{"title":"Kadali","description":"","products":[{"product_id":"anandamaye-sakhi","title":"Anandamaye Sakhi","description":"\u003cp\u003eAnandamaye Sakhi - A Telugu Novel By Srujana Vavilapalli\u003cbr\u003e\u003cspan\u003eనీలోకి, నాలోకి, మనందరిలోకి, తొంగి చూస్తే ఒకే కథ కనిపిస్తుంది. కానీ వాటికి మనం స్పందించే తీరు వేరుగా ఉంటుంది. ఒక మాటని నువ్వు ఎంత లోతున దాచుకుంటావో, ఒక కష్టానికి నేను ఎంతలా విరిగిపోతానో, గుప్పెడు ఆనందానికి తను ఎన్ని గంతులేస్తుందో, ఇదంతా ఎవరికి వాళ్ళే తెలుసుకునే సంగతి. నీలా నేను మారలేను. నాలా నువ్వు ఉండలేవు. కానీ మన విరుద్ధ భావాలను ఒకే వంతెనపై నడిపించగల శక్తి స్నేహానికి ఉంది. ఆ స్నేహం తాలుకు అవసరం అందరిలాగే స్త్రీకి ఉంది. ఏదో సాధించడానికి కాదు, ఎక్కడికో ఎగిరిపోవడానికి కాదు. తనకి తను మిగలడానికి, తనని తనకు మిగుల్చుకోవడానికి- ఈ పరిచయాలు, స్నేహాలు, నమ్మకాలు, ప్రేమలు, వీటన్నింటి కలబోతే ఈ నవల. అవును! “నీలో ఆకాశమంత వెలుగు చూసేందుకు, ఆమె ఒక మబ్బు తునకై తప్పక నీ వెంట వస్తుంది.”\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Kadali Writes and Publications","offers":[{"title":"Default Title","offer_id":44554670473263,"sku":null,"price":230.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AnandamayeSakhifrontcover.jpg?v=1759407225"},{"product_id":"chick-lit","title":"Chick Lit","description":"\u003cp\u003eChick Lit - A Telugu Novel by Kadali\u003cbr\u003e\u003cspan\u003eఎలాంటి పుస్తకమైనా మన ఆలోచనా తీరుని పదునుపెట్టాలి, ముందుకు నడపాలి. అలాంటి సాహిత్యం మనని మనం బెటర్ ఇండివిడ్యువల్గా మార్చుకోడానికి సహాయపడుతుంది. చిక్ లిట్ అచ్చం అలాంటి రచనే. మొదటి పేజీ మొదలు పెట్టినప్పటినుండి ఆఖరి పేజీ పూర్తయ్యేలోపు మనని మనం వెతికి, తట్టి, ప్రశ్నించుకుంటాం. మనకి మనమే కొత్తగా దొరుకుతాం. రోజు చూసే సంఘటనలు, చూసి చూడనట్టు వదిలేసిన విషయాలు మన కళ్లముందుకొచ్చి నిల్చుంటాయి. పట్టించుకోలేదేంటని నిలదీస్తాయి. ఇదొక థ్రిలర్, ఇదొక లవ్ స్టోరీ, ఇదొక సోషల్ డాక్యుమెంటరీ. ఇది టోటల్గా ఒక కంటెంపరరీ నవల. ఆ తరానిది, ఈ తరానిది. తరాల మధ్యన వంతెన.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Kadali Writes and Publications","offers":[{"title":"Default Title","offer_id":44554673356847,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/chiklitfrontcover.jpg?v=1759407418"},{"product_id":"aadavari-matalaku","title":"Aadavari Matalaku...","description":"\u003cp\u003eAadavari Matalaku... - A Collection of Poems by Kadali\u003cbr\u003e\u003cspan\u003eకొన్ని మనం గుర్తుపెట్టుకోవాలనుకొని గుర్తుపెట్టుకున్న సంగతులు, కొన్ని గుర్తుపెట్టుకోవాలని అనుకొని కూడా తెలియకుండా మర్చిపోయే విషయాలు. గుర్తుండిపోయేవి, అప్పుడప్పుడూ గుర్తొచ్చేవి, వదిలించుకున్నవి, వదల్లేనివి, నీవి, నావి, మనందరివీ ఈ వివరాలు. ఓ రోజు ఏ విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా వదిలేస్తామో, అదే విషయం ఇంకో రోజున తెగ హింస పెడుతుంది. నిన్న బాగా నచ్చిన ఏదో సంగతి ఈ రోజుకి చిరాకు పుట్టిస్తుంది. ఈ రోజు అంత అసహ్యం కలిగించిన అదే సంగతి రేపు బతకడానికి ఆశని కలిగిస్తుంది. అవన్నీ పోగేసి మూట కట్టి ఇదిగో ఇలా మీ చేతికిచ్చాను. కొన్ని మర్చిపోయినా పర్వాలేదు, కొన్నింటిని మాత్రం గుండెకి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా హత్తుకోండి. ఈ రోజు కాకపోయినా రేపటి రోజున ఖచ్చితంగా అవసరం పడొచ్చు. మీరు ఆగి- ప్రపంచం కదులుతోందో, మీరు కదిలి- ప్రపంచం ఆగిపోయిందో తెలుసుకున్న రోజున ఈ పుస్తకం మీకు గుర్తొస్తుంది. అప్పుడు తీరిగ్గా మాట్లాడుకుందాం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Kadali Writes and Publications","offers":[{"title":"Default Title","offer_id":44554674831407,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/aadavarimaatalaubackcover.jpg?v=1759407547"},{"product_id":"letters-to-love","title":"Letters to Love","description":"\u003cp\u003eLetters to Love - A Collection Of Love Letters\u003cbr\u003e\u003cspan\u003eమనందరికీ ఒక పేరుంటుంది. అది మనకి ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ ఆ పేరు మనం కాదు. అది కొన్ని అక్షరాల సమాహారం మాత్రమే. కానీ కడలి అనే పేరు కేవలం కొన్ని అక్షరాలు మాత్రమే కాదు. పేరుకి తగ్గట్టే ఆమెలో సముద్రమంత ప్రేమ ఉండుండాలి. సరైన పదాలు లేవుగానీ, ఉండుంటే ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రేమ లేఖను రాసుండేవాడినంటాడు ఫిట్జెరాల్డ్. కడలికి ఆ సమస్య లేనట్టే ఉంది. ఆమెలోని అంతులేని ప్రేమకు సాక్ష్యం ఈ`లెటర్స్ టు లవ్‘.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Kadali Writes and Publications","offers":[{"title":"Default Title","offer_id":44554675159087,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/letterstolovefrontcover.jpg?v=1759407746"},{"product_id":"kadali-kathalu","title":"Kadali Kathalu","description":"\u003cp\u003eKadali Kathalu - Telugu Short Stories by Kadali\u003cbr\u003e\u003cspan\u003eకొన్ని మనం గుర్తుపెట్టుకోవాలనుకొని గుర్తుపెట్టుకున్న కథలు, కొన్ని గుర్తుపెట్టుకోవాలని అనుకొని కూడా తెలియకుండా మర్చిపొయే కథలు. గుర్తుండిపోయేవి, అప్పుడప్పుడూ గుర్తొచ్చేవి, వదిలించుకున్నవి, వదల్లేనివి, నీవి, నావి, మనందరివీ ఈ కథలు. ఓ కథలో ఏ విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా వదిలేస్తామో, అదే విషయం ఇంకో కథ రూపాన వచ్చి తెగ హింస పెడుతుంది. నిన్నటి కథలో బాగా నచ్చిన ఏదో సంగతి ఈ రోజుకి రోత పుట్టిస్తుంది. ఈ రోజు అంత అసహ్యం కలిగించిన అదే సంగతి రేపటికి బతకడానికి ఆశని కలిగిస్తుంది. అవన్ని పోగేసి మూట కట్టి కథల్లా మీ చెతికిచ్చాను..\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Kadali Writes and Publications","offers":[{"title":"Default Title","offer_id":44554676502575,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kadalikathalufrontcover.jpg?v=1759407933"},{"product_id":"chemistry","title":"Chemistry","description":"\u003cp\u003eChemistry - A Telugu Novel by Booduri Sudharshan\u003cbr\u003e\u003cspan\u003eప్రేమకి నిర్వచనాలెన్నో. కానీ ఈ కథలో ప్రేమను ఒక ప్రయోగశాలకి తీసుకెళ్లాం. బంధాల మధ్య రియాక్షన్లు, రియాక్షన్ల మధ్య బంధాలు – ఇవన్నీ రికార్డు చేసిన ఓ కొత్త ప్రయోగమిది. పారిస్ నుంచి మదనపల్లి వరకు, తిరుపతి మీదుగా సాగే ఈ ప్రయాణంలో ఒక్కో అనుభూతి, ఒక్కో అనుభవం. క్లాస్రూమ్లో చేసిన అల్లరి, మీ ఫేవరెట్ టీచర్, కాలేజ్ గొడవలు, దోస్తీలు, దూరాలు, దగ్గరితనాలు – ఇవన్నీ ఇందులో ఉన్నాయ్. ఈ నవల మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. అంతే ఏడిపిస్తుంది కూడా. చదువుతుంటే, ఎక్కడో ఓ చోట మీకు మీరు ఎదురవుతారు. అప్పటికి మాత్రం ఓ చిరునవ్వు నవ్వి మీకు మీరు హాయ్ చెప్పుకోండి\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Kadali Writes and Publications","offers":[{"title":"Default Title","offer_id":44554678829103,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/chemistryfrontcover.jpg?v=1759408129"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/kadali_ac0a7be7-86c9-4136-a58e-e87b22d67bf2.jpg?v=1759408289","url":"https:\/\/books.ataka.in\/collections\/kadali.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}