{"title":"Jhansi Publications","description":"","products":[{"product_id":"aarella-prema","title":"Aarella Prema","description":"\u003cp\u003e\u003cspan\u003eప్రేమ ఒక్కొక్కరిలో ఒకలా ఉంటుంది. ప్రేమించడం, ప్రేమించబడంలో అమాయకత్వం ఎంత ఉండాలో, ఆ ప్రేమ అందకుండా పోతున్నప్పుడు అంతే మెచ్యూరిటీ ఉండాలి. ఈ రెండూ ఆయా సమయాల్లో లేనపుడే జీవితాలు గతితప్పుతాయి. ఈ నవల చదువుతున్నప్పుడు... ఎప్పుడో ఎవరో మనకు గుర్తుగా ఇచ్చిన ఓ చిన్న నెమలీకో, ఇంకెవరి గుర్తుగానో దాచుకున్న ఙ్ఞాపకమో మనసుని తడుతుంది. మనిషిని కోల్పోయిన బాధ మెలితిప్పుతుంది. ప్రేమంటే ఇవ్వటమే కాదు, దూరాన్ని అంగీకరించటం, జీవితాన్ని ప్రేమించడం అనే విషయాన్ని కీర్తి ఇనుగుర్తి ఇంత సులభంగా చెప్పిన తీరు ఆశ్చర్యంగా అనిపించింది. కొత్తతరం ఏమైపోతుందా అనిపించినప్పుడు. వాళ్లకి ఇచ్చే బహుమతుల్లో ఈ పుస్తకం కూడా ఉండాలి. పిల్లలకి జీవితాన్ని ప్రేమించడం కూడా తెలియాలంటే... ఈ కథ చదవాలి. - నరేష్కుమార్ సూఫీ Replacement available only if the book is received damaged, misprinted, or wrong edition. No returns for change of mind.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500008566831,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AarellaPremafrontcover.jpg?v=1757674349"},{"product_id":"nallaregadi-nelallo","title":"Nallaregadi Nelallo","description":"\u003cp\u003e\u003cspan\u003eపాలగిరి విశ్వప్రసాద్ గ్రామ కక్ష అనే నిప్పులకొలిమిలో కాలి, వ్యవసాయమనే వైతరణిలో ఈది, స్వయంగా వాటిని అనుభవించి పలవరించి కథలు రాశాడు. సమాజాన్నీ రాజకీయాల్నీ నడిపించే ఆర్థిక మూలాలు, అగ్రకులాధిపత్యం, ఎస్సీ ఎస్టీల ఆక్రందన, మానవత్వం, అమానుషత్వం, స్త్రీ స్వేచ్ఛ, పురుషాధిక్యత - ఇవన్నీ కథల్లో చొప్పించి సజీవమైన మాండలికంలో రాశాడు. పాలగిరి విశ్వప్రసాద్ కు కరువెందుకొస్తుందో తెలుసు. రాయలసీమలో గ్రామ కక్షలకు కరువు కన్నతల్లి అని తెలుసు. రైతులు శ్రమకోడ్చి పండించే పంట తక్కువ ధరకు ఎందుకు తెగనమ్ముకుంటారో, పోలీసుల తాకిడి, కోర్టుకేసులు, రోడ్ల వెనకాల ప్రపంచీకరణ, హైవే ధాబాల చాటున జీవితాలు ఛిన్నాభిన్నం ఎందుకవుతాయో, దొంగతనాలకు పేరుపడ్డ కులాలు ఎవరివల్ల ఎందుకు అలాగే వుండిపోతాయో ఆ కారణాలన్నీ తెలుసు. అవేవీ తెలియని - ఒక ఒరవడిలో కొట్టుకుపోయే - అమాయక జీవుల్ని పాత్రలుగా చేసి సమకాలీన చరిత్ర సూక్ష్మంగా ఆవిష్కరింపజేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పాలగిరి విశ్వప్రసాద్ ప్రస్తుతంలో వుండి కథలు రాస్తున్న రచయిత. అందుకే పాలగిరి విశ్వప్రసాద్ కథలు నిజం చెబుతాయి. నిజాయితీగా చెబుతాయి. కథలు రాస్తున్న వాళ్ళు కూడా చదవాల్సిన కథలివి. -ఎన్. దాదాహయాత్, కథా రచయిత\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500016889903,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/NallaregadiNelallofrontcover.jpg?v=1757675052"},{"product_id":"erra-mallelu","title":"Erra Mallelu","description":"\u003cp\u003e\u003cspan\u003eఒక స్నేహితురాలు మనతో కూర్చుని మన హక్కులు, పీరియడ్స్, కోరికలు, సెక్స్ ఎడ్యుకేషన్, కనీస అవసరాలు, మారిటల్ రేప్ ఇలా మనకి అవగాహన లేని వాటి గురించి తన కథ ద్వారా మనకి తెలియచేస్తుంటే ఎంత బావుంటుంది. ఆ స్నేహితురాలే \"ఎర్ర మల్లెలు\"\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500026785839,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ErraMallelufrontcover.jpg?v=1757675391"},{"product_id":"pottelu","title":"POTTELU","description":"\u003cp\u003e\u003cspan\u003eమనుషులు ఏకాంతాన్ని కోరుకోవచ్చు కానీ, ఎప్పటికీ ఒంటరి కాలేరు. తనకు తానుగా ఏదో ఒక బంధాన్ని వెతుక్కుంటారు. సత్యం పొట్టేలుని వెతుక్కున్నట్టు. కాశినాయన క్షేత్రంలో తనని తాను వెతుకున్నట్టు. దూరమైన మనుషుల స్థానంలో ఆ ఖాళీని పూర్తి చేసే మరేదైనా నింపాలనే తపన ఉన్నంత వరకూ మనుషులు ఒంటరిగా ఉండలేరు. సొంత నేల మీద నుంచి ఓ పిలుపు వెంటాడుతూనే ఉంటుంది. తల్లీ కొడుకులుగా పైకి కనిపించే కథ మార్మికంగా ఈ ప్రకృతికీ మనిషికీ ఉండే లోతైన అనుబంధాన్ని చెబుతుంది. నవలలో అమెరికా వలస అనేది కేవలం జియోగ్రాఫిక్ మార్పు కాదు, పొట్టేలు కేవలం ఒక జంతువు కాదు. మహిళా రైతుగా, తల్లిగా వేదన పడే సత్యం, మల్లేష్ ఒకడికే తల్లి కాదు. మానసికంగా సొంత నేలనీ, కోల్పోతున్న అనుబంధాలనీ గుర్తు చేసే ప్రతీకలు. తాత్వికతా, వాస్తవికత కలిసిపోయిన ఈ \"పొట్టేలు\" తెలుగులో మరో అద్బుతమైన రచనగా నిలుస్తుంది. - నరేష్కుమార్ సూఫీ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500028096559,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/POTTELU.jpg?v=1757675502"},{"product_id":"chowrastha","title":"CHOWRASTHA","description":"\u003cp\u003e\u003cspan\u003e‘చౌరస్తా’.. పేరుకు తగ్గట్టే రకరకాల దారులు, రకరకాల కథలు ఒకచోట చేరే కూడలి. గమనాలు వేరైనా గమ్యం ఒక్కటే! రండి.. ఈ కథల చౌరస్తాలోకి అడుగుపెట్టి, ఈ కథలు చదివి చూడండి. 11 Stories Compilation by 11 Authors Genres inside (love, suspense, social, etc.) “Hyderabad Book Fair 2024 Best Seller” 💥 Book Fair Best Seller 2024 💫📖 500+ readers impressed already\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500029374511,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/CHOWRASTHA.jpg?v=1757675666"},{"product_id":"never-ending-love-story","title":"Never Ending Love Story","description":"\u003cp\u003e\u003cspan\u003eకొన్ని కథలు మనసుని సున్నితంగా తట్టి లేపుతాయి. మనలో ప్రేమను, ఆత్మ విశ్వాసాన్ని నింపుతాయి. అలాంటి కథలు కొంతకాలం మనతో కలిసి ప్రయాణం చేస్తాయి. ఇప్పుడు మీ చేతుల్లోకి రానున్న “నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ” కూడా అచ్చం అలాంటిదే. రచయిత్రి అద్భుతంగా మలిచిన ఈ ప్రేమ కథ మిమ్మల్ని మీ తొలి ప్రేమల్లోకి తీసుకెళ్తుంది. ప్రేమంటే ఆకర్షణ కాదు బాధ్యత అని గుర్తుచేస్తుంది. అనంతమైన ప్రేమ రూపాంతరం చెందుతూ మీ చేయి పట్టుకుని కొత్త లోకాల్లోకి తీసుకెళ్తుంది. కోల్పోయిన ప్రేమను తిరిగి పంచివ్వడంలో కొత్త ఆశలతో ముందడుగు వేయడానికి ఉత్సాహాన్నిస్తుంది అనంతమైన ప్రేమ. - పబ్లిషర్స్\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500030357551,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/NeverEndingLoveStoryfrontcover.jpg?v=1757675814"},{"product_id":"puri-the-power-house","title":"PURI THE POWER HOUSE","description":"\u003cp\u003e\u003cspan\u003eతెలుగు సినీ ఇండస్ట్రీ మనకి కొన్ని వందల మంది దర్శకులను ఇచ్చింది. అప్పుడెప్పుడో వచ్చిన మాయాబజార్ కె.వి రెడ్డి గారి నుంచి మొన్న వచ్చిన సందీప్ రెడ్డి వంగ వరకు చాలా మంది ఇండస్ట్రీ మీద తమ మార్క్ చూపించారు. ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉన్నా కూడా పూరి మార్క్ వేరు. తెలుగు హీరోకి పూరి ఇచ్చిన టచ్ వేరు. కొన్ని రాయాలన్నా పూరి నే. తీయాలన్నా పూరి నే. ఇండస్ట్రీ కి దొరికిన \"ఐటమ్\" కూడా పూరి నే\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500031143983,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/PURITHEPOWERHOUSE.jpg?v=1757675974"},{"product_id":"kalalu","title":"Kalalu","description":"\u003cp\u003e\u003cspan\u003eతన చుట్టూ ఉన్న సమాజాన్ని దాటి ఏ కవి అయినా కవితా వస్తువును ఎంచుకోలేడు. అదే వనమాలలో చూడవచ్చు. రైతు గురించి తల్లి గురించి భ్రూణహత్యల గురించి ఆయన ఒకే గొంతుతో మాట్లాడతారు. తన గొంతులో ఎంత ఆవేశం ఉన్నా, అది అక్షరాల్లోకి వచ్చేసరికి సున్నితంగా మారిపోతుంది. అందుకే \"అంటుగట్టి లక్షల కొమ్మలను పెంచుతాడే\/ వేరు తానైనా ఎదగలేక ఒదిగి ఉన్నా\/ రెక్కలుడిగి వేరుగానే తాను మిగిలిపోయాడే...\/ పగిలిపోయాడే\" అంటాడు. వేరు అనే పదం రెండు చోట్ల వాడటం ద్వారా శ్లేషగా రైతు దీన స్థితిని చెబుతాడు. కవిలో కదిలే గుణం లేకపోతే తాను ఎంచుకున్న అంశాల్లోకి ఆర్ద్రత రాదు. ఆ చలింపు ఈ కవిలో ఉండబట్టే తను రాసిన కవితల్లో ఆర్ద్రత చోటు చేసుకుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500031832111,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Kalalu.jpg?v=1757676130"},{"product_id":"sontha-ooru","title":"Sontha Ooru","description":"\u003cp\u003e\u003cspan\u003eమా సొంత ఊరు క్రాకుటూరు, పేరు చదవడానికి చిత్రంగా ఉన్నా , వినసొంపుగా ఉంటుంది మా ఊరి మనుషుల మాటల్లాగా. చూడటానికి షుమారుగా ఒక వంద నుంచి నూట యాభై గడపల పల్లెటూరే, కానీ పలికే ప్రతి మాటా, పెదాల పైనుంచి కాకుండా కడుపులోంచి వస్తుంది. అటువంటి ఊళ్ళో, అటువంటి మనుషుల మధ్య పెరిగిన నేను. నేను చూసిన, నాకు ఎదురైన సంఘటనలకు అక్షర రూపమే ఈ సొంత ఊరు కథలు. ప్రతి ఇంట్లో మనుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగానే చూసుకునేది మా పశువుల్ని , జివ్వాల్నే. ఇంట్లో ఎవరికైనా కాలికి ముల్లు గుచ్చుకుంటే, ముళ్ళ దగ్గరికి ఎందుకు పోయినవ్ అని కసురుకుంటారు అదే మందలో ఒక గొర్రి కాల్లో ముల్లు గుచ్చుకుంటే కీలకత్తి పెట్టి దాన్ని జాగ్రత్తగా తీసి, కిరసనాయిలు పోసి కడిగి, గాయపాకు తెచ్చి కట్టు కట్టి అది మానేంత వరకూ బిడ్డకంటే జాగ్రత్తగా చూసుకుంటారు. అది మా ఊరి మనుషులకూ, జివ్వాలకీ మధ్య పెనవేసుకున్న బంధం. ఎంత చెప్పినా తక్కువే మా ఊరి మనుషుల గురించి, వాళ్ళ మనసుల గురించి. మా ఊళ్ళోనే కాదు. మీ సొంత ఊళ్ళో కూడా, పొట్టేలును ప్రాణంగా చూసుకునే గంగయ్య లాంటి మట్టి మనిషి , తండ్రి చెప్పిన పని కంటే పాల కాయలే ఎక్కువనుకునే పిల్లోడు, తాత తెచ్చి ఇచ్చే మాయా పుల్ల కంటే, జేబులో కమ్మరకడ్డీలు పంచుకుని తినే స్నేహితుడే గొప్ప అనుకునే చిన్నోడు . ఇలా అందరూ తారసపడతారు ఒక సారి కళ్ళు మూసుకుని గుర్తుకు తెచ్చుకోండి. మీరు వెనక వదిలేసిన జ్ఞాపకాల్లో మీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44567403364399,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sonthaoorufrontcover.jpg?v=1759986405"},{"product_id":"hidimbi","title":"Hidimbi","description":"\u003cp\u003e\u003cspan\u003eఈ హిడింబి, అనాది జీవుల తిరుగుబాటు గాథ. ఆదిమ జాతుల ప్రేమ గాధ. ఆదిమ జాతుల తండ్లాట లోంచి పుట్టిన Original, native, ethnic, indigenous, alternative, unsung story గా చదువుదాం...! హిడింబి లోకంలోకి పయనిద్దాం! నరేష్ సృష్టించిన ఒక neglected, ignored universe లోకి శశభిషలేవీ లేకుండా అన్నీ వదిలేసి పర్యటిద్దాం. మన పుస్తక జ్ఞానాన్ని, పూర్వ జ్ఞానాన్ని, ఇంగిత జ్ఞానాన్ని, మన పూర్వ ప్రభావిత అంశాలన్నింటినీ త్యజించి, అన్నిటినీ unlearn చేసి, నగ్నంగా, స్వచ్ఛంగా అచ్చమైన పాఠకుడిగా, ఒక నిఖార్సయిన మానవుడిగా ఈ యూనివర్స్లోకి పయనిద్దాం రండి...! డా. మామిడి హరిక్రిష్ణ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44608545095727,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Hidimbi.jpg?v=1761274711"},{"product_id":"nanna-vacchina-velaa-visesham","title":"Nanna Vacchina Velaa visesham","description":"\u003cp\u003e\u003cspan\u003eఈ నవల చదువుతున్నంత సేపు ఒంటరి జీవితాల్లో ఒక్కో క్షణం ఎంత భయంకరంగా ఉంటుందో, ఒంటిరిగా బతుకుతున్న వ్యక్తి జీవితంలోకి వచ్చిన ఒక్కరిద్దరిని ఆ వ్యక్తి తన ఎడారి గుండెలో ఎంత లోతున నాటుకుంటాడో కళ్ళకి కట్టినట్టుగా, మనసుని తట్టినట్టుగా చూపించారు రచయిత \"రవీంద్ర రావెళ్ళ\". ఓ మధ్యతరగతి కుర్రాడి జీవితంలో తన తండ్రి పాత్ర ఎలా ఉండాలి అని కలలు కంటాడో అలా ఆ పాత్రని మలిచిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. తండ్రి ప్రేమకై తపించే ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44653124223023,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nannavachhinavelavisesham.jpg?v=1762488301"},{"product_id":"cinema-anveshi","title":"Cinema Anveshi","description":"\u003cp\u003e\u003cspan\u003eతెర మీద కదిలే బొమ్మల వెనక తమ మనసును, మెదడును, ఒంటిని కలిపి కష్టపడ్డ మనుషులెందరో ఉంటారు. ఆ కష్టాన్ని చెడగొట్టక, తెర మీద అద్భుతంగా చూపే నటీనటులుంటారు. వాళ్ల మీద గౌరవంతో కైగట్టిన రాతలివి. నా మనసు నింపిన సినిమాల గురించి నేను రాసిన రాతలివి. - విశీ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44653129269295,"sku":null,"price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/cinemaanveshibook.jpg?v=1762488504"},{"product_id":"palakarimpu","title":"Palakarimpu","description":"\u003cp\u003e\u003cspan\u003ePalakarimpu Telugu novel by Sandhya Chandru \u003cbr\u003e\u003cbr\u003eప్రేమించిన వాళ్ళకి ఎప్పుడైనా దూరంగా ఉన్నారా? లేదా దూరంగా ఉండి ఎవరినైనా ప్రేమించారా? మన జీవితంలో ఎంతోమంది ఒక చిన్న పలకరింపుతో పరిచయం అవుతారు. మనమే జీవితం అనుకునేవారు తారసపడడమనేది మాత్రం ఒక అరుదైన ఘట్టం. కొన్ని ప్రేమలకు కలుసుకోవడానికి సమయం పడుతుంది! అప్పుడే విరుస్తున్న ఎర్ర మందారంలా పెద్ద కళ్ళతో, లోకాన్ని గమ్మత్తుగా పరిచయం చేసుకుంటున్న అందుమైన అమ్మాయి సత్య. ఆమె అమాయకత్వాన్ని, ధైర్యాన్ని మౌనంగా ఇష్టపడే అబ్బాయి సూర్య. ఈ కథ వందల మైళ్ళ మధ్య చిగురించిన ప్రేమ. రెండు మనసుల మధ్య అల్లుకున్న అందమైన కవిత.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44744981774383,"sku":null,"price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/palakarimpu.jpg?v=1765102536"},{"product_id":"kutumbeekula-kondatakam","title":"Kutumbeekula kondatakam","description":"\u003cp\u003e\u003cspan\u003eకుటుంబీకుల కొండాటకం: A Telugu book about గాడ్ మేనియా by Sarath\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44940446629935,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Kutumbikulakondatakambook.jpg?v=1770298842"},{"product_id":"bomma-borusu-1","title":"Bomma Borusu","description":"\u003cp\u003e\u003cspan\u003e*రచయిత గురించి* కృష్ణ సాహితి మానసిక శాస్త్ర రంగంలో తొమ్మిదేళ్ల అనుభవం కలిగి ఉన్నారు. ఆమె అనేక సంస్థలతో పని చేసి, విద్యార్థులు మరియు యువతకు అనేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్లో హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా, ఆమె హైదరాబాద్లో తన స్వంత సైకాలజీ కౌన్సెలింగ్ సెంటర్లను (ithihas psychology counselling and Hypnotherapy centre) రెండు శాఖలతో స్థాపించారు. మానసిక శాస్త్ర వృత్తితో పాటు ఆమెకు పుస్తకాలంటే అపారమైన ప్రేమ. ఇప్పుడు తన వృత్తితో పాటు తన అభిరుచిని అనుసరించే కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44940451872815,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Bommaborusubook.jpg?v=1770299912"},{"product_id":"prema-prayanam","title":"Prema Prayanam","description":"\u003cp\u003e\u003cstrong\u003eఆరంభం\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eసూర్యుడు అస్తమించే సమయానికి, బడిలో నా తోటి పిల్లలంతా వంటున్నారు.\u003c\/p\u003e\n\u003cp\u003eఆఖరి బడిగంట కోసం ఎదురుచూస్తున్నాం మేమంతా. శరీరమంతా మైదానంలో పొర్లుతున్నా... మనసు మాత్రం ఆ గంట శబ్దం కోసం ఎదురుచూస్తోంది. కాసేపటికి బడిలో గంట కొట్టే వ్యక్తి గంట వైపు వెళ్లడం చూసాం. అందరం ఒక్కసారిగా తరగతి గదిలోకి పరుగు తీసాం. బ్యాగు భుజాన వేసుకొని అందరం ఇంటి ముఖం పట్టాం.\u003c\/p\u003e\n\u003cp\u003eబడి గేటు వద్ద పిల్లల కోసం వచ్చిన తల్లిదండ్రులు 'అమ్మ!' అంటూ పరిగెత్తుకు వస్తూన్న వాళ్ళ పిల్లల వద్దకు వెళ్లి, వాటేసుకుంటున్నారు.\u003c\/p\u003e\n\u003cp\u003eమా ఇల్లు పక్క వీధిలోనే ఉంది. నేను నడిచి వెళ్ళగలను. పైగా నేను 10వ తరగతి చదువుతున్నాను. ఇంకా చిన్న పిల్లని కాదు కదా! ఇంటికి వచ్చి 'నాన్నా!' అని పిలిచాను. ఇంట్లో ఎవరూ కనిపించట్లేదు. అందరూ బయటికి వెళ్లినట్టున్నారు. ' ఇప్పుడు ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలి' అని కాస్త నిరాశ పడ్డాను. 'సరే', అనుకుంటూ, తినడానికి ఏమైనా ఉన్నాయేమోనని వంటగదిని సోదా చేశాను. ఏమీ కనిపించలేదు..................\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":45205592604719,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/premaprayanam.jpg?v=1776262938"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/Jhansi_logo_png.jpg?v=1757677030","url":"https:\/\/books.ataka.in\/collections\/jhansi-publishers.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}