{"title":"Novels","description":"","products":[{"product_id":"maa-ammante-naakistam-i-love-my-mother","title":"Maa Ammante Naakishtam","description":"\u003cp\u003eMaa Ammante Naakishtam (I Love My Mother) (Translated Kannada Stories - Kannada Sahitya Akademi Award Winner) Vasudhendra\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పుస్తకాన్ని చిన్న పిల్లవాడు తాయిలం దాచుకుని కొంచెం కొంచెమే తింటున్నట్టు చదవాలి. ఇది చదివి అందరూ అనే మాటే: మా అమ్మంటే నాకిష్టం. తప్పక చదవండి. Vasudhendra's Kannada Sahitya Akademi Award winning Short Story collection, 'Maa Ammante Naakistam.'\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397746749487,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/maa-ammante-naakishtam.webp?v=1754490183"},{"product_id":"yerra-gabbilaala-veta","title":"Yerra Gabbilaala Veta","description":"\n\u003cp\u003eనిజమైన చీకటిని నేనెప్పుడు చూడలేదు, ఆ చీకటిని నేనెపుడు అనుభవించలేదు. అసలు చీకట్లో ఏముంటుంది? చీకటి నిజమైన రంగు, చీకటి రూపం, చీకట్లో వాన, చీకట్లో వాసన, చీకట్లో సంచారము, చీకట్లో వేట, చీకట్లో భూమి కదలిక, చీకట్లో సముద్రం, ప్రళయం ఇవన్నీ ఎవరైనా చూసారా? అర్ధరాత్రి అడవి మధ్యలో చీకట్లో కూర్చొని కళ్ళు తెరిచి చూస్తే ఏమి కనపడుతుంది? కళ్లుండి కూడా. అసలయిన చీకటిని నేనెపుడు చూడలేదు. ఎందుకు? నా ఊహలు అలా కాదు, చీకట్లో బాసిపట్లు వేసుకు కూర్చొని అక్కడ దేన్నో వెతుకుతాయి. ఆ చీకట్లోనే ఈ యెర్ర గబ్బిలాల వేట మొదలయ్యింది. ఆ వేటలో నేను నా ముత్తాతల తరానికి ఆయనకు ముందు తరాలలోకి దూకాను. కళ్ళు మూసుకొని కలలు కంటూ ఆ తరంలోకి నేను ప్రవేశించాను. అప్పటి మనుషులను వారి మనస్తత్వాలను, ప్రాంతాలను వారి ప్రాంతీయతను. జీవన సౌందర్యాన్ని పీడితులు దౌర్జన్యాన్ని, కలిసున్న కుటుంబాలని కలగాపులగం అవుతున్న తెగలను చూశాను, వాళ్ళతో సంవత్సరంకు పైగా గడిపాను, అక్కడ కనిపించాయి నాకు ఈ యెర్రగబ్బిలాలు.\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44397762904111,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Yerra-Gabbilala-Veta-Front-cover.webp?v=1754490199"},{"product_id":"yaradakonda-ata-award-winning-novel","title":"YaradaKonda - ATA Award Winning Novel","description":"\n\u003cp\u003eజాలరుల కుగ్రామంగా మొదలైన విశాఖపట్నం , రెండో ప్రపంచ యుద్ధం తరువాత మహానగరంగా అవతరించడానికి మూలకారణమైన భౌగోళిక విశేషం యారాడ కొండ. విశాఖపట్నం ఎదుగుదలకు అదొక కొండగుర్తు. ఎంతో మందికి ఉపాధినీ, కొంత మందికి సంపదనూ ప్రసాదించిన బంగారు కొండ అది. ఆ కొండ విశాఖపట్నం కథను చెప్పుకొస్తే అది ఎలా ఉంటుంది? గడచిన వందేళ్ల కాలంలో అక్కడి మనుషులూ, వాళ్ల ఆశలు, ఆశయాలూ, వ్యధలూ, బాధలూ, సుఖ సంతోషాలనూ, అలాగే వీటన్నింటినీ నడిపించిన శక్తులనూ యారాడ కొండ నమోదుచేసి వినిపించిన గాథకు నవలా రూపం ఈ రచన. మూలాలను తెలుసుకున్నప్పుడే ఎదుగుదల అర్థవంతం కాగలదనే నమ్మికతో ఏరికూర్చిన సృజన ఈ 'యారాడ కొండ' నవల.\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44397769392175,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/yarada-konda-front-cover.webp?v=1754490206"},{"product_id":"son-of-jojappa","title":"Son of Jojappa","description":"\n\u003cp\u003eఇటీవలి కాలంలో తెలుగులోనూ sexuality కి సంబంధిచిన చర్చ ప్రధాన స్రవంతిలో చాలానే జరిగింది. అయితే, ఆ చర్చ సైద్దాంతిక, పండిత చర్చను దాటి సాహిత్యంలోకి వచ్చింది తక్కువే. వేళ్ళమీద లెక్కించే రచనలు వచ్చినా వాటిపై జరగాల్సినంత చర్చ జరగలేదు. Sexuality ఉద్యమాలను అస్తిత్వ ఉద్యమాల కోణంలోనే చూస్తున్నప్పుడు “వాటిని గురించిన సాహిత్య వ్యక్తీకరణా ఆ సమూహం వాళ్ళే చేయాలా? లేదూ ఆ విషయం తెలిసిన బయటి వారు ఎవరైనా చేయవచ్చా?” అనేది ఎప్పుడూ ఎదుర్కొనే ప్రశ్న. అయితే, ఆ సమూహంలోని వ్యక్తులే ఆ విషయాలను సాహిత్యంలోకి తీసుకునివచ్చినప్పుడు వ్యక్తమయ్యే pain ని బయటి వారు తీసుకుని రాలేరు అనేది సత్యం. pain ఒక్కటే సాహిత్యం అవ్వదు గనుక, సాహిత్యం తెలిసిన వారు లేదా రాస్తున్నవారు చేసే వ్యక్తీకరణ empathetic గా ఉంటుంది. ఇది అట్లా బయటి సమూహం నుండి రాసిన నవల. అయితే, అస్తిత్వ ఉద్యమాల సాహిత్యం వచ్చిన తొలినాళ్లలో దాన్ని సాహిత్యంగా గుర్తించ నిరాకరించడమూ, మౌనం పాటించడమూ మనకు తెలుసు. ఇప్పుడు sexuality మీద వస్తున్న సాహిత్యం పట్లా అదే మౌనం కనబడుతోంది. ఇది ఆ మౌనాన్ని బద్దలుకొట్టే ‘నవల’ అని మేం భావిస్తున్నాం. సాహిత్యంలోకి దీన్ని కొత్త చేర్పుగా గుర్తిస్తున్నాం. ఇప్పుడు ఇది మీ చేతుల్లోకి. చర్చల్లోకి.” – అరుణాంక్ లత\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397788692527,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Son-of-Jojappa-Front.webp?v=1754490230"},{"product_id":"pranaya-hampi-historical-novel","title":"Pranaya Hampi (Historical Novel)","description":"\n\u003cp\u003eప్రణయ హంపీ. చారిత్రిక కాల్పనిక నవల. తెలుగునాట జరిగిన అతి పెద్ద చివరి యుద్ధం రక్కసి - తంగడి యుద్ధం. ఆ యుద్ధం విజయనగర రాజ్య రూపు రేఖల్నీ, చరిత్రనూ మార్చింది. రాయల వంశ పాలన ముగిసింది. ఆ యుద్ధాన్నీ, యుద్ధకాలంలో ప్రేమకథనూ బిగిసడలకుండా అల్లిన నవల ఈ ప్రణయ హంపీ. కథకుడిగా \"ఊరి మర్లు\" పుస్తకంతో పేరుగాంచిన మారుతీ పౌరోహితం నుండి వచ్చిన మొదటి నవల ఇది. పుస్తకం చేతిలోకి తీసుకుంటే అక్షరాల వెంట మీరూ 16వ శతాబ్దపు విజయనగర వీధుల్లో తిరగాడుతారు.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397791903791,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Hampi-Front.webp?v=1754490233"},{"product_id":"amma-diarylo-konni-pageelu","title":"Amma Diarylo Konni Pageelu","description":"\n\u003cp\u003eAmma Diarylo Konni Pageelu - Novel by Ravi Mantri\u003c\/p\u003e\n\u003cp\u003eనాకో సంగతి చెప్పు... అసలు ఎవరైనా నీకు ఇంతకు ముందు ఉత్తరం రాశారా? ప్రేమలేఖలో, మామూలు లేఖలో. పోనీ నువ్వెప్పుడైనా రాశావా? మామూలుగా మనం రోజూ మాట్లాడుకునే మాటల్నే పొందిగ్గా పేర్చి కాయితం మీద పెడితే ఉత్తరం అయిపోతుందనుకునే అల్పసంతోషిని నేను. ఇవాళెందుకో ఇప్పటికిప్పుడే నీకో ప్రేమకథ చెప్పాలనిపించి, నీకు ఉత్తరాలు చదివే అలవాటుందో లేదో తెలీకుండానే రాసేస్తున్నాను.\u003cbr\u003e\nబహుశా నేను అమ్మకథని చెప్పాలనుకోవడం దగ్గర, అమ్మకి కూడా ప్రేమకథ ఉంటుందనుకోవడం దగ్గర ఈ ప్రయాణం మొదలై ఉండొచ్చు. వెన్నెల రాత్రుల్లో అలల్ని లెక్కపెడుతూ, కలల్ని దాచుకుంటూ నేను ఇష్టంగా రాసిన ప్రేమలేఖే నా ఈ అమ్మడైరీలో కొన్నిపేజీలు.\u003cbr\u003e\nఇది అమ్మ ప్రేమకథ.\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397795115055,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/adkp-front.webp?v=1754490236"},{"product_id":"okkokka-talaku-okkaka-vela","title":"Okkokka Talaku Okkaka Vela","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412905553967,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156513.jpg?v=1754589570"},{"product_id":"lankamala-daarullo","title":"Lankamala Daarullo","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413000024111,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156489.jpg?v=1754589570"},{"product_id":"enugekkina-sampada","title":"Enugekkina sampada","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413156425775,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156540.jpg?v=1754589570"},{"product_id":"sambala","title":"Sambala","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413163601967,"sku":null,"price":140.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156537.jpg?v=1754589570"},{"product_id":"manushulu-mayamayye-kaalam","title":"Manushulu mayamayye kaalam","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413166747695,"sku":null,"price":499.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156554.jpg?v=1754589570"},{"product_id":"ghandruk","title":"Ghandruk","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413168025647,"sku":null,"price":425.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156535.jpg?v=1754589570"},{"product_id":"mohana-swamy","title":"Mohana swamy","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413192634415,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156496.jpg?v=1754589570"},{"product_id":"pattu-thova","title":"Pattu Thova","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413195092015,"sku":null,"price":475.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156485.jpg?v=1754589570"},{"product_id":"adholokam","title":"Adholokam","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413197910063,"sku":null,"price":350.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156495.jpg?v=1754589570"},{"product_id":"mairavana","title":"Mairavana","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413206003759,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156520.jpg?v=1754589570"},{"product_id":"panakam-on-the-rocks","title":"Panakam on the rocks","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413217734703,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156486.jpg?v=1754589570"},{"product_id":"athade-oka-samudram","title":"Athade oka samudram","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413231431727,"sku":null,"price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156546.jpg?v=1754589570"},{"product_id":"antarani-vasantam","title":"Antarani Vasantam","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415927713839,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/antaranivasantham_front.jpg?v=1754708225"},{"product_id":"naalo-unna-prema","title":"Naalo Unna Prema","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415931383855,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/naalo_unna_prema_front.jpg?v=1754708278"},{"product_id":"nadoori-midde","title":"NADOORI MIDDE","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415932923951,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nadoori_midde_front.jpg?v=1754708295"},{"product_id":"that-last-melody","title":"That Last Melody","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415946719279,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/That_last_melody_front_cover.jpg?v=1754708537"},{"product_id":"bharatha-sainikula-veera-gaadhalu","title":"Bharatha Sainikula Veera Gaadhalu","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44415963856943,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bsvgfront.jpg?v=1754708043"},{"product_id":"ramagrama-nunchi-ravanalanka-daaka","title":"Ramagrama Nunchi Ravanalanka Daaka","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416065994799,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ramagramamfront.jpg?v=1754708123"},{"product_id":"bhageeratha-kona","title":"Bhageeratha kona","description":"","brand":"Regi Achhulu","offers":[{"title":"Default Title","offer_id":44464945791023,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/BK01.jpg?v=1756396156"},{"product_id":"long-march-a-novel","title":"Long March - A Novel","description":"\u003cp\u003e\u003cspan\u003eఎవరు చదివినా చదవకపోయునా కాలం నిజాయితీగా తన చరిత్రను తాను రాసుకుంటూనే ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సంఘటనలను మైలురాళ్లుగా వేసుకుంటూనే ఉంటుంది. అలాంటి మైలురాళ్లలో ఒకటి తెలంగాణ మలిదశ ఉద్యమంలోని ’మిలియన్ మార్చ్’. అప్పటికి సహాయనిరాకరణతో ఊరూరు అట్టుడుకుతుంది. ట్యాంక్ బండ్ మీద ’మిలియన్ మార్చ్’ చేసి తను ఆకాంక్షను బలంగా చెప్పాలని ఉక్కుపాదం మోపి అనుమతికి నిరాకరించింది. అయినా భయపడకుండా జనం ముందుకు కదిలారు. అరెస్టుల్య్, బారికేడ్లు, ఇనుపకంచెలు, పోలీసులను దాటుకుని, దెబ్బలుతిని, రక్తమోడుతూ ట్యాంక్ బండ్ ను ముద్దాడారు. కడుపుమండి కనబడిన విగ్రాహాలను నేలకూల్చారు. అనుకూలంగా వత్తాసు పలికే బాకాలను ఎత్తి ట్యాంక్ బండ్ లోకి విసిరికొట్టారు. ఒకరు పిలిచింది కాదు, ఒకరు రమ్మని ఒత్తిడి చేసింది లేదు. పల్లెపల్లె నుంచి గుంపులు గుంపులుగా సామాన్య జనం అవరోధాలను దాటుకుని పట్నం చేరుకున్నారు. దీనికి స్ఫూర్తి ఏమిటి? అప్పటి పల్లెప్రజల మానసికస్థితి ఎలా ఉంది? ఉద్యమ భావజాలవ్యాప్తి ఇల్లిల్లుకు ఎలా చేరింది? ఇలాంటి అనేక విషయాలను చర్చించిన నవల ఈ \"లాంగ్ మార్చ్\".\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475177238575,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/longmarchf.jpg?v=1756808767"},{"product_id":"sira","title":"Sira","description":"\u003cp\u003e\u003cspan\u003eఎరీనాలో ఇద్దరు అతి శక్తి వంతులైన 'గ్లాడియేటర్స్' ఢీకొంటే ఎంత థ్రిల్ ఉంటుందో కోర్ట్ రూమ్ డ్రామా కూడా అంత థ్రిలింగ్ గా ఉంటుంది అని నా నమ్మకం . స్టాన్లీ గార్డెనర్ నుంచి జాన్ గ్రీషామ్ వరకూ కోర్ట్ డ్రామా బుక్స్, మూవీస్ అన్నీ నాకు ఇష్టం. వాటిలాగే నా నమ్మకం 'కరెక్ట్' అని ప్రూవ్ చేసింది ఈ రాజ్ మాదిరాజు గారి పుస్తకం. ఇంట్రస్టింగ్ యూత్ ఫుల్ బ్యాక్ డ్రాప్ లో .. ఆ ఫేమస్ ఇన్స్టిట్యూట్లో అనుమానంగా అనిపించే కుర్రవాళ్ళ ఆత్మ హత్యలు, వాటి వెనక వున్న రహస్యం ఛేదించాలని సిద్ధపడ్డ యంగ్ లాయర్ రామ్.. తనకెదురుగా కేసు వాదిస్తోంది. ఇండియాలో నెంబర్ వన్ లాయర్, తన గురువు 'మూర్తి సర్......! ఇద్దరు ఇంటిలిజెంట్, స్మార్ట్ లాయర్స్... ఒకరిది టెక్నికల్లో బ్రిలియెన్సు.. ఒకరిది ఎమోషనల్ ఫోర్సు.. ఒకరు ఓటమి తెలియని గురువు.. ఒకరు గెలిచి తీరాలి అనుకునే శిష్యుడు ... కోర్ట్ అనే ఎరీనాలో ఇద్దరూ కసిగా యుద్ధం మొదలు పెట్టారు .... ఈ మేటర్ చాలదూ పుస్తకం చివరివరకు ఆపకుండా చదివించటానికి... హ్యాపీ అండ్ థ్రిల్లింగ్ రీడింగ్.. పి. సత్యానంద్.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475183661103,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sirabookf.jpg?v=1756809091"},{"product_id":"saptha-bhoomi-శప్తభూమి","title":"Saptha Bhoomi - శప్తభూమి","description":"\u003cp\u003e\u003cspan\u003eరాయలసీమ - అందులోనూ అనంతపురం జిల్లా పరిధిలో అత్యుత్తమ కథకులు ఉన్నారు. అలాంటివారిలో సన్మిత్రుడు బండి నారాయణస్వామి కూడా ఒకరు. గత మూడు దశాబ్దాలలో స్వామిగారి అనేక కథలను చదివాను. వాటిలోని శైలిశిల్పాలకు, వస్తు వైవిధ్యానికి, రైతాంగం పట్ల ఆసక్తికి ఆశ్చర్యపోయాను. వారి కొన్ని కథలను నావే అన్నట్టు భావించి కన్నడలోకి అనువదించాను. మాంత్రిక వాస్తవికవాద పరంపరకు పునాది వేసిన స్పానిష్ రచయిత మార్క్వెజ్ ను గుర్తుకు తెచ్చేలా రాసేటటువంటి స్వామి అపురూపంగా ‘శప్తభూమి' అనే చారిత్రాత్మక నవల రాశారు. - ఈ నవలలో అనేక గొప్ప పాత్రల వల్ల, ఘటనల వల్ల పద్దెనిమిదవ శతాబ్దపు కథను వర్తమానానికి అలవరుచుకునే కార్యాన్ని రచయిత బండి నారాయణస్వామి అత్యంత నైపుణ్యంతో నిర్వహించారు. ఒక్కమాటలో చెప్పాల్సి వస్తే ఇది రాజు కేంద్రితమైన నవల కాదు. రాజ్యాన్ని కేంద్రంగా చేసుకున్న నవల. ఇది రాయలసీమ చారిత్రక నవల దళిత బహుజన చారిత్రక నవల --డా||కుం.వీరభదప్పు ప్రఖ్యాత కన్నడ రచయిత SapthaBhumi, Sapthabhoomi, Saptabhumi, Sapthabhumi.Shapthabhumi, Shaptha bhumi, Shaptha Bhoomi\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475184218159,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sapthabhumif.jpg?v=1756809322"},{"product_id":"manodharmaparagam-ata-award-winning-novel","title":"Manodharmaparagam - ATA Award Winning Novel","description":"\u003cul class=\"a-unordered-list a-vertical\"\u003e\n\u003cli\u003e\u003cspan class=\"a-list-item\"\u003e\u003cspan\u003eప్రతిభకు పట్టం కట్టే విషయంలో కులాల పాత్ర అప్పటికీ యిప్పటికీ కూడా అలాగే ఉంది. రచయిత అనేకమంది స్త్రీల ముఖతా ఆనాటి దేవదాసీ వ్యవస్థను, వారి జీవన పోరాటాలను వినిపిస్తారు... ఒక చరిత్రను తవ్వి తీశారు.\u003c\/span\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e-పి.సత్యవతి\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cspan class=\"a-list-item\"\u003e\u003cspan\u003eప్రదర్శన జరుగుతున్నప్పుడు చూడటం కాకుండా, జరిగిన అనంతరం నెమరువేత శిల్పాన్ని ఎంచుకోవడం వల్ల కొన్ని సూక్ష్మ వివరాలను చెప్పడానికి అది బాగా కలిసొచ్చింది. ప్రశ్నలు రేపి, సమాధానాలు పూరించుకునేలా వదిలేయడంలోనే ఉంది రచయిత ప్రజ్ఞ. \u003c\/span\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e- పూడూరి రాజిరెడ్డి\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cspan class=\"a-list-item\"\u003e\u003cspan\u003eఇందులో పలికే ఒక్కో స్వరాన్ని నింపాదిగా అవలోకనం చేసుకోవాలి. ఒక్క ముక్కలో చెబితే తెలిసేది కాదు. ఓపిగ్గా చదివి అర్థం చేసుకోవాలి. ఆ సంగీత స్వరాల వెనుక దాగివున్న ఆత్మఘోషని పట్టుకోగలగాలి. \u003c\/span\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e- సాయి బ్రహ్మానందం గొర్తి\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cspan class=\"a-list-item\"\u003e\u003cspan\u003eకీలకమయిన పాత్ర, ఆ పాత్ర చిత్రీకరణకి తోడ్పడే కొన్ని ముఖ్యమయిన పాత్రలు, వాటిని కలిపే సంఘటనలు, వ్యక్తీకరణకు వన్నె తెచ్చే పటిష్ఠమయిన సంభాషణలు, తగుపాళ్ళలో వర్ణన, హత్తుకుపోయే భాష. ఇవి కాక, నేలని వదిలి సాము చెయ్యడం లేదని తెలియజేసే స్పష్టత -అంటే, సామాజిక స్థితిగతులకి అద్దం పట్టడం అన్న మాట -ఇవన్నీ ఈ నవల అంతస్సూత్రంలో భాగాలు.\u003c\/span\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e- తాడికొండ కె. శివకుమార శర్మ\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475184513071,"sku":null,"price":375.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/manodharmaparagamf.jpg?v=1756809523"},{"product_id":"soonyam-novel","title":"Soonyam - Novel","description":"\u003cp\u003e\u003cspan\u003eSOONYAM novel by Mukthavaram Pardhasarathy పంజరంలో చువ్వమీద కూర్చుని, నింపాదిగా ధాన్యం ముక్కన కరుచుకుంటున్న పక్షితో \"ఎగిరిపో! నీకు స్వేచ్ఛనిస్తున్నాను\" అన్నాడట ఒక యువకుడు. \"ఎగిరిపోవాలనే ఉంది. ఆకాశంలో పట్టుకోవడానికి చువ్వలుంటాయా?” అని అడిగిందట పక్షి. 83లో అదీ పరిస్థితి. ఆకలికన్నా పెద్ద భయం. రోడ్డు మీద చెత్త ఏరుకునే వాళ్లతో సహా, ఉస్మాన్ గంజ్ లో బస్తాలెత్తే కూలీలతో సహా జేబుదొంగలు, ఇతర పెట్టి క్రిమినల్స్ సహా అందరూ నా ప్రతిరూపాలే. - ముక్తవరం పార్థసారథి తనకు విలువలున్నాయంటే అది ధిక్కారంలాగా కనిపిస్తుంది. తనకూ వాళ్ళకూ మధ్య యింత ఎడం ఎందుకు? ఈ నిత్య జీవితపు రొచ్చులో ఎవరూ తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోయినా రాసేటప్పటి తన నిజాయితీనయినా నమ్ముతారా? ఈ వూహలూ, ఈ అనుభవం మరపుతెరల మరుగున మాయం కాకముందే - రొటీన్ జీవితపు అడుగున పడిపోకముందే అక్షరరూపంలో వ్యక్తమయ్యే నిజాయితీయే సాహిత్యం. అటువంటి సాహిత్యం అది శూన్యంకాదు - జీవితం. అర్థవంతమైన జీవితం. - - వరవరరావు IT Ush It is a middle class saga in the sense that a powerful writer normally comes from this pessimistic, melancholic and cynical background. The last sentence of this book makes you to forget all the disturbing features of life. A writer is in the making is really a great event. This novel has disturbed me a lot. Munipalle Raju\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475541946415,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/soonyamf.jpg?v=1756820874"},{"product_id":"seethapaharanam","title":"Seethapaharanam","description":"\u003cp\u003e\u003cspan\u003e\"సీత చచ్చిపోయింది లేదా అపహరించబడింది\" అనే మాటతో ఉలిక్కిపడి లేచాను. దూరంగా ఉన్న గుడి దగ్గర లౌడ్ స్పీకర్ల నుంచి రామాయణం వినిపిస్తోంది. రాముడు లక్ష్మణునితో అన్నమాటలు నందన్ మనసుని కుదిపేస్తున్నాయి. నా సీత కనిపించకుండా పోయి రెండు రోజులు అయ్యింది. ఎవరికి ఉంది? సీతను కిడ్నాప్ చెయ్యాల్సిన అవసరం డబ్బు కోసం అయితే ఈ పాటికే ఫోన్ లాంటిది రావాలి... ఇంకేదైనా జరిగి ఉంటే భయం దుఃఖం ఒకేసారి!!!- ఇంకేదైనా జరిగి ఉంటే ఈ పాటికే ఏదో ఒకటి తెలియాలి. నీళా సరస్త ముఖసూరి వరేణ్య గీతి పాత్రం విరాజిత విభీషణ భాగధేయ;\" ఒక్కసారిగా కన్నులు ఆ శ్లోకం మీదకు వెళ్లాయి. సీత రూమ్ ఓల్డ్ మ్యాప్లతో నిండి ఉంది. చిన్న కాగితాలు మ్యాప్స్ కి అనుగుణంగా అమర్చి ఉన్నాయి. శ్రీరంగం అన్న చోట పేపర్ మీద రాసి ఉంది ఈ శ్లోకం. శ్రీరంగనాధుణ్ని వర్ణించిన శ్లోకం అని అర్ధం అవుతోంది. అసలు వీటికి సీతకు సంబంధం ఏమిటి? సీతకు శత్రువులు ఎవరైనా ఉన్నారా?? సీత ఏమయ్యింది???\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475551612975,"sku":null,"price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sithapaharanamf.jpg?v=1756821084"},{"product_id":"digantham","title":"DIGANTHAM","description":"\u003cp\u003e\u003cspan\u003eఏ ముఖమూ లేని నేను నా ముందు పరిగెత్తుతున్నాను. ముఖమే లేని యింకో నేను... నన్నే తరుముకుంటున్నాను. ముందు పరుగెత్తే నేనూ.... వెనక తరిమే మరో నేనూ... నా నేనులు వేటాడేదీ వెంటాడ్తోన్నదీ. గాలిస్తున్నది.... ఎక్కడో కోర్కెల దొమ్మీలో... ఏవో ఆశల తొక్కిసలాటలో పారేసుకున్న ముఖాన్నే... మనిషి ముఖాన్నే... ఎంతకీ దొరకదా ముఖం... ఎక్కడో దూరంగా దిగంతం దగ్గర లీలగా కనీ కనబడకా.... మభ్యపెడ్తుంది.... అలా... అలా... అనేకమైన నేనులుగా చీలిపోయి, చిట్లిపోయి, చెదిరిపోయి నిజముఖ లాలసతో పరిగెడుతూ... పరిగెడ్తూ.. అలసిపోయి... ఉన్నట్టుంది మెట్లు. ఎక్కుతున్నాను... ఎక్కుతున్నాను... ఎక్కుతూనే వున్నాను.... యెంతకీ మెట్లు మాయం కావు.... - కాశీభట్ల వేణుగోపాల్\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475556692015,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/diganthamf.jpg?v=1756821197"},{"product_id":"meka-bathuku","title":"Meka Bathuku","description":"\u003cp\u003e\u003cspan\u003eమీరీ పుస్తకాన్ని చదవరు. మీ కళ్ళముందు మీరెప్పుడూ కనని, వినని కొత్త జీవితాన్ని చూస్తారు. ఇంతకంటే నరకం ఇంకేం ఉంటుందని మీరు ఏడుస్తారు. మీకు ఆకలి విలువ తెలుస్తుంది. నీటి విలువ తెలుస్తుంది. మీకు మాట విలువ తెలుస్తుంది. మనిషి విలువ తెలుస్తుంది. ప్రాణం కంటే విలువైనది ఈ భూమ్మీద ఇంకేం లేదని తెలుసుకున్నాక, మీరు ఘోర సమస్యలనుకుంటున్నవన్నీ గోరంతవే అన్న సత్యం బోధపడ్డాక, మీరీ పుస్తకాన్ని మూసి – ఆ కథానాయకుడికీ, ఆ కథారచయితకీ కృతజ్ఞతలు చెప్తారు. గ్యారంటీ! మలయాళంలో వందకుపైగా పునర్ముద్రణలు పొంది చరిత్ర సృష్టించిన పుస్తకం. ఏడు భాషల్లోకి అనువాదమై, ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షల కాపీలు అమ్ముడైన సంచలన పుస్తకం. ఐదు భాషల్లో రిలీజై 150 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాకి కథను అందించిన పాపులర్ పుస్తకం. అదే- బెన్యామిన్ రాసిన 'ఆడు జీవితం'! కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, జేసీబీ ప్రైజ్, అబూదాబి శక్తి అవార్డులు అందుకున్న పుస్తకం. జోసెఫ్ కోయిపల్లి ఇంగ్లీషులో 'గోట్ డేస్' గా అనువదించిన ఈ పుస్తకానికి తెలుగు అనువాదమే ఈ 'మేక బతుకు'. \"Meka Batuku\" is the translated version of the acclaimed Malayalam novel \"Aadujeevitham\" (Goat Days) by Benyamin. This powerful story follows Najeeb Muhammed, an Indian migrant worker forced into a life of servitude as a goatherd in the Saudi Arabian desert. Based on true events, the novel depicts Najeeb's harrowing journey from hopeful emigrant to virtual slave, and his daring quest for freedom. A bestseller in its original language, this universal tale of survival, loneliness, and resilience has garnered international recognition and numerous literary accolades.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475595849775,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/mekabathukuf.jpg?v=1756821319"},{"product_id":"final-diagnosis","title":"Final Diagnosis","description":"\u003cp\u003e\u003cspan\u003e“ఫైనల్ డయాగ్నోసిస్” - ఒక్క ఉత్తరంతో ప్రారంభమై, జీవన మరణాల మధ్య సాగే సాహసోపేతమైన ప్రయాణం! తన సాధారణ జీవితం ఒక్క క్షణంలో తలకిందులవుతుందని సారథి కలలో కూడా ఊహించలేదు. మొబైల్ ఫోన్స్, ఈ మెయిల్స్ రాజ్యమేలుతున్న ఈ కాలంలో తన అక్క దగ్గర్నుంచి ఉత్తరం రావడంతో సారథి ఆశ్చర్యపోతాడు. తన భర్తకు మరొకామెతో పెళ్లి చేయాలనుకుంటున్నాని అక్క రాసిన ఉత్తరంలోని విషయం చదివి కంగారు పడతాడు. ఇదంతా ఏంటో తెలుసుకుందామని అక్కను కలుసుకోడానికి వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లి అక్కడ అక్క హాస్పిటల్లో బెడ్ మీద ఉండడం చూసి భయపడతాడు. కానీ కొన్ని రోజుల్లోనే అక్క బావ హాస్పిటల్ నుంచి మిస్ అవడంతో ఆందోళనకు గురవుతాడు. తన అక్క, బావ ఏమయ్యారు? అక్క హాస్పిటల్లో ఎందుకు చేరింది? తన అక్క మిస్ అయిన విషయం అమెరికాలో ఉన్న తన తల్లిదండ్రులకు తెలియకుండా ఎన్ని రోజులు ఆపగలడు? ఉత్కంఠ, రహస్యం, భావోద్వేగం - ఇవన్నీ సమపాళ్ళలో మేళవించి, ఒక బెస్ట్్సల్లర్కు కావలసిన అన్ని లక్షణాలను కలిగి ఉన్న మెడికల్ థ్రిల్లర్ - “ఫైనల్ డయాగ్నసిస్.” ప్రతి పేజీ మీ గుండెల్లో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ప్రతి అధ్యాయం మిమ్మల్ని మరింత లోతుగా రహస్యాల వలలోకి లాగుతుంది. ఈ థ్రిల్లర్ నవల పాఠకులను ఒక రహస్య ప్రపంచంలోకి తీసుకెళ్తుంది, వారి గుండెల్లో భయాన్ని రేకెత్తిస్తుంది మరియు చివరి పేజీ వరకు వారిని ఉత్కంఠభరితులను చేస్తుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475605090351,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/finaldiagnosisf.jpg?v=1756821822"},{"product_id":"vidhi-a-novel","title":"VIDHI - A Novel","description":"\u003cp\u003e\u003cspan\u003eఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని ప్రశ్నలు మనల్ని వెంటాడతాయి. సమాధానాలు దొరకని ఆ ప్రశ్నలు మనల్ని మరింత సంఘర్షణలోకి నెట్టేస్తాయి. అటువంటి సమయంలో విధి మనకు ఏం నేర్పుతుంది? రామ్ జీవితం అలాంటి మలుపు తిరిగిన సమయంలో మొదలవుతుంది ఈ కథ. తల్లి లక్ష్మమ్మ ఒంటరిగా పెంచిన రామ్, సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడి, భువిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడు. కానీ పెళ్లయిన ఏడాదికి అతని జీవితంలో ఊహించని మలుపు ఎదురవుతుంది. ఆధునిక సమాజంలో వివాహ బంధం విలువ, దాంపత్య సంబంధాల్లో తలెత్తే సవాళ్ళు, తరాల మధ్య అంతరం, మారుతున్న విలువలు - ఇలాంటి అనేక అంశాలను స్పృశిస్తూ సాగే ఈ నవల ఒక ప్రత్యేకమైన ప్రయాణం. డాక్టర్ పరశురామ్ లాంటి పెద్దల అనుభవజ్ఞానం, చిన్ననాటి స్నేహితుడు వాసు సహకారం, మరియు కాలం అనే గురువు నేర్పే పాఠాలతో రామ్ జీవితం ఎటు మలుపు తిరుగుతుంది? విధి అతనికి ఏ మార్గం చూపిస్తుంది? రాజేష్ కుమార్ బొచ్చు తన తొలి నవలలో సమకాలీన సమాజంలోని సంక్లిష్ట సమస్యలను సున్నితంగా స్పృశిస్తూ, మానవ సంబంధాల విలువను గుర్తు చేస్తారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475613937711,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/vidhif.jpg?v=1756822058"},{"product_id":"itlu-nee-preyasi-a-novel","title":"Itlu.. Nee Preyasi - A Novel","description":"\u003cp\u003e\u003cspan\u003eముందుగా.. ఈ పుస్తకం చదివాక దానితో వొచ్చే ఇన్లాండ్ లెటర్లో మీరో అందమైన ప్రేమలేఖ రాసి పంపాలి.. అడ్రసు ఆ లెటర్ పైనే ఉంది.. ఇక కథకొస్తే.. \"నేనేమో వెన్నపూసని.. విచ్చుకుంటున్న పువ్వు రెక్కలు గాలికి చెదిరి రాలిపోతే బాధతో కరిగిపోయేదాన్ని.. పుప్పొడిని భద్రంగా దాచుకుని ఒక తరాన్ని, కనీసం జ్ఞాపకాన్ని నిలుపుదామని ఆశపడేదాన్ని..\" ఇలాంటి ఒక రాధ.. \"నువ్వేమో బండరాయివి.. ఎవరో ఉలితో శ్రద్ధగా చెక్కిన శిల్పానివి.. కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులే తప్ప మనసు, మెదడు గురించిన ఆనవాళ్ళు భూతద్దం పెట్టి వెతుక్కోవాల్సిన శరీరం అది..\" అలాంటి ఒక శ్యాం.. భద్రాద్రి రాముడి గుడిగంటలు, పాపికొండలమధ్య పారే గోదారి ఇసుకతిన్నెలు, పాల్వంచ పవర్హౌజు కార్మిక యూనియన్ పోరాట నినాదాల సాక్షిగా జరిగిన ఒక అందమైన ప్రేమకథ..\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475618066479,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/itluneepreyasif.jpg?v=1756822163"},{"product_id":"tejo-tungabhadra","title":"TEJO TUNGABHADRA","description":"\u003cp\u003e\u003cspan\u003eఅవి 15వ శతాబ్దపు చివరి సంవత్సరాలు. బలిష్టులైన పోర్చుగీసు నావికులు ప్రాణాలను పణంగాపెట్టీ భారతదేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టారు. భారతదేశంలోని ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపోయి యూరోప్లో స్వతంత్రంగా మిరియాల వ్యాపారం ప్రారంభం కావటానికి కారకులయ్యారు. ప్రపంచం మొత్తం వారి సాహసాన్ని కొనియాడింది. కాని ఈ చారిత్రక సంఘటనలు సామాన్య ప్రజల మీద ఎలాంటి పరిణామాన్ని కలిగించాయి? రాజకీయ, ధార్మిక చదరంగంలో సామాన్య ప్రజానీకం ఏ విధంగా నలిగిపోయింది? చరిత్రను సామాన్య జనుల దృష్టా చూడటం సాధ్యమా? ఈ చారిత్రక నవల పై ప్రశ్నలకు సామాన్య ప్రజానీకం ద్వారా జవాబులు ఇవ్వటానికి ప్రయత్నిస్తుంది. లిస్బన్ లో తమ మానాన తాము బతుకులను కూడగట్టుకుంటున్న యూదుల సముదాయం ఒకవైప్ర, అప్పటివరకు బీదరికాన్ని చవిచూసి, ఇప్పుడు మిరియాల వ్యాపారంతో తలెత్తుకు నిలబడిన క్యాథలిక్ సముదాయం మరోవైపు. ఈ పరిస్థితిలో యూదుల ఇంటి అందమైన ఆడపిల్లను క్యాథలిక్ ధర్మానికి చెందిన ఒక అబ్బాయి ఇష్టపడితే పరిణామమెలా ఉంటుంది? భారతదేశంలోని ఐశ్వర్యం వారి ప్రేమని నిరాటంకంగా కొనసాగనిస్తుందా? ఇదే పరిస్థితిలో లిస్బన్ తేజో నదిలో ఈదులాడే రెండు బంగారు చేపలు భారతదేశంలోని తుంగభద్రానదిని చేరటానికి ఓడవెక్కి కూర్చున్నాయి. ఇవి మరో నదిని చేరటం సాధ్యమా? ఒక నదిలో ఈదిన చేపలు మరో నది నీటిని తమదిగా చేసుకుంటాయా? ఎన్నో రోమాంచక దృశ్యాలతో అల్లిన ఈ మానవీయ కథనంలో అసంఖ్యాకమైన పాత్రలు రూపుదిద్దుకున్నాయి. వాటి నడుమ కొనసాగే జీవన నాటకము, మన సమకాలీన జీవితానికి భిన్నంగా కనిపించదు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44497767759919,"sku":null,"price":475.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/TejoTungabadraFront.jpg?v=1757589464"},{"product_id":"tella-enugu","title":"Tella Enugu","description":"\u003cp\u003e\u003cspan\u003e1870 లో సమయంలో దేశంలో వచ్చిన కరువు ప్రపంచ చరిత్రలోనే అతి పెద్దది. అందులో ఇరవై ఐదు శాతం మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారిలో అత్యధికులు నిమ్న వర్గాల వారే. దానికి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ విధానాలు, దోపిడీ కారణం. కానీ మన న్యాయాన్యాయ విచక్షణ కూడా దానికి తోడ్పడింది. ఏదో ఒక రకంగా మనం కూడా జరిగిన విధ్వంసానికి సమష్టిగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నవల మనలో ప్రతి ఒక్కర్నీ దోషిగా నిలబెడుతుంది. ఇప్పటికైనా మనల్ని మనం పరీక్షించుకోవాలి. చరిత్ర పుటల్లో అంతులేకుండా రగులుతున్న జ్వాలల్లోకి మన నిస్సారమైన వాదనలు, పనికిమాలిన సమర్థనలను విసిరేయడం మనం మానుకోవాలి. - జయమెహన్\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44497771462703,"sku":null,"price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/tellaenuguf.jpg?v=1757590053"},{"product_id":"aarella-prema","title":"Aarella Prema","description":"\u003cp\u003e\u003cspan\u003eప్రేమ ఒక్కొక్కరిలో ఒకలా ఉంటుంది. ప్రేమించడం, ప్రేమించబడంలో అమాయకత్వం ఎంత ఉండాలో, ఆ ప్రేమ అందకుండా పోతున్నప్పుడు అంతే మెచ్యూరిటీ ఉండాలి. ఈ రెండూ ఆయా సమయాల్లో లేనపుడే జీవితాలు గతితప్పుతాయి. ఈ నవల చదువుతున్నప్పుడు... ఎప్పుడో ఎవరో మనకు గుర్తుగా ఇచ్చిన ఓ చిన్న నెమలీకో, ఇంకెవరి గుర్తుగానో దాచుకున్న ఙ్ఞాపకమో మనసుని తడుతుంది. మనిషిని కోల్పోయిన బాధ మెలితిప్పుతుంది. ప్రేమంటే ఇవ్వటమే కాదు, దూరాన్ని అంగీకరించటం, జీవితాన్ని ప్రేమించడం అనే విషయాన్ని కీర్తి ఇనుగుర్తి ఇంత సులభంగా చెప్పిన తీరు ఆశ్చర్యంగా అనిపించింది. కొత్తతరం ఏమైపోతుందా అనిపించినప్పుడు. వాళ్లకి ఇచ్చే బహుమతుల్లో ఈ పుస్తకం కూడా ఉండాలి. పిల్లలకి జీవితాన్ని ప్రేమించడం కూడా తెలియాలంటే... ఈ కథ చదవాలి. - నరేష్కుమార్ సూఫీ Replacement available only if the book is received damaged, misprinted, or wrong edition. No returns for change of mind.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500008566831,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AarellaPremafrontcover.jpg?v=1757674349"},{"product_id":"erra-mallelu","title":"Erra Mallelu","description":"\u003cp\u003e\u003cspan\u003eఒక స్నేహితురాలు మనతో కూర్చుని మన హక్కులు, పీరియడ్స్, కోరికలు, సెక్స్ ఎడ్యుకేషన్, కనీస అవసరాలు, మారిటల్ రేప్ ఇలా మనకి అవగాహన లేని వాటి గురించి తన కథ ద్వారా మనకి తెలియచేస్తుంటే ఎంత బావుంటుంది. ఆ స్నేహితురాలే \"ఎర్ర మల్లెలు\"\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500026785839,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ErraMallelufrontcover.jpg?v=1757675391"},{"product_id":"pottelu","title":"POTTELU","description":"\u003cp\u003e\u003cspan\u003eమనుషులు ఏకాంతాన్ని కోరుకోవచ్చు కానీ, ఎప్పటికీ ఒంటరి కాలేరు. తనకు తానుగా ఏదో ఒక బంధాన్ని వెతుక్కుంటారు. సత్యం పొట్టేలుని వెతుక్కున్నట్టు. కాశినాయన క్షేత్రంలో తనని తాను వెతుకున్నట్టు. దూరమైన మనుషుల స్థానంలో ఆ ఖాళీని పూర్తి చేసే మరేదైనా నింపాలనే తపన ఉన్నంత వరకూ మనుషులు ఒంటరిగా ఉండలేరు. సొంత నేల మీద నుంచి ఓ పిలుపు వెంటాడుతూనే ఉంటుంది. తల్లీ కొడుకులుగా పైకి కనిపించే కథ మార్మికంగా ఈ ప్రకృతికీ మనిషికీ ఉండే లోతైన అనుబంధాన్ని చెబుతుంది. నవలలో అమెరికా వలస అనేది కేవలం జియోగ్రాఫిక్ మార్పు కాదు, పొట్టేలు కేవలం ఒక జంతువు కాదు. మహిళా రైతుగా, తల్లిగా వేదన పడే సత్యం, మల్లేష్ ఒకడికే తల్లి కాదు. మానసికంగా సొంత నేలనీ, కోల్పోతున్న అనుబంధాలనీ గుర్తు చేసే ప్రతీకలు. తాత్వికతా, వాస్తవికత కలిసిపోయిన ఈ \"పొట్టేలు\" తెలుగులో మరో అద్బుతమైన రచనగా నిలుస్తుంది. - నరేష్కుమార్ సూఫీ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500028096559,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/POTTELU.jpg?v=1757675502"},{"product_id":"never-ending-love-story","title":"Never Ending Love Story","description":"\u003cp\u003e\u003cspan\u003eకొన్ని కథలు మనసుని సున్నితంగా తట్టి లేపుతాయి. మనలో ప్రేమను, ఆత్మ విశ్వాసాన్ని నింపుతాయి. అలాంటి కథలు కొంతకాలం మనతో కలిసి ప్రయాణం చేస్తాయి. ఇప్పుడు మీ చేతుల్లోకి రానున్న “నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ” కూడా అచ్చం అలాంటిదే. రచయిత్రి అద్భుతంగా మలిచిన ఈ ప్రేమ కథ మిమ్మల్ని మీ తొలి ప్రేమల్లోకి తీసుకెళ్తుంది. ప్రేమంటే ఆకర్షణ కాదు బాధ్యత అని గుర్తుచేస్తుంది. అనంతమైన ప్రేమ రూపాంతరం చెందుతూ మీ చేయి పట్టుకుని కొత్త లోకాల్లోకి తీసుకెళ్తుంది. కోల్పోయిన ప్రేమను తిరిగి పంచివ్వడంలో కొత్త ఆశలతో ముందడుగు వేయడానికి ఉత్సాహాన్నిస్తుంది అనంతమైన ప్రేమ. - పబ్లిషర్స్\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500030357551,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/NeverEndingLoveStoryfrontcover.jpg?v=1757675814"},{"product_id":"mruthyu-vihari","title":"Mruthyu Vihari","description":"\u003cp\u003eమృత్యు విహారి - సుధీర్ కస్పా \u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44511840600111,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/IMG_20250912_150123.jpg?v=1758033819"},{"product_id":"manase-o-mareechika","title":"Manase O mareechika","description":"","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44511847153711,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/IMG_20250912_145835_2.jpg?v=1758034878"},{"product_id":"prolaya-naayaka","title":"Prolaya Naayaka","description":"","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44511902269487,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/IMG_20250912_145915.jpg?v=1758037344"},{"product_id":"sravana-masamlo-vacche-nindu-chandamama-sravani","title":"Sravana Masamlo Vacche Nindu Chandamama...! Sravani","description":"\u003cp\u003e\u003cspan\u003eThis story…, will bore you, but also surprise you...! It will make you angry, but also calm you…! It will make you sad, but also make you laugh…! It will scare you, but it will also give you courage…! I believe that this story will travel with you, captivating you…!\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44534965010479,"sku":null,"price":259.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/SravanaMasamloVaccheNinduChandamama..._Sravani.jpg?v=1758694367"},{"product_id":"chaitra-novel","title":"Chaitra (Novel)","description":"\u003cp\u003e\u003cspan\u003eకాలం ఎప్పటికప్పుడు కొత్త రంగులను తొడుక్కుంటూనే ఉంది, రోజులన్నీ తేదీలను మారుస్తూ అభివృద్ధి వైపు అడుగులేస్తూ పోతున్నా, ఆధునిక యుగంలో ఇంకా అనాగరికంగానే బతుకుతున్నాం, విచక్షణ కోల్పోయి, వివక్ష తాలుకా మనిషి నిలబడ్డప్పుడు కొన్ని మనుగడలెప్పుడూ మనిషిని వేధిస్తూ ఉంటాయి, మనం ఆనవాళ్ళుగా చెప్పుకునే అమ్మల జీవితాలు ఏ గర్భగుడిలోనో హత్య చేయబడతాయి, ఏ చెత్త కుప్పల మీదో అనాథగా వెలేయబడతాయి. భారం దించుకొని, బాధ్యతగా చెప్పుకునే ఓ తాడుకి ఉరితీయబడుతున్నాయి ఇలా ఒకే కారణం మీద వేలాడుతూ దుఃఖిస్తూ ఉన్నాయి. అయినా కాలంతో పాటు కాసిన్ని కలలతో జీవితాన్ని కలగంటున్నవారు విరిగిన రెక్కలను అతికించుకుంటూ కొత్త రంగులను జీవితానికి అద్దుతున్నారు. ఇంటి గడపల ముందు ఎదురుచూపులు మాని దేశ సరిహద్దుల మీద కాపలా కనురెప్పలవుతున్నారు. కంచెలు తెంచుకొని కాలం మీద చరిత్రలు రాస్తున్నవారు మనకు కనిపిస్తూనే ఉంటారు… నా ఆలోచనలకు అక్షరాలను అద్ది అస్థిత్వపు నినాదంగా నా మొదటి నవల 'చైత్ర'ను మీకు అందిస్తున్నాను. -స్ఫూర్తి కందివనం\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44534969794607,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/chaitra.jpg?v=1758694942"},{"product_id":"dheera-sameere-ganga-teere","title":"Dheera Sameere Ganga Teere","description":"\u003cp\u003e\u003cspan\u003eప్రతీ చిరునవ్వు వెనుకా ఒక కథ ఉంటుంది అన్న మాట ఎంత నిజమో, ఆ చిరునవ్వు ప్రేమ నుండి పుట్టింది అయితే ప్రపంచం చాలా అందంగా ఉంటుంది అన్న మాట కూడా అంతే నిజం. 'ప్రపంచానికి చాలా ప్రేమని పంచాలిరా నువ్వు..' అంటాడు నాన్న. నేను మాత్రం ఇష్టంగా ప్రేమకథల్ని పంచుతున్నాను అనిపిస్తుంది అప్పుడపుడు. నచ్చిన వారితో కాసేపు మాట్లాడటం, ఇష్టమైన పనిని చెయ్యటం ప్రియంగా మారిపోయాయి. అందుకే నిన్ను కాసేపు ఆపి కూర్చోపెట్టి ప్రేమగా మాట్లాడాలి అనిపించింది నాకు. యమునా నది ఒడ్డున వెన్నెల, ప్రేమ మకరందపు సిరాలో ముంచిన కుంచెతో గీసిన బృందావనపు రాసలీల దృశ్యాన్ని ఊహించుకుని రాసిన మాటల్ని నీకు వినిపించాలి అనిపించింది. ఆ మాటలకే నేను పెట్టుకున్న పేరు ఈ ధీర సమీరే గంగా తీరే.. Ravi Mantri\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44535427399727,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/dheerasameeregangatheere.jpg?v=1758710940"},{"product_id":"96-a-real-life-love-story","title":"96 A REAL LIFE LOVE STORY","description":"\u003cp\u003e\u003cspan\u003eఇదొక రియల్ లైఫ్ లవ్ స్టోరీ. వేసవికాలం, పౌర్ణమిరాత్రి ఆరుబయట మంచం వేసుకొని ఆరామ్సే వెళ్ళకిలా పడుకొని ఆకాశంలో మెరిసే నక్షత్రాల్ని, ముద్దుగా వెలిగే చందమామని చూస్తూ, చుట్టూ పాలపొంగులా పరుచుకున్న వెన్నెల్లో తడుస్తూ బామ్మో, తాతయ్యో, అమ్మో, నాన్నో, తోబుట్టువులో, ఫ్రెండ్సో, చెప్పే కబుర్ల కథల్ని వింటున్నంత హాయిగా సాగుతుంది ఈ కథ! స్నేహం, ప్రేమ, ఫ్యూచర్, ఫ్యామిలీ, కెరీర్, కలలూ, ఇష్టాయిష్టాలు ఇలా ప్రతీ విషయంలోనూ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఎలా ఆలోచిస్తారు? టీనేజ్లో కలిగే భావోద్వేగాల పరిణామాలు ఎలా ఉంటాయి? ఏ రిలేషన్లోనైనా ఉండాల్సిన లిమిటేషన్స్ ఏంటీ? ఒకరితో ఒకరు గౌరవంగా, స్నేహంగా, మెచ్యూర్డ్ గా ఎలా మసులుకోవాలి? ఇలాంటి విషయాల గురించి, ఇందులో ముఖ్యపాత్రలైన ఒక అమ్మాయీ, అబ్బాయీ వారి ఫీలింగ్స్ ్న, కథలోని మూమెంట్ని, వారి వారి దృక్కోణం నుంచి మీతో పంచుకుంటూ, ఈ ఇద్దరూ మీ చెరోచేతిని పట్టుకొని మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు ఒక్క క్షణం కూడా మిమ్ముల్ని వదలకుండా ప్రతీ జ్ఞాపకాన్ని, అనుభవాన్ని దృశ్యరూపంలో మీ కళ్ళ ముందుంచుతారు. తొలి ప్రేమ ఇచ్చే తీపి, చేదు జ్ఞాపకాలతో, ఎన్నో ఎమోషన్స్, మరెన్నో మలుపులతో ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం నాన్స్టాప్ ఎంటర్టైయిన్తో రోలర్ కోస్టర్లా సాగే ఈ కథని సాంతం చదివాక ఒక మంచి పుస్తకాన్ని చదివామనే సంతృప్తిని మీకు తప్పకుండా ఇస్తుందని హామీ ఇస్తూ, మీకు ఈ \"Come back to book revolution\"s సపోర్ట్ చేయగలరని కోరుకుంటూ... థాంక్యూ...\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44542928355375,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/96frontcover.jpg?v=1758951208"},{"product_id":"ala-ninnu-cheraa","title":"Ala Ninnu Cheraa","description":"\u003cp\u003e\u003cspan\u003eనీ నుండి దూరంగా ఉన్నా, ఈ దూరమే బాగుంది. ఎందుకంటే మళ్ళీ నిన్ను చేరాక నువ్వు అనుకుంటున్న నేను, నేను కాదని చెప్తే నా గుండె తట్టుకోగలదా? Please be with me Like a pearl with the shell. Please be with me Like a moon in a dark night. Please be with me Like the courage of a soldier\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Regi Achhulu","offers":[{"title":"Default Title","offer_id":44578256945199,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/alaninnucheraabook.jpg?v=1760352011"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/novels-removebg-preview.png?v=1754764215","url":"https:\/\/books.ataka.in\/collections\/novels.oembed?page=4","provider":"అటక","version":"1.0","type":"link"}