{"title":"Katha Sravanthi","description":"\u003cp\u003eKatha Sravanthi Kathalu\u003c\/p\u003e","products":[{"product_id":"ampasayya-naveen-kathalu","title":"Ampasayya Naveen Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003e        తెలుగులో తొలి చైతన్య స్రవంతి నవలా రచయితగా పేరొందిన అంపశయ్య నవీన్ మనస్తత్వ విశ్లేషణతో రచనలు చేయటంలో సిద్ధహస్తులు. కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత. నవీన్ కథలు కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలలో వస్తున్న మార్పులను తెలియజేస్తాయి. మనుషులలో పెరిగిపోతున్న అవకాశవాదం, స్వార్థచింతన, వ్యాపార ధోరణిని వివరిస్తాయి. నవీన్ తన అనుభవ పరిధిలోకి వచ్చిన సమస్త విషయాలను, చూసిన సంఘటనలను సన్నివేశాలుగా పరిచితులైన పాత్రలుగా మలచి కథలను రూపొందించారు. కల్పన తక్కువగా ఉంది వాస్తవిక ధోరణిలో నవీన్ కథలు కొనసాగుతాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e                 క్షణక్షణం పరిణామం చెందే మనసులోకి ప్రతిస్పందనలను చైతన్య స్రవంతి శిల్పంతో వ్యక్తం చేసి తనదైన ప్రత్యేకతను ఈ కథలలో నవీన్ సాధించారు. నవీన్ కథలు వస్తువులోనే గాక, శిల్పంలోనూ వైవిధ్యాన్ని సంతరించుకున్నాయి. కథలను ఆసక్తికరంగా తీర్చిదిద్దటంలో నవీన్ కు నవీనే సాటి. 'నవీన్ కథలను చదవటం మరచిపోలేని అనుభవం' అన్న ప్రసిద్ధ మధురాంతకం రాజారాం మాటలతో ఈ కథలను చదివిన పాఠకుడు తప్పక ఏకీభవిస్తాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758752657455,"sku":null,"price":50.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ampasayyanaveenkathalu.jpg?v=1765550839"},{"product_id":"balivada-kantarao-kathalu","title":"Balivada Kantarao Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eశిశు విక్రయం\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనెల రోజులనుంచీ పనికోసం తిరుగుతున్న మొగుడు పట్నం పొలిమేరలో నున్న పాకలో కాలు పెడుతూ “పని దొరికిం\" దన్నాడు, పెళ్ళానికి యెంత చల్లని కబురు. మొగుడు | మాటలను పొడిగిస్తూ, “యాభై రూపాయలు లంచం యివాళ పొద్దు తిరక్కముందు ఇస్తేనే\" అన్నాడు. ఏభై రూపాయలు-అమ్మో, అంత డబ్బే!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఆకలితో అలమటించిపోతున్న ముగ్గురు పిల్లల గోడు, తన అటమటింపు, నోటిలో చీకటిలో మంచినీరు పోసుకొని నిద్రపోయిన రాత్రులు ఈ హృదయ క్షోభే వుత్తేజితురాలను చేసి \"చప్పున నే తెస్తానుండు” అని బిడ్డను చంకనెత్తుకొని బయలు దేరింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eకొద్దిగా మీదికి లేచిన వేసవి సూర్యుడు అప్పుడే కోపంతో కూడిన చూపులను కురిపిస్తున్నాడు. నడుస్తూనే భుజంమీద బిడ్డను వేసుకొని నిమురుతూ మళ్ళీ మళ్ళీ అనుకుంది - “ఏభై రూపాయలు యింతే!\"\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఎదురుగా కనిపించిన వీధి మేడల మయం. ముఖం తేజోవంతమైంది. ఉబుకుతున్న | ఆశా తరంగాలతో మొదటి మేడ చేరగానే చేరవేస్తుంది తలుపు. \"పిలిస్తే యేమనుకుంటారో ఇంటిలో యే గొడవా లేదు. వీళ్ళకు పిల్లలు లేరేమో? నా బిడ్డ యెన్ని ఏభైలకు వారసు | డౌతాడు?\" పిలుస్తానని రెండో మెట్టుమీద కాలువేసే సరికి కఁయ్ మన్న యేడుపు వినిపించింది. తన బిడ్డయేడుపు కాదది. గబగబా మెట్లు దిగి మళ్ళీ వెనుకకు చూడలేదు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eపొడుగా లావుగావున్న పక్కయింటి యజమాని నోటిలో సిగరెట్ తో పైకి రాగానే | ఆయనతో తన భర ఫేకరీలో కూలీలు హెచ్చయ్యారని నెలరోజుల క్రితం తొలగించిన రెండు వందలమందిలో ఒకడని, అప్పటినుంచి కుటుంబం పడుతున్న కష్టాలని మొదట | చెప్పాలన్న వుబలాటంతో దగ్గరకు వెళ్తూండగానే ఆయన అణా మీదకు విసిరేసి లోనికి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eయాడు. ఎదరగా పడ అణా వేపు తన బిడ్డవేపు పదే పదే చూసుకొని కదిలి అయసాంతంలా ఆమెను ఆకరిస్తోంది. పట్టుకుంది. పారేసింది. నాలుగడుగులు బాబు దయతో యిచ్చినాడు. నేను అడుక్కోలేందే తీసుకోకపోతే పాపం!\" |\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచేత అణాతో ఆ ప్రక్క యింటిలో కస్సు బుస్సు లాడుకుంటున్న మొగుడు పెళ్ళాం ఎపు చూసి “నా బిడను పెంచటం చేతకాక పాడు చేస్తారు. నేనెప్పుడైనా చూడాలని వసే..................\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758754328623,"sku":null,"price":65.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/balivadakantharaokathalu.jpg?v=1765551118"},{"product_id":"bhushanam-kathalu","title":"Bhushanam Kathalu","description":"\u003cp\u003e            ప్రపంచం పొట్టమీద సన్నని నూగు వెంట్రుక ఆ ఊరు! ఊరి వెలుపల.. ?\u003cbr\u003e           ఉరి వెలుపల ఏముంటుంది?!\u003cbr\u003e            శ్మశానం. కాకపోతే శ్మశానం లాంటి వీధి.\u003cbr\u003e           వీధిలోని ఇళ్ళన్నీ శిథిలావస్థలో, గోడలు జారి పై కప్పుల్లేక కుర్రాళ్ళు కట్టి తిరగదోసిన పిచ్చిగ్గుళ్ళలా పిచ్చివాడి ఊహల్లా ఉన్నాయి. \u003cbr\u003eఆ ఇళ్ళలో నివసిస్తున్న మనుషులు చరిత్ర కందనివాళ్ళు. సమాజానికి వెలుపలి వాళ్ళు, దగాపడ్డ వాళ్ళు. \u003cbr\u003e         అదుగో! అదే గుడిసెలో నుంటున్న సుబ్బడు గొడ్లు కోస్తాడు. చర్మాన్ని అమ్మేసి మిగిలిన మాంసాన్ని తిని బ్రతుకుతాడు. ఆ ఎదురింట్లో నుంటున్న గంగడు కోడిపిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మేస్తాడు. దొరికితే దెబ్బలు తింటాడు. ఆ పక్క గుడిసెలో నున్న వెంకడు; చింతకాయ లమ్ముకుంటాడు. ఒకసారి చింతకాయ లెరుతుండగా చెట్టు మీద నుండి జారిపడితే, కుడి కాలిరిగిపోయింది. \u003cbr\u003e                                                                                                   - అట్టాడ అప్పల్నాయుడు \u003c\/p\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758761209903,"sku":null,"price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bhusahanamkathalu.jpg?v=1765551253"},{"product_id":"chalam-kathalu","title":"Chalam Kathalu","description":"\u003cp\u003e\u003cstrong\u003eచలం కథా వీథి\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచలం రచనల్ని మెచ్చుకుంటూ 'ఏమిశైలి, ఏమి శిల్పం' అని అంటుంటే 'నాశైలి పాడుగాను, నేను చెప్పింది పట్టించుకోరేమర్రా' - అని విసుక్కొనేవాడు చలం. ఆయన విసుక్కున్నాడు గదా అని మనం వాటిని మర్చిపోతామా! తెలుగు కథకు ఆధునికతను ఇచ్చినవాడు గురజాడ అయితే, టెక్నిక్ను కథనశిల్పాన్ని ఇచ్చినవాడు చలం. విషయం, సందేశం మొదలయినవే ప్రధానం అయితే, ఈ టెక్నిక్ అంతా ఎట్లా వచ్చింది. ఆ టెక్నిక్ను విశ్లేషించి దానికి సూత్రాలు కట్టి మరెవరయినా వ్రాస్తే కథనానికి ఆ బలం. వస్తుందా! కథా సంకల్పానికున్న బలం, రచయిత ఆవేశాలే శిల్పాన్ని నిర్ణయిస్తాయి. అనటానికి చలం రచనలే మంచి ఉదాహరణలు. వ్రాసిన తర్వాత మళ్లీ వెనక్కి చూసుకొని నగిషీలు దిద్దుకొనే అలవాటు తనకు లేదని ఎక్కడో ఆయనే చెప్పాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅడిగి వ్రాయించుకున్న కథలలో \"ఓ పువ్వు పూసింది\" మహాగొప్పది. అప్పట్లో మర్యాదస్తుల విఖ్యాత సాహిత్య ప్రతిక 'భారతి' చలం కథలను ప్రచురించేదికాదు. కాని తమ స్వర్ణోత్సవ సంచికకు ఒక రచన పంపమని వారే అడిగారు. \"ఏభై ఏళ్ల 'భారతి'కి చలం కావలసివచ్చాడా” అని వ్యంగ్యంగా ఎత్తిపొడిచి “ఓ పువ్వు పూచింది\" వ్రాసి పంపాడు. అది సర్వకాల మహోత్కృష్ట కథగా ఉండి పోయింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eపూవు వివిధ వికాస దశలపై స్త్రీత్వాన్ని ఆరోపించిన, అన్యాపదేశ కథగా (ఎలిగరీ) అందరూ ప్రశంసిస్తారు. అంతమాత్రమే కాదు. అనంతలోకాధిపతి చేతినందుకొని ఆనంద సరసిలోకి ఎగిరిపోయిన జీవుని సంపూర్ణ జీవిత చిత్రణగా నాకు కనిపిస్తుంది. నిత్య సృష్టి లీలను వర్ణించిన భావప్రధానమయిన కథ ఇది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచలం కలం సిరాలో అనేక రససమ్మేళనాలు ఉన్నాయి. అవి శిల్పావసరం బట్టి ఛాయలు మారుతుంటాయి అదేమి చిత్రమో పాఠకుల మనస్సు చలం సాహిత్యంలో శృంగారాన్ని, స్త్రీ పురుష సంబంధాలనే ముందుగా వెతుకుతుంది. విస్తృత వైవిధ్యాలకు అనేక ఉదాహరణలను ఇవ్వగలను. ఈ సంకలనంలో చలం స్పృశించిన కొన్ని భిన్న కోణాలకు ప్రతినిధి కథలను ఎంపిక చేసాము.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచలంలోని హాస్యం ప్రత్యేకంగా ఆస్వాదింపదగినది. అతనిలో ఒకే మూస హాస్యం ఉండదు. అతనొక హాస్య నమూనాను సిద్ధం చేసుకోలేదు. చలం తర్క శక్తి, హాస్య శక్తి కలసి అత్యంతబలంగా పాఠకుణ్ణి తన పక్షానికి మళ్లించుకుంటాయి..............................\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758771662895,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/chalamkathalu.jpg?v=1765551504"},{"product_id":"gopichand-kathalu","title":"Gopichand Kathalu","description":"\u003ch4\u003e   శిశిర కుమారబాబు రైలు దిగాడు. అది అట్టే పెద్ద స్టేషన్ కాకపోవటం వల్ల ప్రయాణీకులు ఎక్కువ మంది లేరు. సామాన్లు మోసే కూలీలు లేరు. ఒక పోర్టరు మాత్రం ఎర్ర జెండా ఆకుపచ్చ జెండా కలిపి చుట్టి చంకలో పెట్టుకొని అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆ రైలు మార్గమంతా తన జెండాల ప్రభావం వల్లే నడుస్తుందని అతని అహంకారం. \u003c\/h4\u003e\n\u003ch4\u003eఅతన్ని పిలిచి శిశిర కుమారబాబు అడిగాడు - \u003c\/h4\u003e\n\u003ch4\u003e\"వెంకయ్యగారిల్లెక్కడ?\"\u003c\/h4\u003e\n\u003ch4\u003e\"ఏ వెంకయ్య? ఇక్కడ వెంకయ్యలు కొల్లల క్కొల్లలున్నారు!\" అన్నాడు పోర్టరు.\u003c\/h4\u003e\n\u003ch4\u003eశశిర కుమారబాబుకి వెంకయ్య యింటి పేరు తెలియదు. తిలకం భర్త అని మాత్రమే తెలుసు. \u003c\/h4\u003e\n\u003ch4\u003e                                                                                                - లక్ష్మీ నారాయణ  \u003c\/h4\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758777135151,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gopichandkathalu.jpg?v=1765551622"},{"product_id":"k-sabha-kathalu","title":"K Sabha Kathalu","description":"\u003cp\u003e\u003cstrong\u003eరాయలసీమ నవకథా వైతాళికుడు\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eపరిశోధకులు రాయలసీమలో తొలికథ 1852లోనే పుట్టిందని నిరూపించినా, అనంతపురం జిల్లాకు చెందిన జి. రామకృష్ణగారు 1941లోనే కథలు రాశారని చాలా కాలం వరకూ ఆయన్నే తొలి రాయలసీమ కథకుడని సంభావించినా, 1944లో ప్రారంభించి 1980లో _మరణించే వరకూ దాదాపు 300 కథలు రాసి, తర్వాత వచ్చిన కథకుల మార్గదర్శకుడైన కె. సభాగారినే తొలి ముఖ్యమైన రాయలసీమ కథకుడుగా గుర్తించాల్సి వుంటుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eసభాగారిది బహుముఖీనమైన ప్రతిభ. ఆయన కథలేగాకుండా నవలలు, పిల్లల కథలు, కవిత్వమూ కూడా రాశారు. ఆనాటి యెన్నికల సమయాల్లో బుర్రకథలు కూడా రాశారు. బడిపంతులుగా వొక దశాబ్దంపాటూ పనిచేసి తర్వాత ప్రాతికేయుడిగా మారారు. తానే వొక పత్రికను స్థాపించి నడిపారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచిత్తూరు జిల్లాలో కొట్రకోన అనే చిన్న కుగ్రామంలో సాదాసీదా కుటుంబంలో 1923లో పుట్టిన సభాగారికి బీదరికం, రైతుల కష్టాలు, కూలీల అవస్థలు, వృత్తిపని వాళ్ళ కడగండ్లు బాగా తెలుసు. చిన్నతనంలో తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం కూడా చేశారు. 1947లోనే చిత్తూరుకు దగ్గరిలో శివగిరిలో రైతాంగ విద్యాలయం నిర్వహించారు. పట్టణాలకు వచ్చాక అక్కడి మధ్యతరగతి మనుషుల జీవితాల్ని పట్టించుకున్నారు. తిరువణ్ణామలైకెళ్ళి రమణాశ్రమంలో రమణ మహర్షిని చూశారు. చలంగారితో స్నేహం చేశారు. ఆ తరువాత ఆధ్యాత్మిక రచనలు గూడా రాశారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eస్వాతంత్య్రానికి ముందున్న గాంధీయిజపు ఆదర్శవాదమూ, స్వాతంత్ర్యం తరువాతి కాలంలో జరిగిన సాంఘిక రాజకీయ పరిణామాలూ సభాగారి కథల్లో స్పష్టంగా కనబడతాయి. వ్యవసాయంలో వచ్చిన మార్పులూ, గ్రామాల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం, తగ్గిన భూగర్భజలాలూ, వ్యవసాయ అనుసంగిక వృత్తులవారి జీవన సంక్షోభాలూ, సభాగారు రాసిన గ్రామీణ కథలకు వొస్తులయ్యాయి. గ్రామాల్లోని దళితుల కష్టాలూ, ఆడకూలీల యాతనలూ, సారా కల్లు దుఖాణాల ప్రాభవాలూ ఆయన కథల్లో విస్పష్టంగా కనబడతాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eరాయలసీమ అన్న పేరే కరువుకు పర్యాయపదంగా మారిపోయింది. వర్షాభావం, నీటి యెద్దడిల గురించి రాసిన కథలకంతా సభాగారి 'పాతాళగంగ' గొప్ప నమూనాగా నిలబడి పోయింది. వ్యవసాయానికి బావిని తవ్వే తండ్రి పట్టుదలనూ, సరిహద్దుల్లో శత్రువుతో పోరాడే..............\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758778052655,"sku":null,"price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ksabhakathalu.jpg?v=1765551877"},{"product_id":"karuna-kumara-kathalu","title":"Karuna Kumara Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eకయ్య - కాలవ\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eలక్ష్మమ్మ గొప్ప అదృష్ట జాతకురాలు. పాకనాటి కాపుకులంలో పుట్టింది. మళ్ళా అపర మహాలక్ష్మే. పూర్వ జన్మలో ఇంత పెట్టిపుట్టిందేమో, ఈ జన్మలో భోగం అనుభవిస్తోంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eలక్ష్మమ్మ పుట్టింటి వారిది చాలా గట్టిసంసారం. మొగపిల్లకాయలు లేనందువల్ల లక్ష్మమ్మకూ, ఆవిడ అక్కకూ ఒక వూళ్ళోనే మనువులు కుదిర్చి తండ్రి ఇద్దరికీ చెరి ముప్పయి. వేల రూపాయల ఆస్తి ఇచ్చి మహా వైభవంతో వివాహం చేసి, వాళ్ళను కాపురానికి పంపేడు. కాని కాపరానికి వెళ్ళిన మరుసటి సంవత్సరమే లక్ష్మమ్మ భర్త కాలం చేసినందువల్ల అప్పటి నుంచీ ఇప్పటివరకూ ఆవిడ నిరంకుశమైన వైధవ్యాన్ని అవిచ్చిన్నంగా పరిపాలిస్తోంది. ఇదొక్కటే ఆవిడకు కొరత పెట్టాడు భగవంతుడు. ఇది మినహా ఆవిడ సంసారానికి ఏమీ కొరతలేదు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅటు పుట్టింటివారివల్ల దఖలుపడ్డ ముప్పయివేల రూపాయల ఆస్తి, యిటు అత్తింటివారివల్ల లభ్యపడ్డ ఏభై వేల రూపాయల ఆస్తీ కలిపి, భర్త చనిపోయేటప్పటికి ఓ 80, 90 వేల రూపాయల ఆస్తికి లక్ష్మమ్మ హక్కుదారయింది. చనిపోయే ముందు మంచంమీద ఇంకా తెలివుండగానే భర్త సిసలైన వీలునామా వ్రాసి ఏభై ఎకరాల మాగాణి, డెబ్బై ఎకరాల మెట్టా, మామిడితోటా, నాలుగెకరాల పాటి మట్టి దొడ్లీ, పశువుల బీళ్ళూ, పది అంకణాల | మద్ది, ఇన్ని పాడిపశువులూ, నాలుగువందల సన్నజీవాలూ ఒకటేమిటి, ఒకరి దగ్గరకు పోనక్కర లేకుండా అమర్చి పెట్టినట్లు ఇనప్పెట్లో బీగాలతో సహా చేతిలో పెట్టి, “నేను లేనన్న కారతతప్ప యిక నీకేమీ లోపం లేదు. ఇంట్లో తల అట్లా వీధిలో పెట్టుకోకుండా ఈ యావదాస్తే నువ్వు అనుభవించు కొని జీవించు\" అని అంత్యకాలాన ఆశీర్వదిస్తూ ఆవిడ భర్త! అదృశ్యమైనాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eలక్ష్మమ్మది మొదటి నుంచీ గట్టిపిడికిలి. పొలంలో పండిన అరవై పుట్ల ధాన్యం ఆగాయత్తు దొడ్లో పశువులు వేసే పేడవరకూ సమస్తమూ ఆమె రొట్ట రూపంగా మార్చి |\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచేసిన సంసారం అది. రాగులు, సజలు, జొన్నలు, మిరపకాయలు, చింతపండు. అదికాయలు, టెంకాయలు, టెంకాయపీచు. తాటికాయలు, తాటాకు, తాటిబుర్రలు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eపరుగు, వెన్న, నెయ్యి ఒకటేమిటి. పాటి మట్టి, ఎరువుమట్టి, దూడా దుడుకూ సమస్తమూ - మార్చి చేతపటుకొనే అలవాటు లక్ష్మమ్మకు. అందువల్ల భూములు, దొడ్డు, బంగారు..............\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758778675247,"sku":null,"price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/karunakumarkathalu.jpg?v=1765552013"},{"product_id":"kethu-viswanadha-reddy-kathalu","title":"Kethu Viswanadha Reddy Kathalu","description":"","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758781820975,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kethuviswanadhareddybooks.jpg?v=1765552162"},{"product_id":"kodavatiganti-kutumbarao-kathalu","title":"Kodavatiganti Kutumbarao Kathalu","description":"","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758783197231,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kodavatihganti.jpg?v=1765552426"},{"product_id":"kupili-padma-kathalu","title":"Kupili Padma Kathalu","description":"\u003cp\u003e\u003cstrong\u003eగాయాల లోతులను కొలిచే కథలు\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eకుటుంబము, రాజ్యము, మార్కెట్ అనే మూడు వ్యవస్థల మధ్య నలుగుతున్న మనుషుల కథలను కుప్పిలి పద్మ రాశారు. ఈ మూడు వ్యవస్థలకు లేదా సంస్థలకు అప్రతిహత అధికారం సంక్రమింపజేసిన సుదీర్గ మానవ సమూహ ప్రయాణం కూడా ఉంది. పద్మ కథలు ఈ మూడిటిలోంచి ముప్పేటలుగా అల్లుకున్న ఇతివృత్తాలతో ప్రకటితమవుతూ ఉంటాయి. ఈ మూడు వ్యవస్థలకు ఒక ధర్మం, ఒక స్వభావం, ఒక లక్షణం ఉంది. అదేమంటే పీడన, దోపిడి, అణచివేత, అమానవీకరణ, అప్రజాస్వామికత, ఆధిపత్యం. వీటిని ప్రశ్నించటం, ప్రతిఘటించటం, నిరాకరించటం, నిర్మూలించటం అనే లక్ష్యంతో పద్మ కథలు సాగుతాయి. నిర్మూలన అనేది కొంత పెద్దమాట. లేకుండా చేయటం, తొలగించుకోవటం, అధిగమించటం అనే అర్థస్ఫూర్తిని గ్రహించగలిగితే చాలు. అయితే ప్రశ్నకు, ప్రతిఘటనకు, నిరాకరణకు అంతా సంఘటితం కావటమనే భావనకు పద్మ కథలు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వవు. రచయిత దృక్పథంలో కూడా సంఘటితం, సంఘభావంలాంటి వాటికి అంతగా స్థానం లేనట్టుగా ఉంటుంది. వ్యక్తిగత స్థాయిలోనే ప్రతిఘటన లేదా పరిష్కారం కొరకు ఆయా పాత్రలు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ ప్రయత్న క్రమంలో ఆయా వ్యక్తులు, పాత్రలు తమ స్థితిగతులను, సామర్థ్యాలను, పరిమితులను అవగాహన చేసుకోగలుగుతాయి. వ్యక్తిగతస్థాయి పరిష్కార ప్రయత్నాలలో ఎడతెగని సంఘర్షణను అవి ఎదుర్కోవటం కూడా గమనించవచ్చు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఆధిపత్య రాజకీయాలను అర్థం చేసుకొని ప్రశ్నించే స్వభావం, చైతన్యం పెరగటం తెలుగు సాహిత్యంలో 1980 ల నాటికి వచ్చిన ఒక పరిణామం. ఈ పరిణామంలో స్త్రీవాదం ఒక పాయ. ఈ పాయలో బలమైన ఉరవడి, ఉధృతిని కలిగించి పెంచిన గొంతుల్లో పద్మది ఒక గొంతు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eమొదట చెప్పినట్టు కుటుంబం, రాజ్యం, మార్కెట్ వ్యవస్థలలో రాజ్యం పాత్ర ప్రత్యక్షంగా కనిపించదు. అట్లాగని రాజ్యం పాత్ర లేకుండానూ ఉండదు. ప్రతి వ్యక్తి కూడా సంక్షిప్త రాజ్యమేనని ఫుకో విశ్లేషణ. ఇది పురుషుడికి సరిగ్గా వర్తిస్తుంది. రాజ్యం అంటే పురుష.....................\u003c\/p\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758784704559,"sku":null,"price":70.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kuppilipadmakathalu.jpg?v=1765552689"},{"product_id":"madhurantakam-narendra-kathalu","title":"Madhurantakam Narendra Kathalu","description":"\u003ch4\u003e            నగరం నుంచీ యింగ్లీషు దినపత్రికల్ని మోసుకొచ్చిన పేపర్ వాన్ నాలుగు కాళ్ళ మండపం దగ్గరికి రాగానే హారన్ మోగించడం మొదలెట్టింది. అక్కడి నుంచీ ఆ పేపరు యేజంటు కార్యాలయం అరఫర్లాంగు దూరంలో వుంది. ఆ అరఫర్లాంగు దూరం పొడవునా హారన్ మోగిస్తూ వెళ్లడం ఆ వాన్ డ్రైవర్ కలవాటు. నిద్రపోతున్న పేపర్ కుర్రాళ్ళకు అదే మేలుకొలుపు. \u003c\/h4\u003e\n\u003ch4\u003e               నాలుగు కాళ్ళ మండపం దగ్గర, పాత చావడి మొండిగోడల పక్కన పడుకున్న రంగమ్మ పేపరు వాన్ హారను వినిపించగానే, విసుగ్గా వొళ్లు విరుచుకుంటూ లేచి కూర్చుంది. కనురెప్పల్ని విడివడనివ్వకుండా అడ్డం పడుతున్న కంటి పుసుల్ని రెండు చేతుల్తోనూ తుడుచుకుంటూ, సగం కనురెప్పల్ని బలవంతంగా పైకి కదిల్చి రోడ్డుకేసి చూపులు సారించింది. \u003c\/h4\u003e\n\u003ch4\u003e                                                                                               - కాకుమని శ్రీనివాసరావు \u003c\/h4\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758785753135,"sku":null,"price":60.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/madhuranthakamnarendrakathalu.jpg?v=1765552827"},{"product_id":"madhuranthakam-rajaram-kathalu","title":"Madhuranthakam Rajaram Kathalu","description":"","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758787751983,"sku":null,"price":65.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/madhuranthakamrajaramkathalu.jpg?v=1765553002"},{"product_id":"munipalle-raju-kathalu","title":"Munipalle Raju Kathalu","description":"","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758788997167,"sku":null,"price":50.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/munipallerajukathalu.jpg?v=1765553265"},{"product_id":"tallavajjula-patanjali-sastry-kathalu","title":"Tallavajjula Patanjali Sastry Kathalu","description":"\u003cp\u003e\u003cstrong\u003eతెరుచుకున్న కథలు\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eతల్లావజ్ఝల పతంజలిశాస్త్రిగారు కవి, కథకులు, నాటకకారులు, నవలా రచయిత, పర్యావరణవేత్త. ఆయన కథలగురించి మాత్రమే మాట్లాడాల్సిన సందర్భంలో కూడా తక్కిన విశేషాలన్నిటినీ ప్రస్తావించుకోవాల్సిందే. ఎందుకంటే అవన్నీ కలిసి ఆయన కథలు తయార \u003c\/span\u003e\u003cspan\u003eకాబట్టి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eశాస్త్రిగారి కథల్లో కవి కనిపిస్తాడు. కథల్లో కవిత్వస్పర్శ కనిపించే రచయితలు ఇతరులు కూడా కొందరున్నారు. కానీ శాస్త్రిగారు కవితాశైలిని వాడడంలో ఉద్దేశం భిన్నంగా ఉంటుంది. ఒక సౌందర్యం కోసం, ఒక ఉద్వేగ స్పర్శకోసం ఆ శైలిని వాడుకోరు. కథనంలో చిక్కదనం సాధించడం కోసం వాడతారు. అనుభవ గాఢతని సాధించడంకోసం వాడతారు. అల్లిక జిగిబిగి సాధించడంలో భాగంగా వాడతారు. శాస్త్రిగారి కథాభాష వేరే భాష, దాన్ని ఆయన సాధించారు. ఆ క్రమంలో తెలుగుదనాన్ని ఎక్కడా కోల్పోలేదు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఈ కథల్లో నాటక కారుడు కనిపిస్తాడు. సంభాషణలు ఎక్కువ రాస్తారని కాదు. బలమైన, సహజమైన, కథాచాలన సమర్థాలయిన సంభాషణలుంటాయనికూడా కాదు. అవన్నీ ఉంటాయి. దాంతోబాటు నాటకంలోలాగా రచయిత ఎక్కడా చొరబడకపోవడం అనే లక్షణంకూడా చాలా ప్రధానంగా ఉంటుంది. తన ముఖతః చెప్పరు. పాత్రలద్వారా ఉపన్యాసాలిప్పించరు. చెప్పదలుచుకున్న మాట కథ వెనక ఉంటుంది. కథకు నీడలా ఉంటుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eపర్యావరణకారుడికి ఉండే ఒక స్పృహ ఆయన కథల్లో చాలాచోట్ల పరుచుకుని ఉంటుంది. కొన్ని కథల్లో ఆ స్పృహే కథ. 'జోగిపంతులు తిరిగి రాలేదు' కథ ఎంత విలక్షణమైన పర్యావరణ కథో! 'ఉర్వి' మరో విశేషమైన కథ.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eశాస్త్రిగారు ఇన్నేళ్ళుగానూ రాసిన కథలు ఒక వందవరకూ ఉంటాయి. వీటిల్లో ఆయన సాధించిన వైవిధ్యం అద్భుతం. ఏ రెండు కథలూ ఒకేలా ఉండకూడదని వ్రతం పట్టి రాసినట్టు ఉంటాయి ఆయన కథలు. ఈ సంపుటినే తీసుకుంటే 'జై' కథ గాంధీగారి ఆంధ్రదేశ కుగ్రామ సందర్శన ఇతివృత్తంగా ఉంది. 'రోహిణి' బుద్ధుడి కాలం నాటి కథ. జిర్రున పొలిటికల్ సెటైర్............\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758792962095,"sku":null,"price":70.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/pathanjalisastrykathalu.jpg?v=1765553496"},{"product_id":"peddinti-ashok-kumar-kathalu","title":"Peddinti Ashok Kumar Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eజుమ్మేకి రాత్మా\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅనంతమైన ఇసుక మైదానం. ఒంటరి పావురంలా ముడుచుకుని కూర్చుని ఉన్నాడు సలీం. అతని చేతిలోని లాప్ టాప్ ప్రపంచాన్ని చుట్టి వస్తోంది. ఫేస్ బుక్ లో పేజీలు తిరుగుతున్నాయి. ఫాతిమా లాగిన్ అయినట్టుంది. ఫొటో ముందు గ్రీన్ సింబల్. క్లిక్ చేసి 'హాయ్... హౌ ఆర్యూ డియర్' అని ఆతృతగా టైప్ చేసాడు సలీం. 'ఫైన్... ఆప్ కైసా హై' రిప్లయ్ వచ్చింది. బీడుబడ్డ నేలమీద వాన చినుకులు పడ్డంత పులకరింత. 'అచ్ఛా హై... నువ్వెట్లున్నవ్... ఏం చేస్తున్నవ్?” “బాగున్న... నీ గురించే ఆలోచిస్తున్న\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనొక్కుతున్నది. ఫాతిమా చెక్కిళ్ళే అన్నంత తన్మయత్వంలో కీ బోర్డును తాకుతున్నాడు సలీం. ఎడారిలో ఎడబాటులో ఒక సెల్ ఫోన్ టచ్ స్క్రీన్... ఓ కీ బోర్డ్ ఓ నెట్ కార్డ్ ఇవే సుఖదుఃఖాల... ఇఫుట్, అవుట్ పుట్.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e'నేనూ అంతే... నీతోపాటు ఈ రోజు హసీనా గురించి కూడా ఆలోచిస్తున్న. ఈ రోజు దాని పుట్టినరోజు.... టైప్ చేసి సెండ్ చేసాడు సలీం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eక్షణాలు, నిమిషాలు గడిచాయి. సమాధానం లేదు. నొచ్చుకున్నాడు సలీం. 'క్యా హువా.... ఓ... బాత్ బంద్ కరే!' టైప్ చేసి పంపాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eరిప్లయి లేదు కాని ఫోన్ మోగింది. ఫాతిమా అనుకుని ఆతృతగా ఎత్తాడు. కాదు కంపెనీ సూపర్వైజర్.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనీరసంగా 'సార్... నమస్తే' అన్నాడు. \"సలీం భాయ్... నమసే... ఎంత చెప్పగూడదనుకున్నా గురువారం నాడే నీకు చెప్పాల్సివస్తున్నది...\" నసిగాడు సూపర్వైజర్.......\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758888382511,"sku":null,"price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/peddintiashokkumarkathalu.jpg?v=1765558001"},{"product_id":"raavi-sastry-kathalu","title":"Raavi Sastry Kathalu","description":"\u003cp\u003eRaavi sastry Kathalu - katha sravatnhi\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003ch4\u003e                 \"రచయిత ప్రతివారూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తోందో ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకి సహాయపూఁ చెయ్య కూడదని నేను భావిస్తాను\" అనే స్పష్టమైన దృక్పథంతో రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని ప్రజా పంథాలో పయనింపజేసిన రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి. \u003c\/h4\u003e\n\u003ch4\u003e                 నాగరికత ముసుగులో దాక్కున్న అమానవీయ ప్రపంచాన్నీ, బాధలకు గురవుతున్న మానవుల కష్టాలనూ విస్పష్టంగా చూసే చూపు రావిశాస్త్రిది. బాల్యంలో అయన చదువుకున్న చార్లెస్ డికెన్సు నవలలు, ఆంటోన్ చెకోవ్ కథలూ రవిశాస్త్రి దృష్టిని అధోజగత్తుకేసి మళ్లించాయి. గురుజాడ నుంచి శ్రీ శ్రీ వరకూ వున్న సాహిత్య నేపథ్యం ఆయనకుంది. \u003c\/h4\u003e\n\u003ch4\u003e                                                                                                - మధురాంతకం నరేంద్ర \u003c\/h4\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44779600740399,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ravisastrykathalu.jpg?v=1766074404"},{"product_id":"kathasravanthi-sarada-kathalu","title":"Sarada Kathalu","description":"\u003cp\u003e\u003cstrong\u003eతెలుగు 'శారద' - తమిళ నటరాజన్\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eపుట్టుకతో తమిళుడు. పేరు నటరాజన్. తమిళనాట ఏడవ తరగతివరకు చదువుకున్నాడు. 12 ఏళ్ళ వయస్సులో తండ్రి సుబ్రహ్మణ్యయ్యర్ తో 1937లో తెలుగు గడ్డమీద కాలుమోపాడు. ఆనాటికి అతనికి తెలుగు తెలియదు. బతుకు పోరాటంలో నిత్య శ్రామికుడు. హోటల్ కార్మికుడు. తెనాలిలో వీధి బడి పంతులుగారి వద్ద మూడవ తెలుగులో తరగతి వరకు చదివాడు. నటరాజన్ . కష్టపడి తెలుగు నేర్చుకున్నాడు. 15ఏళ్ళ వయసు. లోకం గురించి తెలుసుకుంటుండగనే తండ్రి 1940లో కనుమూశారు. అదే సమయంలో నటరాజన్కు మూర్ఛల వ్యాధి తోడయింది. జీవితంలో పస్తులతో గడిపిన రోజులు అనేకం. ఆ వ్యాధితోనే అతని జీవితం ముగిసింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఆ \u003c\/span\u003e\u003cspan\u003eగత శతాబ్ది 30వ దశకం ఉత్తరార్థంలో తెనాలి చేరిన నటరాజన్ నాటి స్వాతంత్య్ర ఉద్యమాలను కళ్ళారా చూశాడు. కమ్యూనిస్టు పార్టీ ఆ ధ్వర్యంలో కార్మికులు తమ కనీస హక్కుల కోసం చేసిన పోరాటాలలో ప్రత్యక్ష భాగస్వామి. హెూటల్లో దోశల మీద సుత్తీకొడవలి బొమ్మలు వేసి యజమాని కోపానికి గురయ్యాడు. పని పోగొట్టుకున్నాడు. జీవితాంతం కమ్యూనిస్టుగానే నిలబడ్డాడు. హెూటల్ కార్మికుడిగా రోజుకు 10గంటలు, ఒక్కోసారి 12 గంటలు పనిచేసినా ఖాళీ సమయంలో కొంత చదువుకు కేటాయించాడు. చదవడంలో శ్రమను మర్చిపోవడం అలవాటు చేసుకున్నాడు. చేతికందిన పుస్తకాన్ని వదలకుండా చదివాడు. ఎంతగా అంటే పొయ్యిదగ్గర పదార్థాలు తయారు చేస్తూకూడా ఒకచేతిలో అట్లకాడ ఉంటే మరోచేత పుస్తకం ఉండేది. ఆ కష్టాలు తనకొక్కడివే కాదని అర్థమయింది. సామాజిక సంఘర్షణలను చూస్తున్నాడు. ఆంతరంగిక వేదనకు గురవుతున్నాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cstrong\u003eబాటలు వేసిన సాహిత్య పాఠశాల\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eతెనాలిలో ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భవించింది. తెలుగునాట || ప్రగతిశీల సాహిత్య ఉద్యమానికి బాటలు వేసింది. అందులో భాగంగా 1946లో తెనాలి | తాలూక పెదపూడిలో నెల రోజులపాటు సాహిత్య పాఠశాలను నిర్వహించింది. భాషా, సాహిత్య,.................\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44779603197999,"sku":null,"price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/saradakathalu.jpg?v=1766080576"},{"product_id":"singamaneni-narayana-kathalu","title":"Singamaneni Narayana Kathalu","description":"\u003cp\u003e\u003cspan data-mce-mark=\"1\"\u003e             రాయలసీమ రైతుగుండె చప్పుళ్ళను నిజాయితీగా పట్టుకొని కథల్లో ప్రవేశపెట్టిన ఉత్తమ శ్రేణి కథకుడు సింగమనేని. వీరి కథల్లో కొత్త మలుపులు, కొత్త భావాలు, మునుపటి కథకులు ఊహించలేని గమనాలు, చూడని దృష్టికోణాలు మనకు దర్శనమిస్తాయి. సమాజాన్ని మార్చాలనే దృష్టితో మార్క్సిస్టు దృక్పథంతో సింగమనేని నారాయణ రాసిన ఈ కథానికలు ఈ తరం రచయితలకు కరదీపికలు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e             రైతాంగవ్యవస్థ సంక్షోభాన్ని, వ్యావసాయిక విధ్వంస దృశ్యాల్ని చిత్రించిన సింగమనేని నారాయణ కథానికలు తెలుగు పల్లెలో మరీ ముఖ్యంగా రాయలసీమ గ్రామ సీమల్లో జరిగే సామాజిక ఆర్ధిక రాజకీయ సాంస్కృతిక మార్పుల్ని మన ముందుంచుతాయి. సామాన్య జన జీవితాలను, వాళ్ళ కష్టాలను కన్నీళ్లను, బతికేందుకు వాళ్ళు పడే ఆరాటాల్ని, చేసే పోరాటాల్ని వాళ్ళ మాటల్లోనే నిజాయితీగా పలికిన ఈ కథానికలు మనసు పెట్టి చదివితే మనందరి కథలు - జీవేచ్చను రగిలించే అక్షర శిల్పాలు కూడా! సమాజాన్ని మార్చగలిగిన సత్తావున్న కథల్ని రాసిన కొద్దిమంది రచయితలలో సింగమనేని నారాయణ ఒకరు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44779608178735,"sku":null,"price":50.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/singamaneninarayankathalu.jpg?v=1766080817"},{"product_id":"sripathi-kathalu","title":"Sripathi Kathalu","description":"\u003cp\u003e\u003cspan data-mce-mark=\"1\"\u003e            గత అర్ధ శతాబ్దకాలంగా గ్రామాల్లోనూ, నగరాల్లోనూ జరుగుతున్న పరిణామాలు, మానవ మనస్తత్వాలపై వాటి ప్రభావాల విశ్లేషణ శ్రీపతి కథల ముడిసరుకు. ఒకవైపు ఆధునికత శరవేగంగా జీవితాల్లోకి, కుటుంబాల్లోకి దూసుకువస్తున్నా మరోవైపు మనల్ని వదలకుండా పట్టుబిగిస్తున్న కులం, కట్టుబాట్లు, మూఢ విశ్వాసాలు, కట్టు కథల ప్రచారం, ద్వంద్వ విలువలు చక్కటి కథాకథనంతో, చిక్కటి శిల్పంతో, సహజసిద్ధమైన వాడుకభాషలో ప్రకటితమైన ఉత్తమ కథాగుచ్చం ఈ సంపుటి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan data-mce-mark=\"1\"\u003e              సామాన్య ప్రజలకి కడుపునిండా గంజి, చేతినిండా పని, కళ్ళ నిండా నిద్ర, ఉండటానికి ఇల్లు సమకూరాలన్న సామాజిక స్వప్నతో శ్రీపతి రచించిన కథలివి. మనిషినీ, మనిషిలోనీ ప్రేమించే మనిషితనాన్ని ప్రేమించే ఉదాత్త లక్షణం శ్రీపతి కథలకు జీవనాడి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e              జీవిత వాస్తవాలను దర్శించిన కథలు ఇవి. అలవోకగా పద చిత్రాలు గీసినట్లుగా ఉండే ఈ కథలో కవులను సైతం ఆశ్చర్యపరచే కాల్పనిక తీవ్రత కనపడుతుంది. కథా సాహిత్య చరిత్రకు న్యాయం చేకూర్చే కథలే గాక పాఠ్యబోధనకు కూడా పనికివచ్చే పాఠ్యాంశాలు ఈ కథలు. శ్రీపతి కథల సందేశం విశ్వజనీనం.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44779610734639,"sku":null,"price":50.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sreepathikathalu.jpg?v=1766081021"},{"product_id":"valluru-sivaprasad-kathalu","title":"Valluru Sivaprasad Kathalu","description":"","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44779618009135,"sku":null,"price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/vallurusivaprasadkathalu.jpg?v=1766081177"},{"product_id":"vasireddy-sitadevi-kathalu","title":"Vasireddy Sitadevi Kathalu","description":"\u003cp\u003e\u003cstrong\u003eవాసిరెడ్డి సీతాదేవి కథాసాహిత్యం\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e“నా సాహిత్య నేపథ్యం ఏ గొప్ప పుస్తకాలు కావు - గొప్ప మేధావుల సత్ సాంగత్యంకాదు. కేవలం నా చుట్టూ ఉన్న ప్రపంచం - నా లోపలి ప్రపంచం - రెండు సంఘర్షించినప్పుడు. తలెత్తిన ప్రశ్నలకు అందిన సమాధానాలే - నా సాహిత్యానికి నేపథ్యం\" అని స్పష్టం చేసిన రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. ఇంకా 'సాహితీ జీవితం నా జీవితం వేరు కాదు' అని కూడా\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eసీతాదేవి కథలకు వస్తువులు తాను సూసిన, తాను తెలుసుకొన్న, తన అనుభవంలోకి వచ్చిన విషయాలే.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచతుర్ముఖ బ్రహ్మ దేవాలయం నెలకొని వున్న చేబ్రోలులో జన్మించిన ఆమెకు చిన్నతనంలోనే ఒక ప్రశ్న తలెత్తింది. ఆ ప్రశ్నే ఆమె గుండెను పిండింది. 'కోనేట్లో ఆడవాళ్ళ శవాలే ఎందుకు తేల్తాయి? మగవాళ్ళ శవాలు ఎందుకు తేలవు!?' అనేదే ఆ ప్రశ్న. తన చుట్టూ ఉన్న భౌతిక వాస్తవికతను, దాని వెనుకవున్న స్త్రీ జీవన దుఃఖాన్ని ఆమె తన చిన్ననాడే కనుగొన్నది. ఆమెలో ఒక తాత్విక చింతనను ఇటువంటి ప్రశ్నలు నెలకొల్పాయి. అందుకే ఆమె కథలలో స్త్రీల వేదనలు, రోదనలు కనిపిస్తాయి, వినిపిస్తాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eదాదాపు వంద కథలు రాసిన సీతాదేవి కథలలో యాభై కథలను ఎంపిక చేసి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ జనవరి 2002లో సంపుటిగా ప్రచురించింది. అందునుంచి ఎంపిక చేసినవే ఈ పది కథలు. సీతాదేవి కథలు సామాజిక సత్యాలు, సీతాదేవి కథలు జీవితంలోంచి వచ్చినవే. సీతాదేవి కథలకు వాస్తవికతే పునాది. సీతాదేవి సాహిత్యానికి ఒక నిర్దుష్ట ప్రయోజనం వుండాల న్నారు. 'గాలికథ' (1985)లను తిరస్కరించారు. 1980 దశకంలో తెలుగు నవలా సాహిత్యంలో ఒక పెనుప్రమాదం లేపిన క్షుద్రరచనల మీద, అటువంటి అహేతుకత రచనలు చేసిన క్షుద్ర రచయితలమీద 'గాలికథ'లో సీతాదేవి నిప్పులు చెరిగారు. తీవ్రమైన దాడి చేశారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\"నువ్వు వాళ్ళందరికంటే పెద్ద యాంటీ సోషల్ ఎలిమెంటువి. డబ్బుకోసం, సెక్సు కోసం నేరాలు చేసేవాళ్ళకంటే నువ్వేమీ తీసిపోవు. నీ రాతల్లో మిథేల్ ఆల్కహాల్ ఉంది. నువ్వు తాగిన విస్కీలో మిథేల్ ఆల్కహాల్ కలిపిన వాడెంత నేరస్తుడో నువ్వూ అంత నేరస్తుడివే. ఇది ఇన్స్టెంట్ నీది పాయిజన్. వాడు కలిపిన విషంతో చచ్చేది తాగడానికి అలవాటు పడినవాళ్ళే......................\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44779619450927,"sku":null,"price":70.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/vasireddisitadevikathalu.jpg?v=1766081400"}],"url":"https:\/\/books.ataka.in\/collections\/katha-sravanthi.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}