{"title":"Nine Books Combo","description":"","products":[{"product_id":"kanyashulkam","title":"Kanyashulkam","description":"\u003cp\u003e\u003cspan\u003eతాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి డామిట్! కథ అడ్డంగా తిరిగింది పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్ గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి. Kanyasulkam book by Gurajaada Venkata Apparao helps in developing your knowledge and skills in Indian Writing. This book is available in Telugu language making it easier to read and understand.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45054971576367,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kanyashulkam.jpg?v=1773593392"},{"product_id":"myna","title":"Myna","description":"\u003cp\u003e\u003cspan\u003eఈ నవలకు వస్తువు, ఒక మలుపుకూ, మరో మలుపుకూ మధ్యగల జీవితం. ఇతివృత్తాన్ని ఎన్నుకోవడం అనేది రచయిత దృష్టిని బట్టి ఉంటుంది. నది ఒడ్డునకూర్చున్న మనిషికి పూర్తిగా నది అంతా కనిపించదు. ఏ కొండ పక్కనో చటుక్కున మలుపు తిరిగిన చోట కనబడటం ప్రారంభించి, మనిషి ముందు నుండి వెళ్లి, ఏ చెట్ల గుబురుల పక్కకో మళ్ళి, మాయమైపోతుంది. కొండ మీద నిలబడి చూస్తే మరికాస్తా ఎక్కువ కనిపిస్తుంది. విమానం మీద నుండి మరీనీ. దృష్టిని బట్టి మారుతుంది. ఏ ఫోటోను తీసుకున్నా మూడూ నదిని చూపించేవే. రచయిత దేన్నైనా ఎన్నుకోవచ్చు. అయితే ఆ ఫోటోలు ఏవో రెండు మలుపుల మధ్యగల నదిని చుపించేవిగా ఉంటే చూడటానికి బాగుంటాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e       సాహిత్యపు పరిభాషలో వీటినే 'ట్విస్ట్'లు అంటారు. చక్కటి రెండు ట్విస్ట్ ల మధ్యగల జీవితం నవలకు పరిపూర్ణతను, అందాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ నవలలో ప్రధాన పాత్రను దాటుకుని వెళ్లి, అందమైన ఒక ట్విస్ట్ తో కథను ప్రారంభించాల్సి వచ్చింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e       ఈ నవలలో ఒక జీవితాన్ని యధాతథంగా చూపించడానికి ప్రయత్నించారు రచయిత. ఇది ఫోటో ధోరణిలో వేసిన చిత్రం. ఈ జీవిత చిత్రణలో ఆ వ్యక్తీ బాధలూ, సుఖాలూ, ఆశలూ, జీవిత సంగ్రామంలో నిలదొక్కుకునే ప్రయత్నాలూ, పరిణామాలూ - అన్నీ ఇందులో ఉన్నాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e       ఈ కథ ఎక్కడో జరగడం లేదు. మీ ముందే జరుగుతుంది. మీరు ప్రేక్షకులు. ఇందులోని ప్రతి కదలికను చిత్రంగా గీశాను. ఈ చిత్రాలన్నింటిని వరుసగా పేర్చి గబగబా ఒక వేగంతో చూసుకుంటూ వెళ్తే మీ ముందు ఒక సినిమా కదులుతుంది. తెలుగు సాహిత్యానికి కొత్తదైన ఒక తెలుగు జీవితం ఈ నవలలో ఉంది.  ఈ నవల కొత్తదనం కావాలనుకున్న వారి గురించి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e                                                                                                                       - శిలా వీర్రాజు   \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055014404143,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Maina.jpg?v=1773594622"},{"product_id":"kalatheetha-vyakthulu","title":"Kalatheetha Vyakthulu","description":"\u003cp\u003e\u003cspan\u003eఇందులోని ప్రధానపాత్రలు నాలుగు. ప్రకాశం, కళ్యాణి, క్రిష్ణమూర్తులతో పాటు ఇందిర. నిజానికి ఇందిరే ప్రధాన పాత్ర. ఈ కధలోని వ్యక్తులందరూ అమెచుట్టూ తిరుగుతూ రకరకాలుగా ప్రభావితం చెందుతూ వుంటారు. ఆమెను అంగీకరించలేరు. వదలలేరు. అమెవల్ల పరిచయమయిన మొదటిపాత్ర ప్రకాశం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e            ఎం.బి.బి.ఎస్ చదివే ప్రకాశాన్ని అందరూ మెత్తని వాడంటారు. అసమర్డుడని కూడా కొందరనేవారు. సాటి విద్యార్దులతన్ని చూసి \"వట్టి చవటవురా\" అని తేల్చి చెప్పేవారు. 'బొత్తిగా చేవలేని వాడివి. ఎలా బతుకుతావో కానీ' అని నిట్టూర్చేది వాళ్ళమ్మ.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e            \"చిన్నతనం నుంచీ ఇల్లు కదిలి ఎక్కడికీ వెళ్ళేదాన్ని కాదు. నలుగురితో కలిసి ఆడుకోవడం కూడా తెలీదు...కనీసం నాన్నైనా నలుగురితో కలిసిమెలిసి ఉండగలిగి మనిషైతే నేనిలా తయారవకపోదు నేమో! ఆయనా నాలాంటి వాడే. తెలివి తక్కువవాడు కాదుగానీ అమ్మపోయిన నాటినుంచి జీవితం మీద అదో రకం నిరక్తి పెంచేసుకున్నాడు. అందుకే నేను చిన్నప్పటి నుంచి అలాగే తయారయాను. చెప్పలేని ఒంటరితనం సర్వదా నన్ను భాదించేది\" ఇవీ కళ్యాణి పెరిగిన కుటుంబ పరిస్థితులు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e              కృష్ణముర్తి విశాఖపట్టణంలోని ఏ.వి.యన్ కాలేజి లో బి.ఏ చదువుతూ తాత తండ్రులిచ్చిన ఆస్తుల్ని ఖర్చు చేస్తూ కులాసాగా కాలం గడిపే విలాస యువకుడు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e             \"ఏ పని చేసినా నేను కళ్ళు తెరుచుకునే చేస్తాను. నాకు మిగతావాళ్ళకీ అదే తేడా. ఏడుస్తూ ఏది చెయ్యను. ఎం జరిగినా ఏడవను...\" ఇది ఇందిర వ్యక్తిత్వం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e             విభిన్న మనస్తత్వాలు గల ఈ నలుగురి మద్య సహృదయులైన వసుంధర, డాక్టర్ చక్రవర్తి ...\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e             ఈ ఆరుగురి మధ్య జరిగే చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎవరిని ఎవరి దరి చేర్చాయో తెలుసుకోవాలంటే సహజత్వానికి అద్దం పట్టే డా. పి.శ్రీదేవి గారి \"\u003cstrong\u003eకాలాతీత వ్యక్తులు\u003c\/strong\u003e\" చదవవలసిందే.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055017713711,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kalatithavyakthulu.jpg?v=1773594724"},{"product_id":"secretary","title":"Secretary","description":"\u003cp\u003e\u003cspan\u003eఅందం, పరువం, పొగరుమోత్తనంగా కనిపించే ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్ల జయంతి. హుందా, ఠీవి, డబ్బు, పదిమందిలో పలుకుబడి ఉండి, ఆడవాళ్ళని సమ్మోహనపరిచే రూపున్న నిండైన వ్యక్తి రాజశేఖరం. పైకి చెప్పుకోలేకపోయినా జయంతి అంటే అంతరంగంలో అమితమైన అనురాగం రాజశేఖరానికి. అమాయకత్వాన్నీ, అంతస్తుల భేదాన్నీ అధిగమించలేని జయంతి ఆడమనసుకి రాజశేఖరం అంటే అసహ్యం. అందమైన రాజశేఖరం, మరీ అందమైన అతని సెక్రటరీ జయంతి ఈ కథ ఆంధ్రులకు కొత్తదేం కాదు. మనసు లోపల పొరల్లోని ఇష్టాయిష్టాల్ని, రాగద్వేషాల్ని మదించి సునిశితంగా, సుందరంగా చిత్రించే సులోచనారాణి నవలా రచన తెలియంది కాదు! కానీ ఎన్నిసార్లు చదివినా, తిరిగి చదవాలనిపించే 'సెక్రటరీ' అందించే అనుభూతి మాత్రం నవ్యాతి నవ్యం.. చదవండి, మీకే తెలుస్తుంది!!\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055064375343,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/secretary.jpg?v=1773595811"},{"product_id":"mayanagaram","title":"Mayanagaram","description":"\u003ch4\u003eమాయనగరం అన్నిట్నీ \u003c\/h4\u003e\n\u003ch4\u003eఅంతట్నీ గమనిస్తూనే వుంది.\u003c\/h4\u003e\n\u003ch4\u003eఅవిశ్రాంతంగా.... ఆత్రంగా \u003c\/h4\u003e\n\u003ch4\u003e        ప్రతి వ్యక్తి జీవితంలోంచీ మరో వ్యక్తి నేర్చుకోదగింది కొంతే వుంటుంది. ఎందుకంటే మనిషి జీవితంలో అత్యద్భుత క్షణాలు కొన్ని మాత్రమే వుంటాయి. అలాగే మనిషి జీవితం పుట్టుకనుంచి మృత్యువు వరకూ స్థిరమైనది కాదు. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూనే వుంటుంది. తనని తాను మార్చుకుంటునే వుంటుంది. నగరం కూడా మనిషి లాంటిదే. ఏ నగరపు ప్రవృత్తి దానిదే. మనిషి అనేకానేక భావాల్ని తనలో ఇముడ్చుకున్నట్టు నగరం కూడా రకరకాల మనుషుల్ని తనలో ఇముడ్చుకుంటుంది. అవిశ్రాంతంగా తనమీద ఆధారపడ్డవాళ్ళ బ్రతుకుల్ని గమనిస్తూనే వుంటుంది. మౌనంగా.... నిర్వికారంగా.\u003c\/h4\u003e\n\u003ch4\u003e             అందుకే - 'మాయానగరం' కథ ఎప్పటికీ సశేషమే.   - భువనచంద్ర \u003c\/h4\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055086886959,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Maayanagaram.jpg?v=1773596166"},{"product_id":"penkutillu","title":"Penkutillu","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057554907183,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/penkutillu.jpg?v=1773668275"},{"product_id":"girija-kalyanam","title":"Girija Kalyanam","description":"\u003cp\u003e\u003cspan\u003eగిరిజా కళ్యాణం - యద్దనపూడి సులోచనా రాణి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057565851695,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/girijakalyanam.jpg?v=1773671836"},{"product_id":"agraharam-kathalu","title":"Agraharam Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan\u003eపుట్టినది గోదారొడ్డున - అమలాపురంలో, నాన్నగారి బదిలీల వల్ల చదువు చాలా చోట్లే జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీల్లో జెనెటిక్స్ లో పిహెచ్ డి., దాకా. ప్రస్తుతం బెంగుళూరులో నివాసం ఉద్యోగం. సంగీతమన్నా, సాహిత్యమన్నా ప్రాణం - రెండింటిలోనూ పెద్దగా ప్రావీణ్యం లేకపోయినా సరే! అడపా తడపా కథలంటూ నేనేవో రాసినా, పంపినవీ, ప్రచురించబడినవీ తక్కువే! గతంలో ఒకటి రెండు కథలూ, కవితలూ చిన్న చిన్న బహుమతులూ, ప్రశంసలూ పొందాయి. 'రచన' పత్రికలో వసుంధర దంపతుల చేత అభినందనలు అందుకోవడం ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e            కౌముది ఇంటర్నెట్ పత్రికలో మూడు సంవత్సరాలు ధారావాహికంగా ప్రచురించబడిన ఈ 'అగ్రహారం కథలు' నాకెంతో ప్రత్యేకమైనవి. నెలనెలకీ పెరిగిన ఆదరణతో నాకెంతో పేరు, ఎందరో అభిమానులని సమకూర్చాయి. పేరులో ఒకరకమయిన రాజసాన్నీ, కొంత గాంభీర్యాన్నీ సంతరించుకుని ఆంద్రదేశమంతటా ఉన్న చిన్న చిన్న గ్రామాలే అగ్రహారాలు. ఎదురెదురుగా చిన్నదీ, పెద్దదీ రెండు రాములవారి గుళ్ళూ ఆ ఊరి దేవుడి కాళ్ళు నిత్యమూ కడుగుతూ అప్పుడప్పుడు ఒద్దికగానూ, మరొకప్పుడు కాస్త ఉగ్రంగానూ ప్రవహించే కౌశికగా పిలవాడే గోదావరి. వెనకే పచ్చదనాల నెచ్చెలులు వరిచేలూ. వాటికి కాపలాగా నిలుచున్న అన్నదమ్ముల్లాంటి కొబ్బరిచెట్లూ.. ఇలా ఎంతో మనోహరంగా ఉన్నచోట ఎదురెదురుగా రోడ్డు కిరువైపులా ఉన్న పాతిక ఇళ్ళని కలిపి ఒక ఊరుగా కట్టేస్తే అదే ఈ అగ్రహారం. \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057884782639,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/agraharamkathalu.jpg?v=1773675981"},{"product_id":"ravvala-konda","title":"Ravvala Konda","description":"\u003cp\u003e\u003cspan\u003e‘‘రాత్రంతా నాకు నిద్రరాలేదు. మనసునిండా చీకటి. ఆ చీకట్లో నిన్న రాత్రి మనం కన్న ఆ కల ఎక్కడయినా కనిపిస్తుందేమోనని వెలిగించిన ప్రమిదని అరచేతుల్లో పట్టుకుని వెతికాను. ఎక్కడా కనిపించలేదు మనం ప్రసవించిన ఆ అపురూపమైన కల, చివరికి  తెలిసింది నువ్వు లేనప్పుడు ఆ కల నాకెందుకు కనిపిస్తుందీ అన్న సత్యం.  చూడూ! నువ్వు నా ఆరోప్రాణం. ఇన్నాళ్ళు ఎలా బ్రతికానో నాకు తెలీదు. నువ్వు లేకుండా ఇక ముందు బతకడం మాత్రం నాకు సాధ్యం కాదు.’’ ఆ వెన్నెల రాత్రి వెలగచెట్టు నీడలో అలా చాలాసేపు మాట్లాడింది రాజకుమారి.  ‘అంత గొప్పమనిషి అనుకోకుండా నా ప్రాణంలో ప్రాణం అయింది. ఈ మనిషికి దగ్గరయ్యాను. సరే దక్కించు కోగలనా చివరికి?’ అనుకున్నాడు రవ్వలకొండ.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058451308591,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ravvalakonda.jpg?v=1773684557"}],"url":"https:\/\/books.ataka.in\/collections\/nine-books-combo.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}