{"title":"By The Women","description":"","products":[{"product_id":"pachha-bottu","title":"PACHHA BOTTU","description":"\n\u003cp\u003eThis Novel booked by C Sujatha, who worked as Editor in Andhra Jyothi, Udayam, Harathi, etc. She worked as script writer in ETV2, Sakhi, Vanitha etc.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397730693167,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/pachha-bottu-book-f.webp?v=1754490169"},{"product_id":"uniki","title":"UNIKI","description":"\n\u003cp\u003eఒక కథో, కవితో, నవలో చదివితే నిన్ను పట్టుకుని కుదిపెయ్యాలి. ప్రేమతోనో లేదూ కోపంతోనో. అయితే, ప్రతిదీ ఖచ్చితంగా కుదిపెయ్యాలనే నియమేమీ లేదు. కొన్ని ఆ సమయానికి హాయినిస్తాయి. ఈ కథలు చదివినప్పుడు కాసేపు బ్లాంక్ అవుతాం. contemporarywomen stories అంటాం కాని ఇవి contemporary పురుషులు చదవాల్సిన కథలు. పుస్తకాల్లో యుద్ధం గురించిన పాఠం ఉందంటే యుద్ధం తాలుకు భీభత్సం నుండి యుద్ధం వద్దని నేర్చుకుంటారని. ఇవీ అంతే. కొన్ని ఎలా ఉండాలో చెబితే, ఇంకొన్ని ఎలా ఉండకూడదో చెబుతాయి.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397733937199,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/uniki-f.webp?v=1754490172"},{"product_id":"aido-goda","title":"Aido goda","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412984000559,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156557.jpg?v=1754589570"},{"product_id":"panakam-on-the-rocks","title":"Panakam on the rocks","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413217734703,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156486.jpg?v=1754589570"},{"product_id":"deva-rahasyaalu","title":"Deva Rahasyaalu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413235822639,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156499.jpg?v=1754589570"},{"product_id":"ententa-dooram","title":"Ententa Dooram","description":"\u003cp\u003e\u003cspan\u003eఇవేం గొప్ప కథలు కాదు... తలకిందలయ్యే సంఘటనలూ లేవు... ఆశ్చర్యపరిచే మలుపులు లేవు... మెస్మరైజింగ్ ముగింపులు లేవు... కానీ ఒక్కొక్క కథ వెనక ఓ ఊపిరి ఉంది... ఓ నిశ్శబ్దం ఉంది... ఒక చిన్న తడబాటు ఉంది. మాటల్లో చెప్పలేని సున్నిత భావాలు, మౌనంగా మిగిలిపోయిన బరువైన క్షణాలు ఈ కథలు. లక్ష్మీ ప్రియాంక తన పుస్తకంలో నెమలిపించంతో పాటు పదునైన గాజు పెంకుని కూడా దాచుకుంది. ఇవి కథలు కావు... భావాలు! మన మనసుల్లో ఎన్నోసార్లు మాటలుగా రూపం దాల్చలేకపోయిన ఊహలు, ముగించలేక మిగిలిన కొన్ని బంధాలు, చెప్పలేక మిగిలిన కొన్ని ప్రేమలు, చిరునవ్వుల వెనక పడిపోయిన కొన్ని కన్నీటి చుక్కలు. మరెక్కడా చదవలేనంత కొత్త కథలేం కాదు, ఇంకెక్కడా అనుభవించలేనంత అనుభూతులు కావు, ఇవి పెద్ద ప్రకంపనలు కావు అనిపించే చిన్న కథలు. వేచిచూసే ఒక చూపు, తలవంచి ఆపుకున్న చిరునవ్వు, వదిలేసినా కాలంలో మిగిలిపోయిన చూపుల్లాగా మనల్ని గుచ్చుతూ ఉంటాయి. మనసుతో చదవాల్సిన కథలు. ఈ కథల్లో ఎక్కడో దాక్కున్న మిమ్మల్ని మీరు కలుసుకుంటారు, ఎప్పుడో కలిసిన ఓ ఆత్మీయుడ్ని గుర్తు చేసుకుంటారు. కొన్నింట్లో ప్రేమ మొదలవుతుంది. కొన్నింట్లో ప్రేమ సాగుతుంది. మరికొన్నింట్లో ప్రేమ ఆగిపోతుంది. కొన్ని కథలు పూర్తవ్వవు. కానీ అసంపూర్ణంగా మిగిలిన కథల్లోనే ఎక్కువగా భావాలు మిగిలిపోతాయి కదా! చెప్పాలనుకున్న చివరి మాటను ఒక చిరునవ్వుతో వదిలేసినట్టు. వదిలేసిన ఆ మాటే మనలో ఎక్కువకాలం నిలిచిపోతుంది. ఈ కథలు మీరు చదవకపోయినా ప్రపంచానికి ఏమీ జరుగదు. చదివాక మాత్రం ప్రియాంక మీ హృదయాన్ని తాకుతుంది... మీ మనసులో ఓ మూలన జ్ఞాపకాల పక్కన ఓ చిన్న కప్పు కాఫీ పెట్టి కూర్చుంటుంది. -భరత్ కమ్మ (డియర్ కామ్రేడ్ చిత్ర దర్శకులు)\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475609874479,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/enthenthadhuramf.jpg?v=1756821952"},{"product_id":"erra-mallelu","title":"Erra Mallelu","description":"\u003cp\u003e\u003cspan\u003eఒక స్నేహితురాలు మనతో కూర్చుని మన హక్కులు, పీరియడ్స్, కోరికలు, సెక్స్ ఎడ్యుకేషన్, కనీస అవసరాలు, మారిటల్ రేప్ ఇలా మనకి అవగాహన లేని వాటి గురించి తన కథ ద్వారా మనకి తెలియచేస్తుంటే ఎంత బావుంటుంది. ఆ స్నేహితురాలే \"ఎర్ర మల్లెలు\"\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500026785839,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ErraMallelufrontcover.jpg?v=1757675391"},{"product_id":"chaitra-novel","title":"Chaitra (Novel)","description":"\u003cp\u003e\u003cspan\u003eకాలం ఎప్పటికప్పుడు కొత్త రంగులను తొడుక్కుంటూనే ఉంది, రోజులన్నీ తేదీలను మారుస్తూ అభివృద్ధి వైపు అడుగులేస్తూ పోతున్నా, ఆధునిక యుగంలో ఇంకా అనాగరికంగానే బతుకుతున్నాం, విచక్షణ కోల్పోయి, వివక్ష తాలుకా మనిషి నిలబడ్డప్పుడు కొన్ని మనుగడలెప్పుడూ మనిషిని వేధిస్తూ ఉంటాయి, మనం ఆనవాళ్ళుగా చెప్పుకునే అమ్మల జీవితాలు ఏ గర్భగుడిలోనో హత్య చేయబడతాయి, ఏ చెత్త కుప్పల మీదో అనాథగా వెలేయబడతాయి. భారం దించుకొని, బాధ్యతగా చెప్పుకునే ఓ తాడుకి ఉరితీయబడుతున్నాయి ఇలా ఒకే కారణం మీద వేలాడుతూ దుఃఖిస్తూ ఉన్నాయి. అయినా కాలంతో పాటు కాసిన్ని కలలతో జీవితాన్ని కలగంటున్నవారు విరిగిన రెక్కలను అతికించుకుంటూ కొత్త రంగులను జీవితానికి అద్దుతున్నారు. ఇంటి గడపల ముందు ఎదురుచూపులు మాని దేశ సరిహద్దుల మీద కాపలా కనురెప్పలవుతున్నారు. కంచెలు తెంచుకొని కాలం మీద చరిత్రలు రాస్తున్నవారు మనకు కనిపిస్తూనే ఉంటారు… నా ఆలోచనలకు అక్షరాలను అద్ది అస్థిత్వపు నినాదంగా నా మొదటి నవల 'చైత్ర'ను మీకు అందిస్తున్నాను. -స్ఫూర్తి కందివనం\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44534969794607,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/chaitra.jpg?v=1758694942"},{"product_id":"dimki","title":"Dimki","description":"\u003cp\u003eDimki (Telugu) Paperback\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనేను పుట్టిన నేల, నాకు అనుభవంలోకి వచ్చిన కొన్ని సంఘటనలు, నా జీవన ప్రయాణంలో నాకు తారసపడిన వ్యక్తులు, లోతుగా పరిశీలించిన కొన్ని కోణాలు నేను రాయాల్సిన అవసరాన్ని తెలిపి నా చేత రాయించినవే ఈ కథలు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eసాహిత్యం సమాజాన్ని కచ్చితంగా ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. కథలు, నవలలు చదివి తమ సమస్యకు పరిష్కారం వెతుక్కునే వాళ్లు కొందరైతే, ఆ పాత్రలలో తమని చూసుకుని ఎమోషనల్ అయ్యే వాళ్ళు కొందరు. తెలియని విషయాలను గురించి తెలుసుకునేవాళ్ళు కొందరైతే, తెలిసిన విషయాన్నే వాళ్లకు తెలియని కొత్త కోణంలో తెలుసుకుని వాళ్ళ ఆలోచనా ధోరణిని మార్చుకునేవాళ్ళు కొందరు. అటువంటి మార్పులు తీసుకొచ్చిన కథలు, నవలలు కోకొల్లలు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eమన రచన మొత్తం సమాజాన్నే మార్చేయలేకపోవొచ్చేమో కానీ దాన్ని చదివే ఏ ఒక్కరినైనా కదిలించగలగి, ఒక ఆలోచనను రేకెత్తించగలిగి, ఆ ఆలోచనే రేపటి మార్పుకు పునాది కావాలి. ఒక రచయిత అక్షరానికి అంతకంటే గొప్ప గుర్తింపు, గౌరవం మరేదీ ఉండదని నా నమ్మకం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003e-స్ఫూర్తి కందివనం\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eరచయిత్రి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44609342865455,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/DimkiFrontcover.jpg?v=1761291149"},{"product_id":"swatantra-స్వతంత్ర","title":"Swatantra (స్వతంత్ర)","description":"\u003cp\u003e\u003cspan\u003e“ఒకసారి చెప్తే అర్థం కాదూ? నీలాంటి ఆడాళ్ళు ఉన్నంతలో ఉంటే మంచిది” అతడి మాట కచ్చితంగా అతడి హృదయం నుండి ప్రతిధ్వనిస్తుంది. ‘నా లాంటి ఆడాళ్ళా? అంటే నేనేం చేసాను? ఈయన ఎందుకిలా అంటున్నారు? ఉన్నట్టుండి ఇంత చిత్రమైన మాటెందుకు పలికారు. ఆయన ఉద్దేశ్యమేమిటి? ఇష్టం లేకుంటే లేదని చెప్పాలిగానీ ఈ మాట ఊరికే ఎలా అనగలిగారు?’ ఆమెలో ఆవేదన తన్నుకొస్తూ “నేనేం చేశాను? ఎందుకలా అంటున్నారు?” అడిగింది కన్నీళ్ళ భారానికి బరువైన గొంతు సరిచేసుకుంటూ. “మీ ఆడాళ్లకు పాపులారిటీ పెరిగితే కళ్ళు నెత్తికెక్కుతాయి. మొగుడూ పిల్లలూ ఇవేం మీకు అవసరం ఉండదు. అందుకే ఈ చెత్త ఐడియాలు పక్కన పెడితే మంచిది. లేకుంటే అనవసరంగా నీ గొయ్యి నువ్వు తీసుకుంటావు” అతడి మాటలు కటువుగా ఆమె హృదయంలోకి చేరుకున్నాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Godavari Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44718602977327,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/swathantrafront.jpg?v=1764327261"},{"product_id":"emotional-pregnancy","title":"Emotional Pregnancy","description":"\u003cp\u003eEmotional Pregnancy (Short Stories) [Paperback] Purnima Tammireddy\u003cbr\u003e\u003cspan\u003eప్రేమ, పాశం, విరహం, దుఃఖం - ఇలాంటి వాటి గురించి మనకు తెలిసిన అర్థాలను, ఉన్న అనుభవాలను సవాలు చేసే కథాంశాలివి. తెలుగులోనే రాసినా, తెలుగు సాహిత్యానికి అలవాటు లేని శైలి, వ్యక్తీకరణలు ఉన్న కథనాలివి. అర్బన్ జీవితాల్లోని కనిపించని, కనిపించనివ్వకుండా దాచే విషయాల గురించిన కథలివి. మొత్తం 25 కథలు. విలక్షమైన కథలు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743873953839,"sku":null,"price":290.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/EmotionalPregnancy.jpg?v=1765032730"},{"product_id":"nemarese-stories","title":"Nemarese Stories","description":"\u003cp\u003eNemarese Stories: Peddala kosam Pillala Kathalu\u003cbr\u003e\u003cspan\u003eMullapudi Sridevi has re-spun age-old children stories from the Panchatantra and Jataka tales for the new-age elders, especially moms and grandmoms. In this age of pervasive technology, a group of ladies come together in a neighbourhood park to share stories that they can relay to the kids at home. Sridevi's simple and effective storytelling combined with compelling illustrations by Anvit, Arnav and Ananya, this is a children's book that all adults can read and enjoy! ఈ పుస్తకంలో మొత్తం పదహారు కథలు ఉన్నాయి. పంచతంత్రం, జాతక కథలు, జానపద కథల్లో మనకి తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని. మనకు మామూలుగా పరిచయం ఉన్న పిల్లల పుస్తకాలకంటే ఈ పుస్తకం రెండు విధాల కొత్తది. అ) ఇందులో చిన్న పిల్లల కథలను పిల్లలకు కాకుండా పెద్దలకు చెప్పారు. ఆ) కుటుంబాలలో పరిమితమైన కథా సమయాన్ని కమ్యూనిటీ స్థాయిలోకి, పెద్దల మధ్య సాయకాలం వ్యాపకంగా రచయిత్రి తీసుకొచ్చారు. ఆన్విత్(10), ఆనవ్ (12), అనన్య గీసిన బొమ్మలు ఇందులో ఉన్నాయి. ఈ కథలు చదువుతూ మీరు కాసేపు చిన్నపిల్లలై పోవడానికి, ఆ పైన మీ చుట్టూ ఉన్న పిల్లలకు కథలు చెప్పడానికి, వెంటనే ఒక కాపీ సొంతం చేసుకోండి మరి!\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743874412591,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/NemareseStoriescover.jpg?v=1765032876"},{"product_id":"panjaram","title":"Panjaram","description":"\u003cp\u003ePanjaram [Paperback] Amrita Pritam and Purnima Tammireddy\u003cbr\u003e\u003cspan\u003eThis is Telugu translation of Amrita Pritam's classic novel, PInjar. దేశ విభజన నేపథ్యంలో పూరో అనే అమ్మాయి కథ. పేరెన్నికగన్న పంజాబీ రచయిత్రి అమృతా ప్రీతమ్ 1950లో రాసిన నవల. విశ్వప్రసిద్ధ సినీ దర్శకులు డా. చంద్రశేఖర్ ద్వివేది సినిమాగా తీసిన నవల. పూర్ణిమ తమ్మిరెడ్డి తెలుగు అనువాదంలో. పుస్తకం చివర్న \"పంజరం\" నవలపై ఒక విశ్లేషణాత్మక వ్యాసం కూడా ఉంది.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743875002415,"sku":null,"price":230.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/panjarambyamrutapritam.jpg?v=1765033009"},{"product_id":"grama-devata","title":"Grama Devata","description":"\u003cp\u003eGrama Devata by Sree Padma\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eడా. శ్రీ పద్మ గారు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో, బౌడిన్ కాలేజీలో చరిత్ర ప్రొఫెసర్గా పనిచేశారు. దక్షిణ ఆసియా సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన నిపుణురాలుగా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. డా. శ్రీ పద్మ గారు గ్రామ దేవతలపై Vicissitudes of the Goddess: Reconstructions of the Gramadevata in India’s Religious Traditions అనే పుస్తకాన్ని రచించారు. దీన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. ఈ పుస్తకాన్ని ఇప్పుడు “గ్రామ దేవత చారిత్రక పరిణామం” అనే పేరుతో తెలుగులోకి అనువదించి మనకు అందిస్తున్నారు. ఇది భారతదేశంలోని గ్రామదేవతా సంప్రదాయాల చరిత్రపై విస్తృతంగా అధ్యయనం చేసి రాసిన పుస్తకం. ఇది ఇంతరకూ ఎవరూ స్పృశించని చాలా లోతైన అంశం. ఇందులో గ్రామదేవతారాధన పరిణామాన్నీ, సమాజపు సాంస్కృతిక, రాజకీయ ప్రభావాలనూ లోతుగా అధ్యయనం చేసారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44754179325999,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gramadevathafrontcover.jpg?v=1765384778"},{"product_id":"rekkachatu-akasham","title":"Rekkachatu Akasham","description":"\u003cp\u003e\u003cspan\u003e\"Each time a woman stands up for herself, without knowing it possibly, without claiming it, she stands up for all women.\" — Maya Angelou ప్రతి స్త్రీ జీవితం భిన్నమైనట్లే వారి సమస్యలు కూడా అంతే విభిన్నం. ఎన్నో ప్రశ్నలు, ప్రశ్నార్థకాలు.నేనెవరు అన్న ఒక ప్రశ్న నుండి మేమెవరు అన్న సామూహిక ప్రశ్న ఎదురయినప్పుడు అది అసహాయత్వాన్ని చీల్చుకుని బయటకి వచ్చే ఉరుము అవుతుంది. ఈ నవలలోని పాత్రలు తమ చెదిరిన జీవితాలను, దాని తాలూకు చీలిన ముక్కల్ని ఏరుకుని తిరిగి పునర్నిర్మించుకుంటాయి. ఆ స్త్రీల బాధ ఒక మౌనం. వాళ్ళు పడి లేస్తారు, కానీ ఒంటరిగా కాదు. ఎందుకంటే, ప్రతి స్త్రీకి అసలైన బలం—ఇంకొక స్త్రీ చేతిని పట్టుకోవడంలో ఉంటుంది. అందుకే సిస్టర్ హుడ్ అనేది ఈ నవల్లో కేవలం ఒక పదం కాదు. అది ఊపిరి. అది బలహీనతలోంచి పుట్టిన సామూహిక శక్తి. మనం ఎప్పుడైనా పూర్తిగా మన లాగ కావాలంటే, మనతో పాటు ఉండే మరొకరినీ పూర్తిగా మన స్నేహితురాలిగా అంగీకరించాలి. చదువుకుని, ఆర్థిక స్వావలంబన కల్గిన మధ్య తరగతి స్త్రీలను సమాజం \"భద్ర జీవులు\" గా ముద్ర వేస్తుంది. ఆ భద్ర జీవులు పురుష స్వామ్యం తమ నెత్తిన పెట్టిన భారాలను మోస్తూ లక్ష సమస్యల్ని నిత్యం ఎదుర్కొంటున్నా, సమాజం వారి సమస్యల్ని గుర్తించడానికి వెనకడుగు వేస్తుంది. సొంత సంపాదన ఉన్న స్త్రీలందరూ విముక్తులే అని భావిస్తుంది. సమకాలీన సాహిత్యం సైతం వారి జీవితాలను ప్రతిబింబించడానికి సుముఖంగా లేదు. ఈ నవల అన్ని వర్గాల స్త్రీలకూ ప్రాతినిధ్యం వహించదు. ఆ మాటకొస్తే ఏ నవలా అన్ని వర్గాలనూ ప్రతిబింబించదు. మన ఇంట్లోనూ, మన చుట్టూ నవ్వుతూ ఉల్లాసంగా కనిపించే కొందరు స్త్రీలను, వారి ఉల్లాసం వెనుక వారు మౌనంగా, ధైర్యంగా చేస్తున్న పోరాటాలను గురించి ఈ నవల మాట్లాడుతుంది. మన మధ్యన ఉన్న అటువంటి కొద్ది మంది కథే ఈ \"రెక్క చాటు ఆకాశం\". పురుష స్వామ్యం వేసిన చిక్కుముళ్ళ ను విదిలించుకుని రెక్కలు విప్పి ఆకాశానికి ఎగరగలిగిన స్త్రీల కథ.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44779657592879,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/rekkachatuaakasamtelugubook.jpg?v=1766082676"},{"product_id":"radha-madhilo","title":"Radha Madhilo","description":"\u003cp\u003eRadha Madhilo by Sowjanya Lolugu\u003c\/p\u003e\n\u003cp\u003eరాధ మదిలో - సౌజన్య లోలుగు\u003cbr\u003e\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eప్రపంచమే తెలియని ఒక ఆడపిల్ల ఆవేదనని..\u003cbr\u003eప్రపంచంలో ఏ కనులు గుర్తించలేదు.\u003c\/p\u003e\n\u003cp\u003eఅమ్మ, నాన్న, ఆప్తులు, బంధువులు ఎవరూ ఆమె వేదనని చూడలేదు. మౌనంగా ఆమె జీవితం కోసం చేస్తున్న పోరాటంలో స్వేచ్ఛగా ఎగిరిపోవడమే అందరికి కనపడింది. కానీ ఆమె చుట్టూ ఉన్న బానిస సంకెళ్ళు ఎవరికీ కనపడలేదు. \u003cbr\u003e    \u003cbr\u003eరెక్కలు కట్టుకొని ఈ ప్రపంచంలో ఎగరాలన్న కోరిక ఆమెకి లేదు. విరిగిపోయిన రెక్కలను ముద్దాడే ఒడిలో సేద తీరాలన్న కోరిక తప్ప. ఆ కోరికను కలగానే మిగిల్చి, ఆమె ప్రేమని అర్థం చేసుకోకుండా, ఆవేదన మిగిల్చిన మనుషుల మీద ఉన్న  ప్రేమని  ఆరాధనగా మార్చుకున్న అమ్మాయే ఈ  రాధ.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పుస్తకంలో నేను రాసిన అక్షరాలు\u003cbr\u003eనా మదిలోని మధురస్మృతులు.\u003cbr\u003eఈ ప్రపంచానికి కనపడని నా కన్నీటి గాధలు. \u003cbr\u003e              \u003cbr\u003eఎవరికీ చెప్పుకోలేని నా అంతర్మథనాలు.\u003cbr\u003eనా మదిలో ఉన్న వారిపై ఆరాధనలు.\u003cbr\u003eఆ  ఆరాధన నుండి పుట్టుకొచ్చిన రాధను నేనే.\u003cbr\u003eనేను కానిది ఏదిలేదు.\u003cbr\u003eఈ రాధ మదిలో...\u003cbr\u003e -    సౌజన్య\u003c\/p\u003e","brand":"Mana Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44815061352495,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Final2_b4fd10c8-7c59-4b7e-8510-62dd1870bf8f.jpg?v=1767031060"},{"product_id":"bomma-borusu-1","title":"Bomma Borusu","description":"\u003cp\u003e\u003cspan\u003e*రచయిత గురించి* కృష్ణ సాహితి మానసిక శాస్త్ర రంగంలో తొమ్మిదేళ్ల అనుభవం కలిగి ఉన్నారు. ఆమె అనేక సంస్థలతో పని చేసి, విద్యార్థులు మరియు యువతకు అనేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్లో హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా, ఆమె హైదరాబాద్లో తన స్వంత సైకాలజీ కౌన్సెలింగ్ సెంటర్లను (ithihas psychology counselling and Hypnotherapy centre) రెండు శాఖలతో స్థాపించారు. మానసిక శాస్త్ర వృత్తితో పాటు ఆమెకు పుస్తకాలంటే అపారమైన ప్రేమ. ఇప్పుడు తన వృత్తితో పాటు తన అభిరుచిని అనుసరించే కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44940451872815,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Bommaborusubook.jpg?v=1770299912"},{"product_id":"balkaav-backpack-kathalu","title":"Balkaav - Backpack Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eBalkaav (Backpack Stories) by Sri Uha\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈ పుస్తకం మీకో ట్రైన్ టికెట్. బస్ టికెట్. ఫ్లయిట్ టికెట్. మీరు ఏ సాయంత్రం వేళలోనో బాల్కనీలో కూచుని తెరిస్తే అమాంతం అక్కణ్ణుంచి మాయమయ్యి మాయా లేపనంతో ఒక కథాస్థలికి చేరుకుంటారు. గోవాలో ఒక కథ చూస్తారు. వరంగల్లులో ఒక కథ వింటారు. జైపూర్ దగ్గర పల్లె బయట రాత్రయితే నులక మంచం వాల్చే ఆనవాయితీ ఏమిటా అని తెలుసుకుని కలత చెందుతారు. హెూటల్ రూముల్లో దిగాల్సిన పని లేదు. కాని చెక్ఇన్ మధ్యాహ్నం రెండు గంటలకే అని హెూటల్వాడు హటాయిస్తే ఏం తోచక కొత్త ఈ ఊళ్లో తిరుగుతామే అలా ఈ పుటల మధ్య తిరగొచ్చు. నిజంగా రెక్కలతో ఎగిరి కొత్త ప్రాంతాల జనగాథలను వినాలని కోరుకునే అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. కథకులు, కవులు, సృజనకారులు తమ సిరాచుక్కల దారి పరిచి అట్టివారిని మోసుకెళతారు. శ్రీ ఊహ అలాంటి పని చేసింది ఈ కథల్లో.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003e- మహమ్మద్ ఖదీర్ బాబు\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sri Uha","offers":[{"title":"Default Title","offer_id":44943560441903,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Balkaavtelugubook.jpg?v=1770402088"},{"product_id":"gajadanti","title":"Gajadanti","description":"\u003cp\u003e\u003cspan\u003eప్రపంచం నలుమూలల నుంచి అమ్మమ్మ గారింటికి బయల్దేరిన కథేమిటో తెలుసా..?\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eవజ్రం కోసం దేవుడయ్య ఆ దేవుడే దగ్గరికే వెళ్లి మొరపెట్టుకున్నాడా?\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకన్నీటి చెమ్మ సాక్షిగా... గజదంతి జీవితంలో ఎదురైన సంఘటన.. ఒక కిరాతకుడిని వాల్మీకిగా మార్చిన ఘటన.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eముప్పయేళ్ల క్రితం విమానంతో సహా అదృశ్యమై, ముప్పయేళ్ల తర్వాత అదే వయసుతో తిరిగొస్తే.... బ్లాక్ హోల్\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eప్రకృతిని పునఃసృష్టించిన సైన్స్ విచిత్రం.. అతడు ప్రకృతిని సృష్టించాడు ది బ్లాస్ట్... ఒకేసారి 12 మంది కిడ్నాప్, సముద్రం నుంచి ఎలా తప్పించుకున్నారు.. హార్ట్చ్, సైన్స్ టచ్,థ్రిల్లర్ ఎక్సయిట్మెంట్... కంటికి కనిపించని ఎమోషన్స్ని కథల్లోకి తర్జుమా చేస్తే...\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eమనసు పొరల్లో దాగి ఉన్న జ్ఞాపకాలు, కళ్ళలో మెదిలే కన్నీటి బిందువులు, గుండె లోతుల్లో నిశ్శబ్దంగా మిగిలిపోయిన మాటలు... ప్రతి కథా మీలోని ఒక అనుభూతిని తట్టి లేపుతుంది. రక్త సంబంధాల మధ్య ఉండే ఆత్మీయత, విడిపోయిన మనసుల మధ్య ఉండే వేదన, మరియు ఆశ కోల్పోయిన చోట చిగురించే కొత్త ఉత్సాహం - ఇలా రకరకాల భావోద్వేగాల ప్రయాణం ఇది.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eనవ్వులు, కన్నీళ్లు, కోపతాపాలు, అనుబంధాల అల్లికతో సాగే ఈ కథాప్రయాణం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ప్రతి పేజీలోనూ ఒక కొత్త అనుభూతిని, ప్రతి ముగింపులోనూ ఒక మధురమైన జ్ఞాపకాన్ని ఈ పుస్తకం మీకు అందిస్తుంది. భావోద్వేగాల ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్న ప్రముఖ రచయిత్రి శ్రీసుధామయి కథాసంపుటి... ఈ గజదంతి మరిన్ని కథలు\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Balabooks","offers":[{"title":"Default Title","offer_id":45463687364655,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gajadanti_6386e810-a70b-4658-b7ff-49f75e997039.jpg?v=1781252059"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/5779ef8d-434f-4b8d-acae-afa0aa3dc8f0.jpg?v=1772898306","url":"https:\/\/books.ataka.in\/collections\/by-the-women.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}