{"title":"సీమ SWAG","description":"\u003cp\u003eSeema Swag\u003c\/p\u003e","products":[{"product_id":"valapateddu","title":"Valapateddu","description":"\n\u003cp\u003eవర్డ్స్‌‌వర్త్‌‌ని ప్రకృతి కవి అంటారు. కీట్స్‌‌ని మనిషి కవి అన్నారు. అయితే, “వర్డ్స్‌‌వర్త్‌‌ ప్రకృతిలో మనిషి ఉంటాడు. కీట్స్ మనిషిలో ప్రకృతి ఉంటుంది.” అంటాడు జి. కళ్యాణరావు. ఇప్పుడే రాస్తున్న రచయితని అట్లా పొల్చీ పెద్ద చేసి, అతనికి కొమ్ములు తెప్పించి అతనిలో కథకుడిని చంపేయడం ఉద్దేశం కాదు గాని, వివేక్ లంకమల కథలు చదివినప్పుడు కళ్యాణరావు ఎప్పుడో పంచుకున్న ఈ మాట గుర్తొచ్చింది. ఈ కథల్లో ప్రకృతినీ మనిషినీ భాగం చేశాడు వివేక్. నిజానికి చరిత్ర పొడుగుతా మనిషీ ప్రకృతీ వీడదీయలేనంతగా కలిసే ఉన్నాయి. అదే వివేక్ కథల్లో ప్రతిఫలిస్తుంది. ప్రకృతి ధర్మం ప్రకృతి చేసింది. మనిషి తన జీవిక కోసం తన ధర్మం నిర్వర్తించాడు. ఎప్పుడైతే మనిషి ప్రకృతి మీద ఆధిపత్యం చేయడానికి పూనుకున్నాడో ప్రకృతీ ప్రతిఘటించడం మొదలుపెట్టింది. కొండలు తొవ్వినప్పుడు కొండచరియలు విరిగిపడ్డాయి. అడవిని ధ్వంసం చేసినప్పుడు ఎండలు విజృంభించాయి. అడవుల్లో బతికే పులులూ, ఎలుగుబంట్లు, ఏనుగులు పల్లెల మీద పడ్డాయి. ఈ అకస్మాత్తు వరదలన్నీ ప్రకృతిపై మనిషి చేసిన అత్యాచారం తాలుకు ఫలితాలే. లంకమల దారులు అనే ట్రావెలాగ్‌లోనూ కథల్లో ఉండే శిల్పాన్ని సాధించిన వివేక్ రాసిన కథలివి. కథలు కాదని రాసిన వాటిల్లోనే కథ వుంటే, కథ అంటూ వస్తున్నదాంట్లో ఎంత వుండొచ్చు? మేం చదివాం. నచ్చాయి. మీరూ చదవండి. మునుపటికన్నా ప్రేమిస్తారు. - అరుణాంక్ లత ఎడిటర్, ఛాయ\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397785481263,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Valapateddu-Front.webp?v=1754490225"},{"product_id":"lankamala-daarullo","title":"Lankamala Daarullo","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413000024111,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156489.jpg?v=1754589570"},{"product_id":"bahuda-bathuku-kathalu","title":"Bahuda Bathuku Kathalu","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415927877679,"sku":null,"price":190.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Bahudha_Front_cover.jpg?v=1754708235"},{"product_id":"nadoori-midde","title":"NADOORI MIDDE","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415932923951,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nadoori_midde_front.jpg?v=1754708295"},{"product_id":"parveta-kathalu","title":"Parveta Kathalu","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415934922799,"sku":null,"price":199.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Parveta_front_cover.jpg?v=1754708397"},{"product_id":"gaajula-sanchi","title":"Gaajula Sanchi","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416003211311,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gajulasanchifront.jpg?v=1754708058"},{"product_id":"saptha-bhoomi-శప్తభూమి","title":"Saptha Bhoomi - శప్తభూమి","description":"\u003cp\u003e\u003cspan\u003eరాయలసీమ - అందులోనూ అనంతపురం జిల్లా పరిధిలో అత్యుత్తమ కథకులు ఉన్నారు. అలాంటివారిలో సన్మిత్రుడు బండి నారాయణస్వామి కూడా ఒకరు. గత మూడు దశాబ్దాలలో స్వామిగారి అనేక కథలను చదివాను. వాటిలోని శైలిశిల్పాలకు, వస్తు వైవిధ్యానికి, రైతాంగం పట్ల ఆసక్తికి ఆశ్చర్యపోయాను. వారి కొన్ని కథలను నావే అన్నట్టు భావించి కన్నడలోకి అనువదించాను. మాంత్రిక వాస్తవికవాద పరంపరకు పునాది వేసిన స్పానిష్ రచయిత మార్క్వెజ్ ను గుర్తుకు తెచ్చేలా రాసేటటువంటి స్వామి అపురూపంగా ‘శప్తభూమి' అనే చారిత్రాత్మక నవల రాశారు. - ఈ నవలలో అనేక గొప్ప పాత్రల వల్ల, ఘటనల వల్ల పద్దెనిమిదవ శతాబ్దపు కథను వర్తమానానికి అలవరుచుకునే కార్యాన్ని రచయిత బండి నారాయణస్వామి అత్యంత నైపుణ్యంతో నిర్వహించారు. ఒక్కమాటలో చెప్పాల్సి వస్తే ఇది రాజు కేంద్రితమైన నవల కాదు. రాజ్యాన్ని కేంద్రంగా చేసుకున్న నవల. ఇది రాయలసీమ చారిత్రక నవల దళిత బహుజన చారిత్రక నవల --డా||కుం.వీరభదప్పు ప్రఖ్యాత కన్నడ రచయిత SapthaBhumi, Sapthabhoomi, Saptabhumi, Sapthabhumi.Shapthabhumi, Shaptha bhumi, Shaptha Bhoomi\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475184218159,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sapthabhumif.jpg?v=1756809322"},{"product_id":"pottelu","title":"POTTELU","description":"\u003cp\u003e\u003cspan\u003eమనుషులు ఏకాంతాన్ని కోరుకోవచ్చు కానీ, ఎప్పటికీ ఒంటరి కాలేరు. తనకు తానుగా ఏదో ఒక బంధాన్ని వెతుక్కుంటారు. సత్యం పొట్టేలుని వెతుక్కున్నట్టు. కాశినాయన క్షేత్రంలో తనని తాను వెతుకున్నట్టు. దూరమైన మనుషుల స్థానంలో ఆ ఖాళీని పూర్తి చేసే మరేదైనా నింపాలనే తపన ఉన్నంత వరకూ మనుషులు ఒంటరిగా ఉండలేరు. సొంత నేల మీద నుంచి ఓ పిలుపు వెంటాడుతూనే ఉంటుంది. తల్లీ కొడుకులుగా పైకి కనిపించే కథ మార్మికంగా ఈ ప్రకృతికీ మనిషికీ ఉండే లోతైన అనుబంధాన్ని చెబుతుంది. నవలలో అమెరికా వలస అనేది కేవలం జియోగ్రాఫిక్ మార్పు కాదు, పొట్టేలు కేవలం ఒక జంతువు కాదు. మహిళా రైతుగా, తల్లిగా వేదన పడే సత్యం, మల్లేష్ ఒకడికే తల్లి కాదు. మానసికంగా సొంత నేలనీ, కోల్పోతున్న అనుబంధాలనీ గుర్తు చేసే ప్రతీకలు. తాత్వికతా, వాస్తవికత కలిసిపోయిన ఈ \"పొట్టేలు\" తెలుగులో మరో అద్బుతమైన రచనగా నిలుస్తుంది. - నరేష్కుమార్ సూఫీ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500028096559,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/POTTELU.jpg?v=1757675502"},{"product_id":"kunderu-sakshigaa","title":"Kunderu Sakshigaa","description":"\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eకొత్త తరం రచయితల్లో సురేంద్రది ఒక ప్రత్యేక శైలి. మూడేళ్లలో మూడు పుస్తకాలు ప్రచురించి సాహిత్య ఎకాడమీ యువ పురస్కార్క రెండు సార్లు నామినేట్ అయ్యి, ఈ తరం రచయితల్లో ముందు వరసలో నిలబడ్డాడు సురేంద్ర. రాయలసీమ మట్టి పరిమళం, స్థానిక భాషా సౌందర్యం, మానవ సంబంధాల సంక్లిష్టతను అద్భుతంగా మిళితం చేస్తూ రచనలు చేస్తున్న సురేంద్ర శీలం రెండవ నవల “కుందేరు సాక్షిగా!” క్రిష్టిపాడు అనే గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని, తరాలుగా సాగే ఆధిపత్య పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. నరసింహస్వామి ఆలయ భూమి చుట్టూ అల్లుకున్న రాజకీయం, గ్రామాధికారం కోసం నారపురెడ్డి, తిమ్మారెడ్డి వర్గాలు చేసే కుయుక్తులను తనదైన శైలిలో ఈ నవలలో చిత్రించాడు. అయితే, ఈ రాజకీయ జ్వాలల మధ్య, డాక్టర్ చదువుతున్న ప్రభాకర్, రికార్డింగ్ డాన్స్ కళాకారిణి శ్రావణిల నిస్వార్థమైన ప్రేమ చిగురిస్తుంది. వారి ప్రేమకు సమాజంలో ఎదురయ్యే అవమానాలు, అన్యాయాలు మరియు కుల-వర్గ విభేదాలను ఈ నవల ప్రశ్నిస్తుంది. శ్రావణి 'మర్యాద' గురించి, ప్రభాకర్ తన 'సామాజిక బాధ్యత' గురించి చేసే పోరాటాలు కథకు జీవం పోస్తాయి. ఈ నవలలో గుర్రన్న వంటి పాత్రల స్నేహం, శేఖర్ వంటి ఆదర్శవంతమైన వ్యక్తులు చూపిన ఆశయం మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. తన ప్రాంతంలోని సాధారణ మనుషులు, వారి ఆశలు, నిస్సహాయతలు, ఎత్తు పల్లాలను కథలో నిలబెట్టడంలో సురేంద్ర చేసిన కృషి అభినందనీయం. రూరల్ నవలలకు పేరుగాంచిన కేశవరెడ్డి గారి శైలికి వారసత్వాన్ని అందిస్తూ, సురేంద్ర శీలం, తెలుగు రాష్ట్రాల సాహిత్యాభిమానుల గుండెల్లో బలంగా నాటుకునే నిజమైన మట్టి కథను సృష్టించారు. ఈ నవలలోని ప్రతి పేజీ గ్రామీణ జీవన చిత్రణకు, భావోద్వేగాల తీవ్రతకు నిదర్శనం.\u003c\/span\u003e\u003c\/div\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44862925799471,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/KunderuSakshigacover.jpg?v=1768307710"}],"url":"https:\/\/books.ataka.in\/collections\/%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae-swag.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}