{"title":"150 Club","description":"","products":[{"product_id":"khwaab-of-love-and-revoultion","title":"Khwaab of love and revoultion","description":"\n\u003cp\u003e\"మనిషిని యేకాకిని చేసే ప్రేమరాహిత్యాన్ని, విద్వేషాన్ని, హింసని, వివక్షని ద్వేషంతో కాకుండా తన అక్షరాలనిండా ప్రేమ నింపుకుని తడమడమే అరుణాంక్ ‘ఖ్వాబ్’ ప్రత్యేకత.యీ లేఖా రచనలో మంచి భావుకత, సౌందర్యం వుంది. చలం ప్రేమలేఖలల్ని అప్పట్లో దాచుకు దాచుకు చదివేవాళ్ళం... యిప్పుడు అరుణాంక్ ‘ఖ్వాబ్’ లేఖలు రాయడం, అందునా ప్రేమని రాయడం మరిచిపోయిన మనందరిలో మళ్ళీ ప్రేమలేఖలు రాయాలనే వుత్సాహాన్ని తట్టిలేపుతుంది. విప్లవం, ప్రేమ రెండూ వేరుకాదనీ, విప్లవం అంటే మనిషితనంపై రాజీలేని ప్రేమ అని గుర్తుచేస్తుంది.\" - ప్రో. చల్లపల్లి స్వరూపరాణి\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397724139567,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/khwaab-book-f.webp?v=1754490165"},{"product_id":"pachha-bottu","title":"PACHHA BOTTU","description":"\n\u003cp\u003eThis Novel booked by C Sujatha, who worked as Editor in Andhra Jyothi, Udayam, Harathi, etc. She worked as script writer in ETV2, Sakhi, Vanitha etc.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397730693167,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/pachha-bottu-book-f.webp?v=1754490169"},{"product_id":"uniki","title":"UNIKI","description":"\n\u003cp\u003eఒక కథో, కవితో, నవలో చదివితే నిన్ను పట్టుకుని కుదిపెయ్యాలి. ప్రేమతోనో లేదూ కోపంతోనో. అయితే, ప్రతిదీ ఖచ్చితంగా కుదిపెయ్యాలనే నియమేమీ లేదు. కొన్ని ఆ సమయానికి హాయినిస్తాయి. ఈ కథలు చదివినప్పుడు కాసేపు బ్లాంక్ అవుతాం. contemporarywomen stories అంటాం కాని ఇవి contemporary పురుషులు చదవాల్సిన కథలు. పుస్తకాల్లో యుద్ధం గురించిన పాఠం ఉందంటే యుద్ధం తాలుకు భీభత్సం నుండి యుద్ధం వద్దని నేర్చుకుంటారని. ఇవీ అంతే. కొన్ని ఎలా ఉండాలో చెబితే, ఇంకొన్ని ఎలా ఉండకూడదో చెబుతాయి.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397733937199,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/uniki-f.webp?v=1754490172"},{"product_id":"nalla-pillanagrovi","title":"NALLA PILLANAGROVI","description":"\n\u003cp\u003eSHORT STORIES BASING ON VILLEGE BACKGROUND, WRITTEN BY YOUNGSTER, GUNDLA VENKATANARANA.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397740359727,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nalla-pillanagrovi.webp?v=1754490180"},{"product_id":"charminar-kathalu","title":"Charminar Kathalu","description":"\n\u003cp\u003ePARAVASTHU LOKESHWAR CHARMINAR KATHALU SHORT STORIES\u003c\/p\u003e\n\u003cp\u003eఅప్పటికి హైద్రాబాద్ సంస్థానం పై పోలీస్ యాక్షన్ జరిగి మూడు సంవత్సరాలు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి నాలుగు సంవత్సరాలు. దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగింది కూడా అదే సంవత్సరం. యాఖుత పురా రైల్వే స్టేషన్ దగ్గరి రైన్ బజార్ పుట్టి పెరిగి ఐదో తరగతి కామ్యాఐన అమ్మకు గాంధీ, నెహ్రూ, పటేల్ అంటే దేవుండ్లతో సమానం. అట్ల ఏడుపదుల క్రింద ఆఖరి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్ మూసీనది తీరాన కట్టించిన ఉస్మానియా సర్కారీ దవాఖానాల నేను కండ్లు తెరిచి ఈ భూమ్మీదపడిన. చందమామ కథల పత్రిక నుండి విశ్వనాథ నవలల వరకూ చదివే మా అమ్మకు నా పేరు ఖరారు లక్ష వరహాల సమస్యగా మారింది. అరుదైన అపురూపమైన పేరు పెట్టాలని ఆమె ఆలోచన. దాదాపు సంవత్సరం కావొస్తున్నా సరిఐన పేరే ఆమెకు ఇంకా దొరకలేదు. పిల్లల పేర్లు తల్లితండ్రుల సంస్కారానికి ప్రతిరూపాలు.\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44397775847471,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Charminar-kathalu-Front-cover.webp?v=1754490214"},{"product_id":"gangaraajam-bidda","title":"Gangaraajam Bidda","description":"\n\u003cp\u003eGangaraajam Bidda | Collection of Short Stories\u003cbr\u003e\nby Poodoori Rajireddy\u003cbr\u003e\n“మొత్తం సృష్టి విన్యాసాన్ని వ్యాఖ్యానించడానికి నువ్విక్కడ లేవు, సరిపోవు.”\u003c\/p\u003e\n\u003cp\u003e“మనసు అనేది తక్షణ, సుదూర జ్ఞాపకాల మైదానం. అక్కడి ఆటే సాహిత్యానికి మెటీరియల్‌‌ అవుతుంది. కాకపోతే, కలల్లో కొత్త ఉనికిని సంతరించుకున్నట్టుగానే, సాహిత్యంలోనూ వాస్తవ జీవితం తన రూపును మార్చుకోవచ్చు. అయితే, సాహిత్యం దానికదే ముఖ్యమే అయినా, జీవితం తన అనుభవాలతో ఇచ్చే తీవ్రతలో ఇది ఏమంత ప్రాధాన్యం ఉన్నది కాదు. అలాంటప్పుడు మరెందుకు రాస్తాం? ఏమో! ఏ జవాబు అయినా పేలవమైనదే అవుతుంది. ఆ ‘చెప్పలేనితనం’ మనల్ని చాలా పనులు చేయిస్తుంది. నాతో ఇట్లా కొన్ని కథలు రాయించింది. ఒకటి మాత్రం నిజం; కళారూపం ఏదైనా సరే, అది ఆ మనిషికి సంబంధించిన అత్యుత్తమ పార్శ్వం. ద బెస్ట్‌‌! ఈ వచన కళలో భాగం కావడం అనేది నా జీవితంలోని కొన్ని క్షణాలకు అందివచ్చిన సార్థకత.”\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397782204463,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Gangarajam-Bidda-Front.webp?v=1754490217"},{"product_id":"son-of-jojappa","title":"Son of Jojappa","description":"\n\u003cp\u003eఇటీవలి కాలంలో తెలుగులోనూ sexuality కి సంబంధిచిన చర్చ ప్రధాన స్రవంతిలో చాలానే జరిగింది. అయితే, ఆ చర్చ సైద్దాంతిక, పండిత చర్చను దాటి సాహిత్యంలోకి వచ్చింది తక్కువే. వేళ్ళమీద లెక్కించే రచనలు వచ్చినా వాటిపై జరగాల్సినంత చర్చ జరగలేదు. Sexuality ఉద్యమాలను అస్తిత్వ ఉద్యమాల కోణంలోనే చూస్తున్నప్పుడు “వాటిని గురించిన సాహిత్య వ్యక్తీకరణా ఆ సమూహం వాళ్ళే చేయాలా? లేదూ ఆ విషయం తెలిసిన బయటి వారు ఎవరైనా చేయవచ్చా?” అనేది ఎప్పుడూ ఎదుర్కొనే ప్రశ్న. అయితే, ఆ సమూహంలోని వ్యక్తులే ఆ విషయాలను సాహిత్యంలోకి తీసుకునివచ్చినప్పుడు వ్యక్తమయ్యే pain ని బయటి వారు తీసుకుని రాలేరు అనేది సత్యం. pain ఒక్కటే సాహిత్యం అవ్వదు గనుక, సాహిత్యం తెలిసిన వారు లేదా రాస్తున్నవారు చేసే వ్యక్తీకరణ empathetic గా ఉంటుంది. ఇది అట్లా బయటి సమూహం నుండి రాసిన నవల. అయితే, అస్తిత్వ ఉద్యమాల సాహిత్యం వచ్చిన తొలినాళ్లలో దాన్ని సాహిత్యంగా గుర్తించ నిరాకరించడమూ, మౌనం పాటించడమూ మనకు తెలుసు. ఇప్పుడు sexuality మీద వస్తున్న సాహిత్యం పట్లా అదే మౌనం కనబడుతోంది. ఇది ఆ మౌనాన్ని బద్దలుకొట్టే ‘నవల’ అని మేం భావిస్తున్నాం. సాహిత్యంలోకి దీన్ని కొత్త చేర్పుగా గుర్తిస్తున్నాం. ఇప్పుడు ఇది మీ చేతుల్లోకి. చర్చల్లోకి.” – అరుణాంక్ లత\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397788692527,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Son-of-Jojappa-Front.webp?v=1754490230"},{"product_id":"pranaya-hampi-historical-novel","title":"Pranaya Hampi (Historical Novel)","description":"\n\u003cp\u003eప్రణయ హంపీ. చారిత్రిక కాల్పనిక నవల. తెలుగునాట జరిగిన అతి పెద్ద చివరి యుద్ధం రక్కసి - తంగడి యుద్ధం. ఆ యుద్ధం విజయనగర రాజ్య రూపు రేఖల్నీ, చరిత్రనూ మార్చింది. రాయల వంశ పాలన ముగిసింది. ఆ యుద్ధాన్నీ, యుద్ధకాలంలో ప్రేమకథనూ బిగిసడలకుండా అల్లిన నవల ఈ ప్రణయ హంపీ. కథకుడిగా \"ఊరి మర్లు\" పుస్తకంతో పేరుగాంచిన మారుతీ పౌరోహితం నుండి వచ్చిన మొదటి నవల ఇది. పుస్తకం చేతిలోకి తీసుకుంటే అక్షరాల వెంట మీరూ 16వ శతాబ్దపు విజయనగర వీధుల్లో తిరగాడుతారు.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397791903791,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Hampi-Front.webp?v=1754490233"},{"product_id":"kalavapudi-kathalu","title":"Kalavapudi Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eకలవపూడి కథలు  - గోదావరి జిల్లాల్లోని చిన్నిచిన్ని కథలు\u003cbr\u003eby Samba Shiva Thadavarthi A.K.A. @Kataari__\u003cbr\u003e\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఅప్పుడెప్పుడో చిన్నప్పుడు ప్రతి వేసవికి మీరంతా అమ్మమ్మ గారి ఊరికి వచ్చిపోయేవాళ్లు; ఆ ఊరు ఇంకా గుర్తుందా? ఆఁ గుండె లోతుల్లో ఏదోక మూలన ఉండే ఉంటుందిలే.... నేనే ఆ ఊరిని.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈ మధ్యన అసలు ఇటువైపు రావడమే మరిచిపోయారు కదా, అందుకే ఈసారి నేనే మీ ఇంటికొద్దామని ఇలా బయలుదేరాను. వస్తూ వస్తూ ఉట్టిచేతుల్తో వస్తే ఏం బాగుంటుందని, మన ఊరి మునసబు గారింటి దగ్గర నుండి మొదలుపెట్టి తూరుపు వీధి మీదగా బడి అవతల పిల్లకాలువ వరకు ఉన్న కథలు, ప్రేమకథలు, చిన్ని చిన్ని వ్యధలన్నీ కలిపి మూటకట్టి ముచ్చటగా ఇరవై కథల్తో ఇలా మీ చేతుల్లోకి చేరా. పదండి, ఈ గజిబిజి జీవితం నుండి కాసేపలా బయటకి వెళ్లి... చుక్కలు కురిసే రాత్రుల్లో మేడ పైనో, నిశ్శబ్దం నిండిన నదీ తీరాల్లోనో, ఊరంతా నిద్దురపోయినా మేల్కొని ఉండే గది వెలుతురులోనో కూర్చుని మాటాడుకుందాం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e- మీ సాంబశివ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397795180591,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kalavapudi-kathalu-front-1.webp?v=1754490240"},{"product_id":"attar","title":"Attar","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412955000879,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156515.jpg?v=1754589570"},{"product_id":"kaagitalaku-avatala","title":"Kaagitalaku Avatala","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412973842479,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156567.jpg?v=1754589570"},{"product_id":"aido-goda","title":"Aido goda","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412984000559,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156557.jpg?v=1754589570"},{"product_id":"untitled-7aug_23-52","title":"Chali cheemla kavathu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413025058863,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/chali_cheemala_kavathu_f.jpg?v=1754672930"},{"product_id":"sambala","title":"Sambala","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413163601967,"sku":null,"price":140.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156537.jpg?v=1754589570"},{"product_id":"sanchaari-1","title":"Sanchaari","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413170155567,"sku":null,"price":140.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156561.jpg?v=1754589570"},{"product_id":"panakam-on-the-rocks","title":"Panakam on the rocks","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413217734703,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156486.jpg?v=1754589570"},{"product_id":"kanchana-seetha","title":"Kanchana seetha","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413218160687,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156503.jpg?v=1754589570"},{"product_id":"kaasintha-prema-kaavali","title":"Kaasintha prema kaavali","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413222125615,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kaasinthapremakavali.jpg?v=1757589220"},{"product_id":"diguvintodi-kathalu","title":"Diguvintodi kathalu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413223075887,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156492.jpg?v=1754589570"},{"product_id":"2-1-0","title":"2+1=0","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413228679215,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156532.jpg?v=1754589570"},{"product_id":"athade-oka-samudram","title":"Athade oka samudram","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413231431727,"sku":null,"price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156546.jpg?v=1754589570"},{"product_id":"samantharaalu","title":"Samantharaalu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413233594415,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156507.jpg?v=1754589570"},{"product_id":"deva-rahasyaalu","title":"Deva Rahasyaalu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413235822639,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156499.jpg?v=1754589570"},{"product_id":"alaa-jaragaledey","title":"Alaa Jaragaledey","description":"\u003cp\u003eAlaa Jaragaledey Telugu Book\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44415956287535,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AlaaJaragaledeyFrontcover_80a4c9be-3a19-421f-95b4-b02642cc2074.jpg?v=1754708034"},{"product_id":"gaajula-sanchi","title":"Gaajula Sanchi","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416003211311,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gajulasanchifront.jpg?v=1754708058"},{"product_id":"harshaayanam","title":"Harshaayanam","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416021233711,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/HarshaayanamFrontcover.jpg?v=1754708071"},{"product_id":"kgh-kathalu","title":"KGH Kathalu","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416048988207,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kghfront.jpg?v=1754708100"},{"product_id":"lohanadi-poetry","title":"Lohanadi (Poetry)","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416058327087,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/lohanadhipoetryfront.jpg?v=1754708105"},{"product_id":"cycle-donga","title":"Cycle Donga","description":"\u003cp\u003eసైకిల్ దొంగ by అనిల్ బత్తుల పబ్లికేషన్స్\u003c\/p\u003e\n\u003cp\u003eఒక వ్యక్తి సైకిల్ పోగొట్టుకుంటాడు. ఆ సైకిల్ చివరికి అతనికి దొరికిందా\u003c\/p\u003e\n\u003cp\u003eలేదా? అనే అంశంతో వున్న ఈ నవలను ఇటాలియన్ రచయిత బార్టొలిని రాసాడు. ఈ నవల\u003c\/p\u003e\n\u003cp\u003eఆధారంగా 1948లో 'BICYCLE THIEVES' అనే ఇటాలియన్ సినిమా విట్టోరియో డి\u003c\/p\u003e\n\u003cp\u003eసికా దర్శకత్వంలో వచ్చింది. మన తెలుగు రచయిత కేశవరెడ్డికి, బెంగాలి\u003c\/p\u003e\n\u003cp\u003eదర్శకుడు సత్యజిత్‍రే‍కి కూడా ఈ సినిమా చాలా ఇష్టం. ఈ నవలను శ్రీనివాస\u003c\/p\u003e\n\u003cp\u003eచక్రవర్తి అనువదించారు.\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44418800025647,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/cycledongaf.jpg?v=1754888654"},{"product_id":"burma-campu","title":"Burma Campu","description":"\u003cp\u003e\u003cspan\u003eBURMA CAMPU TELUGU STORIES - హరి వెంకటరమణ చదువరుల గుండెల్లోకి అడుగుపెట్టి, వాళ్ళకి అసలేమీ తెలియని జీవితపు లోతుపాతులు చెప్తూ, కొత్త అనుభవాల తడితో ఆకట్టుకున్నాడు. ఈ అనుభవాలు తెలియకపోతే, మన తెలుగు జీవితాల స్థానికతలో పెద్ద వెలితి వుండేదన్న చేదునిజాన్ని గ్రహించేలాగా చేశాడు. చమత్కారాలేమీ చేయకుండా, తిన్నగా కథ చెప్పడం రమణ శిల్పవిన్యాసం. అంతిమంగా అనుభవం గొప్పదనే స్పృహ కలిగించడం ఈ కథల విజయం. - అఫ్సర్(కవి, కథకుడు, సంపాదకుడు)\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Regi Achhulu","offers":[{"title":"Default Title","offer_id":44464970006575,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/burmacampkathalufront.jpg?v=1756397123"},{"product_id":"selfie","title":"SELFIE","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44466175868975,"sku":null,"price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Selfiebookfrontcover.jpg?v=1756443260"},{"product_id":"vidhi-a-novel","title":"VIDHI - A Novel","description":"\u003cp\u003e\u003cspan\u003eఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని ప్రశ్నలు మనల్ని వెంటాడతాయి. సమాధానాలు దొరకని ఆ ప్రశ్నలు మనల్ని మరింత సంఘర్షణలోకి నెట్టేస్తాయి. అటువంటి సమయంలో విధి మనకు ఏం నేర్పుతుంది? రామ్ జీవితం అలాంటి మలుపు తిరిగిన సమయంలో మొదలవుతుంది ఈ కథ. తల్లి లక్ష్మమ్మ ఒంటరిగా పెంచిన రామ్, సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడి, భువిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడు. కానీ పెళ్లయిన ఏడాదికి అతని జీవితంలో ఊహించని మలుపు ఎదురవుతుంది. ఆధునిక సమాజంలో వివాహ బంధం విలువ, దాంపత్య సంబంధాల్లో తలెత్తే సవాళ్ళు, తరాల మధ్య అంతరం, మారుతున్న విలువలు - ఇలాంటి అనేక అంశాలను స్పృశిస్తూ సాగే ఈ నవల ఒక ప్రత్యేకమైన ప్రయాణం. డాక్టర్ పరశురామ్ లాంటి పెద్దల అనుభవజ్ఞానం, చిన్ననాటి స్నేహితుడు వాసు సహకారం, మరియు కాలం అనే గురువు నేర్పే పాఠాలతో రామ్ జీవితం ఎటు మలుపు తిరుగుతుంది? విధి అతనికి ఏ మార్గం చూపిస్తుంది? రాజేష్ కుమార్ బొచ్చు తన తొలి నవలలో సమకాలీన సమాజంలోని సంక్లిష్ట సమస్యలను సున్నితంగా స్పృశిస్తూ, మానవ సంబంధాల విలువను గుర్తు చేస్తారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475613937711,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/vidhif.jpg?v=1756822058"},{"product_id":"erra-mallelu","title":"Erra Mallelu","description":"\u003cp\u003e\u003cspan\u003eఒక స్నేహితురాలు మనతో కూర్చుని మన హక్కులు, పీరియడ్స్, కోరికలు, సెక్స్ ఎడ్యుకేషన్, కనీస అవసరాలు, మారిటల్ రేప్ ఇలా మనకి అవగాహన లేని వాటి గురించి తన కథ ద్వారా మనకి తెలియచేస్తుంటే ఎంత బావుంటుంది. ఆ స్నేహితురాలే \"ఎర్ర మల్లెలు\"\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500026785839,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ErraMallelufrontcover.jpg?v=1757675391"},{"product_id":"pottelu","title":"POTTELU","description":"\u003cp\u003e\u003cspan\u003eమనుషులు ఏకాంతాన్ని కోరుకోవచ్చు కానీ, ఎప్పటికీ ఒంటరి కాలేరు. తనకు తానుగా ఏదో ఒక బంధాన్ని వెతుక్కుంటారు. సత్యం పొట్టేలుని వెతుక్కున్నట్టు. కాశినాయన క్షేత్రంలో తనని తాను వెతుకున్నట్టు. దూరమైన మనుషుల స్థానంలో ఆ ఖాళీని పూర్తి చేసే మరేదైనా నింపాలనే తపన ఉన్నంత వరకూ మనుషులు ఒంటరిగా ఉండలేరు. సొంత నేల మీద నుంచి ఓ పిలుపు వెంటాడుతూనే ఉంటుంది. తల్లీ కొడుకులుగా పైకి కనిపించే కథ మార్మికంగా ఈ ప్రకృతికీ మనిషికీ ఉండే లోతైన అనుబంధాన్ని చెబుతుంది. నవలలో అమెరికా వలస అనేది కేవలం జియోగ్రాఫిక్ మార్పు కాదు, పొట్టేలు కేవలం ఒక జంతువు కాదు. మహిళా రైతుగా, తల్లిగా వేదన పడే సత్యం, మల్లేష్ ఒకడికే తల్లి కాదు. మానసికంగా సొంత నేలనీ, కోల్పోతున్న అనుబంధాలనీ గుర్తు చేసే ప్రతీకలు. తాత్వికతా, వాస్తవికత కలిసిపోయిన ఈ \"పొట్టేలు\" తెలుగులో మరో అద్బుతమైన రచనగా నిలుస్తుంది. - నరేష్కుమార్ సూఫీ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500028096559,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/POTTELU.jpg?v=1757675502"},{"product_id":"chowrastha","title":"CHOWRASTHA","description":"\u003cp\u003e\u003cspan\u003e‘చౌరస్తా’.. పేరుకు తగ్గట్టే రకరకాల దారులు, రకరకాల కథలు ఒకచోట చేరే కూడలి. గమనాలు వేరైనా గమ్యం ఒక్కటే! రండి.. ఈ కథల చౌరస్తాలోకి అడుగుపెట్టి, ఈ కథలు చదివి చూడండి. 11 Stories Compilation by 11 Authors Genres inside (love, suspense, social, etc.) “Hyderabad Book Fair 2024 Best Seller” 💥 Book Fair Best Seller 2024 💫📖 500+ readers impressed already\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500029374511,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/CHOWRASTHA.jpg?v=1757675666"},{"product_id":"kalalu","title":"Kalalu","description":"\u003cp\u003e\u003cspan\u003eతన చుట్టూ ఉన్న సమాజాన్ని దాటి ఏ కవి అయినా కవితా వస్తువును ఎంచుకోలేడు. అదే వనమాలలో చూడవచ్చు. రైతు గురించి తల్లి గురించి భ్రూణహత్యల గురించి ఆయన ఒకే గొంతుతో మాట్లాడతారు. తన గొంతులో ఎంత ఆవేశం ఉన్నా, అది అక్షరాల్లోకి వచ్చేసరికి సున్నితంగా మారిపోతుంది. అందుకే \"అంటుగట్టి లక్షల కొమ్మలను పెంచుతాడే\/ వేరు తానైనా ఎదగలేక ఒదిగి ఉన్నా\/ రెక్కలుడిగి వేరుగానే తాను మిగిలిపోయాడే...\/ పగిలిపోయాడే\" అంటాడు. వేరు అనే పదం రెండు చోట్ల వాడటం ద్వారా శ్లేషగా రైతు దీన స్థితిని చెబుతాడు. కవిలో కదిలే గుణం లేకపోతే తాను ఎంచుకున్న అంశాల్లోకి ఆర్ద్రత రాదు. ఆ చలింపు ఈ కవిలో ఉండబట్టే తను రాసిన కవితల్లో ఆర్ద్రత చోటు చేసుకుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500031832111,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Kalalu.jpg?v=1757676130"},{"product_id":"kshanikaalu","title":"Kshanikaalu","description":"\u003cp\u003e\u003cspan\u003eKshanikaalu | Of lights and lives\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eby Dheeraj Kashyap Vemuganti\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eలోపమో కోపమో సౌఖ్యమో మోహమో ఎంత సౌందర్యం అనుకోగల మనిషిని ఇప్పటి ప్రపంచపు తూనికరాళ్ళతో భోగి అనడం తేలికైన పని. కానీ, విడదీయలేని ముడులతో చిక్కుబడ్డ జీవితానుభవాలన్నింటినీ, తనవైన ప్రశ్నలతో తరచి చూసుకునే శోధకుడి అంతరంగం నిజానికి అంత తేలిగ్గా పట్టుబడదు. అట్లాంటి అంతరంగపు చీకటి దారుల్లోకి వెలుతురు వాలిన క్షణాలే ఈ క్షణికాలు . ప్రేమలు పోగొట్టుకున్న నగరంలో పావురాళ్లకు స్నేహమిచ్చే హైదరాబాదీ యవ్వనమూ, ఇరానీ కేఫ్ లో సాయంకాలాలను తాగేసి లక్కీ అలీ గొంతు నుండి వయొలిన్ నొప్పి వేరుపడడం చూడగల ఏకాంతమూ, ఈ రెంటినీ సమన్వయపరుచుకునే ప్రయత్నమూ...అందులోని జీవితమూ...\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e- మానస చామర్తి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Regi Achhulu","offers":[{"title":"Default Title","offer_id":44505596592175,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kshanikaalufront.jpg?v=1757840512"},{"product_id":"dravida-mahasamudram","title":"Dravida Mahasamudram","description":"","brand":"Regi Achhulu","offers":[{"title":"Default Title","offer_id":44505608683567,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/IMG-20250911-WA0003_3.jpg?v=1757841422"},{"product_id":"nenu-manchidhannena","title":"Nenu Manchidhannena","description":"","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44511851151407,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/IMG_20250912_150055.jpg?v=1758035010"},{"product_id":"kathalu-kane-kallu","title":"kathalu kane kallu","description":"\u003cp\u003ekathalu kane kallu by Gayatri Pendyala.\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44511855706159,"sku":null,"price":140.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/IMG_20250912_150018.jpg?v=1758035179"},{"product_id":"sontha-ooru","title":"Sontha Ooru","description":"\u003cp\u003e\u003cspan\u003eమా సొంత ఊరు క్రాకుటూరు, పేరు చదవడానికి చిత్రంగా ఉన్నా , వినసొంపుగా ఉంటుంది మా ఊరి మనుషుల మాటల్లాగా. చూడటానికి షుమారుగా ఒక వంద నుంచి నూట యాభై గడపల పల్లెటూరే, కానీ పలికే ప్రతి మాటా, పెదాల పైనుంచి కాకుండా కడుపులోంచి వస్తుంది. అటువంటి ఊళ్ళో, అటువంటి మనుషుల మధ్య పెరిగిన నేను. నేను చూసిన, నాకు ఎదురైన సంఘటనలకు అక్షర రూపమే ఈ సొంత ఊరు కథలు. ప్రతి ఇంట్లో మనుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగానే చూసుకునేది మా పశువుల్ని , జివ్వాల్నే. ఇంట్లో ఎవరికైనా కాలికి ముల్లు గుచ్చుకుంటే, ముళ్ళ దగ్గరికి ఎందుకు పోయినవ్ అని కసురుకుంటారు అదే మందలో ఒక గొర్రి కాల్లో ముల్లు గుచ్చుకుంటే కీలకత్తి పెట్టి దాన్ని జాగ్రత్తగా తీసి, కిరసనాయిలు పోసి కడిగి, గాయపాకు తెచ్చి కట్టు కట్టి అది మానేంత వరకూ బిడ్డకంటే జాగ్రత్తగా చూసుకుంటారు. అది మా ఊరి మనుషులకూ, జివ్వాలకీ మధ్య పెనవేసుకున్న బంధం. ఎంత చెప్పినా తక్కువే మా ఊరి మనుషుల గురించి, వాళ్ళ మనసుల గురించి. మా ఊళ్ళోనే కాదు. మీ సొంత ఊళ్ళో కూడా, పొట్టేలును ప్రాణంగా చూసుకునే గంగయ్య లాంటి మట్టి మనిషి , తండ్రి చెప్పిన పని కంటే పాల కాయలే ఎక్కువనుకునే పిల్లోడు, తాత తెచ్చి ఇచ్చే మాయా పుల్ల కంటే, జేబులో కమ్మరకడ్డీలు పంచుకుని తినే స్నేహితుడే గొప్ప అనుకునే చిన్నోడు . ఇలా అందరూ తారసపడతారు ఒక సారి కళ్ళు మూసుకుని గుర్తుకు తెచ్చుకోండి. మీరు వెనక వదిలేసిన జ్ఞాపకాల్లో మీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44567403364399,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sonthaoorufrontcover.jpg?v=1759986405"},{"product_id":"daivamichina-bharya","title":"Daivamichina Bharya","description":"\u003cp\u003eDaivamichina Bharya by Chalam\u003c\/p\u003e","brand":"Chalam Books","offers":[{"title":"Default Title","offer_id":44584176648239,"sku":null,"price":110.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/daivamichinabharyabookbychalam.jpg?v=1760534099"},{"product_id":"gandhari-vana","title":"Gandhari Vana","description":"\u003cp\u003e\u003cstrong\u003eకృష్ణానది ఒడ్డున రక్తవర్ణపు కల\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e2022 మొదట్లో అనుకుంటా - తమ్ముడు అనిల్ తన తరువాతి పుస్తకం గురించి చెబుతూ, 'ఈ సారి ముందు మాట నువ్వు రాయాలి' అని చెప్పినపుడు 'సరదాగా అని వుంటాడు' అని ఆ సంగతి మర్చిపోయాను. సంవత్సరం చివరి మాసాలలో కవితలు. పంపిస్తూ అప్పటి మాటను గుర్తు చేసినపుడు, వారించే ప్రయత్నమే చేసాను ముందు. ఒక కారణం, ఈ పనికి నా శక్తి సరిపోతుందా అన్న నా సందేహమైతే, అసలైన కారణం, ఇప్పటికే 'ఎనిమిదో రంగు' 'స్పెల్లింగ్ మిస్టేక్' కవితా సంపుటులతో తెలుగు కవిత్వ ప్రపంచంలో తనదైన గొంతును వినిపించిన, వినిపిస్తోన్న అనిల్ కు ఇక ముందు మాటల అవసరం లేదని నేను భావించడం!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅందుకే, దీనిని 'ముందుమాట' గా కన్నా, ఇష్టపడే కవి వెలువరిస్తోన్న కొత్త కవిత్వం మీద 'ప్రేమతో రాసే మాటలు' గానే ప్రారంభించాను.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eతన రెండవ కవితా సంపుటి 'స్పెల్లింగ్ మిస్టేక్' లో 'కన్ఫెషన్ పేజీ' పేరున అనిల్ కొన్ని మాటలు రాసుకున్నాడు. అందులో అంటాడు 'నిరంతరం మన కళ్ళముందు జరుగుతున్న ఘోరాలూ దుర్మార్గాలూ నిలబడనీయకుండా చేసినపుడు అక్షరం చేసిన అంతర్మథనం మొత్తాన్ని తొలి కవితా సంపుటి 'ఎనిమిదో రంగు' గా తీసుకు వొస్తే, ఎన్నాళ్లయినా ఏమీ మారని సమాజంలో జరిగే అకృత్యాలని, తప్పిదాలని సరిదిద్దే అవసరం వుందనే ఆకాంక్ష కలిగినవాడిగా తాజా కవితా సంపుటి 'స్పెల్లింగ్ మిస్టేక్' తీసుకు వచ్చాడు'.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e'కవిత్వం నీకు ఏమిటి?' అని కవులను ప్రశ్నిస్తే, ఒక్కో కవి ఒక్కో విధంగా స్పందించవచ్చు. బహుశా, ఎక్కువ మంది కవులకు ఒక స్పష్టత ఏదీ వుండకపోవొచ్చు కూడా! కానీ, అనిల్ కు అటువంటి ఇబ్బంది ఏదీ లేదు. అనిల్ తన రెండవ కవితా సంపుటిలోని 'కన్ఫెషన్ పేజీ' లో రాసుకున్న మాటలతో, తనకు కవిత్వం ఏమిటో స్పష్టంగానే చెప్పుకున్నాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅందుకే, 'రాజధాని భూముల వివాదం' నేపథ్యంలో రాసిన 'ఆకుపచ్చని కన్నీరు' లో ఇట్లా వాపోతాడు- 'చిగురించడమే తెలిసిన నేల \/ఇప్పుడొక ఫోటో ప్రదర్శన శాల\/నీ బలంతో గట్టుకు గొడవ పడిన చోటంతా\/ ఇప్పుడు శిలాఫలకాల బొమ్మల కొలువు\/ ఎప్పుడో బీడు భూమిలో తాత నాగటికర్రు మోపిన చోటంతా\/కొత్త జీవోల కలుపు............\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44608558039087,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gandhari-vana-19.jpg?v=1761275578"},{"product_id":"kokoro","title":"kokoro","description":"\u003cp\u003eసొసెకి నట్సుమే జపాన్ దేశానికి చెందిన కవి, నవలాకారుడు. ఈ జపనీస్ క్లాసిక్ నవలలో సెన్సే అనే యువకుడి జీవితంలోని ప్రేమ, స్నేహాల దాగుడుమూతల్ని మనసు కంటితో మనం చూడవచ్చు. తండ్రి మరణాంతరం పినతండ్రి తన ఆస్తినంతా కాజేస్తే, మనుషుల మీద విశ్వాసాన్ని కోల్పోతాడు. వివాహం చేసుకోవాలనుకున్న యువతి ద్రోహం చేస్తుంది. స్నేహితుడు ఆత్మహత్య చేసుకుంటాడు. మరి సెన్సే జీవితం చివరికి ఏమైంది? ఈ నవల ఆధారంగా ఖొన్ ఈచికవ దర్శకత్వంలో 1955లో ' KOKORO ' అనే జపనీస్ సినిమా వచ్చింది. ఈ నవలను శ్రీనివాస చక్రవర్తి అనువదించారు.\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44635882160175,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/WhatsAppImage2025-11-01at7.20.51PM.jpg?v=1762005288"},{"product_id":"vruddasaramam","title":"VRUDDASRAMAM","description":"\u003cp\u003eVRUDDASARAMAM BOOK Written by SATYA PRAKASH\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44665029197871,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/IMG_20251112_083909.jpg?v=1762917246"},{"product_id":"online-scamulu-mee-dabbulu-kaapaadukondila","title":"Online Scamulu - Mee Dabbulu Kaapaadukondila","description":"\u003cp\u003e\u003cspan\u003eమన విద్యార్హతలు, టెక్నాలజీ పై అవగాహన ఆన్లైన్ స్కామ్స్ నుంచి తప్పించుకోడానికి సరిపోవు. మన మానసిక స్థితి కూడా కీలకమని గుర్తించాలి. అది గుర్తు పెట్టుకుంటే మనం అతీతులం కాదని అర్థమవుతుంది. అప్పుడు ఈ నేరాలకు మనం లొంగకుండా ఏం చేయగలం? మన చేతిలో ఎంత కంట్రోల్ ఉంది? మనం ఎలా ఈ ఎరలను తప్పించుకోగలం? వంటి ప్రశ్నలు పుట్టుకొస్తాయి. వాటి సమాధానాల దిశగా ఆలోచింపజేయాలనే ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. శారీరిక ఆరోగ్యానికి ఎలా అయితే పౌష్టికాహారం, వ్యాయామం లాంటివి తప్పని సరో, డిజిటల్ ఆరోగ్యానికి కూడా కొన్ని సూత్రాలుంటాయి. వాటిని తెలుసుకుని, మన నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి. ఆ ప్రయత్నాలలో ఈ పుస్తకం కూడా ఎంతో కొంత సహాయ పడితే మా ఈ ప్రయత్నం సఫలమైనట్టే.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743878246447,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Online_Scamulu_-_Mee_Dabbulu_Kaapaadukondila_book.jpg?v=1765033543"},{"product_id":"teru-itara-kathalu","title":"Teru - Itara Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eTelugu translation of Kannada Short Story Collection, \"Neelakurinji\" by Dadapeer Jyman, that won the Sahitya Akademy Yuva Puraskar Award for 2022. The Telugu translation is masterfully done by D.V. Subhashri. The collection contains 10 short stories dealing with urban migration, gender identities, and childhood stories.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743879426095,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Teru-Itarakathalubook.jpg?v=1765033701"},{"product_id":"bhushanam-kathalu","title":"Bhushanam Kathalu","description":"\u003cp\u003e            ప్రపంచం పొట్టమీద సన్నని నూగు వెంట్రుక ఆ ఊరు! ఊరి వెలుపల.. ?\u003cbr\u003e           ఉరి వెలుపల ఏముంటుంది?!\u003cbr\u003e            శ్మశానం. కాకపోతే శ్మశానం లాంటి వీధి.\u003cbr\u003e           వీధిలోని ఇళ్ళన్నీ శిథిలావస్థలో, గోడలు జారి పై కప్పుల్లేక కుర్రాళ్ళు కట్టి తిరగదోసిన పిచ్చిగ్గుళ్ళలా పిచ్చివాడి ఊహల్లా ఉన్నాయి. \u003cbr\u003eఆ ఇళ్ళలో నివసిస్తున్న మనుషులు చరిత్ర కందనివాళ్ళు. సమాజానికి వెలుపలి వాళ్ళు, దగాపడ్డ వాళ్ళు. \u003cbr\u003e         అదుగో! అదే గుడిసెలో నుంటున్న సుబ్బడు గొడ్లు కోస్తాడు. చర్మాన్ని అమ్మేసి మిగిలిన మాంసాన్ని తిని బ్రతుకుతాడు. ఆ ఎదురింట్లో నుంటున్న గంగడు కోడిపిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మేస్తాడు. దొరికితే దెబ్బలు తింటాడు. ఆ పక్క గుడిసెలో నున్న వెంకడు; చింతకాయ లమ్ముకుంటాడు. ఒకసారి చింతకాయ లెరుతుండగా చెట్టు మీద నుండి జారిపడితే, కుడి కాలిరిగిపోయింది. \u003cbr\u003e                                                                                                   - అట్టాడ అప్పల్నాయుడు \u003c\/p\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758761209903,"sku":null,"price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bhusahanamkathalu.jpg?v=1765551253"},{"product_id":"k-sabha-kathalu","title":"K Sabha Kathalu","description":"\u003cp\u003e\u003cstrong\u003eరాయలసీమ నవకథా వైతాళికుడు\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eపరిశోధకులు రాయలసీమలో తొలికథ 1852లోనే పుట్టిందని నిరూపించినా, అనంతపురం జిల్లాకు చెందిన జి. రామకృష్ణగారు 1941లోనే కథలు రాశారని చాలా కాలం వరకూ ఆయన్నే తొలి రాయలసీమ కథకుడని సంభావించినా, 1944లో ప్రారంభించి 1980లో _మరణించే వరకూ దాదాపు 300 కథలు రాసి, తర్వాత వచ్చిన కథకుల మార్గదర్శకుడైన కె. సభాగారినే తొలి ముఖ్యమైన రాయలసీమ కథకుడుగా గుర్తించాల్సి వుంటుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eసభాగారిది బహుముఖీనమైన ప్రతిభ. ఆయన కథలేగాకుండా నవలలు, పిల్లల కథలు, కవిత్వమూ కూడా రాశారు. ఆనాటి యెన్నికల సమయాల్లో బుర్రకథలు కూడా రాశారు. బడిపంతులుగా వొక దశాబ్దంపాటూ పనిచేసి తర్వాత ప్రాతికేయుడిగా మారారు. తానే వొక పత్రికను స్థాపించి నడిపారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచిత్తూరు జిల్లాలో కొట్రకోన అనే చిన్న కుగ్రామంలో సాదాసీదా కుటుంబంలో 1923లో పుట్టిన సభాగారికి బీదరికం, రైతుల కష్టాలు, కూలీల అవస్థలు, వృత్తిపని వాళ్ళ కడగండ్లు బాగా తెలుసు. చిన్నతనంలో తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం కూడా చేశారు. 1947లోనే చిత్తూరుకు దగ్గరిలో శివగిరిలో రైతాంగ విద్యాలయం నిర్వహించారు. పట్టణాలకు వచ్చాక అక్కడి మధ్యతరగతి మనుషుల జీవితాల్ని పట్టించుకున్నారు. తిరువణ్ణామలైకెళ్ళి రమణాశ్రమంలో రమణ మహర్షిని చూశారు. చలంగారితో స్నేహం చేశారు. ఆ తరువాత ఆధ్యాత్మిక రచనలు గూడా రాశారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eస్వాతంత్య్రానికి ముందున్న గాంధీయిజపు ఆదర్శవాదమూ, స్వాతంత్ర్యం తరువాతి కాలంలో జరిగిన సాంఘిక రాజకీయ పరిణామాలూ సభాగారి కథల్లో స్పష్టంగా కనబడతాయి. వ్యవసాయంలో వచ్చిన మార్పులూ, గ్రామాల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం, తగ్గిన భూగర్భజలాలూ, వ్యవసాయ అనుసంగిక వృత్తులవారి జీవన సంక్షోభాలూ, సభాగారు రాసిన గ్రామీణ కథలకు వొస్తులయ్యాయి. గ్రామాల్లోని దళితుల కష్టాలూ, ఆడకూలీల యాతనలూ, సారా కల్లు దుఖాణాల ప్రాభవాలూ ఆయన కథల్లో విస్పష్టంగా కనబడతాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eరాయలసీమ అన్న పేరే కరువుకు పర్యాయపదంగా మారిపోయింది. వర్షాభావం, నీటి యెద్దడిల గురించి రాసిన కథలకంతా సభాగారి 'పాతాళగంగ' గొప్ప నమూనాగా నిలబడి పోయింది. వ్యవసాయానికి బావిని తవ్వే తండ్రి పట్టుదలనూ, సరిహద్దుల్లో శత్రువుతో పోరాడే..............\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758778052655,"sku":null,"price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ksabhakathalu.jpg?v=1765551877"},{"product_id":"karuna-kumara-kathalu","title":"Karuna Kumara Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eకయ్య - కాలవ\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eలక్ష్మమ్మ గొప్ప అదృష్ట జాతకురాలు. పాకనాటి కాపుకులంలో పుట్టింది. మళ్ళా అపర మహాలక్ష్మే. పూర్వ జన్మలో ఇంత పెట్టిపుట్టిందేమో, ఈ జన్మలో భోగం అనుభవిస్తోంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eలక్ష్మమ్మ పుట్టింటి వారిది చాలా గట్టిసంసారం. మొగపిల్లకాయలు లేనందువల్ల లక్ష్మమ్మకూ, ఆవిడ అక్కకూ ఒక వూళ్ళోనే మనువులు కుదిర్చి తండ్రి ఇద్దరికీ చెరి ముప్పయి. వేల రూపాయల ఆస్తి ఇచ్చి మహా వైభవంతో వివాహం చేసి, వాళ్ళను కాపురానికి పంపేడు. కాని కాపరానికి వెళ్ళిన మరుసటి సంవత్సరమే లక్ష్మమ్మ భర్త కాలం చేసినందువల్ల అప్పటి నుంచీ ఇప్పటివరకూ ఆవిడ నిరంకుశమైన వైధవ్యాన్ని అవిచ్చిన్నంగా పరిపాలిస్తోంది. ఇదొక్కటే ఆవిడకు కొరత పెట్టాడు భగవంతుడు. ఇది మినహా ఆవిడ సంసారానికి ఏమీ కొరతలేదు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅటు పుట్టింటివారివల్ల దఖలుపడ్డ ముప్పయివేల రూపాయల ఆస్తి, యిటు అత్తింటివారివల్ల లభ్యపడ్డ ఏభై వేల రూపాయల ఆస్తీ కలిపి, భర్త చనిపోయేటప్పటికి ఓ 80, 90 వేల రూపాయల ఆస్తికి లక్ష్మమ్మ హక్కుదారయింది. చనిపోయే ముందు మంచంమీద ఇంకా తెలివుండగానే భర్త సిసలైన వీలునామా వ్రాసి ఏభై ఎకరాల మాగాణి, డెబ్బై ఎకరాల మెట్టా, మామిడితోటా, నాలుగెకరాల పాటి మట్టి దొడ్లీ, పశువుల బీళ్ళూ, పది అంకణాల | మద్ది, ఇన్ని పాడిపశువులూ, నాలుగువందల సన్నజీవాలూ ఒకటేమిటి, ఒకరి దగ్గరకు పోనక్కర లేకుండా అమర్చి పెట్టినట్లు ఇనప్పెట్లో బీగాలతో సహా చేతిలో పెట్టి, “నేను లేనన్న కారతతప్ప యిక నీకేమీ లోపం లేదు. ఇంట్లో తల అట్లా వీధిలో పెట్టుకోకుండా ఈ యావదాస్తే నువ్వు అనుభవించు కొని జీవించు\" అని అంత్యకాలాన ఆశీర్వదిస్తూ ఆవిడ భర్త! అదృశ్యమైనాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eలక్ష్మమ్మది మొదటి నుంచీ గట్టిపిడికిలి. పొలంలో పండిన అరవై పుట్ల ధాన్యం ఆగాయత్తు దొడ్లో పశువులు వేసే పేడవరకూ సమస్తమూ ఆమె రొట్ట రూపంగా మార్చి |\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచేసిన సంసారం అది. రాగులు, సజలు, జొన్నలు, మిరపకాయలు, చింతపండు. అదికాయలు, టెంకాయలు, టెంకాయపీచు. తాటికాయలు, తాటాకు, తాటిబుర్రలు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eపరుగు, వెన్న, నెయ్యి ఒకటేమిటి. పాటి మట్టి, ఎరువుమట్టి, దూడా దుడుకూ సమస్తమూ - మార్చి చేతపటుకొనే అలవాటు లక్ష్మమ్మకు. అందువల్ల భూములు, దొడ్డు, బంగారు..............\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758778675247,"sku":null,"price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/karunakumarkathalu.jpg?v=1765552013"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/150.png?v=1775240669","url":"https:\/\/books.ataka.in\/collections\/150-club.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}