{"title":"New Arrivals","description":"","products":[{"product_id":"khwaab-of-love-and-revoultion","title":"Khwaab of love and revoultion","description":"\n\u003cp\u003e\"మనిషిని యేకాకిని చేసే ప్రేమరాహిత్యాన్ని, విద్వేషాన్ని, హింసని, వివక్షని ద్వేషంతో కాకుండా తన అక్షరాలనిండా ప్రేమ నింపుకుని తడమడమే అరుణాంక్ ‘ఖ్వాబ్’ ప్రత్యేకత.యీ లేఖా రచనలో మంచి భావుకత, సౌందర్యం వుంది. చలం ప్రేమలేఖలల్ని అప్పట్లో దాచుకు దాచుకు చదివేవాళ్ళం... యిప్పుడు అరుణాంక్ ‘ఖ్వాబ్’ లేఖలు రాయడం, అందునా ప్రేమని రాయడం మరిచిపోయిన మనందరిలో మళ్ళీ ప్రేమలేఖలు రాయాలనే వుత్సాహాన్ని తట్టిలేపుతుంది. విప్లవం, ప్రేమ రెండూ వేరుకాదనీ, విప్లవం అంటే మనిషితనంపై రాజీలేని ప్రేమ అని గుర్తుచేస్తుంది.\" - ప్రో. చల్లపల్లి స్వరూపరాణి\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397724139567,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/khwaab-book-f.webp?v=1754490165"},{"product_id":"pachha-bottu","title":"PACHHA BOTTU","description":"\n\u003cp\u003eThis Novel booked by C Sujatha, who worked as Editor in Andhra Jyothi, Udayam, Harathi, etc. She worked as script writer in ETV2, Sakhi, Vanitha etc.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397730693167,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/pachha-bottu-book-f.webp?v=1754490169"},{"product_id":"uniki","title":"UNIKI","description":"\n\u003cp\u003eఒక కథో, కవితో, నవలో చదివితే నిన్ను పట్టుకుని కుదిపెయ్యాలి. ప్రేమతోనో లేదూ కోపంతోనో. అయితే, ప్రతిదీ ఖచ్చితంగా కుదిపెయ్యాలనే నియమేమీ లేదు. కొన్ని ఆ సమయానికి హాయినిస్తాయి. ఈ కథలు చదివినప్పుడు కాసేపు బ్లాంక్ అవుతాం. contemporarywomen stories అంటాం కాని ఇవి contemporary పురుషులు చదవాల్సిన కథలు. పుస్తకాల్లో యుద్ధం గురించిన పాఠం ఉందంటే యుద్ధం తాలుకు భీభత్సం నుండి యుద్ధం వద్దని నేర్చుకుంటారని. ఇవీ అంతే. కొన్ని ఎలా ఉండాలో చెబితే, ఇంకొన్ని ఎలా ఉండకూడదో చెబుతాయి.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397733937199,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/uniki-f.webp?v=1754490172"},{"product_id":"toorupu-gaalulu-the-eastern-winds","title":"Toorupu Gaalulu (The Eastern Winds)","description":"\n\u003cp\u003eToorupu Gaalulu (The Eastern Winds) (?????? ??????) [Paperback] Unudurti Sudhakar\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397737148463,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/toorupu-gaaluolu-f.webp?v=1754490176"},{"product_id":"nalla-pillanagrovi","title":"NALLA PILLANAGROVI","description":"\n\u003cp\u003eSHORT STORIES BASING ON VILLEGE BACKGROUND, WRITTEN BY YOUNGSTER, GUNDLA VENKATANARANA.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397740359727,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nalla-pillanagrovi.webp?v=1754490180"},{"product_id":"maa-ammante-naakistam-i-love-my-mother","title":"Maa Ammante Naakishtam","description":"\u003cp\u003eMaa Ammante Naakishtam (I Love My Mother) (Translated Kannada Stories - Kannada Sahitya Akademi Award Winner) Vasudhendra\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పుస్తకాన్ని చిన్న పిల్లవాడు తాయిలం దాచుకుని కొంచెం కొంచెమే తింటున్నట్టు చదవాలి. ఇది చదివి అందరూ అనే మాటే: మా అమ్మంటే నాకిష్టం. తప్పక చదవండి. Vasudhendra's Kannada Sahitya Akademi Award winning Short Story collection, 'Maa Ammante Naakistam.'\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397746749487,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/maa-ammante-naakishtam.webp?v=1754490183"},{"product_id":"yerra-gabbilaala-veta","title":"Yerra Gabbilaala Veta","description":"\n\u003cp\u003eనిజమైన చీకటిని నేనెప్పుడు చూడలేదు, ఆ చీకటిని నేనెపుడు అనుభవించలేదు. అసలు చీకట్లో ఏముంటుంది? చీకటి నిజమైన రంగు, చీకటి రూపం, చీకట్లో వాన, చీకట్లో వాసన, చీకట్లో సంచారము, చీకట్లో వేట, చీకట్లో భూమి కదలిక, చీకట్లో సముద్రం, ప్రళయం ఇవన్నీ ఎవరైనా చూసారా? అర్ధరాత్రి అడవి మధ్యలో చీకట్లో కూర్చొని కళ్ళు తెరిచి చూస్తే ఏమి కనపడుతుంది? కళ్లుండి కూడా. అసలయిన చీకటిని నేనెపుడు చూడలేదు. ఎందుకు? నా ఊహలు అలా కాదు, చీకట్లో బాసిపట్లు వేసుకు కూర్చొని అక్కడ దేన్నో వెతుకుతాయి. ఆ చీకట్లోనే ఈ యెర్ర గబ్బిలాల వేట మొదలయ్యింది. ఆ వేటలో నేను నా ముత్తాతల తరానికి ఆయనకు ముందు తరాలలోకి దూకాను. కళ్ళు మూసుకొని కలలు కంటూ ఆ తరంలోకి నేను ప్రవేశించాను. అప్పటి మనుషులను వారి మనస్తత్వాలను, ప్రాంతాలను వారి ప్రాంతీయతను. జీవన సౌందర్యాన్ని పీడితులు దౌర్జన్యాన్ని, కలిసున్న కుటుంబాలని కలగాపులగం అవుతున్న తెగలను చూశాను, వాళ్ళతో సంవత్సరంకు పైగా గడిపాను, అక్కడ కనిపించాయి నాకు ఈ యెర్రగబ్బిలాలు.\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44397762904111,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Yerra-Gabbilala-Veta-Front-cover.webp?v=1754490199"},{"product_id":"nenu-mee-brahmanandam","title":"Nenu Mee Brahmanandam","description":"\n\u003cp\u003eఅంతా దేవుడి దయ. అంతా ఆయనే. అన్నీ ఆయన చేస్తున్నవే అనుకోవడం ఆస్తికత్వం ఇదంతా నా కష్టార్జితం. నా స్వయంకృషి. నా ఆలోచనల ప్రతిఫలం అనుకోవడం నాస్తికత్వం. ఈ రెండు భావాలు కాడికి కట్టిన రెండు ఎద్దుల్లాంటివి! నా పద్ధతి నాదే అని ఆస్తికత్వం అటు లాక్కెళ్ళినా, కాదు. .. నా పద్ధతి నాదే అని నాస్తికత్వం ఇటు లాక్కెళ్ళినా సరైనటువంటి ఫలాలను మనం అందుకోలేకపోతాం! అటు చేస్తున్న పని శ్రద్ధగా, అంకితభావంతో, నవ్యతతో చేయాలి... ఇటు స్వామి అనుగ్రహం తోడవ్వాలి... ఈ రెండూ కలిస్తేనే జీవితమనే బండి సక్రమంగా సాగుతుందని నా విశ్వాసం. భగవద్గీత చెప్పినా, మహ్మద్ ప్రవక్త చెప్పినా, జైనులు చెప్పినా, బౌద్ధులు చెప్పినా ఒకటే చెప్పారు. \"కష్టపడు ... ఫలితాన్ని ఆశించకు\" అని. నీ కష్టం నువ్వు పడితే ఆ భగవంతుడే దానికి సంబంధించిన ఫలితాన్ని ఇస్తాడని తెలియ జేయడానికే నా ఈ పుస్తక రచన. అంతేగాని... నాకున్న కష్టాల్ని, నేను పడినటువంటి బాధల్నీ చెప్పుకుని నేను ఇంత తక్కువ వాడిననీ, బీదవాడిననీ, ఇంత దారుణమైన స్థితి నుంచి వచ్చాననీ మీ దగ్గర నుంచి జాలి పొందడానికి గానీ... లేదా నేను సాధించిన విజయాల్ని... నేను సాధించిన విజయసోపానాల్ని మీ ముందుంచి నేనింత గొప్పవాడిననీ చెప్పుకోవడానికి ఈ పుస్తకం రాయడం లేదు. -- బ్రహ్మానందం\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44397766148143,"sku":null,"price":375.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nenu-front.webp?v=1754490203"},{"product_id":"yaradakonda-ata-award-winning-novel","title":"YaradaKonda - ATA Award Winning Novel","description":"\n\u003cp\u003eజాలరుల కుగ్రామంగా మొదలైన విశాఖపట్నం , రెండో ప్రపంచ యుద్ధం తరువాత మహానగరంగా అవతరించడానికి మూలకారణమైన భౌగోళిక విశేషం యారాడ కొండ. విశాఖపట్నం ఎదుగుదలకు అదొక కొండగుర్తు. ఎంతో మందికి ఉపాధినీ, కొంత మందికి సంపదనూ ప్రసాదించిన బంగారు కొండ అది. ఆ కొండ విశాఖపట్నం కథను చెప్పుకొస్తే అది ఎలా ఉంటుంది? గడచిన వందేళ్ల కాలంలో అక్కడి మనుషులూ, వాళ్ల ఆశలు, ఆశయాలూ, వ్యధలూ, బాధలూ, సుఖ సంతోషాలనూ, అలాగే వీటన్నింటినీ నడిపించిన శక్తులనూ యారాడ కొండ నమోదుచేసి వినిపించిన గాథకు నవలా రూపం ఈ రచన. మూలాలను తెలుసుకున్నప్పుడే ఎదుగుదల అర్థవంతం కాగలదనే నమ్మికతో ఏరికూర్చిన సృజన ఈ 'యారాడ కొండ' నవల.\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44397769392175,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/yarada-konda-front-cover.webp?v=1754490206"},{"product_id":"charminar-kathalu","title":"Charminar Kathalu","description":"\n\u003cp\u003ePARAVASTHU LOKESHWAR CHARMINAR KATHALU SHORT STORIES\u003c\/p\u003e\n\u003cp\u003eఅప్పటికి హైద్రాబాద్ సంస్థానం పై పోలీస్ యాక్షన్ జరిగి మూడు సంవత్సరాలు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి నాలుగు సంవత్సరాలు. దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగింది కూడా అదే సంవత్సరం. యాఖుత పురా రైల్వే స్టేషన్ దగ్గరి రైన్ బజార్ పుట్టి పెరిగి ఐదో తరగతి కామ్యాఐన అమ్మకు గాంధీ, నెహ్రూ, పటేల్ అంటే దేవుండ్లతో సమానం. అట్ల ఏడుపదుల క్రింద ఆఖరి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్ మూసీనది తీరాన కట్టించిన ఉస్మానియా సర్కారీ దవాఖానాల నేను కండ్లు తెరిచి ఈ భూమ్మీదపడిన. చందమామ కథల పత్రిక నుండి విశ్వనాథ నవలల వరకూ చదివే మా అమ్మకు నా పేరు ఖరారు లక్ష వరహాల సమస్యగా మారింది. అరుదైన అపురూపమైన పేరు పెట్టాలని ఆమె ఆలోచన. దాదాపు సంవత్సరం కావొస్తున్నా సరిఐన పేరే ఆమెకు ఇంకా దొరకలేదు. పిల్లల పేర్లు తల్లితండ్రుల సంస్కారానికి ప్రతిరూపాలు.\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44397775847471,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Charminar-kathalu-Front-cover.webp?v=1754490214"},{"product_id":"gangaraajam-bidda","title":"Gangaraajam Bidda","description":"\n\u003cp\u003eGangaraajam Bidda | Collection of Short Stories\u003cbr\u003e\nby Poodoori Rajireddy\u003cbr\u003e\n“మొత్తం సృష్టి విన్యాసాన్ని వ్యాఖ్యానించడానికి నువ్విక్కడ లేవు, సరిపోవు.”\u003c\/p\u003e\n\u003cp\u003e“మనసు అనేది తక్షణ, సుదూర జ్ఞాపకాల మైదానం. అక్కడి ఆటే సాహిత్యానికి మెటీరియల్‌‌ అవుతుంది. కాకపోతే, కలల్లో కొత్త ఉనికిని సంతరించుకున్నట్టుగానే, సాహిత్యంలోనూ వాస్తవ జీవితం తన రూపును మార్చుకోవచ్చు. అయితే, సాహిత్యం దానికదే ముఖ్యమే అయినా, జీవితం తన అనుభవాలతో ఇచ్చే తీవ్రతలో ఇది ఏమంత ప్రాధాన్యం ఉన్నది కాదు. అలాంటప్పుడు మరెందుకు రాస్తాం? ఏమో! ఏ జవాబు అయినా పేలవమైనదే అవుతుంది. ఆ ‘చెప్పలేనితనం’ మనల్ని చాలా పనులు చేయిస్తుంది. నాతో ఇట్లా కొన్ని కథలు రాయించింది. ఒకటి మాత్రం నిజం; కళారూపం ఏదైనా సరే, అది ఆ మనిషికి సంబంధించిన అత్యుత్తమ పార్శ్వం. ద బెస్ట్‌‌! ఈ వచన కళలో భాగం కావడం అనేది నా జీవితంలోని కొన్ని క్షణాలకు అందివచ్చిన సార్థకత.”\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397782204463,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Gangarajam-Bidda-Front.webp?v=1754490217"},{"product_id":"nallagonda-kathalu","title":"Nallagonda Kathalu","description":"\n\u003cp\u003eNallagonda Kathalu - Stories from a small town childhood – by V Mallikarjun. గట్టిగ తిరిగితే ఒక ఇరవై నిమిషాలల్ల మా ఊరు చూశుడు అయిపోతది. ‘అర్బనూరు’ అని నేనొక కథ కోసం కనిపెట్టిన పదం మా ఊరిని చూసి పెట్టిందే. అచ్చంగా అట్లనే ఉంటది మా ఊరు. సిటీకి ఊరులెక్క. ఊరికి సిటీలెక్క. నేను మా ఊరి గురించి, మా ఊరి మనుషుల గురించి, మా నాన్న గురించి, మా అమ్మ గురించి చెప్పాల్నని చానా రోజుల్నించి అనుకుంటున్న. చెప్తానికి చానా కథలున్నయి సరే, అయి ఎట్ల చెప్పాలి? ఏది కథ అయితది? ఈ జ్ఞాపకాలు, ఇష్టాలన్నీ పోగేసి ఏం కథ రాయాలి? ఇదంత నా మెదడుల తిరుగుతనే ఉండె. మొత్తానికి కొన్ని కథలు దొరికినయి. వాటి గురించి ఆలోచించుకుంట ఈ కథలు రాస్తుంటె నాకు నేను దొరుకుతనే ఉన్న. ఒక్కసారి గతాలకువోతే మనకు మనం గుర్తొస్తమంటే ఇదే. ఇయి రాస్తుంటే నన్ను నేను మళ్లా దోలాడుకుంటున్నట్టు, నాకు నేను మళ్లా దొరుకుతున్నట్టు అనిపిచ్చింది. మీగ్గూడ అట్లనే అనిపిస్తదా లేదా చెప్పలేను. సదివి మీరే చెప్పాలి. -వి. మల్లికార్జున్‌\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397782269999,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Nallagonda-kathalu-front.webp?v=1754490221"},{"product_id":"valapateddu","title":"Valapateddu","description":"\n\u003cp\u003eవర్డ్స్‌‌వర్త్‌‌ని ప్రకృతి కవి అంటారు. కీట్స్‌‌ని మనిషి కవి అన్నారు. అయితే, “వర్డ్స్‌‌వర్త్‌‌ ప్రకృతిలో మనిషి ఉంటాడు. కీట్స్ మనిషిలో ప్రకృతి ఉంటుంది.” అంటాడు జి. కళ్యాణరావు. ఇప్పుడే రాస్తున్న రచయితని అట్లా పొల్చీ పెద్ద చేసి, అతనికి కొమ్ములు తెప్పించి అతనిలో కథకుడిని చంపేయడం ఉద్దేశం కాదు గాని, వివేక్ లంకమల కథలు చదివినప్పుడు కళ్యాణరావు ఎప్పుడో పంచుకున్న ఈ మాట గుర్తొచ్చింది. ఈ కథల్లో ప్రకృతినీ మనిషినీ భాగం చేశాడు వివేక్. నిజానికి చరిత్ర పొడుగుతా మనిషీ ప్రకృతీ వీడదీయలేనంతగా కలిసే ఉన్నాయి. అదే వివేక్ కథల్లో ప్రతిఫలిస్తుంది. ప్రకృతి ధర్మం ప్రకృతి చేసింది. మనిషి తన జీవిక కోసం తన ధర్మం నిర్వర్తించాడు. ఎప్పుడైతే మనిషి ప్రకృతి మీద ఆధిపత్యం చేయడానికి పూనుకున్నాడో ప్రకృతీ ప్రతిఘటించడం మొదలుపెట్టింది. కొండలు తొవ్వినప్పుడు కొండచరియలు విరిగిపడ్డాయి. అడవిని ధ్వంసం చేసినప్పుడు ఎండలు విజృంభించాయి. అడవుల్లో బతికే పులులూ, ఎలుగుబంట్లు, ఏనుగులు పల్లెల మీద పడ్డాయి. ఈ అకస్మాత్తు వరదలన్నీ ప్రకృతిపై మనిషి చేసిన అత్యాచారం తాలుకు ఫలితాలే. లంకమల దారులు అనే ట్రావెలాగ్‌లోనూ కథల్లో ఉండే శిల్పాన్ని సాధించిన వివేక్ రాసిన కథలివి. కథలు కాదని రాసిన వాటిల్లోనే కథ వుంటే, కథ అంటూ వస్తున్నదాంట్లో ఎంత వుండొచ్చు? మేం చదివాం. నచ్చాయి. మీరూ చదవండి. మునుపటికన్నా ప్రేమిస్తారు. - అరుణాంక్ లత ఎడిటర్, ఛాయ\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397785481263,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Valapateddu-Front.webp?v=1754490225"},{"product_id":"son-of-jojappa","title":"Son of Jojappa","description":"\n\u003cp\u003eఇటీవలి కాలంలో తెలుగులోనూ sexuality కి సంబంధిచిన చర్చ ప్రధాన స్రవంతిలో చాలానే జరిగింది. అయితే, ఆ చర్చ సైద్దాంతిక, పండిత చర్చను దాటి సాహిత్యంలోకి వచ్చింది తక్కువే. వేళ్ళమీద లెక్కించే రచనలు వచ్చినా వాటిపై జరగాల్సినంత చర్చ జరగలేదు. Sexuality ఉద్యమాలను అస్తిత్వ ఉద్యమాల కోణంలోనే చూస్తున్నప్పుడు “వాటిని గురించిన సాహిత్య వ్యక్తీకరణా ఆ సమూహం వాళ్ళే చేయాలా? లేదూ ఆ విషయం తెలిసిన బయటి వారు ఎవరైనా చేయవచ్చా?” అనేది ఎప్పుడూ ఎదుర్కొనే ప్రశ్న. అయితే, ఆ సమూహంలోని వ్యక్తులే ఆ విషయాలను సాహిత్యంలోకి తీసుకునివచ్చినప్పుడు వ్యక్తమయ్యే pain ని బయటి వారు తీసుకుని రాలేరు అనేది సత్యం. pain ఒక్కటే సాహిత్యం అవ్వదు గనుక, సాహిత్యం తెలిసిన వారు లేదా రాస్తున్నవారు చేసే వ్యక్తీకరణ empathetic గా ఉంటుంది. ఇది అట్లా బయటి సమూహం నుండి రాసిన నవల. అయితే, అస్తిత్వ ఉద్యమాల సాహిత్యం వచ్చిన తొలినాళ్లలో దాన్ని సాహిత్యంగా గుర్తించ నిరాకరించడమూ, మౌనం పాటించడమూ మనకు తెలుసు. ఇప్పుడు sexuality మీద వస్తున్న సాహిత్యం పట్లా అదే మౌనం కనబడుతోంది. ఇది ఆ మౌనాన్ని బద్దలుకొట్టే ‘నవల’ అని మేం భావిస్తున్నాం. సాహిత్యంలోకి దీన్ని కొత్త చేర్పుగా గుర్తిస్తున్నాం. ఇప్పుడు ఇది మీ చేతుల్లోకి. చర్చల్లోకి.” – అరుణాంక్ లత\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397788692527,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Son-of-Jojappa-Front.webp?v=1754490230"},{"product_id":"pranaya-hampi-historical-novel","title":"Pranaya Hampi (Historical Novel)","description":"\n\u003cp\u003eప్రణయ హంపీ. చారిత్రిక కాల్పనిక నవల. తెలుగునాట జరిగిన అతి పెద్ద చివరి యుద్ధం రక్కసి - తంగడి యుద్ధం. ఆ యుద్ధం విజయనగర రాజ్య రూపు రేఖల్నీ, చరిత్రనూ మార్చింది. రాయల వంశ పాలన ముగిసింది. ఆ యుద్ధాన్నీ, యుద్ధకాలంలో ప్రేమకథనూ బిగిసడలకుండా అల్లిన నవల ఈ ప్రణయ హంపీ. కథకుడిగా \"ఊరి మర్లు\" పుస్తకంతో పేరుగాంచిన మారుతీ పౌరోహితం నుండి వచ్చిన మొదటి నవల ఇది. పుస్తకం చేతిలోకి తీసుకుంటే అక్షరాల వెంట మీరూ 16వ శతాబ్దపు విజయనగర వీధుల్లో తిరగాడుతారు.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397791903791,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Hampi-Front.webp?v=1754490233"},{"product_id":"amma-diarylo-konni-pageelu","title":"Amma Diarylo Konni Pageelu","description":"\n\u003cp\u003eAmma Diarylo Konni Pageelu - Novel by Ravi Mantri\u003c\/p\u003e\n\u003cp\u003eనాకో సంగతి చెప్పు... అసలు ఎవరైనా నీకు ఇంతకు ముందు ఉత్తరం రాశారా? ప్రేమలేఖలో, మామూలు లేఖలో. పోనీ నువ్వెప్పుడైనా రాశావా? మామూలుగా మనం రోజూ మాట్లాడుకునే మాటల్నే పొందిగ్గా పేర్చి కాయితం మీద పెడితే ఉత్తరం అయిపోతుందనుకునే అల్పసంతోషిని నేను. ఇవాళెందుకో ఇప్పటికిప్పుడే నీకో ప్రేమకథ చెప్పాలనిపించి, నీకు ఉత్తరాలు చదివే అలవాటుందో లేదో తెలీకుండానే రాసేస్తున్నాను.\u003cbr\u003e\nబహుశా నేను అమ్మకథని చెప్పాలనుకోవడం దగ్గర, అమ్మకి కూడా ప్రేమకథ ఉంటుందనుకోవడం దగ్గర ఈ ప్రయాణం మొదలై ఉండొచ్చు. వెన్నెల రాత్రుల్లో అలల్ని లెక్కపెడుతూ, కలల్ని దాచుకుంటూ నేను ఇష్టంగా రాసిన ప్రేమలేఖే నా ఈ అమ్మడైరీలో కొన్నిపేజీలు.\u003cbr\u003e\nఇది అమ్మ ప్రేమకథ.\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397795115055,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/adkp-front.webp?v=1754490236"},{"product_id":"kalavapudi-kathalu","title":"Kalavapudi Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eకలవపూడి కథలు  - గోదావరి జిల్లాల్లోని చిన్నిచిన్ని కథలు\u003cbr\u003eby Samba Shiva Thadavarthi A.K.A. @Kataari__\u003cbr\u003e\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఅప్పుడెప్పుడో చిన్నప్పుడు ప్రతి వేసవికి మీరంతా అమ్మమ్మ గారి ఊరికి వచ్చిపోయేవాళ్లు; ఆ ఊరు ఇంకా గుర్తుందా? ఆఁ గుండె లోతుల్లో ఏదోక మూలన ఉండే ఉంటుందిలే.... నేనే ఆ ఊరిని.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈ మధ్యన అసలు ఇటువైపు రావడమే మరిచిపోయారు కదా, అందుకే ఈసారి నేనే మీ ఇంటికొద్దామని ఇలా బయలుదేరాను. వస్తూ వస్తూ ఉట్టిచేతుల్తో వస్తే ఏం బాగుంటుందని, మన ఊరి మునసబు గారింటి దగ్గర నుండి మొదలుపెట్టి తూరుపు వీధి మీదగా బడి అవతల పిల్లకాలువ వరకు ఉన్న కథలు, ప్రేమకథలు, చిన్ని చిన్ని వ్యధలన్నీ కలిపి మూటకట్టి ముచ్చటగా ఇరవై కథల్తో ఇలా మీ చేతుల్లోకి చేరా. పదండి, ఈ గజిబిజి జీవితం నుండి కాసేపలా బయటకి వెళ్లి... చుక్కలు కురిసే రాత్రుల్లో మేడ పైనో, నిశ్శబ్దం నిండిన నదీ తీరాల్లోనో, ఊరంతా నిద్దురపోయినా మేల్కొని ఉండే గది వెలుతురులోనో కూర్చుని మాటాడుకుందాం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e- మీ సాంబశివ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397795180591,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kalavapudi-kathalu-front-1.webp?v=1754490240"},{"product_id":"a-telugu-stories","title":"‘A’ Telugu Stories","description":"\u003cp\u003eA- చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ కథలు. కథకి విస్తరణ పరిమితి, నిర్మాణ క్రమం— ఉత్కంఠ ఎత్తుగడ, రచనాచాపం, నిర్దిష్ట నిలుపు; ఈ కొలబద్దలకి ఆవల నేను . జీవితంలో కూడా!\u003c\/p\u003e\n\u003cp\u003eఏదో ఒక విషయం తీసుకోవడం , దాన్ని చదివేలా, కించిత్ రసవత్త తరంగా కాగితం మీద పెట్టడం. పుట్టుుపూర్వోత్త తరాలు కాకపోయి నా దానిమీద ఎంతోకొంత అవగాహన. ఆ క్రమంలో మీతో కాస్సేపు నడక. అదో ఆనందం! మిగిలిన విషయాలు, నిర్ణణయాల్లాంటివి— మీకే.\u003c\/p\u003e\n\u003cp\u003eమొదటిసారి చదివినప్పుడు అర్థమయి కానట్టుగా ఉండచ్చు కథలు కొన్ని. చక్కరకేళీ ఒలిచి చేతిలో పెట్టలేను . కొంత శ్రమైక సాహచర్యం ఆశిస్తాను మీనుంచి, ప్రమోద మధనానికి.\u003c\/p\u003e\n\u003cp\u003eపలు భాషాకోవిదుణ్ణి కాను — తెలుగులోనే. నాకు తెలిసిన భాషే నా కథల్లో కూడా.\u003c\/p\u003e\n\u003cp\u003eచివరిగా— నా పాత్రలు నేను చెప్పినట్టు మాట్లాడవు. వాళ్ళు చెప్పేదే రాస్తాన్నేను.\u003c\/p\u003e\n\u003cp\u003eఇప్పపటికింతే — కథల్లో కలుద్దాం.\u003c\/p\u003e\n\u003cp\u003eచిలుకూరి రామ ఉమామాహేశ్వర శర్మ\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44411425554479,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ATeluguStoriesFront.jpg?v=1754549681"},{"product_id":"okkokka-talaku-okkaka-vela","title":"Okkokka Talaku Okkaka Vela","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412905553967,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156513.jpg?v=1754589570"},{"product_id":"varada-gudi","title":"Varada Gudi","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412942319663,"sku":null,"price":350.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156559.jpg?v=1754589570"},{"product_id":"attar","title":"Attar","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412955000879,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156515.jpg?v=1754589570"},{"product_id":"manto","title":"Manto","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412965224495,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156544.jpg?v=1754589570"},{"product_id":"kaagitalaku-avatala","title":"Kaagitalaku Avatala","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412973842479,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156567.jpg?v=1754589570"},{"product_id":"aido-goda","title":"Aido goda","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412984000559,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156557.jpg?v=1754589570"},{"product_id":"lankamala-daarullo","title":"Lankamala Daarullo","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413000024111,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156489.jpg?v=1754589570"},{"product_id":"untitled-7aug_23-52","title":"Chali cheemla kavathu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413025058863,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/chali_cheemala_kavathu_f.jpg?v=1754672930"},{"product_id":"hampi-express","title":"Hampi Express","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413112156207,"sku":null,"price":199.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156550.jpg?v=1754589570"},{"product_id":"uttama-telugu-vana-kathalu","title":"Uttama Telugu vana kathalu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413117759535,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156533.jpg?v=1754589570"},{"product_id":"rameshwaram-kakulu","title":"Rameshwaram Kakulu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413122248751,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156494.jpg?v=1754589570"},{"product_id":"enugekkina-sampada","title":"Enugekkina sampada","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413156425775,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156540.jpg?v=1754589570"},{"product_id":"moodu-beerla-tarvata","title":"Moodu beerla tarvata","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413162389551,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156568.jpg?v=1754589570"},{"product_id":"sambala","title":"Sambala","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413163601967,"sku":null,"price":140.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156537.jpg?v=1754589570"},{"product_id":"manushulu-mayamayye-kaalam","title":"Manushulu mayamayye kaalam","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413166747695,"sku":null,"price":499.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156554.jpg?v=1754589570"},{"product_id":"ghandruk","title":"Ghandruk","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413168025647,"sku":null,"price":425.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156535.jpg?v=1754589570"},{"product_id":"sanchaari-1","title":"Sanchaari","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413170155567,"sku":null,"price":140.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156561.jpg?v=1754589570"},{"product_id":"mohana-swamy","title":"Mohana swamy","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413192634415,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156496.jpg?v=1754589570"},{"product_id":"pattu-thova","title":"Pattu Thova","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413195092015,"sku":null,"price":475.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156485.jpg?v=1754589570"},{"product_id":"adholokam","title":"Adholokam","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413197910063,"sku":null,"price":350.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156495.jpg?v=1754589570"},{"product_id":"mairavana","title":"Mairavana","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413206003759,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156520.jpg?v=1754589570"},{"product_id":"nemmi-neelam","title":"Nemmi Neelam","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413209018415,"sku":null,"price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156505.jpg?v=1754589570"},{"product_id":"edu-samudrala-avatala","title":"Edu samudrala avatala","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413213343791,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156531.jpg?v=1754589570"},{"product_id":"panakam-on-the-rocks","title":"Panakam on the rocks","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413217734703,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156486.jpg?v=1754589570"},{"product_id":"kanchana-seetha","title":"Kanchana seetha","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413218160687,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156503.jpg?v=1754589570"},{"product_id":"kaasintha-prema-kaavali","title":"Kaasintha prema kaavali","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413222125615,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kaasinthapremakavali.jpg?v=1757589220"},{"product_id":"diguvintodi-kathalu","title":"Diguvintodi kathalu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413223075887,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156492.jpg?v=1754589570"},{"product_id":"2-1-0","title":"2+1=0","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413228679215,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156532.jpg?v=1754589570"},{"product_id":"athade-oka-samudram","title":"Athade oka samudram","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413231431727,"sku":null,"price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156546.jpg?v=1754589570"},{"product_id":"samantharaalu","title":"Samantharaalu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413233594415,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156507.jpg?v=1754589570"},{"product_id":"deva-rahasyaalu","title":"Deva Rahasyaalu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413235822639,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156499.jpg?v=1754589570"},{"product_id":"antarani-vasantam","title":"Antarani Vasantam","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415927713839,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/antaranivasantham_front.jpg?v=1754708225"}],"url":"https:\/\/books.ataka.in\/collections\/new-arrivals.oembed?page=6","provider":"అటక","version":"1.0","type":"link"}