్ని కళ్ళారా చూసి వింతలు, విడ్డూరాలను అక్కడి ప్రజలు చెప్పగా చెవులారా విని, స్పందించి అందరికీ ఆసక్తికరంగా వుండేలా రాశారు. ఈ కథలన్నిటికీ బాపూ వేసిన బొమ్మలు మామూలు బొమ్మలు కావు. రూపానువాదాలు. టీకా తాత్పర్యాలు, అద్భుత వ్యాఖ్యానాలు. స్వాతి వారపత్రికలో 52 వారాలు ప్రచురింపబడిన ఈ కథలు దేనికదే మాస్టర్ పీస్. తప్పక చదవండి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058135883823,"sku":null,"price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/madiguvagodavarikathalu.jpg?v=1773677404"},{"product_id":"galikondapuram-railway-gate","title":"Galikondapuram Railway Gate","description":"\u003cp\u003e\u003cspan\u003eమహారణ్యంలో చాలా ఎత్తయిన కొండల సమూహం మధ్యలోవున్న ఆ చిన్న స్టేషను పేరు గాలికొండపురం రైల్వేగేటు. స్టేషనుకి దిగువగా వుంది ఊరు.  అప్పుడు సమయం రాత్రి 12 గంటలు. వచ్చే రైళ్ళేమీ లేకపోవడంతో నిశ్శబ్దంగా వుందా ప్రాంతం. చేతితో తాకితే చీకటి పొడి రాలుతుందా అనిపించేటంతటి కటిక చీకటి. నిద్రపోని రుషిపక్షుల అరుపులు. ప్రేతాత్మగొంతులా ఎత్తయిన గాలికొండ మీంచి సుళ్ళు తిరుగుతూ వీస్తున్న గాలులు. ఎదుటి మనిషి స్పష్టంగా కన్పించనంత దట్టంగా మూసుకుపోయిన మంచు. కేన్సర్లా నరాలు కొరుకుతున్న చలికి మెలికలు తిరుగుతున్న ప్రకృతి కన్య, చీకటి దుప్పటి నిలువునా కప్పుకుంది. గడ్డ కట్టిన ఆ అందంలో చాలా పొద్దు గడిచింది. హఠాత్తుగా శబ్దాలు… స్టేషను మధ్య రైలుపట్టాల మధ్యనున్న ఉడెన్ స్లీపర్స్ మీద వేగంగా పరిగెడ్తున్న బలిష్టమైన ముగ్గురు వ్యక్తుల్ని చేతిలో రివాల్వర్తో ఛేజ్ చేస్తున్నాడతను. కొంతదూరం వెళ్లాక రైలుబాట పక్కనే లోయలోకి వెళ్ళడానికి వున్న చిన్న కంకర దారిలోకి దిగి జరజరా జారి, దొర్లి, క్షణాల్లో మాయమయ్యారు ముగ్గురూ. అది గమనించని అతను తిన్నగా ముప్ఫైఏడో నెంబరు టన్నల్లో పరుగెట్టి, అలా కొంతదూరం వెళ్ళాక ఆగి వాళ్ళు ఎటువెళ్ళారో అర్థంగాక అటు ఇటు తచ్చాడుతూ కొన్ని క్షణాలు ఒకచోట ఆగాడు. అంతే- రింగ్ ఆకారంలో వుండి గుప్పెటికి సరిపడే చుట్టుకొలతతో వున్న తాడొకటి మెరుపువేగంతో అతని మెడలో పడటం, విడదీసుకునే ప్రయత్నం చేసేలోపే అది బలంగా బిగుసుకుపోవడం జరిగిపోయాయి. ఊపిరాడక గిలగిల్లాడుతున్న అతని ముక్కుకి క్లోరోఫాం నింపిన తెల్లటి సిల్కు గుడ్డ మెత్తగా అద్దబడడంతో క్షణాల్లో స్పృహతప్పి పట్టాలమీద క్రాస్గా పడిపోయాడు. సిగ్నల్లో ఎర్రదీపం ఆరి పచ్చదీపం వెలగడంతో ముగ్గురూ అక్కడ్నుంచీ పరుగుపెడ్తూ వెళ్ళిపోయారు.  కాస్సేపటికి అతను పడున్న పట్టాలమీదుగా ఏభై లోడు వేగన్లు బిగించివున్న పొడుగాటి గూడ్సు ట్రైను శరవేగంగా ప్రయాణిస్తూ వస్తోంది. పడివున్న అతనిలో కదలిక లేదు. బాగా దగ్గరకొచ్చేసిన ట్రైను అతన్ని ముక్కలుగా చీల్చుకుపోవడానికి ఇక పది అడుగుల దూరం మాత్రమే ఉంది. అతనికి క్లోరోఫాం మత్తు వదలడానికి ఇంకా రెండు గంటలు పడ్తుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058433876015,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/GalikondapuramRailwayGate.jpg?v=1773683980"},{"product_id":"ravvala-konda","title":"Ravvala Konda","description":"\u003cp\u003e\u003cspan\u003e‘‘రాత్రంతా నాకు నిద్రరాలేదు. మనసునిండా చీకటి. ఆ చీకట్లో నిన్న రాత్రి మనం కన్న ఆ కల ఎక్కడయినా కనిపిస్తుందేమోనని వెలిగించిన ప్రమిదని అరచేతుల్లో పట్టుకుని వెతికాను. ఎక్కడా కనిపించలేదు మనం ప్రసవించిన ఆ అపురూపమైన కల, చివరికి  తెలిసింది నువ్వు లేనప్పుడు ఆ కల నాకెందుకు కనిపిస్తుందీ అన్న సత్యం.  చూడూ! నువ్వు నా ఆరోప్రాణం. ఇన్నాళ్ళు ఎలా బ్రతికానో నాకు తెలీదు. నువ్వు లేకుండా ఇక ముందు బతకడం మాత్రం నాకు సాధ్యం కాదు.’’ ఆ వెన్నెల రాత్రి వెలగచెట్టు నీడలో అలా చాలాసేపు మాట్లాడింది రాజకుమారి.  ‘అంత గొప్పమనిషి అనుకోకుండా నా ప్రాణంలో ప్రాణం అయింది. ఈ మనిషికి దగ్గరయ్యాను. సరే దక్కించు కోగలనా చివరికి?’ అనుకున్నాడు రవ్వలకొండ.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058451308591,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ravvalakonda.jpg?v=1773684557"}],"url":"https:\/\/books.ataka.in\/collections\/%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b0%be%e0%b0%82%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2%e0%b1%81.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}