{"title":"By The Women","description":"","products":[{"product_id":"pachha-bottu","title":"PACHHA BOTTU","description":"\n\u003cp\u003eThis Novel booked by C Sujatha, who worked as Editor in Andhra Jyothi, Udayam, Harathi, etc. She worked as script writer in ETV2, Sakhi, Vanitha etc.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397730693167,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/pachha-bottu-book-f.webp?v=1754490169"},{"product_id":"uniki","title":"UNIKI","description":"\n\u003cp\u003eఒక కథో, కవితో, నవలో చదివితే నిన్ను పట్టుకుని కుదిపెయ్యాలి. ప్రేమతోనో లేదూ కోపంతోనో. అయితే, ప్రతిదీ ఖచ్చితంగా కుదిపెయ్యాలనే నియమేమీ లేదు. కొన్ని ఆ సమయానికి హాయినిస్తాయి. ఈ కథలు చదివినప్పుడు కాసేపు బ్లాంక్ అవుతాం. contemporarywomen stories అంటాం కాని ఇవి contemporary పురుషులు చదవాల్సిన కథలు. పుస్తకాల్లో యుద్ధం గురించిన పాఠం ఉందంటే యుద్ధం తాలుకు భీభత్సం నుండి యుద్ధం వద్దని నేర్చుకుంటారని. ఇవీ అంతే. కొన్ని ఎలా ఉండాలో చెబితే, ఇంకొన్ని ఎలా ఉండకూడదో చెబుతాయి.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397733937199,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/uniki-f.webp?v=1754490172"},{"product_id":"aido-goda","title":"Aido goda","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412984000559,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156557.jpg?v=1754589570"},{"product_id":"panakam-on-the-rocks","title":"Panakam on the rocks","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413217734703,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156486.jpg?v=1754589570"},{"product_id":"deva-rahasyaalu","title":"Deva Rahasyaalu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413235822639,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156499.jpg?v=1754589570"},{"product_id":"ententa-dooram","title":"Ententa Dooram","description":"\u003cp\u003e\u003cspan\u003eఇవేం గొప్ప కథలు కాదు... తలకిందలయ్యే సంఘటనలూ లేవు... ఆశ్చర్యపరిచే మలుపులు లేవు... మెస్మరైజింగ్ ముగింపులు లేవు... కానీ ఒక్కొక్క కథ వెనక ఓ ఊపిరి ఉంది... ఓ నిశ్శబ్దం ఉంది... ఒక చిన్న తడబాటు ఉంది. మాటల్లో చెప్పలేని సున్నిత భావాలు, మౌనంగా మిగిలిపోయిన బరువైన క్షణాలు ఈ కథలు. లక్ష్మీ ప్రియాంక తన పుస్తకంలో నెమలిపించంతో పాటు పదునైన గాజు పెంకుని కూడా దాచుకుంది. ఇవి కథలు కావు... భావాలు! మన మనసుల్లో ఎన్నోసార్లు మాటలుగా రూపం దాల్చలేకపోయిన ఊహలు, ముగించలేక మిగిలిన కొన్ని బంధాలు, చెప్పలేక మిగిలిన కొన్ని ప్రేమలు, చిరునవ్వుల వెనక పడిపోయిన కొన్ని కన్నీటి చుక్కలు. మరెక్కడా చదవలేనంత కొత్త కథలేం కాదు, ఇంకెక్కడా అనుభవించలేనంత అనుభూతులు కావు, ఇవి పెద్ద ప్రకంపనలు కావు అనిపించే చిన్న కథలు. వేచిచూసే ఒక చూపు, తలవంచి ఆపుకున్న చిరునవ్వు, వదిలేసినా కాలంలో మిగిలిపోయిన చూపుల్లాగా మనల్ని గుచ్చుతూ ఉంటాయి. మనసుతో చదవాల్సిన కథలు. ఈ కథల్లో ఎక్కడో దాక్కున్న మిమ్మల్ని మీరు కలుసుకుంటారు, ఎప్పుడో కలిసిన ఓ ఆత్మీయుడ్ని గుర్తు చేసుకుంటారు. కొన్నింట్లో ప్రేమ మొదలవుతుంది. కొన్నింట్లో ప్రేమ సాగుతుంది. మరికొన్నింట్లో ప్రేమ ఆగిపోతుంది. కొన్ని కథలు పూర్తవ్వవు. కానీ అసంపూర్ణంగా మిగిలిన కథల్లోనే ఎక్కువగా భావాలు మిగిలిపోతాయి కదా! చెప్పాలనుకున్న చివరి మాటను ఒక చిరునవ్వుతో వదిలేసినట్టు. వదిలేసిన ఆ మాటే మనలో ఎక్కువకాలం నిలిచిపోతుంది. ఈ కథలు మీరు చదవకపోయినా ప్రపంచానికి ఏమీ జరుగదు. చదివాక మాత్రం ప్రియాంక మీ హృదయాన్ని తాకుతుంది... మీ మనసులో ఓ మూలన జ్ఞాపకాల పక్కన ఓ చిన్న కప్పు కాఫీ పెట్టి కూర్చుంటుంది. -భరత్ కమ్మ (డియర్ కామ్రేడ్ చిత్ర దర్శకులు)\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475609874479,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/enthenthadhuramf.jpg?v=1756821952"},{"product_id":"erra-mallelu","title":"Erra Mallelu","description":"\u003cp\u003e\u003cspan\u003eఒక స్నేహితురాలు మనతో కూర్చుని మన హక్కులు, పీరియడ్స్, కోరికలు, సెక్స్ ఎడ్యుకేషన్, కనీస అవసరాలు, మారిటల్ రేప్ ఇలా మనకి అవగాహన లేని వాటి గురించి తన కథ ద్వారా మనకి తెలియచేస్తుంటే ఎంత బావుంటుంది. ఆ స్నేహితురాలే \"ఎర్ర మల్లెలు\"\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500026785839,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ErraMallelufrontcover.jpg?v=1757675391"},{"product_id":"chaitra-novel","title":"Chaitra (Novel)","description":"\u003cp\u003e\u003cspan\u003eకాలం ఎప్పటికప్పుడు కొత్త రంగులను తొడుక్కుంటూనే ఉంది, రోజులన్నీ తేదీలను మారుస్తూ అభివృద్ధి వైపు అడుగులేస్తూ పోతున్నా, ఆధునిక యుగంలో ఇంకా అనాగరికంగానే బతుకుతున్నాం, విచక్షణ కోల్పోయి, వివక్ష తాలుకా మనిషి నిలబడ్డప్పుడు కొన్ని మనుగడలెప్పుడూ మనిషిని వేధిస్తూ ఉంటాయి, మనం ఆనవాళ్ళుగా చెప్పుకునే అమ్మల జీవితాలు ఏ గర్భగుడిలోనో హత్య చేయబడతాయి, ఏ చెత్త కుప్పల మీదో అనాథగా వెలేయబడతాయి. భారం దించుకొని, బాధ్యతగా చెప్పుకునే ఓ తాడుకి ఉరితీయబడుతున్నాయి ఇలా ఒకే కారణం మీద వేలాడుతూ దుఃఖిస్తూ ఉన్నాయి. అయినా కాలంతో పాటు కాసిన్ని కలలతో జీవితాన్ని కలగంటున్నవారు విరిగిన రెక్కలను అతికించుకుంటూ కొత్త రంగులను జీవితానికి అద్దుతున్నారు. ఇంటి గడపల ముందు ఎదురుచూపులు మాని దేశ సరిహద్దుల మీద కాపలా కనురెప్పలవుతున్నారు. కంచెలు తెంచుకొని కాలం మీద చరిత్రలు రాస్తున్నవారు మనకు కనిపిస్తూనే ఉంటారు… నా ఆలోచనలకు అక్షరాలను అద్ది అస్థిత్వపు నినాదంగా నా మొదటి నవల 'చైత్ర'ను మీకు అందిస్తున్నాను. -స్ఫూర్తి కందివనం\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44534969794607,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/chaitra.jpg?v=1758694942"},{"product_id":"dimki","title":"Dimki","description":"\u003cp\u003eDimki (Telugu) Paperback\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనేను పుట్టిన నేల, నాకు అనుభవంలోకి వచ్చిన కొన్ని సంఘటనలు, నా జీవన ప్రయాణంలో నాకు తారసపడిన వ్యక్తులు, లోతుగా పరిశీలించిన కొన్ని కోణాలు నేను రాయాల్సిన అవసరాన్ని తెలిపి నా చేత రాయించినవే ఈ కథలు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eసాహిత్యం సమాజాన్ని కచ్చితంగా ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. కథలు, నవలలు చదివి తమ సమస్యకు పరిష్కారం వెతుక్కునే వాళ్లు కొందరైతే, ఆ పాత్రలలో తమని చూసుకుని ఎమోషనల్ అయ్యే వాళ్ళు కొందరు. తెలియని విషయాలను గురించి తెలుసుకునేవాళ్ళు కొందరైతే, తెలిసిన విషయాన్నే వాళ్లకు తెలియని కొత్త కోణంలో తెలుసుకుని వాళ్ళ ఆలోచనా ధోరణిని మార్చుకునేవాళ్ళు కొందరు. అటువంటి మార్పులు తీసుకొచ్చిన కథలు, నవలలు కోకొల్లలు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eమన రచన మొత్తం సమాజాన్నే మార్చేయలేకపోవొచ్చేమో కానీ దాన్ని చదివే ఏ ఒక్కరినైనా కదిలించగలగి, ఒక ఆలోచనను రేకెత్తించగలిగి, ఆ ఆలోచనే రేపటి మార్పుకు పునాది కావాలి. ఒక రచయిత అక్షరానికి అంతకంటే గొప్ప గుర్తింపు, గౌరవం మరేదీ ఉండదని నా నమ్మకం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003e-స్ఫూర్తి కందివనం\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eరచయిత్రి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44609342865455,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/DimkiFrontcover.jpg?v=1761291149"},{"product_id":"swatantra-స్వతంత్ర","title":"Swatantra (స్వతంత్ర)","description":"\u003cp\u003e\u003cspan\u003e“ఒకసారి చెప్తే అర్థం కాదూ? నీలాంటి ఆడాళ్ళు ఉన్నంతలో ఉంటే మంచిది” అతడి మాట కచ్చితంగా అతడి హృదయం నుండి ప్రతిధ్వనిస్తుంది. ‘నా లాంటి ఆడాళ్ళా? అంటే నేనేం చేసాను? ఈయన ఎందుకిలా అంటున్నారు? ఉన్నట్టుండి ఇంత చిత్రమైన మాటెందుకు పలికారు. ఆయన ఉద్దేశ్యమేమిటి? ఇష్టం లేకుంటే లేదని చెప్పాలిగానీ ఈ మాట ఊరికే ఎలా అనగలిగారు?’ ఆమెలో ఆవేదన తన్నుకొస్తూ “నేనేం చేశాను? ఎందుకలా అంటున్నారు?” అడిగింది కన్నీళ్ళ భారానికి బరువైన గొంతు సరిచేసుకుంటూ. “మీ ఆడాళ్లకు పాపులారిటీ పెరిగితే కళ్ళు నెత్తికెక్కుతాయి. మొగుడూ పిల్లలూ ఇవేం మీకు అవసరం ఉండదు. అందుకే ఈ చెత్త ఐడియాలు పక్కన పెడితే మంచిది. లేకుంటే అనవసరంగా నీ గొయ్యి నువ్వు తీసుకుంటావు” అతడి మాటలు కటువుగా ఆమె హృదయంలోకి చేరుకున్నాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Godavari Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44718602977327,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/swathantrafront.jpg?v=1764327261"},{"product_id":"emotional-pregnancy","title":"Emotional Pregnancy","description":"\u003cp\u003eEmotional Pregnancy (Short Stories) [Paperback] Purnima Tammireddy\u003cbr\u003e\u003cspan\u003eప్రేమ, పాశం, విరహం, దుఃఖం - ఇలాంటి వాటి గురించి మనకు తెలిసిన అర్థాలను, ఉన్న అనుభవాలను సవాలు చేసే కథాంశాలివి. తెలుగులోనే రాసినా, తెలుగు సాహిత్యానికి అలవాటు లేని శైలి, వ్యక్తీకరణలు ఉన్న కథనాలివి. అర్బన్ జీవితాల్లోని కనిపించని, కనిపించనివ్వకుండా దాచే విషయాల గురించిన కథలివి. మొత్తం 25 కథలు. విలక్షమైన కథలు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743873953839,"sku":null,"price":290.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/EmotionalPregnancy.jpg?v=1765032730"},{"product_id":"nemarese-stories","title":"Nemarese Stories","description":"\u003cp\u003eNemarese Stories: Peddala kosam Pillala Kathalu\u003cbr\u003e\u003cspan\u003eMullapudi Sridevi has re-spun age-old children stories from the Panchatantra and Jataka tales for the new-age elders, especially moms and grandmoms. In this age of pervasive technology, a group of ladies come together in a neighbourhood park to share stories that they can relay to the kids at home. Sridevi's simple and effective storytelling combined with compelling illustrations by Anvit, Arnav and Ananya, this is a children's book that all adults can read and enjoy! ఈ పుస్తకంలో మొత్తం పదహారు కథలు ఉన్నాయి. పంచతంత్రం, జాతక కథలు, జానపద కథల్లో మనకి తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని. మనకు మామూలుగా పరిచయం ఉన్న పిల్లల పుస్తకాలకంటే ఈ పుస్తకం రెండు విధాల కొత్తది. అ) ఇందులో చిన్న పిల్లల కథలను పిల్లలకు కాకుండా పెద్దలకు చెప్పారు. ఆ) కుటుంబాలలో పరిమితమైన కథా సమయాన్ని కమ్యూనిటీ స్థాయిలోకి, పెద్దల మధ్య సాయకాలం వ్యాపకంగా రచయిత్రి తీసుకొచ్చారు. ఆన్విత్(10), ఆనవ్ (12), అనన్య గీసిన బొమ్మలు ఇందులో ఉన్నాయి. ఈ కథలు చదువుతూ మీరు కాసేపు చిన్నపిల్లలై పోవడానికి, ఆ పైన మీ చుట్టూ ఉన్న పిల్లలకు కథలు చెప్పడానికి, వెంటనే ఒక కాపీ సొంతం చేసుకోండి మరి!\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743874412591,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/NemareseStoriescover.jpg?v=1765032876"},{"product_id":"panjaram","title":"Panjaram","description":"\u003cp\u003ePanjaram [Paperback] Amrita Pritam and Purnima Tammireddy\u003cbr\u003e\u003cspan\u003eThis is Telugu translation of Amrita Pritam's classic novel, PInjar. దేశ విభజన నేపథ్యంలో పూరో అనే అమ్మాయి కథ. పేరెన్నికగన్న పంజాబీ రచయిత్రి అమృతా ప్రీతమ్ 1950లో రాసిన నవల. విశ్వప్రసిద్ధ సినీ దర్శకులు డా. చంద్రశేఖర్ ద్వివేది సినిమాగా తీసిన నవల. పూర్ణిమ తమ్మిరెడ్డి తెలుగు అనువాదంలో. పుస్తకం చివర్న \"పంజరం\" నవలపై ఒక విశ్లేషణాత్మక వ్యాసం కూడా ఉంది.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743875002415,"sku":null,"price":230.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/panjarambyamrutapritam.jpg?v=1765033009"},{"product_id":"grama-devata","title":"Grama Devata","description":"\u003cp\u003eGrama Devata by Sree Padma\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eడా. శ్రీ పద్మ గారు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో, బౌడిన్ కాలేజీలో చరిత్ర ప్రొఫెసర్గా పనిచేశారు. దక్షిణ ఆసియా సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన నిపుణురాలుగా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. డా. శ్రీ పద్మ గారు గ్రామ దేవతలపై Vicissitudes of the Goddess: Reconstructions of the Gramadevata in India’s Religious Traditions అనే పుస్తకాన్ని రచించారు. దీన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. ఈ పుస్తకాన్ని ఇప్పుడు “గ్రామ దేవత చారిత్రక పరిణామం” అనే పేరుతో తెలుగులోకి అనువదించి మనకు అందిస్తున్నారు. ఇది భారతదేశంలోని గ్రామదేవతా సంప్రదాయాల చరిత్రపై విస్తృతంగా అధ్యయనం చేసి రాసిన పుస్తకం. ఇది ఇంతరకూ ఎవరూ స్పృశించని చాలా లోతైన అంశం. ఇందులో గ్రామదేవతారాధన పరిణామాన్నీ, సమాజపు సాంస్కృతిక, రాజకీయ ప్రభావాలనూ లోతుగా అధ్యయనం చేసారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44754179325999,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gramadevathafrontcover.jpg?v=1765384778"},{"product_id":"rekkachatu-akasham","title":"Rekkachatu Akasham","description":"\u003cp\u003e\u003cspan\u003e\"Each time a woman stands up for herself, without knowing it possibly, without claiming it, she stands up for all women.\" — Maya Angelou ప్రతి స్త్రీ జీవితం భిన్నమైనట్లే వారి సమస్యలు కూడా అంతే విభిన్నం. ఎన్నో ప్రశ్నలు, ప్రశ్నార్థకాలు.నేనెవరు అన్న ఒక ప్రశ్న నుండి మేమెవరు అన్న సామూహిక ప్రశ్న ఎదురయినప్పుడు అది అసహాయత్వాన్ని చీల్చుకుని బయటకి వచ్చే ఉరుము అవుతుంది. ఈ నవలలోని పాత్రలు తమ చెదిరిన జీవితాలను, దాని తాలూకు చీలిన ముక్కల్ని ఏరుకుని తిరిగి పునర్నిర్మించుకుంటాయి. ఆ స్త్రీల బాధ ఒక మౌనం. వాళ్ళు పడి లేస్తారు, కానీ ఒంటరిగా కాదు. ఎందుకంటే, ప్రతి స్త్రీకి అసలైన బలం—ఇంకొక స్త్రీ చేతిని పట్టుకోవడంలో ఉంటుంది. అందుకే సిస్టర్ హుడ్ అనేది ఈ నవల్లో కేవలం ఒక పదం కాదు. అది ఊపిరి. అది బలహీనతలోంచి పుట్టిన సామూహిక శక్తి. మనం ఎప్పుడైనా పూర్తిగా మన లాగ కావాలంటే, మనతో పాటు ఉండే మరొకరినీ పూర్తిగా మన స్నేహితురాలిగా అంగీకరించాలి. చదువుకుని, ఆర్థిక స్వావలంబన కల్గిన మధ్య తరగతి స్త్రీలను సమాజం \"భద్ర జీవులు\" గా ముద్ర వేస్తుంది. ఆ భద్ర జీవులు పురుష స్వామ్యం తమ నెత్తిన పెట్టిన భారాలను మోస్తూ లక్ష సమస్యల్ని నిత్యం ఎదుర్కొంటున్నా, సమాజం వారి సమస్యల్ని గుర్తించడానికి వెనకడుగు వేస్తుంది. సొంత సంపాదన ఉన్న స్త్రీలందరూ విముక్తులే అని భావిస్తుంది. సమకాలీన సాహిత్యం సైతం వారి జీవితాలను ప్రతిబింబించడానికి సుముఖంగా లేదు. ఈ నవల అన్ని వర్గాల స్త్రీలకూ ప్రాతినిధ్యం వహించదు. ఆ మాటకొస్తే ఏ నవలా అన్ని వర్గాలనూ ప్రతిబింబించదు. మన ఇంట్లోనూ, మన చుట్టూ నవ్వుతూ ఉల్లాసంగా కనిపించే కొందరు స్త్రీలను, వారి ఉల్లాసం వెనుక వారు మౌనంగా, ధైర్యంగా చేస్తున్న పోరాటాలను గురించి ఈ నవల మాట్లాడుతుంది. మన మధ్యన ఉన్న అటువంటి కొద్ది మంది కథే ఈ \"రెక్క చాటు ఆకాశం\". పురుష స్వామ్యం వేసిన చిక్కుముళ్ళ ను విదిలించుకుని రెక్కలు విప్పి ఆకాశానికి ఎగరగలిగిన స్త్రీల కథ.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44779657592879,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/rekkachatuaakasamtelugubook.jpg?v=1766082676"},{"product_id":"radha-madhilo","title":"Radha Madhilo","description":"\u003cp\u003eRadha Madhilo by Sowjanya Lolugu\u003c\/p\u003e\n\u003cp\u003eరాధ మదిలో - సౌజన్య లోలుగు\u003cbr\u003e\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eప్రపంచమే తెలియని ఒక ఆడపిల్ల ఆవేదనని..\u003cbr\u003eప్రపంచంలో ఏ కనులు గుర్తించలేదు.\u003c\/p\u003e\n\u003cp\u003eఅమ్మ, నాన్న, ఆప్తులు, బంధువులు ఎవరూ ఆమె వేదనని చూడలేదు. మౌనంగా ఆమె జీవితం కోసం చేస్తున్న పోరాటంలో స్వేచ్ఛగా ఎగిరిపోవడమే అందరికి కనపడింది. కానీ ఆమె చుట్టూ ఉన్న బానిస సంకెళ్ళు ఎవరికీ కనపడలేదు. \u003cbr\u003e    \u003cbr\u003eరెక్కలు కట్టుకొని ఈ ప్రపంచంలో ఎగరాలన్న కోరిక ఆమెకి లేదు. విరిగిపోయిన రెక్కలను ముద్దాడే ఒడిలో సేద తీరాలన్న కోరిక తప్ప. ఆ కోరికను కలగానే మిగిల్చి, ఆమె ప్రేమని అర్థం చేసుకోకుండా, ఆవేదన మిగిల్చిన మనుషుల మీద ఉన్న  ప్రేమని  ఆరాధనగా మార్చుకున్న అమ్మాయే ఈ  రాధ.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పుస్తకంలో నేను రాసిన అక్షరాలు\u003cbr\u003eనా మదిలోని మధురస్మృతులు.\u003cbr\u003eఈ ప్రపంచానికి కనపడని నా కన్నీటి గాధలు. \u003cbr\u003e              \u003cbr\u003eఎవరికీ చెప్పుకోలేని నా అంతర్మథనాలు.\u003cbr\u003eనా మదిలో ఉన్న వారిపై ఆరాధనలు.\u003cbr\u003eఆ  ఆరాధన నుండి పుట్టుకొచ్చిన రాధను నేనే.\u003cbr\u003eనేను కానిది ఏదిలేదు.\u003cbr\u003eఈ రాధ మదిలో...\u003cbr\u003e -    సౌజన్య\u003c\/p\u003e","brand":"Mana Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44815061352495,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Final2_b4fd10c8-7c59-4b7e-8510-62dd1870bf8f.jpg?v=1767031060"},{"product_id":"bomma-borusu-1","title":"Bomma Borusu","description":"\u003cp\u003e\u003cspan\u003e*రచయిత గురించి* కృష్ణ సాహితి మానసిక శాస్త్ర రంగంలో తొమ్మిదేళ్ల అనుభవం కలిగి ఉన్నారు. ఆమె అనేక సంస్థలతో పని చేసి, విద్యార్థులు మరియు యువతకు అనేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్లో హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా, ఆమె హైదరాబాద్లో తన స్వంత సైకాలజీ కౌన్సెలింగ్ సెంటర్లను (ithihas psychology counselling and Hypnotherapy centre) రెండు శాఖలతో స్థాపించారు. మానసిక శాస్త్ర వృత్తితో పాటు ఆమెకు పుస్తకాలంటే అపారమైన ప్రేమ. ఇప్పుడు తన వృత్తితో పాటు తన అభిరుచిని అనుసరించే కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44940451872815,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Bommaborusubook.jpg?v=1770299912"},{"product_id":"balkaav-backpack-kathalu","title":"Balkaav - Backpack Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eBalkaav (Backpack Stories) by Sri Uha\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈ పుస్తకం మీకో ట్రైన్ టికెట్. బస్ టికెట్. ఫ్లయిట్ టికెట్. మీరు ఏ సాయంత్రం వేళలోనో బాల్కనీలో కూచుని తెరిస్తే అమాంతం అక్కణ్ణుంచి మాయమయ్యి మాయా లేపనంతో ఒక కథాస్థలికి చేరుకుంటారు. గోవాలో ఒక కథ చూస్తారు. వరంగల్లులో ఒక కథ వింటారు. జైపూర్ దగ్గర పల్లె బయట రాత్రయితే నులక మంచం వాల్చే ఆనవాయితీ ఏమిటా అని తెలుసుకుని కలత చెందుతారు. హెూటల్ రూముల్లో దిగాల్సిన పని లేదు. కాని చెక్ఇన్ మధ్యాహ్నం రెండు గంటలకే అని హెూటల్వాడు హటాయిస్తే ఏం తోచక కొత్త ఈ ఊళ్లో తిరుగుతామే అలా ఈ పుటల మధ్య తిరగొచ్చు. నిజంగా రెక్కలతో ఎగిరి కొత్త ప్రాంతాల జనగాథలను వినాలని కోరుకునే అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. కథకులు, కవులు, సృజనకారులు తమ సిరాచుక్కల దారి పరిచి అట్టివారిని మోసుకెళతారు. శ్రీ ఊహ అలాంటి పని చేసింది ఈ కథల్లో.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003e- మహమ్మద్ ఖదీర్ బాబు\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sri Uha","offers":[{"title":"Default Title","offer_id":44943560441903,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Balkaavtelugubook.jpg?v=1770402088"},{"product_id":"gajadanti","title":"Gajadanti","description":"\u003cp\u003e\u003cspan\u003eప్రపంచం నలుమూలల నుంచి అమ్మమ్మ గారింటికి బయల్దేరిన కథేమిటో తెలుసా..?\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eవజ్రం కోసం దేవుడయ్య ఆ దేవుడే దగ్గరికే వెళ్లి మొరపెట్టుకున్నాడా?\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకన్నీటి చెమ్మ సాక్షిగా... గజదంతి జీవితంలో ఎదురైన సంఘటన.. ఒక కిరాతకుడిని వాల్మీకిగా మార్చిన ఘటన.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eముప్పయేళ్ల క్రితం విమానంతో సహా అదృశ్యమై, ముప్పయేళ్ల తర్వాత అదే వయసుతో తిరిగొస్తే.... బ్లాక్ హోల్\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eప్రకృతిని పునఃసృష్టించిన సైన్స్ విచిత్రం.. అతడు ప్రకృతిని సృష్టించాడు ది బ్లాస్ట్... ఒకేసారి 12 మంది కిడ్నాప్, సముద్రం నుంచి ఎలా తప్పించుకున్నారు.. హార్ట్చ్, సైన్స్ టచ్,థ్రిల్లర్ ఎక్సయిట్మెంట్... కంటికి కనిపించని ఎమోషన్స్ని కథల్లోకి తర్జుమా చేస్తే...\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eమనసు పొరల్లో దాగి ఉన్న జ్ఞాపకాలు, కళ్ళలో మెదిలే కన్నీటి బిందువులు, గుండె లోతుల్లో నిశ్శబ్దంగా మిగిలిపోయిన మాటలు... ప్రతి కథా మీలోని ఒక అనుభూతిని తట్టి లేపుతుంది. రక్త సంబంధాల మధ్య ఉండే ఆత్మీయత, విడిపోయిన మనసుల మధ్య ఉండే వేదన, మరియు ఆశ కోల్పోయిన చోట చిగురించే కొత్త ఉత్సాహం - ఇలా రకరకాల భావోద్వేగాల ప్రయాణం ఇది.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eనవ్వులు, కన్నీళ్లు, కోపతాపాలు, అనుబంధాల అల్లికతో సాగే ఈ కథాప్రయాణం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ప్రతి పేజీలోనూ ఒక కొత్త అనుభూతిని, ప్రతి ముగింపులోనూ ఒక మధురమైన జ్ఞాపకాన్ని ఈ పుస్తకం మీకు అందిస్తుంది. భావోద్వేగాల ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్న ప్రముఖ రచయిత్రి శ్రీసుధామయి కథాసంపుటి... ఈ గజదంతి మరిన్ని కథలు\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Balabooks","offers":[{"title":"Default Title","offer_id":45463687364655,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gajadanti_6386e810-a70b-4658-b7ff-49f75e997039.jpg?v=1781252059"},{"product_id":"amara-hrudayam","title":"Amara Hrudayam","description":"\u003cp\u003eఅమర హృదయం యద్దనపూడి సులోచనారాణి\u003c\/p\u003e\n\u003cp\u003e“నేను యిప్పడు  విద్యాశాఖ చీఫ్ సెక్రటరీని. కాని చిన్నప్పుడు నా అల్లరి చూసిన ఎవరూ నేను యింతవాడిని అవుతానని కలలోకూడా అనుకోలేదు.పల్లెటూరులో చిన్నప్పుడు స్కూలుకి వెళ్ళమంటే ఏడ్చి రాగాలు పెట్టేవాడిని,స్కూలు ఎగ్గొట్టి ఆటలు ఆడేవాణ్ణి. మార్కులు సున్నా రావటంత,మానాన్న పేను బెత్తంతో నా వీపు చీరేసేవాడు.ఎండలో నిలబెట్టేవాడు. అబ్బో!ఇప్పడు ఆ తన్నులు తలచుకుంటే”,హాలంతా నవ్వులకెరటంగా మారిపోయింది. ఆయన గంభీర స్వరంతో చెప్పసాగాడు “అలాంటి నేను, ఒక్క మేష్టారి వల్ల, ఏడాదిలో పూర్తిగా మారిపోయాను. ఆయనవల్ల నాజాతకం,నా జీవనగమ్యమే మారిపోయింది…\u003c\/p\u003e\n\u003cp\u003eకాబట్టి ఉపాధ్యాయుడు ఎంతోమంది విద్యార్థుల మనసుల్లో జ్ఞానజ్యోతి వెలిగించగలడు.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ మెర్రీ గోల్డ్ స్కూలు చరిత్రలో అలాంటి ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503162253359,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/amarahrudayam.jpg?v=1782030727"},{"product_id":"amruthadhaara","title":"Amruthadhaara","description":"\u003cp\u003eఅమృతధార యద్దనపూడి సులోచనారాణిమనోజ్ అమూల్యని పరీక్షగా చూస్తూ అడిగాడు. \"అట్లా అయితే నువ్వు చెప్పేదే నిజమైతే శివా చనిపోయిన వెంటనే నా దగ్గరకు వెంటనే ఎందుకు రాలేదు\".\u003c\/p\u003e\n\u003cp\u003e\"రెండున్నర సంవత్సరాలు ఒంటరిగా నేను, నేనుగా బ్రతకగలనేమో అని ప్రయత్నించాను. దాదాపు శక్తికి మించి పోరాడాను. కాని నావల్ల కాలేదు. మీ దగ్గరికి రాక తప్పలేదు\". అమూల్య కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టే ఆగిపోయింది.\u003c\/p\u003e\n\u003cp\u003eఒక్క క్షణం తర్వాత తనను తాను నిగ్రహించుకుని, దించిన తల ఎత్తి దిన దిన గండంగా నేను బ్రతకలేను. ఎంత ధైర్యం ఉన్నా ఆడపిల్లగా ఈ సమాజంలో ఎదుర్కోలేనివి చాలా ఉన్నాయి. అందుకే మీ దగ్గరికి రాక తప్పలేదు.\u003c\/p\u003e\n\u003cp\u003eఅమూల్యకి వచ్చిన ఆపద ఏది? మనోజ్ దానిని ఎలా పరిష్కరించాడు?\u003c\/p\u003e\n\u003cp\u003eఅద్భుతమైన కథనంతో, అపురూప సంఘటనలతో హృదయానికి హత్తుకునేలా మలచిన అపురూపమైన నవల\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503189418031,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Amruthadhaara.jpg?v=1782030907"},{"product_id":"andhra-yuvakuda-dari-itu","title":"Andhra Yuvakuda-Dari Itu","description":"\u003cp\u003eచాలా జీవితాల్లో దారుణమైన సంఘటనలెన్నో వుంటాయి. కానీ మానవత్వం సిగ్గుపడాల్సిన సంఘటనలు ఎదురవటం అరుదు. డబ్బే జీవితంగా భావించిన భవానీప్రసాద్ జీవితంలో అలాంటి సంఘటన జరిగింది. మనసు సిగ్గుతో చచ్చిపోయి, మనిషిని జీవచ్ఛవంలా మార్చిన ఆ సంఘటన ఏమిటి? షేమ్-కథ చదవండి. తెలుస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eనిరుద్యోగం, కలసిరాని పరిస్థితులు గోపాలాన్ని పీల్చి పిప్పి చేశాయి. అసమర్థుడని అందరూ వేలెత్తి చూపించారు. తనకి జరిగిన అవమానాలెన్నో సహించిన గోపాలం, శాంతకీ జరిగిన అవమానాన్ని సహించలేకపోయాడు. అగ్నిజ్వాలలా జ్వలించాడు. ఫలితం ఏమిటో, ఏం జరిగిందో తెలిపేకథ-అసమర్థుడు.\u003c\/p\u003e\n\u003cp\u003eఆర్థిక అసమానతలతో, పెద్దవారి అధికారానికి బానిసల్లా బతుకులు వెళ్ళదీస్తున్న బడుగు బతుకుల్తో, రోజురోజుకీ దిగజారుతున్న తన గ్రామం ఒకవైపు… జీవితాన్ని సుఖప్రదంగా, మూడుపువ్వులు ఆరుకాయలుగా మార్చగలిగిన విదేశీ జీవితావకాశం ఒకవైపు… రవి ఏ మలుపు తిరిగాడో తెలుపుతూ, యీనాటి యువతరానికి దారి సూచించే కథ-ఆంధ్రయువకుడా! దారి ఇటు.\u003c\/p\u003e\n\u003cp\u003eఅనుకోని పరిస్థితులెదురై, భార్యనని చెప్పుకోలేకపోయినా భర్తనే అంటిపెట్టుకుని జీవితాన్ని జయించిన జయకథ – భార్య.\u003c\/p\u003e\n\u003cp\u003eప్రతి పదం దృశ్యంలా కళ్ళముందు కదిలేలా రాసిన కథలు రెండైతే విస్తృతమైన కథాసారాన్ని సంఘటనల్లా మలచి కూర్చిన కథలు రెండు. రచనా విధానంలో మార్పుని, రసస్పందన కలిగించటంలో నేర్పుని అవగతం చేసుకోటానికి\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503197577263,"sku":null,"price":50.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AndhraYuvakuda_DaariItu.jpg?v=1782031104"},{"product_id":"anuraga-ganga","title":"Anuraga Ganga","description":"\u003cp\u003eఅందమైన పాలరాతి బొమ్మకి ప్రాణం వచ్చినట్టుగా,పాలనురగ లాంటి తెల్లటి దుస్తులతో,మెల్లగా మెట్లు దిగివస్తున్న ప్రీతి చేతిలో నవనవలాడుతున్న పసుపుపచ్చటి గులాబి పువ్వు ఉంది. క్రింది హాలులో పార్టీకి వచ్చిన ఆహుతులందరి కళ్ళూ ఆ అమ్మాయి మీదనే నిల్చినా, తన కళ్ళుమాత్రం ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా చూస్తున్నాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eప్రీతి పాదం ఆఖరి మెట్టు మీదకు రాగానే శరత్ చంద్ర అక్కడికి వచ్చాడు. ప్రీతి క్షణం సేపు తదేకంగా అతన్ని చూసింది. ఆ తర్వాత చేతిలో గులాబి అతనికి అందిస్తూ తగ్గు స్వరంతో “మీ ఉత్తరానికి జవాబు ఇదే!”అంది. మగసిరి నిండిన అతని చేతివేళ్ళు ఆపువ్వుని అందుకున్నాయి.”థ్యాంక్ యూ”అతను అస్పష్టంగా అన్నాడు. ప్రీతి ఆ పువ్వుని వదల లేదు. అతనివైపే చూస్తోంది. అతను కూడా ప్రీతి వైపే చూస్తున్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eదూరం నుంచి ఒక వయససుమళ్ళిన వ్యక్తి వీళ్ళిద్దరినీ రెప్పవాల్చకుండా చూస్తున్నాడు.అతని ముఖంనిండా దెబ్బలు తగిలి మానినట్లుగా గాట్లు,మచ్చలు ఉన్నాయి.మొరటుగా వున్న అతనిపెదవులమీద క్రూరమైన చిరునవ్వు మెదలింది. ఆనవ్వు అతని ముఖంలో వున్న భీకరత్వాన్ని రెట్టింపు చేసింది.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503209340975,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AnuragaGanga.jpg?v=1782031283"},{"product_id":"jeevana-geetham","title":"Jeevana Geetham","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eజీవనగీతం యద్దనపూడి సులోచనారాణి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eపెళ్ళి అయిన తరువాత జీవిత భాగస్వాముల్లో ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు,అభిమానం వుంటాయి.కానీ, కొన్ని కారణాల వల్ల ముఖ్యంగా వారి వారి వ్యక్తిత్వంలోని అహం వల్లనో,స్వార్థం వల్లనో, వారి మనస్సుల్లో బానిసత్వం వల్లనో,దైనందిన జీవితంలోని చాలా అల్ప సమస్యలు, వారి జీవన మాధుర్యాన్ని చీడక్రీముల్లా హరిస్తూ, ‘హరిత వనం’లా వుండాల్సిన యింటిని ‘శిథిలగృహం’లా మార్చేస్తున్నాయి.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503219433519,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/JeevanaGeetham.jpg?v=1782031430"},{"product_id":"ardhastitha","title":"Ardhastitha","description":"\u003cp\u003e\u003cspan\u003e \u003c\/span\u003eఅర్థస్థిత యద్దనపూడి సులోచనా రాణి\u003c\/p\u003e\n\u003cp\u003eపూజకి ఒక్క క్షణం ఈ సృష్టి అంతా సర్వానందజంత్ర సమ్మేళనంగా అన్పించింది! సిద్దార్థని మరింత దగ్గరకు తీసుకుంది. శరీరం అంతా ఆనందపు వెలుగుమైకంలా కమ్మేస్తుంది. ఈ  ప్రపంచంలో ఇతను తప్ప తనకి యింకేం అవసరంలేదు అన్పిస్తుంది. ఈ ఆనందంలో ఏదో శక్తి! అది ఆమె మనసులోని సంకోచపు గొలుసుల్ని తెగ్గొట్టేసి,ఆమెకి స్వచ్ఛమైన,నిర్మలమైన ఆనందపు అమృతాల్ని దోసిలితో తాగిస్తోంది!\u003c\/p\u003e\n\u003cp\u003eఎక్కడో బీటలు వారిన మనసు క్షేత్రంలో ఆ అమృతపు చినుకులు రాలుతున్నాయి! ఆమెలోని ఏదో నిరుపేదతనం, దాని తాలుకు వ్యథ….! ఎండిన ఆకుల్లా రాలిపోతున్నాయి. ఒక సుమధురమైన గాలి! ఒక కొత్తపథం  వైపు పయనం! సిద్దార్థ భుజాల చుట్టూ చేయివేసి దగ్గరగా పట్టుకుని, ఆ వెలుగుపుంత వైపు తను నిస్సంకోచంగా నడవటానికి సిద్ధం అవుతుంది. అడుగు ముందుకు పడ్తోంది.తనని ఎవ్వరూ ఆపలేరు! అభిజిత్ కూడా అడ్డుకోలేడు! ఆమెకి అర్థం అయిపోతుంది.తను పుట్టిందీ,బ్రతుకుతోందీ యీ దివ్యక్షణాల కోసమే! ఇతని కోసమే!\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503225397295,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ArdhaStitha_bc75f888-afc9-4678-ab52-3f2968b5b691.jpg?v=1782031692"},{"product_id":"atmeeyulu","title":"Atmeeyulu","description":"\u003cp\u003e\u003cspan\u003eఆత్మీయులు \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eకష్టపడి చదువుకుని పైకివచ్చి,పోలిసు ఆఫీసరయిన సూర్యానికి రెండో ప్రాణం చెల్లెలు సీత. ఆమెలక్షాధికారికి కోడలై అష్టయిశ్వర్యాలు అనుభవిస్తుంటే ఆ అదృష్టమంతా తనదే అని కొండెక్కిపోతాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eసీత భర్తకి అంతకు పూర్వం సరోజతో సంబంధం ఉందని తెలుసుకుని,ఆవేశంతో సరోజ ఇంటికి వెళ్ళిన సూర్యం సరోజ దయనీయ చరిత్రవిని నీరైపోతాడు.చెల్లెలిమీద,సరోజమీద సూర్యం జాలి; అతని జాలి గుండెకి ఎదురైన సమస్యకి సినెమెటిక్ పరిష్కారం….?\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503230378031,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/atmeeyulu.jpg?v=1782031955"},{"product_id":"avyaktyam","title":"Avyaktyam","description":"\u003cp\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Yaddanapoodi%20Sulochanarani\"\u003e \u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eహేమ మరణించిన ఆనంద్ ని తదేకంగా చూస్తున్న విజయ భుజం మీద చెయి ఆనించింది.విజయ్ మనసులో ఏర్పడిన లోటు బాగానే అర్థం అవుతోంది. హేమ విజయ్ తలమీద చెయి వేసింది. ఒక్క క్షణం తర్వాత రెండు చేతులతో అతని తలని పొట్టకి ఆనించుకుంది.”హేమా! “విజయ్ దుఃఖభారంతో అన్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eహేమ అతని తలని నమురుతూ తగ్గు స్వరంతో అంది.”విజయ్” ఈ జీవితం వుందే! ఇది ఎప్పుడు మనకి ఏ కానుక యిస్తుందో తెలియదు.మళ్ళీ ఎప్పుడు హఠాత్తుగా మననుంచి మనకి ప్రియమైనది ఏది మననుంచి తీసుకుంటుందో తెలియదు. ఆ అదృశ్య మహాశక్తి ముందు తలవంచటమే మనకర్తవ్యం!\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503233916975,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/avyaktam.jpg?v=1782032092"},{"product_id":"bahumathi","title":"Bahumathi","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eబహుమతి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003cspan\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనవలాదేశపు రాణి, చెయ్యి తిరిగిన రచయిత్రి, యద్దనపూడి సులోచనా రాణి\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకలం నుండి జాలువారిన నులివెచ్చని కథల మాలిక.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఐ లవ్ యూ, నమ్ముతాను, బహుమతి, గెలుపెవరిది?, నాకీ పెళ్ళివద్దు, తెలిసిన విలువలు లాంటి కథల సమాహారం.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503238504495,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bahumathi.jpg?v=1782032247"},{"product_id":"bandhee","title":"Bandhee","description":"\u003cp\u003eబందీ - యద్దనపూడి సులోచనా రాణి\u003c\/p\u003e\n\u003cp\u003e“ఇందులో సిగ్గు పడాల్సిందేముంది?”\u003c\/p\u003e\n\u003cp\u003e“ఎందుకు లేదు? సుందరేకాదు ఏ ఆడపిల్లయినా,నాలో ఏం చూసి నాకు చేరువ అవుతుంది? ఈ జ్ఞానం నాకెందుకు లేకపోయింది!” అతని  ముఖంలో గాయపడిన అబిమానం స్పష్టంగా కన్పిస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003e“ఇందులో నాక్కూడా భాగం వుంది కాబట్టి నేను చెప్పాను.నిన్ను చూస్తుంటే నేను చేసింది మంచిపని అని అన్పించటం లేదు.”…\u003c\/p\u003e\n\u003cp\u003eకవిత బలవంతంగా అతని చెయ్యిపట్టుకుని,ఉంగరం తొడగబోయింది.\u003c\/p\u003e\n\u003cp\u003e“క్షమించు కవితా!”అతను చెయ్యి వదిలించుకున్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003e“నిజం చెప్పినందుకా  నాకీ శిక్ష?”\u003c\/p\u003e\n\u003cp\u003e“అదేం మాట?”\u003c\/p\u003e\n\u003cp\u003e“ఆత్మీయతతో ,స్నేహపూర్వకంగా ఇచ్చిన దానిని ఎందుకు తిరస్కరిస్తున్నావు మరి?”\"ఆత్మీయత,స్నేహం- ఆరెండూ పొందే అర్హత,అదృష్టం నాకు లేవు కవితా!?”\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503242403887,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bandhee.jpg?v=1782032395"},{"product_id":"cheekatilo-chuirudeepam","title":"Cheekatilo Chuirudeepam","description":"\u003cp\u003e\u003cb\u003eChikatlo Chirudeepam\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e“రోహిత్! నువ్వు.. నువ్వు ప్రయత్నం చేస్తే ఈ యగకూపంలో నుంచి బైటకి రాగలవు..”అనునయంగా అంది.ఆమె కంఠంలో ఆత్మీయతో,ఆమె చేతి స్పర్షలో అనురాగమో కానీ,అతను వెంటనే ఆమె ఒడిలోకి ఒదిగిపోయి,ఆమె గుండెలకి తల ఆనించుకున్నాడు. “స్రవంతీ! నాకు తెలుసు.. ఈ ప్రపంచంలో వెన్నెలకాంతి ఎంత అందంగా ఉంటుందో,సూర్యోదయం ఎంత అద్భుతంగా వుంటుంది! కానీ,కానీ, ఆ  అందచందాలు ఆనందించేందుకు నేను ఆ రోహిత్ ని కాను! నేను… నేను… ఒకజీవచ్ఛవాన్ని!” అతను హఠాత్తుగా ఏడ్చేశాడు.”ఐ వాంట్ టు డై!ఐ వాంట్ టు డై!”\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503245123631,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/CheekatiloChiruDeepam.jpg?v=1782032495"},{"product_id":"jahnavi","title":"Jahnavi","description":"\u003cp\u003e\u003cspan\u003eజాహ్నవి యద్దనపూడి సులోచనారాణి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503249023023,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/jahnavi.jpg?v=1782032625"},{"product_id":"kalala-kougili","title":"Kalala Kougili","description":"\u003cp\u003eకలల కౌగిలి యద్దనపూడి సులోచనారాణి\u003c\/p\u003e\n\u003cp\u003eభారతి విజిటర్స్ రూమ్ కి వచ్చింది. అక్కడ ఒక యువకుడు కూర్చుని వున్నాడు. అతని నుదిటిమీద. మోచేతి దగ్గర ప్లాస్టర్లు వున్నాయి. అతను అక్కడున్న పుస్తకం చూస్తున్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eభారతి \"ఎక్స్యూజ్ మీ\" అంది.\u003c\/p\u003e\n\u003cp\u003eఅతను చటుక్కున తలెత్తాడు. భారతిని చూడగానే కుర్చీలోనుంచి లేస్తూ\u003c\/p\u003e\n\u003cp\u003e\"మీరు-\" అన్నాడు సందేహంగా,\u003c\/p\u003e\n\u003cp\u003e\"నా పేరు భారతి.\"\u003c\/p\u003e\n\u003cp\u003eఆ పేరు వినగానే అతని కళ్ళలోకి అనందంలాటిది చెంగున ఎగిరి వచ్చింది.\u003c\/p\u003e\n\u003cp\u003eఅతని ముఖం చూస్తుండగానే సంతోషాతిశయంతో కాంతిమయంగా అయింది. అతను భారతిని ఆపాదమస్తకం. ఒక దేవతని చూసినట్టుగా పవిత్రంగా, శ్రద్ధగా చూసాడు.\u003c\/p\u003e\n\u003cp\u003e“మీరు-మీరేనా\" సంభ్రమంగా, తడబాటుగా అన్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003e\"మీరు-\" అతని దెబ్బలని చూస్తూ అనుమానంగా అడిగింది భారతి.\u003c\/p\u003e\n\u003cp\u003e\"నా పేరు సత్యజిత్. మీరు నన్ను స్కూటర్ యాక్సిడెంట్ అయినప్పుడు రక్షించారే...\"\u003c\/p\u003e\n\u003cp\u003e\"ఓ!\" ఈసారి భారతి కళ్ళు మెరిశాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eఆద్యంతం ఉత్కంఠతతో మిమ్మల్ని చదివించే ఈ నవలారాజం కేవలం రొమాంటిక్ థ్రిల్లరేకాదు!\u003c\/p\u003e\n\u003cp\u003eసస్పెన్స్ థ్రిల్లర్ కూడా\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504135233583,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kalalakougili_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782041341"},{"product_id":"manobhiramam","title":"Manobhiramam","description":"\u003cp\u003eమనోభిరామం\u003c\/p\u003e\n\u003cp\u003eశౌరి యశస్విల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది! కాని శ్రీశైల ప్రయాణంలో ఎదురైన ప్రమాదం వారిద్దరి మధ్య వున్న అపోహలను తొలగించింది.\u003c\/p\u003e\n\u003cp\u003eతీరా తిరిగి హైదరాబాదు చేరుకోగానే శౌరి పినతండ్రి మూలంగా వారిద్దరి మధ్యా మనఃస్పర్థలు కలుగుతాయి. ఓ ఇరవై లక్షలు, సేఠ్ పన్నాలాల్ దగ్గర అప్పు తీసుకుని అది తీర్చకుండానే శౌరి తండ్రి మరణిస్తాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eఆ డబ్బు యశస్వి కోసమేనని పినతండ్రి చెబుతాడు. ఆ డబ్బు ఎక్కడ కట్టాలో అని యశస్వి శౌరిని కలుసుకోవటం లేదని ఎక్కిస్తాడు. అసలు వీరిద్దరి మధ్యా వున్న ఆ అపోహలేమిటి? అవి ఎట్లా తొలగిపోతాయి? శౌరి పినతండ్రి మూలంగా వచ్చిన మనఃస్పర్థలు ఏమౌతాయి?\u003c\/p\u003e\n\u003cp\u003eశౌరి జీవిత పోరాటాన్ని యశస్వి ఎట్లా తన పోరాటంగా స్వీకరించాడు?\u003c\/p\u003e\n\u003cp\u003eఇవన్నీ తెలుసుకోవాలంటే అశేష ఆంధ్ర పాఠకుల అభిమాన రచయిత్రి.\u003c\/p\u003e\n\u003cp\u003eయద్దనపూడి సులోచనారాణి సుమధుర నవల \"మనోభిరామం\" చదవండి!\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504141426735,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Manobhiramam_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782041632"},{"product_id":"mohitha","title":"Mohitha","description":"\u003cp\u003eతెలుగులో నవలా సాహిత్యంలో పాపులర్ రీడింగ్ కు నాంది పలికిన రచయిత్రి ఆమె. ఆమె తీర్చిదిద్ధన ప్రతిపాత్రలోనూ తన ఐడింటిటిని చూసుకోవాలని ప్రతి చదువరీ చేసే ప్రయత్నమే ఆమె అసాధారణ ప్రతిభకు నిదర్శనము.\u003c\/p\u003e\n\u003cp\u003eనవలాదేశపు రాణి యద్దనపూడి సులోచనా రాణి కీర్తి కిరీటంలో చేర్చతగ్గ కోహినూర్ వజ్రపు స్థాయి నవల మోహిత.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504145653807,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Mohitha_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782041815"},{"product_id":"mounabashyam","title":"Mounabashyam","description":"\u003cp\u003e\u003ca\u003e\u003cb\u003eమౌనభాష్యం \u003c\/b\u003e\u003c\/a\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E2%80%8C%E0%B0%AF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%A8%E0%B0%AA%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF%20%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B%E0%B0%9A%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BF\"\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e“విద్యాధర్ తో పెళ్ళి చేసేయ్యాలి.”\u003c\/p\u003e\n\u003cp\u003e“పెళ్ళా! అయిపోయిందిగా ఇంకా ఏమిటి?”అంది విసుగ్గా.\u003c\/p\u003e\n\u003cp\u003e”అది ఒక పెళ్ళా! అబద్దపు పుట్ట.నేను మీ ఇద్దరికీ లక్షణంగా చేస్తాను.లీగల్ గా మీ ఇద్దరూ భార్యాభర్తలవాలి.”\u003c\/p\u003e\n\u003cp\u003e‘దానికోసం నువ్వు తగిలేసే డబ్బు నాకివ్వు.’\u003c\/p\u003e\n\u003cp\u003e“ఇవ్వను. ఒక్కపైసా కూడా ఇవ్వను. విద్యాతో పెళ్ళి చేసి డబ్బు విషయం మొత్తం విద్యాకి కంట్రోలు ఇచ్చేస్తాను.”\u003c\/p\u003e\n\u003cp\u003e“ఏమిటీ!”గుమ్మం దాటబోతున్న సమీర వెనక్కి తిరిగి వచ్చి ఆయన టేబుల్ కెదురుగా నిలబడింది.నడం మీద చేయి ఆనించుకుని ఆయనని తీక్షణంగా చూసింది.\u003c\/p\u003e\n\u003cp\u003e“ఇదా! నా పెళ్ళిలో నవ్వు చేయాలనుకున్న పరమార్థం. నన్ను,ఆస్తిని విద్యాకి కట్టబట్టాలని అనుకుంటున్నావా నువ్వు!” అడిగింది.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504153550895,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/MounaBashyamYaddanapudiSulochanarani.jpg?v=1782041994"},{"product_id":"mouna-tarangaalu","title":"Mouna Tarangaalu","description":"\u003cp\u003e\u003ca\u003eమౌనతరంగాలు\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eనవలా దేశపు రాణి యద్దన పూడి సులోచరాణి కలనుండి జాలువారిన మరో నవలా మాలిక.\u003cbr\u003eమౌనతరంగాలు\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504160333871,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Mouna_Tarangaalu_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782042293"},{"product_id":"nishantha","title":"Nishantha","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eనిశాంత\u003c\/a\u003e\u003c\/b\u003e\u003cspan\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eమనిషికి ఇప్పుడు కావల్సింది ఆమె శరీరం కాదు,ఆమె మేధస్సు! ఆమె మేధస్సు కూడా తనకి తోడైత ఇద్దరూ కలిసి, ఈ సృష్టిమీద ఇంకా సునాయసంగా, ఇంకా ధైర్యంగా యుద్ధం సాగించవచ్చు. మనిషి ఎంత సేపూ ఆమె కళ్ళకి,మనస్సుకి,’రొమాన్స్’అనే బురఖావేసి యీ ప్రపంచాని్న పూర్తిగా అధ్యయనం చేయనీయకుండా పక్కదోవ పట్టిస్తున్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eనిశా!నీకు తెలుసు కదా!\u003c\/p\u003e\n\u003cp\u003eమేధస్సుకి స్త్రీపురుషబేధం లేదు\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504172556335,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Nisantha_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782042684"},{"product_id":"prema","title":"Prema","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eప్రేమ\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e“ఏ చెల్లెలయినా మా అన్న మంచివాడు కాదు అని నోరారా చెబుతుందా?అందులో మన ఆంధ్రా ఆడపడుచు” అంది.\u003c\/p\u003e\n\u003cp\u003e“పోదూ!నీ బోడి రాయల్టీ నువ్వూను”అంది.\u003c\/p\u003e\n\u003cp\u003e“ఎలాగూ రేపు వెళ్ళిపోతున్నాలేవే అమ్మ”అంది ఛాయ.\u003c\/p\u003e\n\u003cp\u003e“వెళ్ళకు ఛాయా!నువ్వు వచ్చినట్టే లేదు” అంది సంహిత.\u003c\/p\u003e\n\u003cp\u003e“నాకు అంతే” అంది ఛాయ. “మనిద్దరం ఒకచోట వుండే బంధం ఏదయినా దొరికితే బాగుండును.”\u003c\/p\u003e\n\u003cp\u003e“అలాంటిదం కుదరదు” ఖచ్చితంగా చెప్పేసింది సంహిత.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504186482735,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Prema_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782042904"},{"product_id":"prema-deepika","title":"Prema Deepika","description":"\u003cp\u003e\u003cspan\u003eప్రేమదీపిక యద్దనపూడి సులోచనారాణి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504189497391,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Premadeepika_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782043263"},{"product_id":"premapeetam","title":"Premapeetam","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eప్రేమపీఠం యద్దనపూడి సులోచనారాణి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eవిశాఖపట్టణానికి 30 కి.మీ. దూరంలో సముద్రంలో క్రొత్తగా ఓ దీవి బయటపడింది. దానిని కొంతమంది సుప్రసిద్ధ వ్యక్తులు, ప్రవాస భారతీయులు కలిసి ఒక అద్భుతమైన విహారయాత్రా కేంద్రంగా మార్చేసి ”ప్లెజర్ ఐలండ్” అని పేరుపెట్టారు. తన కుమార్తె ప్రజ్ఞ కోరిక మేరకు ప్రముఖ వ్యాపారవేత్త గజకర్ణం తన కాబోయే అల్లుడు అరవిందుతోపాటు ”ప్లెజర్ ఐలండ్”కు విహారయాత్రకు పంపిస్తాడు. వీళ్ళు బయలుదేరిన స్టీమరులోనే వ్యాఘ్రమూర్తి అనే ఒక ప్రభుత్వ అధికారి, ఆయన గర్ల్ఫ్రెండ్ అమృత, ప్లెజర్ ఐలండ్లో ఏమైనా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయేమో అని పరిశోధించడానికి జ్ఞానేశ్వరిదేవి అనే ”స్త్రీ సంక్షేమాధికారి” తన స్టెనో మోహన్తో కలిసి బయలుదేరుతారు. వీళ్ళుకాక ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయిని అయిన భారతి, ప్రఖ్యాత పాప్సింగర్ సుమన్, ఒక పత్రిక నిర్వహించిన పోటీలో విజేతలుగా ఎంపికచేయబడి, ”ప్లెజర్ ఐలండ్” ట్రిప్కు బయలుదేరతారు. వీళ్ళందరూ ”ప్లెజర్ ఐలండ్”కు బయలుదేరినప్పటినుంచి జరిగిన సంఘటనల సమాహారమే… యద్దనపూడి సులోచనారాణి అందిస్తున్న చక్కటి రొమాంటిక్ థ్రిల్లర్ నవల ”ప్రేమపీఠం”\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504192938031,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Premapeetam_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782043494"},{"product_id":"sukumari","title":"Sukumari","description":"\u003cp\u003e\u003ca\u003e\u003cb\u003eసుకుమారి\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e\u003c\/a\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E2%80%8C%E0%B0%AF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%A8%E0%B0%AA%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF%20%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B%E0%B0%9A%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BF\"\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఇంతలో కాలింగ్ బెల్ మోగింది!\u003c\/p\u003e\n\u003cp\u003eనేను వెళ్ళితలపుతీశాను.\u003c\/p\u003e\n\u003cp\u003eఎదురుగా బ్రహ్మీ!!\u003c\/p\u003e\n\u003cp\u003eనేను అతన్నే చూస్తున్నాను. నా కళ్ళలోలీలగా వద్దన్నా అశృవులు నిండుకుంటున్నాయి. అతను ఒక్కక్షణం నా కళ్ళలోకి సునిశితంగా వెతుకుతున్నట్లుగా చూశాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eవెంటనే రెండు చేతులలో ఎత్తి మా పడక గదిలోకి తీసుకవచ్చాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eఇదీ నా కథ!\u003c\/p\u003e\n\u003cp\u003eనా యీ జీవిత కథ నా చుట్టూ వున్న లక్షలాది మందిలో ఏ ఒక్క వ్యక్తికైనా ఓదార్పు గాని,మనోధైర్యం గానీ కలిగిస్తే అంతకుమించి ఆనందం….\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504196935727,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Sukumari_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782043792"},{"product_id":"swetha-gulabi","title":"Swetha Gulabi","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eశ్వేతగులాబి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఅతను మెల్లగా తన నడుంచుట్టూ పడిన చేతులను బలవంతంగా విడదీసాడు. తన గుండెల్లోకి ఒదిగిపోయిన ఆ అమ్మాయి భుజాలు పట్టుకుని,వెనక్కి ఆనించి దిండుమీద పడుకోబెట్టాడు.  ఆ పడుకో బెట్టడంలో అన్నూ పయిట జారిపోయింది….\u003c\/p\u003e\n\u003cp\u003eఅతను లాకెట్ చూడగానే సర్పద్రష్టలా ఆగిపోయాడు. వంగి,ఆ లాకెట్ చేతుల్లోకి పట్టుకొని మరింత శ్రద్ధగా పరీక్షగా చూసాడు. సందేహం లేదు. ఆ పక్క పాపిడి, ఆ అంచున్న పొట్టి చేతుల జాకెట్టు,కనుబొమ్మల మధ్య చిన్నబొట్టు, అరవిరసిన మొగ్గలాంటి ఆ చిరునవ్వు యింకెవరు? పారిజాతమే! నిశ్చేష్టుడయ్యాడు. అతని చూపులు ఆ లాకెట్టుకు అతుక్కు పోయినట్టుగా నిల్చిపోయినాయి.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504199721007,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Swetha_Gulabi_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782043979"},{"product_id":"vennello-mallika","title":"Vennello Mallika","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eవెన్నెల్లో మల్లిక\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eవిజయ్,వైజయంతి మల్లికనిలీగల్ గా దత్తత తీసుకుని ఇంటికి వచ్చారు.\u003c\/p\u003e\n\u003cp\u003eమల్లిక చెరో చెయ్యి పట్టుకుని విజయ్,వైజయంతి గుమ్మంలో కాలు పెడ్తుంటే “ఆగండి… ఆగండి… గృహప్రవేశం అలా కాదు చేయాల్సింది” అంటూ వరమ్మ ఎర్రనీళ్ళు వారి చుట్టూతిప్పి పారబోసింది.\u003c\/p\u003e\n\u003cp\u003eముగ్గురు ఇంట్లోకి వస్తుంటే “స్వాగతం” అని వ్రాసి,మేరీ అట్టలు పట్టుకుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eవాసు ఆనాడు విజయ్ వేసిన మూడు కుందేళ్ళ ముఖాలతో వున్న డ్రాయింగ్ రెండుచేతులతో పట్టుకుని ఎదురువచ్చాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eవైజయంతి నవ్వేసింది. విజయ్ నవ్వాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eనేను ఇక “అమ్మగారు,అయ్యగారు అని పిలవకూడదట”అంది కళ్ళు పెద్దవి చేసి చూపిస్తూ మల్లిక. విజయ్,వైజయంతి చెరో చెయ్యి చాపి మల్లికని దగ్గరకి తీసుకున్నారు.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504202899503,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Vennello_Mallika_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782044141"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/5779ef8d-434f-4b8d-acae-afa0aa3dc8f0.jpg?v=1772898306","url":"https:\/\/books.ataka.in\/collections\/by-the-women.oembed?page=2","provider":"అటక","version":"1.0","type":"link"}