{"title":"Free Delivery","description":"","products":[{"product_id":"yerra-gabbilaala-veta","title":"Yerra Gabbilaala Veta","description":"\n\u003cp\u003eనిజమైన చీకటిని నేనెప్పుడు చూడలేదు, ఆ చీకటిని నేనెపుడు అనుభవించలేదు. అసలు చీకట్లో ఏముంటుంది? చీకటి నిజమైన రంగు, చీకటి రూపం, చీకట్లో వాన, చీకట్లో వాసన, చీకట్లో సంచారము, చీకట్లో వేట, చీకట్లో భూమి కదలిక, చీకట్లో సముద్రం, ప్రళయం ఇవన్నీ ఎవరైనా చూసారా? అర్ధరాత్రి అడవి మధ్యలో చీకట్లో కూర్చొని కళ్ళు తెరిచి చూస్తే ఏమి కనపడుతుంది? కళ్లుండి కూడా. అసలయిన చీకటిని నేనెపుడు చూడలేదు. ఎందుకు? నా ఊహలు అలా కాదు, చీకట్లో బాసిపట్లు వేసుకు కూర్చొని అక్కడ దేన్నో వెతుకుతాయి. ఆ చీకట్లోనే ఈ యెర్ర గబ్బిలాల వేట మొదలయ్యింది. ఆ వేటలో నేను నా ముత్తాతల తరానికి ఆయనకు ముందు తరాలలోకి దూకాను. కళ్ళు మూసుకొని కలలు కంటూ ఆ తరంలోకి నేను ప్రవేశించాను. అప్పటి మనుషులను వారి మనస్తత్వాలను, ప్రాంతాలను వారి ప్రాంతీయతను. జీవన సౌందర్యాన్ని పీడితులు దౌర్జన్యాన్ని, కలిసున్న కుటుంబాలని కలగాపులగం అవుతున్న తెగలను చూశాను, వాళ్ళతో సంవత్సరంకు పైగా గడిపాను, అక్కడ కనిపించాయి నాకు ఈ యెర్రగబ్బిలాలు.\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44397762904111,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Yerra-Gabbilala-Veta-Front-cover.webp?v=1754490199"},{"product_id":"nenu-mee-brahmanandam","title":"Nenu Mee Brahmanandam","description":"\n\u003cp\u003eఅంతా దేవుడి దయ. అంతా ఆయనే. అన్నీ ఆయన చేస్తున్నవే అనుకోవడం ఆస్తికత్వం ఇదంతా నా కష్టార్జితం. నా స్వయంకృషి. నా ఆలోచనల ప్రతిఫలం అనుకోవడం నాస్తికత్వం. ఈ రెండు భావాలు కాడికి కట్టిన రెండు ఎద్దుల్లాంటివి! నా పద్ధతి నాదే అని ఆస్తికత్వం అటు లాక్కెళ్ళినా, కాదు. .. నా పద్ధతి నాదే అని నాస్తికత్వం ఇటు లాక్కెళ్ళినా సరైనటువంటి ఫలాలను మనం అందుకోలేకపోతాం! అటు చేస్తున్న పని శ్రద్ధగా, అంకితభావంతో, నవ్యతతో చేయాలి... ఇటు స్వామి అనుగ్రహం తోడవ్వాలి... ఈ రెండూ కలిస్తేనే జీవితమనే బండి సక్రమంగా సాగుతుందని నా విశ్వాసం. భగవద్గీత చెప్పినా, మహ్మద్ ప్రవక్త చెప్పినా, జైనులు చెప్పినా, బౌద్ధులు చెప్పినా ఒకటే చెప్పారు. \"కష్టపడు ... ఫలితాన్ని ఆశించకు\" అని. నీ కష్టం నువ్వు పడితే ఆ భగవంతుడే దానికి సంబంధించిన ఫలితాన్ని ఇస్తాడని తెలియ జేయడానికే నా ఈ పుస్తక రచన. అంతేగాని... నాకున్న కష్టాల్ని, నేను పడినటువంటి బాధల్నీ చెప్పుకుని నేను ఇంత తక్కువ వాడిననీ, బీదవాడిననీ, ఇంత దారుణమైన స్థితి నుంచి వచ్చాననీ మీ దగ్గర నుంచి జాలి పొందడానికి గానీ... లేదా నేను సాధించిన విజయాల్ని... నేను సాధించిన విజయసోపానాల్ని మీ ముందుంచి నేనింత గొప్పవాడిననీ చెప్పుకోవడానికి ఈ పుస్తకం రాయడం లేదు. -- బ్రహ్మానందం\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44397766148143,"sku":null,"price":375.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nenu-front.webp?v=1754490203"},{"product_id":"yaradakonda-ata-award-winning-novel","title":"YaradaKonda - ATA Award Winning Novel","description":"\n\u003cp\u003eజాలరుల కుగ్రామంగా మొదలైన విశాఖపట్నం , రెండో ప్రపంచ యుద్ధం తరువాత మహానగరంగా అవతరించడానికి మూలకారణమైన భౌగోళిక విశేషం యారాడ కొండ. విశాఖపట్నం ఎదుగుదలకు అదొక కొండగుర్తు. ఎంతో మందికి ఉపాధినీ, కొంత మందికి సంపదనూ ప్రసాదించిన బంగారు కొండ అది. ఆ కొండ విశాఖపట్నం కథను చెప్పుకొస్తే అది ఎలా ఉంటుంది? గడచిన వందేళ్ల కాలంలో అక్కడి మనుషులూ, వాళ్ల ఆశలు, ఆశయాలూ, వ్యధలూ, బాధలూ, సుఖ సంతోషాలనూ, అలాగే వీటన్నింటినీ నడిపించిన శక్తులనూ యారాడ కొండ నమోదుచేసి వినిపించిన గాథకు నవలా రూపం ఈ రచన. మూలాలను తెలుసుకున్నప్పుడే ఎదుగుదల అర్థవంతం కాగలదనే నమ్మికతో ఏరికూర్చిన సృజన ఈ 'యారాడ కొండ' నవల.\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44397769392175,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/yarada-konda-front-cover.webp?v=1754490206"},{"product_id":"nallagonda-kathalu","title":"Nallagonda Kathalu","description":"\n\u003cp\u003eNallagonda Kathalu - Stories from a small town childhood – by V Mallikarjun. గట్టిగ తిరిగితే ఒక ఇరవై నిమిషాలల్ల మా ఊరు చూశుడు అయిపోతది. ‘అర్బనూరు’ అని నేనొక కథ కోసం కనిపెట్టిన పదం మా ఊరిని చూసి పెట్టిందే. అచ్చంగా అట్లనే ఉంటది మా ఊరు. సిటీకి ఊరులెక్క. ఊరికి సిటీలెక్క. నేను మా ఊరి గురించి, మా ఊరి మనుషుల గురించి, మా నాన్న గురించి, మా అమ్మ గురించి చెప్పాల్నని చానా రోజుల్నించి అనుకుంటున్న. చెప్తానికి చానా కథలున్నయి సరే, అయి ఎట్ల చెప్పాలి? ఏది కథ అయితది? ఈ జ్ఞాపకాలు, ఇష్టాలన్నీ పోగేసి ఏం కథ రాయాలి? ఇదంత నా మెదడుల తిరుగుతనే ఉండె. మొత్తానికి కొన్ని కథలు దొరికినయి. వాటి గురించి ఆలోచించుకుంట ఈ కథలు రాస్తుంటె నాకు నేను దొరుకుతనే ఉన్న. ఒక్కసారి గతాలకువోతే మనకు మనం గుర్తొస్తమంటే ఇదే. ఇయి రాస్తుంటే నన్ను నేను మళ్లా దోలాడుకుంటున్నట్టు, నాకు నేను మళ్లా దొరుకుతున్నట్టు అనిపిచ్చింది. మీగ్గూడ అట్లనే అనిపిస్తదా లేదా చెప్పలేను. సదివి మీరే చెప్పాలి. -వి. మల్లికార్జున్‌\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397782269999,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Nallagonda-kathalu-front.webp?v=1754490221"},{"product_id":"valapateddu","title":"Valapateddu","description":"\n\u003cp\u003eవర్డ్స్‌‌వర్త్‌‌ని ప్రకృతి కవి అంటారు. కీట్స్‌‌ని మనిషి కవి అన్నారు. అయితే, “వర్డ్స్‌‌వర్త్‌‌ ప్రకృతిలో మనిషి ఉంటాడు. కీట్స్ మనిషిలో ప్రకృతి ఉంటుంది.” అంటాడు జి. కళ్యాణరావు. ఇప్పుడే రాస్తున్న రచయితని అట్లా పొల్చీ పెద్ద చేసి, అతనికి కొమ్ములు తెప్పించి అతనిలో కథకుడిని చంపేయడం ఉద్దేశం కాదు గాని, వివేక్ లంకమల కథలు చదివినప్పుడు కళ్యాణరావు ఎప్పుడో పంచుకున్న ఈ మాట గుర్తొచ్చింది. ఈ కథల్లో ప్రకృతినీ మనిషినీ భాగం చేశాడు వివేక్. నిజానికి చరిత్ర పొడుగుతా మనిషీ ప్రకృతీ వీడదీయలేనంతగా కలిసే ఉన్నాయి. అదే వివేక్ కథల్లో ప్రతిఫలిస్తుంది. ప్రకృతి ధర్మం ప్రకృతి చేసింది. మనిషి తన జీవిక కోసం తన ధర్మం నిర్వర్తించాడు. ఎప్పుడైతే మనిషి ప్రకృతి మీద ఆధిపత్యం చేయడానికి పూనుకున్నాడో ప్రకృతీ ప్రతిఘటించడం మొదలుపెట్టింది. కొండలు తొవ్వినప్పుడు కొండచరియలు విరిగిపడ్డాయి. అడవిని ధ్వంసం చేసినప్పుడు ఎండలు విజృంభించాయి. అడవుల్లో బతికే పులులూ, ఎలుగుబంట్లు, ఏనుగులు పల్లెల మీద పడ్డాయి. ఈ అకస్మాత్తు వరదలన్నీ ప్రకృతిపై మనిషి చేసిన అత్యాచారం తాలుకు ఫలితాలే. లంకమల దారులు అనే ట్రావెలాగ్‌లోనూ కథల్లో ఉండే శిల్పాన్ని సాధించిన వివేక్ రాసిన కథలివి. కథలు కాదని రాసిన వాటిల్లోనే కథ వుంటే, కథ అంటూ వస్తున్నదాంట్లో ఎంత వుండొచ్చు? మేం చదివాం. నచ్చాయి. మీరూ చదవండి. మునుపటికన్నా ప్రేమిస్తారు. - అరుణాంక్ లత ఎడిటర్, ఛాయ\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397785481263,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Valapateddu-Front.webp?v=1754490225"},{"product_id":"amma-diarylo-konni-pageelu","title":"Amma Diarylo Konni Pageelu","description":"\n\u003cp\u003eAmma Diarylo Konni Pageelu - Novel by Ravi Mantri\u003c\/p\u003e\n\u003cp\u003eనాకో సంగతి చెప్పు... అసలు ఎవరైనా నీకు ఇంతకు ముందు ఉత్తరం రాశారా? ప్రేమలేఖలో, మామూలు లేఖలో. పోనీ నువ్వెప్పుడైనా రాశావా? మామూలుగా మనం రోజూ మాట్లాడుకునే మాటల్నే పొందిగ్గా పేర్చి కాయితం మీద పెడితే ఉత్తరం అయిపోతుందనుకునే అల్పసంతోషిని నేను. ఇవాళెందుకో ఇప్పటికిప్పుడే నీకో ప్రేమకథ చెప్పాలనిపించి, నీకు ఉత్తరాలు చదివే అలవాటుందో లేదో తెలీకుండానే రాసేస్తున్నాను.\u003cbr\u003e\nబహుశా నేను అమ్మకథని చెప్పాలనుకోవడం దగ్గర, అమ్మకి కూడా ప్రేమకథ ఉంటుందనుకోవడం దగ్గర ఈ ప్రయాణం మొదలై ఉండొచ్చు. వెన్నెల రాత్రుల్లో అలల్ని లెక్కపెడుతూ, కలల్ని దాచుకుంటూ నేను ఇష్టంగా రాసిన ప్రేమలేఖే నా ఈ అమ్మడైరీలో కొన్నిపేజీలు.\u003cbr\u003e\nఇది అమ్మ ప్రేమకథ.\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397795115055,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/adkp-front.webp?v=1754490236"},{"product_id":"a-telugu-stories","title":"‘A’ Telugu Stories","description":"\u003cp\u003eA- చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ కథలు. కథకి విస్తరణ పరిమితి, నిర్మాణ క్రమం— ఉత్కంఠ ఎత్తుగడ, రచనాచాపం, నిర్దిష్ట నిలుపు; ఈ కొలబద్దలకి ఆవల నేను . జీవితంలో కూడా!\u003c\/p\u003e\n\u003cp\u003eఏదో ఒక విషయం తీసుకోవడం , దాన్ని చదివేలా, కించిత్ రసవత్త తరంగా కాగితం మీద పెట్టడం. పుట్టుుపూర్వోత్త తరాలు కాకపోయి నా దానిమీద ఎంతోకొంత అవగాహన. ఆ క్రమంలో మీతో కాస్సేపు నడక. అదో ఆనందం! మిగిలిన విషయాలు, నిర్ణణయాల్లాంటివి— మీకే.\u003c\/p\u003e\n\u003cp\u003eమొదటిసారి చదివినప్పుడు అర్థమయి కానట్టుగా ఉండచ్చు కథలు కొన్ని. చక్కరకేళీ ఒలిచి చేతిలో పెట్టలేను . కొంత శ్రమైక సాహచర్యం ఆశిస్తాను మీనుంచి, ప్రమోద మధనానికి.\u003c\/p\u003e\n\u003cp\u003eపలు భాషాకోవిదుణ్ణి కాను — తెలుగులోనే. నాకు తెలిసిన భాషే నా కథల్లో కూడా.\u003c\/p\u003e\n\u003cp\u003eచివరిగా— నా పాత్రలు నేను చెప్పినట్టు మాట్లాడవు. వాళ్ళు చెప్పేదే రాస్తాన్నేను.\u003c\/p\u003e\n\u003cp\u003eఇప్పపటికింతే — కథల్లో కలుద్దాం.\u003c\/p\u003e\n\u003cp\u003eచిలుకూరి రామ ఉమామాహేశ్వర శర్మ\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44411425554479,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ATeluguStoriesFront.jpg?v=1754549681"},{"product_id":"okkokka-talaku-okkaka-vela","title":"Okkokka Talaku Okkaka Vela","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412905553967,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156513.jpg?v=1754589570"},{"product_id":"varada-gudi","title":"Varada Gudi","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412942319663,"sku":null,"price":350.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156559.jpg?v=1754589570"},{"product_id":"lankamala-daarullo","title":"Lankamala Daarullo","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413000024111,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156489.jpg?v=1754589570"},{"product_id":"hampi-express","title":"Hampi Express","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413112156207,"sku":null,"price":199.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156550.jpg?v=1754589570"},{"product_id":"uttama-telugu-vana-kathalu","title":"Uttama Telugu vana kathalu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413117759535,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156533.jpg?v=1754589570"},{"product_id":"enugekkina-sampada","title":"Enugekkina sampada","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413156425775,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156540.jpg?v=1754589570"},{"product_id":"manushulu-mayamayye-kaalam","title":"Manushulu mayamayye kaalam","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413166747695,"sku":null,"price":499.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156554.jpg?v=1754589570"},{"product_id":"ghandruk","title":"Ghandruk","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413168025647,"sku":null,"price":425.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156535.jpg?v=1754589570"},{"product_id":"mohana-swamy","title":"Mohana swamy","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413192634415,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156496.jpg?v=1754589570"},{"product_id":"pattu-thova","title":"Pattu Thova","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413195092015,"sku":null,"price":475.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156485.jpg?v=1754589570"},{"product_id":"adholokam","title":"Adholokam","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413197910063,"sku":null,"price":350.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156495.jpg?v=1754589570"},{"product_id":"mairavana","title":"Mairavana","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413206003759,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156520.jpg?v=1754589570"},{"product_id":"nemmi-neelam","title":"Nemmi Neelam","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413209018415,"sku":null,"price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156505.jpg?v=1754589570"},{"product_id":"edu-samudrala-avatala","title":"Edu samudrala avatala","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413213343791,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156531.jpg?v=1754589570"},{"product_id":"antarani-vasantam","title":"Antarani Vasantam","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415927713839,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/antaranivasantham_front.jpg?v=1754708225"},{"product_id":"naalo-unna-prema","title":"Naalo Unna Prema","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415931383855,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/naalo_unna_prema_front.jpg?v=1754708278"},{"product_id":"nallavanthena-kathalu","title":"Nallavanthena Kathalu","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415934857263,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nalla_vanthena_front_cover.jpg?v=1754708302"},{"product_id":"parveta-kathalu","title":"Parveta Kathalu","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415934922799,"sku":null,"price":199.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Parveta_front_cover.jpg?v=1754708397"},{"product_id":"pulasa","title":"Pulasa","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415935053871,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Pulasa_Front.jpg?v=1754708404"},{"product_id":"russian-classics","title":"Russian Classics","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415935086639,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/russian_classics_front_cover.jpg?v=1754708414"},{"product_id":"satyanveshi-chalam","title":"Satyanveshi Chalam","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415935119407,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/satyanveshi_chalam_front_cover.jpg?v=1754708525"},{"product_id":"savarlakonda","title":"SAVARLAKONDA","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415945244719,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Savarla_Konda_Front.jpg?v=1754708531"},{"product_id":"that-last-melody","title":"That Last Melody","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415946719279,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/That_last_melody_front_cover.jpg?v=1754708537"},{"product_id":"untitled","title":"Untitled","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415947309103,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/untitled_front.jpg?v=1754708545"},{"product_id":"bharatha-sainikula-veera-gaadhalu","title":"Bharatha Sainikula Veera Gaadhalu","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44415963856943,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bsvgfront.jpg?v=1754708043"},{"product_id":"dayadula-thota","title":"Dayadula Thota","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44415972212783,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/DayadulaThotaFront.jpg?v=1754708050"},{"product_id":"enugamma-enugu","title":"Enugamma Enugu","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44415992332335,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/VaseeraPoetryFrontcover.jpg?v=1754708139"},{"product_id":"ramagrama-nunchi-ravanalanka-daaka","title":"Ramagrama Nunchi Ravanalanka Daaka","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416065994799,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ramagramamfront.jpg?v=1754708123"},{"product_id":"ruu","title":"Ruu","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416073498671,"sku":null,"price":268.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/RuuFrontcover.jpg?v=1754708131"},{"product_id":"yudham-madhyalo-nuvvu","title":"Yudham Madhyalo Nuvvu","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416081461295,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AfsarsirPoetry.jpg?v=1754708012"},{"product_id":"90s-love-story","title":"90's Love Story","description":"\u003cp\u003e\u003cspan\u003eముందుగా మిమ్మల్ని ఒక విషయం అడగాలి అనుకుంటున్నా మీ ప్రేమ కధ, మీ స్నేహితులు ప్రేమ కథ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రేమ కథ పెళ్లి వరకు చేరి సంతోషంగా ఉండడం మీరు చూశారా..? పోనీ ప్రేమలో విఫలమై పిచ్చివాళ్లు అయిన వాళ్లని, ప్రాణాలను కోల్పోయిన వాళ్లని, లేక బలంగా పోరాడి జీవితంలో నిలబడిన వాళ్ళని మీరు చూశారా..? బహుశా నా ప్రేమ విఫలం అవడం వలన అనుకుంటా..! తాను లేకుండా నేను పడే బాధ కన్నా నన్ను కోల్పోయి తన పడే ఆవేదన గురించి రాయాలనే ఆలోచన నుంచి పుట్టిందే.. ఈ 90s love story. చెప్పుకోలేని భావాలు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44442708967471,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/90_slovestoryneweditionf.jpg?v=1757591589"},{"product_id":"ontaritanapu-kathalu","title":"Ontaritanapu Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eఇది మానవ సంబంధాలు అర్థం చేసుకోలేక ఎదురైన ఒంటరితనం కావొచ్చు. ఆ మానవ సంబంధాలు పూర్తిగా అర్థమయ్యాక మనలో పుట్టే ఒంటరితనం కూడా అయ్యుండొచ్చు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eనగరజీవితంలోని సాయంత్రాల్లో ఒక రకమైన మెలంఖలీ ఉంటుంది. అందులోకి జారిపోతే ఎప్పుడో అర్ధరాత్రుల్లో తేలుతాం. ఆ మెలంఖలీని, నగరజీవితపు ఒంటరితనాన్ని, గత కాలపు చెదిరిన ఙ్ఞాపకాలని ఒక చోట చేర్చే ప్రయత్నమే ఈ పుస్తకం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈ కథల్లో మీ జీవితపు సాయంత్రమో, రాత్రో, మనిషో, ఙ్ఞాపకమో మీకూ దొరికితే, ఒక్కసారి చిన్నగా నవ్వుకుని ‘రేపటీగీతం’ కోసం వెతకండి. అదే దారిలో ఎక్కడో ఒక చోట నేనూ కనిపిస్తాను.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003e-మొహమ్మద్ గౌస్\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44445194387503,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ontarithanapukathalufront.jpg?v=1755860768"},{"product_id":"rendella-padnaalugu","title":"Rendella Padnaalugu","description":"\u003cp\u003e\u003cspan\u003eRendella Padnaalugu\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eCollection of Short Stories by\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eMadhuranthakam Narendra\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eయీ సంపుటంలోని కథలన్నీ దాదాపుగా రెండేళ్లలో రాసిన పద్నాలుగు కథలు. రెండేళ్ల పద్నాలుగు అనే గుణింతంలోనే రెండేళ్లలో రాసిన పద్నాలుగు అనే అర్థంగూడా దాగుంది. యేడు అనే మాటకు ఆయుష్షు అనే మరో అర్థం కూడా వుందని తెలిసాక రెండేళ్ల పద్నాలుగు అనే గుణింతపు మాటకు మరిన్ని అర్థాలు పుడతాయి. సాదాసీదాగా కనిపించే జీవన శకలాలను జాగ్రత్తగా చూడగలిగితే జీవన చలనసూత్రాలను కనిపెట్టడం అసాధ్యమేమీగాదు. అలాంటి ప్రయత్నమొకటి యీ కథల్ని యిలా రూపొందించిందని సహృదయులైన పాఠకులకు ముందుగానే మనవి చేస్తున్నాను.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e2000వ సంవత్సరంలో తిరుపతిలో యిల్లు కట్టుకున్నప్పుడు దాదాపు రెండేళ్లపాటూ నేనీ శ్రామికులతో సన్నిహితంగా గడపగలిగాను. భౌతిక శ్రమే పెట్టుబడిగా జీవించే శ్రామికుల జీవితాలు, మధ్యతరగతి వైట్ కాలర్ వుద్యోగుల జీవితాల్లా సంక్లిష్టంగా గాకుండా, చాలావరకూ పారదర్శకంగా వుంటాయని నాకప్పుడే తెలిసింది. యింటిపనులు ముగించుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతకూడా చాలా సంవత్సరాలపాటూ వాళ్ళ జీవితాల్లోని వైచిత్రి నన్ను వెంటాడింది. సమాజపు పునాదుల్లోనే మిగిలిపోయిన యీ శ్రామికుల శ్రమైక జీవన సౌందర్యానికి (!) నివాళిగా నేనీ కథల్ని మాత్రం రాయగలిగాను.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003e- మధురాంతకం నరేంద్ర\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44460939575343,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/rendellapadhnalugufront.jpg?v=1756298081"},{"product_id":"bhageeratha-kona","title":"Bhageeratha kona","description":"","brand":"Regi Achhulu","offers":[{"title":"Default Title","offer_id":44464945791023,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/BK01.jpg?v=1756396156"},{"product_id":"screenplay","title":"Screenplay","description":"\u003cp\u003e\u003cspan\u003eసుజాత సార్ నాకు స్కూల్ రోజుల నుంచే తెలుసు. ఓ పాఠకుడిగా ఆయనవి ఎన్నో కథలని చదివాను. చాలా కథలు నాకెంతో ఇష్టం కూడా. ముఖ్యంగా కొన్ని చిన్నకథలు. మేమిద్దరం కలిసి 4 సినిమాలు రాశాం - ‘రోజా’, ‘తిరుడా తిరుడా’ (దొంగ దొంగ)’, ‘దిల్ సే’, ‘అమృత’. ఓ దర్శకుడికి ఉండే శైలిని ఆయన అర్థం చేసుకోగలగడం వల్ల, ఆయనతో పని చేయడం ఆనందంగా ఉండేది. కానీ నన్ను ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేసేది – ‘ఎన్నెన్నో విభిన్నమైన విషయాల గురించి రాయగలిగే ఆయన శక్తి.’ అంతా తెలిసివుండవచ్చు, తెలిసినదాన్ని మాట్లాడవచ్చు, కానీ వాటిని కలం పట్టి కాగితంపై సజావుగా వ్రాయడం అంత సులభం కాదు. దీనికి స్పష్టమైన ఆలోచనతో పాటు, పాఠకుడి మనసు దోచుకునే శైలి అవసరం. ఈ స్క్రీన్ప్లేపుస్తకం నన్ను ఆశ్చర్యపరిచింది. స్క్రీన్ప్లేనిర్మాణం, దాని మూలతత్వాన్ని ఇలా స్పష్టంగా, అర్థమయ్యేలా ఆయన రాయగలిగారు. నేను నా మొదటి సినిమా తీసే సమయానికి ఈ పుస్తకాన్ని ఆయన ఎందుకు రాయలేదు? భారతీయ సినిమాకి, భారతీయ స్క్రీన్ప్లేలకు ఎన్నాళ్లుగానో ఉన్న లోటుని తీర్చే తొలి అడుగు ఇదే, పెద్ద అడుగు కూడా ఇదే. --మణిరత్నం\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44474691485743,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Screenplaybookf.jpg?v=1756780848"},{"product_id":"in-the-mood-for-love","title":"In The Mood For Love","description":"\u003cp\u003e\u003cspan\u003e'In The Mood For Love' is an anthology of 12 love stories edited by Aparna Thota and Venkat Siddareddy. This is the first ever anthology of love stories in Telugu. Nagendra kasi, Mahy Bezwada, Karuna Kumar, Aripirala Satyaprasad, Midhuna, Swathi Kumari, Ushha Jyothi, Purnima Tammireddy, Aparna Thota, Rishi Srinivas, Venkat Siddareddy, Manasa Yedluri contributed to this anthology.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475139686447,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/inthemoodforlovef.jpg?v=1756808425"},{"product_id":"cinema-kathalu","title":"Cinema Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eఈ ఒక్క సంపుటితో వెంకట్ సిద్దారెడ్డి సముద్రమంత ప్రపంచాన్ని మనముందుకు తీసుకొచ్చాడు. ఇక ఇందులో మునిగి తేలవలసింది సాహిత్యవిద్యార్థులూ, చలనచిత్రకారులూ, సామాజిక విశ్లేషకులూనూ. వాడ్రేవు చినవీరభద్రుడు\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475177140271,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/cinemakathaluf.jpg?v=1756808577"},{"product_id":"long-march-a-novel","title":"Long March - A Novel","description":"\u003cp\u003e\u003cspan\u003eఎవరు చదివినా చదవకపోయునా కాలం నిజాయితీగా తన చరిత్రను తాను రాసుకుంటూనే ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సంఘటనలను మైలురాళ్లుగా వేసుకుంటూనే ఉంటుంది. అలాంటి మైలురాళ్లలో ఒకటి తెలంగాణ మలిదశ ఉద్యమంలోని ’మిలియన్ మార్చ్’. అప్పటికి సహాయనిరాకరణతో ఊరూరు అట్టుడుకుతుంది. ట్యాంక్ బండ్ మీద ’మిలియన్ మార్చ్’ చేసి తను ఆకాంక్షను బలంగా చెప్పాలని ఉక్కుపాదం మోపి అనుమతికి నిరాకరించింది. అయినా భయపడకుండా జనం ముందుకు కదిలారు. అరెస్టుల్య్, బారికేడ్లు, ఇనుపకంచెలు, పోలీసులను దాటుకుని, దెబ్బలుతిని, రక్తమోడుతూ ట్యాంక్ బండ్ ను ముద్దాడారు. కడుపుమండి కనబడిన విగ్రాహాలను నేలకూల్చారు. అనుకూలంగా వత్తాసు పలికే బాకాలను ఎత్తి ట్యాంక్ బండ్ లోకి విసిరికొట్టారు. ఒకరు పిలిచింది కాదు, ఒకరు రమ్మని ఒత్తిడి చేసింది లేదు. పల్లెపల్లె నుంచి గుంపులు గుంపులుగా సామాన్య జనం అవరోధాలను దాటుకుని పట్నం చేరుకున్నారు. దీనికి స్ఫూర్తి ఏమిటి? అప్పటి పల్లెప్రజల మానసికస్థితి ఎలా ఉంది? ఉద్యమ భావజాలవ్యాప్తి ఇల్లిల్లుకు ఎలా చేరింది? ఇలాంటి అనేక విషయాలను చర్చించిన నవల ఈ \"లాంగ్ మార్చ్\".\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475177238575,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/longmarchf.jpg?v=1756808767"},{"product_id":"cinema-oka-alchemy","title":"Cinema Oka Alchemy","description":"\u003cp\u003e\u003cspan\u003eCinema Oka Alchmey is a collection of essays on world Cinema. This book is the second edition of the highly acclaimed book published earlier by Perspectives Publications. This second edition is being published by Anvikshiki Publishers.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475180220463,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/cinemaokaalchemyf.jpg?v=1756808866"},{"product_id":"anaganaga-oka-cinema","title":"Anaganaga Oka Cinema","description":"\u003cp\u003e\u003cspan\u003eAnaganaga Oka Cinema is a collection of 25 analytical essays on various films across the world. This collection of essays discusses films like \"Cinema Paradiso\", \"Rashomon\", \"Curse of the Golden Flower\", \"Old Boy\" and many other classics as well contemporary films. This is a must read for film lovers.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475182710831,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/anaganagaokacinemaf.jpg?v=1756808951"},{"product_id":"sira","title":"Sira","description":"\u003cp\u003e\u003cspan\u003eఎరీనాలో ఇద్దరు అతి శక్తి వంతులైన 'గ్లాడియేటర్స్' ఢీకొంటే ఎంత థ్రిల్ ఉంటుందో కోర్ట్ రూమ్ డ్రామా కూడా అంత థ్రిలింగ్ గా ఉంటుంది అని నా నమ్మకం . స్టాన్లీ గార్డెనర్ నుంచి జాన్ గ్రీషామ్ వరకూ కోర్ట్ డ్రామా బుక్స్, మూవీస్ అన్నీ నాకు ఇష్టం. వాటిలాగే నా నమ్మకం 'కరెక్ట్' అని ప్రూవ్ చేసింది ఈ రాజ్ మాదిరాజు గారి పుస్తకం. ఇంట్రస్టింగ్ యూత్ ఫుల్ బ్యాక్ డ్రాప్ లో .. ఆ ఫేమస్ ఇన్స్టిట్యూట్లో అనుమానంగా అనిపించే కుర్రవాళ్ళ ఆత్మ హత్యలు, వాటి వెనక వున్న రహస్యం ఛేదించాలని సిద్ధపడ్డ యంగ్ లాయర్ రామ్.. తనకెదురుగా కేసు వాదిస్తోంది. ఇండియాలో నెంబర్ వన్ లాయర్, తన గురువు 'మూర్తి సర్......! ఇద్దరు ఇంటిలిజెంట్, స్మార్ట్ లాయర్స్... ఒకరిది టెక్నికల్లో బ్రిలియెన్సు.. ఒకరిది ఎమోషనల్ ఫోర్సు.. ఒకరు ఓటమి తెలియని గురువు.. ఒకరు గెలిచి తీరాలి అనుకునే శిష్యుడు ... కోర్ట్ అనే ఎరీనాలో ఇద్దరూ కసిగా యుద్ధం మొదలు పెట్టారు .... ఈ మేటర్ చాలదూ పుస్తకం చివరివరకు ఆపకుండా చదివించటానికి... హ్యాపీ అండ్ థ్రిల్లింగ్ రీడింగ్.. పి. సత్యానంద్.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475183661103,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sirabookf.jpg?v=1756809091"},{"product_id":"16-toli-prema-kathalu","title":"16 Toli Prema Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eఈ కథలన్నీ కాలాల మీదగా వీచిన హాయితనపు గాలులు కాదు. వీటిలో ఈదురు గాలులున్నాయి, ఇప్పటికీ ఎదల్ని కోస్తోన్న అంతుపట్టని సమాజపు సజీవావవశేషాల ఛాయలున్నాయి. ముళ్ళకంపల మీదగా నడిచొచ్చిన పాదాలు భద్రంగా దాచుకున్న గాయాల తాలూకా ముద్రలున్నాయి. పసివయసులో ఒక్కోరూపాయినీ ముంతలో వేసుకున్నట్టే... ఆనందాలనీ, ఆశ్చర్యాలనీ, నిరంకుశత్వాన్ని మోసిన నిర్మాలత్వాలనీ, కళ్ళల్లో అట్టే పెట్టుకున్న కన్నీళ్లనీ, అంటి పెట్టుకున్న పసితనపు ఆరోమా వాసన్లనీ, కొనసాగుతోన్న కౌమారపు కలల కార్యాల లోలకపు కంపానల ఆవర్తనాలనూ, శిథిల జ్ఞాపకాల పుటల మీద కొత్త జీవితాలను నిర్మించుకుంటున్న కోట నీడల రెపరెపల పాటలనూ ఈ పుస్తకం సాక్షిగా వలపోసుకున్నారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475184054319,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/tolopremakathaluf.jpg?v=1756809217"},{"product_id":"saptha-bhoomi-శప్తభూమి","title":"Saptha Bhoomi - శప్తభూమి","description":"\u003cp\u003e\u003cspan\u003eరాయలసీమ - అందులోనూ అనంతపురం జిల్లా పరిధిలో అత్యుత్తమ కథకులు ఉన్నారు. అలాంటివారిలో సన్మిత్రుడు బండి నారాయణస్వామి కూడా ఒకరు. గత మూడు దశాబ్దాలలో స్వామిగారి అనేక కథలను చదివాను. వాటిలోని శైలిశిల్పాలకు, వస్తు వైవిధ్యానికి, రైతాంగం పట్ల ఆసక్తికి ఆశ్చర్యపోయాను. వారి కొన్ని కథలను నావే అన్నట్టు భావించి కన్నడలోకి అనువదించాను. మాంత్రిక వాస్తవికవాద పరంపరకు పునాది వేసిన స్పానిష్ రచయిత మార్క్వెజ్ ను గుర్తుకు తెచ్చేలా రాసేటటువంటి స్వామి అపురూపంగా ‘శప్తభూమి' అనే చారిత్రాత్మక నవల రాశారు. - ఈ నవలలో అనేక గొప్ప పాత్రల వల్ల, ఘటనల వల్ల పద్దెనిమిదవ శతాబ్దపు కథను వర్తమానానికి అలవరుచుకునే కార్యాన్ని రచయిత బండి నారాయణస్వామి అత్యంత నైపుణ్యంతో నిర్వహించారు. ఒక్కమాటలో చెప్పాల్సి వస్తే ఇది రాజు కేంద్రితమైన నవల కాదు. రాజ్యాన్ని కేంద్రంగా చేసుకున్న నవల. ఇది రాయలసీమ చారిత్రక నవల దళిత బహుజన చారిత్రక నవల --డా||కుం.వీరభదప్పు ప్రఖ్యాత కన్నడ రచయిత SapthaBhumi, Sapthabhoomi, Saptabhumi, Sapthabhumi.Shapthabhumi, Shaptha bhumi, Shaptha Bhoomi\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475184218159,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sapthabhumif.jpg?v=1756809322"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/Untitled_design_2.jpg?v=1756823096","url":"https:\/\/books.ataka.in\/collections\/free-delivery.oembed?page=4","provider":"అటక","version":"1.0","type":"link"}