{"title":"Sahithya Akademi Shortlisted","description":"","products":[{"product_id":"nallagonda-kathalu","title":"Nallagonda Kathalu","description":"\n\u003cp\u003eNallagonda Kathalu - Stories from a small town childhood – by V Mallikarjun. గట్టిగ తిరిగితే ఒక ఇరవై నిమిషాలల్ల మా ఊరు చూశుడు అయిపోతది. ‘అర్బనూరు’ అని నేనొక కథ కోసం కనిపెట్టిన పదం మా ఊరిని చూసి పెట్టిందే. అచ్చంగా అట్లనే ఉంటది మా ఊరు. సిటీకి ఊరులెక్క. ఊరికి సిటీలెక్క. నేను మా ఊరి గురించి, మా ఊరి మనుషుల గురించి, మా నాన్న గురించి, మా అమ్మ గురించి చెప్పాల్నని చానా రోజుల్నించి అనుకుంటున్న. చెప్తానికి చానా కథలున్నయి సరే, అయి ఎట్ల చెప్పాలి? ఏది కథ అయితది? ఈ జ్ఞాపకాలు, ఇష్టాలన్నీ పోగేసి ఏం కథ రాయాలి? ఇదంత నా మెదడుల తిరుగుతనే ఉండె. మొత్తానికి కొన్ని కథలు దొరికినయి. వాటి గురించి ఆలోచించుకుంట ఈ కథలు రాస్తుంటె నాకు నేను దొరుకుతనే ఉన్న. ఒక్కసారి గతాలకువోతే మనకు మనం గుర్తొస్తమంటే ఇదే. ఇయి రాస్తుంటే నన్ను నేను మళ్లా దోలాడుకుంటున్నట్టు, నాకు నేను మళ్లా దొరుకుతున్నట్టు అనిపిచ్చింది. మీగ్గూడ అట్లనే అనిపిస్తదా లేదా చెప్పలేను. సదివి మీరే చెప్పాలి. -వి. మల్లికార్జున్‌\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397782269999,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Nallagonda-kathalu-front.webp?v=1754490221"},{"product_id":"rameshwaram-kakulu","title":"Rameshwaram Kakulu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413122248751,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156494.jpg?v=1754589570"},{"product_id":"mairavana","title":"Mairavana","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413206003759,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156520.jpg?v=1754589570"},{"product_id":"parveta-kathalu","title":"Parveta Kathalu","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415934922799,"sku":null,"price":199.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Parveta_front_cover.jpg?v=1754708397"},{"product_id":"untitled","title":"Untitled","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415947309103,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/untitled_front.jpg?v=1754708545"},{"product_id":"bombay-pottelu","title":"BOMBAY POTTELU","description":"\u003cp\u003e\u003cspan\u003eBOMBAY POTTELU TELUGU SHORT STORIES\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Regi Achhulu","offers":[{"title":"Default Title","offer_id":44464969351215,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bombaipottelufront.jpg?v=1756396994"},{"product_id":"selfie","title":"SELFIE","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44466175868975,"sku":null,"price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Selfiebookfrontcover.jpg?v=1756443260"},{"product_id":"long-march-a-novel","title":"Long March - A Novel","description":"\u003cp\u003e\u003cspan\u003eఎవరు చదివినా చదవకపోయునా కాలం నిజాయితీగా తన చరిత్రను తాను రాసుకుంటూనే ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సంఘటనలను మైలురాళ్లుగా వేసుకుంటూనే ఉంటుంది. అలాంటి మైలురాళ్లలో ఒకటి తెలంగాణ మలిదశ ఉద్యమంలోని ’మిలియన్ మార్చ్’. అప్పటికి సహాయనిరాకరణతో ఊరూరు అట్టుడుకుతుంది. ట్యాంక్ బండ్ మీద ’మిలియన్ మార్చ్’ చేసి తను ఆకాంక్షను బలంగా చెప్పాలని ఉక్కుపాదం మోపి అనుమతికి నిరాకరించింది. అయినా భయపడకుండా జనం ముందుకు కదిలారు. అరెస్టుల్య్, బారికేడ్లు, ఇనుపకంచెలు, పోలీసులను దాటుకుని, దెబ్బలుతిని, రక్తమోడుతూ ట్యాంక్ బండ్ ను ముద్దాడారు. కడుపుమండి కనబడిన విగ్రాహాలను నేలకూల్చారు. అనుకూలంగా వత్తాసు పలికే బాకాలను ఎత్తి ట్యాంక్ బండ్ లోకి విసిరికొట్టారు. ఒకరు పిలిచింది కాదు, ఒకరు రమ్మని ఒత్తిడి చేసింది లేదు. పల్లెపల్లె నుంచి గుంపులు గుంపులుగా సామాన్య జనం అవరోధాలను దాటుకుని పట్నం చేరుకున్నారు. దీనికి స్ఫూర్తి ఏమిటి? అప్పటి పల్లెప్రజల మానసికస్థితి ఎలా ఉంది? ఉద్యమ భావజాలవ్యాప్తి ఇల్లిల్లుకు ఎలా చేరింది? ఇలాంటి అనేక విషయాలను చర్చించిన నవల ఈ \"లాంగ్ మార్చ్\".\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475177238575,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/longmarchf.jpg?v=1756808767"},{"product_id":"saptha-bhoomi-శప్తభూమి","title":"Saptha Bhoomi - శప్తభూమి","description":"\u003cp\u003e\u003cspan\u003eరాయలసీమ - అందులోనూ అనంతపురం జిల్లా పరిధిలో అత్యుత్తమ కథకులు ఉన్నారు. అలాంటివారిలో సన్మిత్రుడు బండి నారాయణస్వామి కూడా ఒకరు. గత మూడు దశాబ్దాలలో స్వామిగారి అనేక కథలను చదివాను. వాటిలోని శైలిశిల్పాలకు, వస్తు వైవిధ్యానికి, రైతాంగం పట్ల ఆసక్తికి ఆశ్చర్యపోయాను. వారి కొన్ని కథలను నావే అన్నట్టు భావించి కన్నడలోకి అనువదించాను. మాంత్రిక వాస్తవికవాద పరంపరకు పునాది వేసిన స్పానిష్ రచయిత మార్క్వెజ్ ను గుర్తుకు తెచ్చేలా రాసేటటువంటి స్వామి అపురూపంగా ‘శప్తభూమి' అనే చారిత్రాత్మక నవల రాశారు. - ఈ నవలలో అనేక గొప్ప పాత్రల వల్ల, ఘటనల వల్ల పద్దెనిమిదవ శతాబ్దపు కథను వర్తమానానికి అలవరుచుకునే కార్యాన్ని రచయిత బండి నారాయణస్వామి అత్యంత నైపుణ్యంతో నిర్వహించారు. ఒక్కమాటలో చెప్పాల్సి వస్తే ఇది రాజు కేంద్రితమైన నవల కాదు. రాజ్యాన్ని కేంద్రంగా చేసుకున్న నవల. ఇది రాయలసీమ చారిత్రక నవల దళిత బహుజన చారిత్రక నవల --డా||కుం.వీరభదప్పు ప్రఖ్యాత కన్నడ రచయిత SapthaBhumi, Sapthabhoomi, Saptabhumi, Sapthabhumi.Shapthabhumi, Shaptha bhumi, Shaptha Bhoomi\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475184218159,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sapthabhumif.jpg?v=1756809322"},{"product_id":"manodharmaparagam-ata-award-winning-novel","title":"Manodharmaparagam - ATA Award Winning Novel","description":"\u003cul class=\"a-unordered-list a-vertical\"\u003e\n\u003cli\u003e\u003cspan class=\"a-list-item\"\u003e\u003cspan\u003eప్రతిభకు పట్టం కట్టే విషయంలో కులాల పాత్ర అప్పటికీ యిప్పటికీ కూడా అలాగే ఉంది. రచయిత అనేకమంది స్త్రీల ముఖతా ఆనాటి దేవదాసీ వ్యవస్థను, వారి జీవన పోరాటాలను వినిపిస్తారు... ఒక చరిత్రను తవ్వి తీశారు.\u003c\/span\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e-పి.సత్యవతి\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cspan class=\"a-list-item\"\u003e\u003cspan\u003eప్రదర్శన జరుగుతున్నప్పుడు చూడటం కాకుండా, జరిగిన అనంతరం నెమరువేత శిల్పాన్ని ఎంచుకోవడం వల్ల కొన్ని సూక్ష్మ వివరాలను చెప్పడానికి అది బాగా కలిసొచ్చింది. ప్రశ్నలు రేపి, సమాధానాలు పూరించుకునేలా వదిలేయడంలోనే ఉంది రచయిత ప్రజ్ఞ. \u003c\/span\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e- పూడూరి రాజిరెడ్డి\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cspan class=\"a-list-item\"\u003e\u003cspan\u003eఇందులో పలికే ఒక్కో స్వరాన్ని నింపాదిగా అవలోకనం చేసుకోవాలి. ఒక్క ముక్కలో చెబితే తెలిసేది కాదు. ఓపిగ్గా చదివి అర్థం చేసుకోవాలి. ఆ సంగీత స్వరాల వెనుక దాగివున్న ఆత్మఘోషని పట్టుకోగలగాలి. \u003c\/span\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e- సాయి బ్రహ్మానందం గొర్తి\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cspan class=\"a-list-item\"\u003e\u003cspan\u003eకీలకమయిన పాత్ర, ఆ పాత్ర చిత్రీకరణకి తోడ్పడే కొన్ని ముఖ్యమయిన పాత్రలు, వాటిని కలిపే సంఘటనలు, వ్యక్తీకరణకు వన్నె తెచ్చే పటిష్ఠమయిన సంభాషణలు, తగుపాళ్ళలో వర్ణన, హత్తుకుపోయే భాష. ఇవి కాక, నేలని వదిలి సాము చెయ్యడం లేదని తెలియజేసే స్పష్టత -అంటే, సామాజిక స్థితిగతులకి అద్దం పట్టడం అన్న మాట -ఇవన్నీ ఈ నవల అంతస్సూత్రంలో భాగాలు.\u003c\/span\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e- తాడికొండ కె. శివకుమార శర్మ\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475184513071,"sku":null,"price":375.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/manodharmaparagamf.jpg?v=1756809523"},{"product_id":"gundelo-vana","title":"Gundelo Vana","description":"\u003cp\u003e\u003cspan\u003eతెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి పేట గ్రామంలో పుట్టారు. ఎం.ఏ. తెలుగు, ఎంఎస్సీ గణితం, బి.ఎడ్. పూర్తి చేసి గణిత ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. గ్రామంలో తమ పాఠశాల పనితీరు పై రెఫరెండం పెట్టుకుని సంచలనం సృష్టించారు. సీనియర్ సిటిజన్తో పాఠశాలలో ప్రవేశపెట్టిన 'అనుభవ పాఠాలు' ఒక కొత్త ప్రయోగం. 'పాఠశాలనే నా ప్రయోగశాల. మా ఊరే నా కథల కార్యశాల' అని చెప్పుకునే పెద్దింటికి పిల్లలకు పాఠాలు చెప్పడమన్నా కథలు రాయడమన్నా చాలా ఇష్టం. \" 1999 నుండి రచనారంగంలోకి వచ్చారు. మొదటి కథ ‘ఆశ-నిరాశ ఆశ' ఆంధ్రప్రభ ఆదివారంలో అచ్చయింది. ఇప్పటివరకు 250 కథలు, 7 నవలలు, 100 వ్యాసాలు, 4 నాటకాలు రాసారు. 8 కథా సంకలనాలు వెలువరించారు. ఈయన కథల్లో తెలంగాణ పల్లె కళ్లముందు కదులుతుంది. చక్కటి శైలి మంచి కథా శిల్పంతో అరుదైన వస్తువులను తీసుకుని ఆగకుండా చదివించేలా రచన చేస్తారు. కథలు రాయడం పై వివిధ యునివర్సిటీలలో, డిగ్రీ కాలేజీలలో వర్క్ షాపులు నిర్వహించారు. పెద్దింటి సాహిత్యం పై ఇంతవరకు ఆరు ఎం.ఫిలు, మూడు పీ హెచ్ డీలు వచ్చాయి. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475511275567,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gundelovanaf.jpg?v=1756820355"}],"url":"https:\/\/books.ataka.in\/collections\/sahithya-akademi-shortlisted.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}