{"title":"999 Combo","description":"","products":[{"product_id":"kanyashulkam","title":"Kanyashulkam","description":"\u003cp\u003e\u003cspan\u003eతాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి డామిట్! కథ అడ్డంగా తిరిగింది పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్ గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి. Kanyasulkam book by Gurajaada Venkata Apparao helps in developing your knowledge and skills in Indian Writing. This book is available in Telugu language making it easier to read and understand.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45054971576367,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kanyashulkam.jpg?v=1773593392"},{"product_id":"myna","title":"Myna","description":"\u003cp\u003e\u003cspan\u003eఈ నవలకు వస్తువు, ఒక మలుపుకూ, మరో మలుపుకూ మధ్యగల జీవితం. ఇతివృత్తాన్ని ఎన్నుకోవడం అనేది రచయిత దృష్టిని బట్టి ఉంటుంది. నది ఒడ్డునకూర్చున్న మనిషికి పూర్తిగా నది అంతా కనిపించదు. ఏ కొండ పక్కనో చటుక్కున మలుపు తిరిగిన చోట కనబడటం ప్రారంభించి, మనిషి ముందు నుండి వెళ్లి, ఏ చెట్ల గుబురుల పక్కకో మళ్ళి, మాయమైపోతుంది. కొండ మీద నిలబడి చూస్తే మరికాస్తా ఎక్కువ కనిపిస్తుంది. విమానం మీద నుండి మరీనీ. దృష్టిని బట్టి మారుతుంది. ఏ ఫోటోను తీసుకున్నా మూడూ నదిని చూపించేవే. రచయిత దేన్నైనా ఎన్నుకోవచ్చు. అయితే ఆ ఫోటోలు ఏవో రెండు మలుపుల మధ్యగల నదిని చుపించేవిగా ఉంటే చూడటానికి బాగుంటాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e       సాహిత్యపు పరిభాషలో వీటినే 'ట్విస్ట్'లు అంటారు. చక్కటి రెండు ట్విస్ట్ ల మధ్యగల జీవితం నవలకు పరిపూర్ణతను, అందాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ నవలలో ప్రధాన పాత్రను దాటుకుని వెళ్లి, అందమైన ఒక ట్విస్ట్ తో కథను ప్రారంభించాల్సి వచ్చింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e       ఈ నవలలో ఒక జీవితాన్ని యధాతథంగా చూపించడానికి ప్రయత్నించారు రచయిత. ఇది ఫోటో ధోరణిలో వేసిన చిత్రం. ఈ జీవిత చిత్రణలో ఆ వ్యక్తీ బాధలూ, సుఖాలూ, ఆశలూ, జీవిత సంగ్రామంలో నిలదొక్కుకునే ప్రయత్నాలూ, పరిణామాలూ - అన్నీ ఇందులో ఉన్నాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e       ఈ కథ ఎక్కడో జరగడం లేదు. మీ ముందే జరుగుతుంది. మీరు ప్రేక్షకులు. ఇందులోని ప్రతి కదలికను చిత్రంగా గీశాను. ఈ చిత్రాలన్నింటిని వరుసగా పేర్చి గబగబా ఒక వేగంతో చూసుకుంటూ వెళ్తే మీ ముందు ఒక సినిమా కదులుతుంది. తెలుగు సాహిత్యానికి కొత్తదైన ఒక తెలుగు జీవితం ఈ నవలలో ఉంది.  ఈ నవల కొత్తదనం కావాలనుకున్న వారి గురించి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e                                                                                                                       - శిలా వీర్రాజు   \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055014404143,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Maina.jpg?v=1773594622"},{"product_id":"aaradhana","title":"Aaradhana","description":"\u003cp style=\"text-align: left;\"\u003e\u003cspan\u003eఅనంత్ ను  భర్తగా  పొందగానే   అంతా   అన్నపూర్ణను\u003c\/span\u003e\u003cspan\u003e అదృష్టవంతురాలన్నారు. తీరా  అనంత్  జీవితంలోకి  అడుగు\u003c\/span\u003e\u003cspan\u003eపెట్టిన  తర్వాత  గాని  ఆ అమ్మాయికి  తన  అదృష్టం ఏపాటిదో \u003c\/span\u003e\u003cspan\u003e తెలిసిరాలేదు.\u003c\/span\u003e\u003cspan\u003e      అతనిచుట్టూ   అతి   భయంకరమైన   గతం   కోటగోడలా\u003c\/span\u003e\u003cspan\u003e పటిష్టంగా  ఉండిపోయింది.  అనంత్   దగ్గరికి   ప్రవేశం  ఎలాగో\u003c\/span\u003e\u003cspan\u003e అర్ధం   గాని  అన్నపూర్ణ  అలాగే  నిలబడిపోయింది.\u003c\/span\u003e\u003cspan\u003e  \u003c\/span\u003e\u003cspan\u003eఆ  దుర్భేద్యమైన   గోడను  ఛేదింపగలదా  ఆ  మూగపిల్ల! \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055034490927,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Aaradhana.jpg?v=1773595084"},{"product_id":"mayanagaram","title":"Mayanagaram","description":"\u003ch4\u003eమాయనగరం అన్నిట్నీ \u003c\/h4\u003e\n\u003ch4\u003eఅంతట్నీ గమనిస్తూనే వుంది.\u003c\/h4\u003e\n\u003ch4\u003eఅవిశ్రాంతంగా.... ఆత్రంగా \u003c\/h4\u003e\n\u003ch4\u003e        ప్రతి వ్యక్తి జీవితంలోంచీ మరో వ్యక్తి నేర్చుకోదగింది కొంతే వుంటుంది. ఎందుకంటే మనిషి జీవితంలో అత్యద్భుత క్షణాలు కొన్ని మాత్రమే వుంటాయి. అలాగే మనిషి జీవితం పుట్టుకనుంచి మృత్యువు వరకూ స్థిరమైనది కాదు. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూనే వుంటుంది. తనని తాను మార్చుకుంటునే వుంటుంది. నగరం కూడా మనిషి లాంటిదే. ఏ నగరపు ప్రవృత్తి దానిదే. మనిషి అనేకానేక భావాల్ని తనలో ఇముడ్చుకున్నట్టు నగరం కూడా రకరకాల మనుషుల్ని తనలో ఇముడ్చుకుంటుంది. అవిశ్రాంతంగా తనమీద ఆధారపడ్డవాళ్ళ బ్రతుకుల్ని గమనిస్తూనే వుంటుంది. మౌనంగా.... నిర్వికారంగా.\u003c\/h4\u003e\n\u003ch4\u003e             అందుకే - 'మాయానగరం' కథ ఎప్పటికీ సశేషమే.   - భువనచంద్ర \u003c\/h4\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055086886959,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Maayanagaram.jpg?v=1773596166"},{"product_id":"prema-pujari","title":"Prema Pujari","description":"\u003cp\u003e\u003cspan\u003e\"ఆ ప్రతిఒక్కటీ వరూధిని చెప్పినట్లు చేశాను. నీ డ్రెస్ నీవు కాలేజీకి వెళ్ళాక, బాలరాజు తెచ్చి ఇచ్చాడు. దానితోపాటు ఒక ఉత్తరం కూడా.అది నాకు అడ్రస్ చేసి ఉండటంతో విప్పాను. నిన్ను ఎలా అలంకరించాలో వరూధిని వ్రాసింది. గౌను ఈ మోడల్ లో కుట్టిందట. బ్రిటిష్ రాణుల ఎత్తులు, నడుం సన్నదనం కనిపించే వారి గౌనును మోడల్ గా తీసుకుందట. తన శ్రమ ఫలిస్తుందని ఆశిస్తూ జీవించింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e       దివ్యా!  అలా౦టి స్నేహమయి దొరకడం, నీ అదృష్టం.\"\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e       వరూధిని, దివ్యాల స్నేహం అపురూపమైనది. ఆ స్నేహం దివ్య అన్నవిక్రమ్ కి కంటగింపు అయింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e       విక్రమ్ వలన వారి స్నేహం చెదిరిందా? ఇంకా ఎక్కువగా ముడిపడిండా?\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eతెలుసుకోవాలంటే చిట్టారెడ్డి ''ప్రేమపూజారి'' చదవాల్సిందే. \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e                                                                                             - చిట్టారెడ్డి సూర్యకుమారి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057553104943,"sku":null,"price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/premapujari_a61f08b5-1fd8-412e-b605-09387a66ce09.jpg?v=1773667893"},{"product_id":"penkutillu","title":"Penkutillu","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057554907183,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/penkutillu.jpg?v=1773668275"},{"product_id":"vichitra-vyakthi","title":"Vichitra Vyakthi","description":"\u003cp\u003e\u003cspan\u003e‘‘మీ జాతి చరిత్రలో ఇన్ని సామ్రాజ్యాలు, నియంతృత్వాలు, మతాలు సంభవించాయంటే దానికి ఒకటే కారణం. ప్రతి వ్యక్తికి పొరుగువాడిమీద అపనమ్మకం. ప్రతివ్యక్తికీ పొరుగువాడికి తనమీద సదభిప్రాయం ఉండాలని, లేకపోతే తను దుంపనాశనమైపోతానని భావిస్తాడు. ఇలా భావించడంవల్లనే, ఇది ఆధారం చేసుకుని ఇన్ని రాజ్యాలు, మతాలు వెలిశాయి. ఇంకా వెలుస్తాయి. మిమ్మల్ని ఇంకా అణగదొక్కుతాయి, ఇంకా అధోగతికి లాక్కుపోతాయి. ఎందుకంటే మీరు అల్పసంఖ్యాకులకు బానిసలు. ఈ బానిసతనం మీకు పోదు. మీ జాతి గొర్రెలమంద-’’ ఈ మాటలు ముగిస్తూ సైతాను అంతర్థానమయ్యాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058074345519,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/51BoMLgUv8L.jpg?v=1773676880"},{"product_id":"ravvala-konda","title":"Ravvala Konda","description":"\u003cp\u003e\u003cspan\u003e‘‘రాత్రంతా నాకు నిద్రరాలేదు. మనసునిండా చీకటి. ఆ చీకట్లో నిన్న రాత్రి మనం కన్న ఆ కల ఎక్కడయినా కనిపిస్తుందేమోనని వెలిగించిన ప్రమిదని అరచేతుల్లో పట్టుకుని వెతికాను. ఎక్కడా కనిపించలేదు మనం ప్రసవించిన ఆ అపురూపమైన కల, చివరికి  తెలిసింది నువ్వు లేనప్పుడు ఆ కల నాకెందుకు కనిపిస్తుందీ అన్న సత్యం.  చూడూ! నువ్వు నా ఆరోప్రాణం. ఇన్నాళ్ళు ఎలా బ్రతికానో నాకు తెలీదు. నువ్వు లేకుండా ఇక ముందు బతకడం మాత్రం నాకు సాధ్యం కాదు.’’ ఆ వెన్నెల రాత్రి వెలగచెట్టు నీడలో అలా చాలాసేపు మాట్లాడింది రాజకుమారి.  ‘అంత గొప్పమనిషి అనుకోకుండా నా ప్రాణంలో ప్రాణం అయింది. ఈ మనిషికి దగ్గరయ్యాను. సరే దక్కించు కోగలనా చివరికి?’ అనుకున్నాడు రవ్వలకొండ.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058451308591,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ravvalakonda.jpg?v=1773684557"},{"product_id":"no-999-kommuri-sambasivarao","title":"No. 999 - Kommuri SambaSivaRao","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45539210231855,"sku":null,"price":40.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/999.jpg?v=1782825835"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/Gemini_Generated_Image_wgyq93wgyq93wgyq.png?v=1782826076","url":"https:\/\/books.ataka.in\/collections\/999-combo.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}