{"title":"Short Stories","description":"","products":[{"product_id":"toorupu-gaalulu-the-eastern-winds","title":"Toorupu Gaalulu (The Eastern Winds)","description":"\n\u003cp\u003eToorupu Gaalulu (The Eastern Winds) (?????? ??????) [Paperback] Unudurti Sudhakar\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397737148463,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/toorupu-gaaluolu-f.webp?v=1754490176"},{"product_id":"charminar-kathalu","title":"Charminar Kathalu","description":"\n\u003cp\u003ePARAVASTHU LOKESHWAR CHARMINAR KATHALU SHORT STORIES\u003c\/p\u003e\n\u003cp\u003eఅప్పటికి హైద్రాబాద్ సంస్థానం పై పోలీస్ యాక్షన్ జరిగి మూడు సంవత్సరాలు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి నాలుగు సంవత్సరాలు. దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగింది కూడా అదే సంవత్సరం. యాఖుత పురా రైల్వే స్టేషన్ దగ్గరి రైన్ బజార్ పుట్టి పెరిగి ఐదో తరగతి కామ్యాఐన అమ్మకు గాంధీ, నెహ్రూ, పటేల్ అంటే దేవుండ్లతో సమానం. అట్ల ఏడుపదుల క్రింద ఆఖరి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్ మూసీనది తీరాన కట్టించిన ఉస్మానియా సర్కారీ దవాఖానాల నేను కండ్లు తెరిచి ఈ భూమ్మీదపడిన. చందమామ కథల పత్రిక నుండి విశ్వనాథ నవలల వరకూ చదివే మా అమ్మకు నా పేరు ఖరారు లక్ష వరహాల సమస్యగా మారింది. అరుదైన అపురూపమైన పేరు పెట్టాలని ఆమె ఆలోచన. దాదాపు సంవత్సరం కావొస్తున్నా సరిఐన పేరే ఆమెకు ఇంకా దొరకలేదు. పిల్లల పేర్లు తల్లితండ్రుల సంస్కారానికి ప్రతిరూపాలు.\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44397775847471,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Charminar-kathalu-Front-cover.webp?v=1754490214"},{"product_id":"gangaraajam-bidda","title":"Gangaraajam Bidda","description":"\n\u003cp\u003eGangaraajam Bidda | Collection of Short Stories\u003cbr\u003e\nby Poodoori Rajireddy\u003cbr\u003e\n“మొత్తం సృష్టి విన్యాసాన్ని వ్యాఖ్యానించడానికి నువ్విక్కడ లేవు, సరిపోవు.”\u003c\/p\u003e\n\u003cp\u003e“మనసు అనేది తక్షణ, సుదూర జ్ఞాపకాల మైదానం. అక్కడి ఆటే సాహిత్యానికి మెటీరియల్‌‌ అవుతుంది. కాకపోతే, కలల్లో కొత్త ఉనికిని సంతరించుకున్నట్టుగానే, సాహిత్యంలోనూ వాస్తవ జీవితం తన రూపును మార్చుకోవచ్చు. అయితే, సాహిత్యం దానికదే ముఖ్యమే అయినా, జీవితం తన అనుభవాలతో ఇచ్చే తీవ్రతలో ఇది ఏమంత ప్రాధాన్యం ఉన్నది కాదు. అలాంటప్పుడు మరెందుకు రాస్తాం? ఏమో! ఏ జవాబు అయినా పేలవమైనదే అవుతుంది. ఆ ‘చెప్పలేనితనం’ మనల్ని చాలా పనులు చేయిస్తుంది. నాతో ఇట్లా కొన్ని కథలు రాయించింది. ఒకటి మాత్రం నిజం; కళారూపం ఏదైనా సరే, అది ఆ మనిషికి సంబంధించిన అత్యుత్తమ పార్శ్వం. ద బెస్ట్‌‌! ఈ వచన కళలో భాగం కావడం అనేది నా జీవితంలోని కొన్ని క్షణాలకు అందివచ్చిన సార్థకత.”\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397782204463,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Gangarajam-Bidda-Front.webp?v=1754490217"},{"product_id":"nallagonda-kathalu","title":"Nallagonda Kathalu","description":"\n\u003cp\u003eNallagonda Kathalu - Stories from a small town childhood – by V Mallikarjun. గట్టిగ తిరిగితే ఒక ఇరవై నిమిషాలల్ల మా ఊరు చూశుడు అయిపోతది. ‘అర్బనూరు’ అని నేనొక కథ కోసం కనిపెట్టిన పదం మా ఊరిని చూసి పెట్టిందే. అచ్చంగా అట్లనే ఉంటది మా ఊరు. సిటీకి ఊరులెక్క. ఊరికి సిటీలెక్క. నేను మా ఊరి గురించి, మా ఊరి మనుషుల గురించి, మా నాన్న గురించి, మా అమ్మ గురించి చెప్పాల్నని చానా రోజుల్నించి అనుకుంటున్న. చెప్తానికి చానా కథలున్నయి సరే, అయి ఎట్ల చెప్పాలి? ఏది కథ అయితది? ఈ జ్ఞాపకాలు, ఇష్టాలన్నీ పోగేసి ఏం కథ రాయాలి? ఇదంత నా మెదడుల తిరుగుతనే ఉండె. మొత్తానికి కొన్ని కథలు దొరికినయి. వాటి గురించి ఆలోచించుకుంట ఈ కథలు రాస్తుంటె నాకు నేను దొరుకుతనే ఉన్న. ఒక్కసారి గతాలకువోతే మనకు మనం గుర్తొస్తమంటే ఇదే. ఇయి రాస్తుంటే నన్ను నేను మళ్లా దోలాడుకుంటున్నట్టు, నాకు నేను మళ్లా దొరుకుతున్నట్టు అనిపిచ్చింది. మీగ్గూడ అట్లనే అనిపిస్తదా లేదా చెప్పలేను. సదివి మీరే చెప్పాలి. -వి. మల్లికార్జున్‌\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397782269999,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Nallagonda-kathalu-front.webp?v=1754490221"},{"product_id":"valapateddu","title":"Valapateddu","description":"\n\u003cp\u003eవర్డ్స్‌‌వర్త్‌‌ని ప్రకృతి కవి అంటారు. కీట్స్‌‌ని మనిషి కవి అన్నారు. అయితే, “వర్డ్స్‌‌వర్త్‌‌ ప్రకృతిలో మనిషి ఉంటాడు. కీట్స్ మనిషిలో ప్రకృతి ఉంటుంది.” అంటాడు జి. కళ్యాణరావు. ఇప్పుడే రాస్తున్న రచయితని అట్లా పొల్చీ పెద్ద చేసి, అతనికి కొమ్ములు తెప్పించి అతనిలో కథకుడిని చంపేయడం ఉద్దేశం కాదు గాని, వివేక్ లంకమల కథలు చదివినప్పుడు కళ్యాణరావు ఎప్పుడో పంచుకున్న ఈ మాట గుర్తొచ్చింది. ఈ కథల్లో ప్రకృతినీ మనిషినీ భాగం చేశాడు వివేక్. నిజానికి చరిత్ర పొడుగుతా మనిషీ ప్రకృతీ వీడదీయలేనంతగా కలిసే ఉన్నాయి. అదే వివేక్ కథల్లో ప్రతిఫలిస్తుంది. ప్రకృతి ధర్మం ప్రకృతి చేసింది. మనిషి తన జీవిక కోసం తన ధర్మం నిర్వర్తించాడు. ఎప్పుడైతే మనిషి ప్రకృతి మీద ఆధిపత్యం చేయడానికి పూనుకున్నాడో ప్రకృతీ ప్రతిఘటించడం మొదలుపెట్టింది. కొండలు తొవ్వినప్పుడు కొండచరియలు విరిగిపడ్డాయి. అడవిని ధ్వంసం చేసినప్పుడు ఎండలు విజృంభించాయి. అడవుల్లో బతికే పులులూ, ఎలుగుబంట్లు, ఏనుగులు పల్లెల మీద పడ్డాయి. ఈ అకస్మాత్తు వరదలన్నీ ప్రకృతిపై మనిషి చేసిన అత్యాచారం తాలుకు ఫలితాలే. లంకమల దారులు అనే ట్రావెలాగ్‌లోనూ కథల్లో ఉండే శిల్పాన్ని సాధించిన వివేక్ రాసిన కథలివి. కథలు కాదని రాసిన వాటిల్లోనే కథ వుంటే, కథ అంటూ వస్తున్నదాంట్లో ఎంత వుండొచ్చు? మేం చదివాం. నచ్చాయి. మీరూ చదవండి. మునుపటికన్నా ప్రేమిస్తారు. - అరుణాంక్ లత ఎడిటర్, ఛాయ\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397785481263,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Valapateddu-Front.webp?v=1754490225"},{"product_id":"kalavapudi-kathalu","title":"Kalavapudi Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eకలవపూడి కథలు  - గోదావరి జిల్లాల్లోని చిన్నిచిన్ని కథలు\u003cbr\u003eby Samba Shiva Thadavarthi A.K.A. @Kataari__\u003cbr\u003e\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఅప్పుడెప్పుడో చిన్నప్పుడు ప్రతి వేసవికి మీరంతా అమ్మమ్మ గారి ఊరికి వచ్చిపోయేవాళ్లు; ఆ ఊరు ఇంకా గుర్తుందా? ఆఁ గుండె లోతుల్లో ఏదోక మూలన ఉండే ఉంటుందిలే.... నేనే ఆ ఊరిని.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈ మధ్యన అసలు ఇటువైపు రావడమే మరిచిపోయారు కదా, అందుకే ఈసారి నేనే మీ ఇంటికొద్దామని ఇలా బయలుదేరాను. వస్తూ వస్తూ ఉట్టిచేతుల్తో వస్తే ఏం బాగుంటుందని, మన ఊరి మునసబు గారింటి దగ్గర నుండి మొదలుపెట్టి తూరుపు వీధి మీదగా బడి అవతల పిల్లకాలువ వరకు ఉన్న కథలు, ప్రేమకథలు, చిన్ని చిన్ని వ్యధలన్నీ కలిపి మూటకట్టి ముచ్చటగా ఇరవై కథల్తో ఇలా మీ చేతుల్లోకి చేరా. పదండి, ఈ గజిబిజి జీవితం నుండి కాసేపలా బయటకి వెళ్లి... చుక్కలు కురిసే రాత్రుల్లో మేడ పైనో, నిశ్శబ్దం నిండిన నదీ తీరాల్లోనో, ఊరంతా నిద్దురపోయినా మేల్కొని ఉండే గది వెలుతురులోనో కూర్చుని మాటాడుకుందాం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e- మీ సాంబశివ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397795180591,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kalavapudi-kathalu-front-1.webp?v=1754490240"},{"product_id":"a-telugu-stories","title":"‘A’ Telugu Stories","description":"\u003cp\u003eA- చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ కథలు. కథకి విస్తరణ పరిమితి, నిర్మాణ క్రమం— ఉత్కంఠ ఎత్తుగడ, రచనాచాపం, నిర్దిష్ట నిలుపు; ఈ కొలబద్దలకి ఆవల నేను . జీవితంలో కూడా!\u003c\/p\u003e\n\u003cp\u003eఏదో ఒక విషయం తీసుకోవడం , దాన్ని చదివేలా, కించిత్ రసవత్త తరంగా కాగితం మీద పెట్టడం. పుట్టుుపూర్వోత్త తరాలు కాకపోయి నా దానిమీద ఎంతోకొంత అవగాహన. ఆ క్రమంలో మీతో కాస్సేపు నడక. అదో ఆనందం! మిగిలిన విషయాలు, నిర్ణణయాల్లాంటివి— మీకే.\u003c\/p\u003e\n\u003cp\u003eమొదటిసారి చదివినప్పుడు అర్థమయి కానట్టుగా ఉండచ్చు కథలు కొన్ని. చక్కరకేళీ ఒలిచి చేతిలో పెట్టలేను . కొంత శ్రమైక సాహచర్యం ఆశిస్తాను మీనుంచి, ప్రమోద మధనానికి.\u003c\/p\u003e\n\u003cp\u003eపలు భాషాకోవిదుణ్ణి కాను — తెలుగులోనే. నాకు తెలిసిన భాషే నా కథల్లో కూడా.\u003c\/p\u003e\n\u003cp\u003eచివరిగా— నా పాత్రలు నేను చెప్పినట్టు మాట్లాడవు. వాళ్ళు చెప్పేదే రాస్తాన్నేను.\u003c\/p\u003e\n\u003cp\u003eఇప్పపటికింతే — కథల్లో కలుద్దాం.\u003c\/p\u003e\n\u003cp\u003eచిలుకూరి రామ ఉమామాహేశ్వర శర్మ\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44411425554479,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ATeluguStoriesFront.jpg?v=1754549681"},{"product_id":"attar","title":"Attar","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412955000879,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156515.jpg?v=1754589570"},{"product_id":"aido-goda","title":"Aido goda","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412984000559,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156557.jpg?v=1754589570"},{"product_id":"hampi-express","title":"Hampi Express","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413112156207,"sku":null,"price":199.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156550.jpg?v=1754589570"},{"product_id":"uttama-telugu-vana-kathalu","title":"Uttama Telugu vana kathalu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413117759535,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156533.jpg?v=1754589570"},{"product_id":"rameshwaram-kakulu","title":"Rameshwaram Kakulu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413122248751,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156494.jpg?v=1754589570"},{"product_id":"chintakindi-mallayya-muchhata","title":"Chintakindi mallayya muchhata","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413178871855,"sku":null,"price":144.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156560.jpg?v=1754589570"},{"product_id":"diguvintodi-kathalu","title":"Diguvintodi kathalu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413223075887,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156492.jpg?v=1754589570"},{"product_id":"samantharaalu","title":"Samantharaalu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413233594415,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156507.jpg?v=1754589570"},{"product_id":"deva-rahasyaalu","title":"Deva Rahasyaalu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413235822639,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156499.jpg?v=1754589570"},{"product_id":"bahuda-bathuku-kathalu","title":"Bahuda Bathuku Kathalu","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415927877679,"sku":null,"price":190.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Bahudha_Front_cover.jpg?v=1754708235"},{"product_id":"nallavanthena-kathalu","title":"Nallavanthena Kathalu","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415934857263,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nalla_vanthena_front_cover.jpg?v=1754708302"},{"product_id":"parveta-kathalu","title":"Parveta Kathalu","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415934922799,"sku":null,"price":199.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Parveta_front_cover.jpg?v=1754708397"},{"product_id":"pulasa","title":"Pulasa","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415935053871,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Pulasa_Front.jpg?v=1754708404"},{"product_id":"russian-classics","title":"Russian Classics","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415935086639,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/russian_classics_front_cover.jpg?v=1754708414"},{"product_id":"savarlakonda","title":"SAVARLAKONDA","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415945244719,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Savarla_Konda_Front.jpg?v=1754708531"},{"product_id":"gaajula-sanchi","title":"Gaajula Sanchi","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416003211311,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gajulasanchifront.jpg?v=1754708058"},{"product_id":"kgh-kathalu","title":"KGH Kathalu","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416048988207,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kghfront.jpg?v=1754708100"},{"product_id":"ontaritanapu-kathalu","title":"Ontaritanapu Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eఇది మానవ సంబంధాలు అర్థం చేసుకోలేక ఎదురైన ఒంటరితనం కావొచ్చు. ఆ మానవ సంబంధాలు పూర్తిగా అర్థమయ్యాక మనలో పుట్టే ఒంటరితనం కూడా అయ్యుండొచ్చు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eనగరజీవితంలోని సాయంత్రాల్లో ఒక రకమైన మెలంఖలీ ఉంటుంది. అందులోకి జారిపోతే ఎప్పుడో అర్ధరాత్రుల్లో తేలుతాం. ఆ మెలంఖలీని, నగరజీవితపు ఒంటరితనాన్ని, గత కాలపు చెదిరిన ఙ్ఞాపకాలని ఒక చోట చేర్చే ప్రయత్నమే ఈ పుస్తకం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈ కథల్లో మీ జీవితపు సాయంత్రమో, రాత్రో, మనిషో, ఙ్ఞాపకమో మీకూ దొరికితే, ఒక్కసారి చిన్నగా నవ్వుకుని ‘రేపటీగీతం’ కోసం వెతకండి. అదే దారిలో ఎక్కడో ఒక చోట నేనూ కనిపిస్తాను.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003e-మొహమ్మద్ గౌస్\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44445194387503,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ontarithanapukathalufront.jpg?v=1755860768"},{"product_id":"rendella-padnaalugu","title":"Rendella Padnaalugu","description":"\u003cp\u003e\u003cspan\u003eRendella Padnaalugu\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eCollection of Short Stories by\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eMadhuranthakam Narendra\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eయీ సంపుటంలోని కథలన్నీ దాదాపుగా రెండేళ్లలో రాసిన పద్నాలుగు కథలు. రెండేళ్ల పద్నాలుగు అనే గుణింతంలోనే రెండేళ్లలో రాసిన పద్నాలుగు అనే అర్థంగూడా దాగుంది. యేడు అనే మాటకు ఆయుష్షు అనే మరో అర్థం కూడా వుందని తెలిసాక రెండేళ్ల పద్నాలుగు అనే గుణింతపు మాటకు మరిన్ని అర్థాలు పుడతాయి. సాదాసీదాగా కనిపించే జీవన శకలాలను జాగ్రత్తగా చూడగలిగితే జీవన చలనసూత్రాలను కనిపెట్టడం అసాధ్యమేమీగాదు. అలాంటి ప్రయత్నమొకటి యీ కథల్ని యిలా రూపొందించిందని సహృదయులైన పాఠకులకు ముందుగానే మనవి చేస్తున్నాను.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e2000వ సంవత్సరంలో తిరుపతిలో యిల్లు కట్టుకున్నప్పుడు దాదాపు రెండేళ్లపాటూ నేనీ శ్రామికులతో సన్నిహితంగా గడపగలిగాను. భౌతిక శ్రమే పెట్టుబడిగా జీవించే శ్రామికుల జీవితాలు, మధ్యతరగతి వైట్ కాలర్ వుద్యోగుల జీవితాల్లా సంక్లిష్టంగా గాకుండా, చాలావరకూ పారదర్శకంగా వుంటాయని నాకప్పుడే తెలిసింది. యింటిపనులు ముగించుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతకూడా చాలా సంవత్సరాలపాటూ వాళ్ళ జీవితాల్లోని వైచిత్రి నన్ను వెంటాడింది. సమాజపు పునాదుల్లోనే మిగిలిపోయిన యీ శ్రామికుల శ్రమైక జీవన సౌందర్యానికి (!) నివాళిగా నేనీ కథల్ని మాత్రం రాయగలిగాను.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003e- మధురాంతకం నరేంద్ర\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44460939575343,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/rendellapadhnalugufront.jpg?v=1756298081"},{"product_id":"sopathigaallu","title":"Sopathigaallu","description":"\u003cp\u003e\u003cspan\u003eSopathigaallu - పదేళ్ల మా బాల్యాన్ని పది కథల్లో చెప్పడం కష్టమైనా, ఒక్కో కథని కుదించి మిమ్మల్ని మీ బాల్యానికి తీసుకెళ్లడానికి చేసిన ఈ చిన్ని ప్రయత్నమే మా ఈ 'సోపతిగాళ్ళు - విశ్వరూప్ వేముల\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Regi Achhulu","offers":[{"title":"Default Title","offer_id":44464948215855,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/SopathiGallufront.jpg?v=1756396844"},{"product_id":"bombay-pottelu","title":"BOMBAY POTTELU","description":"\u003cp\u003e\u003cspan\u003eBOMBAY POTTELU TELUGU SHORT STORIES\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Regi Achhulu","offers":[{"title":"Default Title","offer_id":44464969351215,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bombaipottelufront.jpg?v=1756396994"},{"product_id":"16-toli-prema-kathalu","title":"16 Toli Prema Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eఈ కథలన్నీ కాలాల మీదగా వీచిన హాయితనపు గాలులు కాదు. వీటిలో ఈదురు గాలులున్నాయి, ఇప్పటికీ ఎదల్ని కోస్తోన్న అంతుపట్టని సమాజపు సజీవావవశేషాల ఛాయలున్నాయి. ముళ్ళకంపల మీదగా నడిచొచ్చిన పాదాలు భద్రంగా దాచుకున్న గాయాల తాలూకా ముద్రలున్నాయి. పసివయసులో ఒక్కోరూపాయినీ ముంతలో వేసుకున్నట్టే... ఆనందాలనీ, ఆశ్చర్యాలనీ, నిరంకుశత్వాన్ని మోసిన నిర్మాలత్వాలనీ, కళ్ళల్లో అట్టే పెట్టుకున్న కన్నీళ్లనీ, అంటి పెట్టుకున్న పసితనపు ఆరోమా వాసన్లనీ, కొనసాగుతోన్న కౌమారపు కలల కార్యాల లోలకపు కంపానల ఆవర్తనాలనూ, శిథిల జ్ఞాపకాల పుటల మీద కొత్త జీవితాలను నిర్మించుకుంటున్న కోట నీడల రెపరెపల పాటలనూ ఈ పుస్తకం సాక్షిగా వలపోసుకున్నారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475184054319,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/tolopremakathaluf.jpg?v=1756809217"},{"product_id":"gundelo-vana","title":"Gundelo Vana","description":"\u003cp\u003e\u003cspan\u003eతెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి పేట గ్రామంలో పుట్టారు. ఎం.ఏ. తెలుగు, ఎంఎస్సీ గణితం, బి.ఎడ్. పూర్తి చేసి గణిత ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. గ్రామంలో తమ పాఠశాల పనితీరు పై రెఫరెండం పెట్టుకుని సంచలనం సృష్టించారు. సీనియర్ సిటిజన్తో పాఠశాలలో ప్రవేశపెట్టిన 'అనుభవ పాఠాలు' ఒక కొత్త ప్రయోగం. 'పాఠశాలనే నా ప్రయోగశాల. మా ఊరే నా కథల కార్యశాల' అని చెప్పుకునే పెద్దింటికి పిల్లలకు పాఠాలు చెప్పడమన్నా కథలు రాయడమన్నా చాలా ఇష్టం. \" 1999 నుండి రచనారంగంలోకి వచ్చారు. మొదటి కథ ‘ఆశ-నిరాశ ఆశ' ఆంధ్రప్రభ ఆదివారంలో అచ్చయింది. ఇప్పటివరకు 250 కథలు, 7 నవలలు, 100 వ్యాసాలు, 4 నాటకాలు రాసారు. 8 కథా సంకలనాలు వెలువరించారు. ఈయన కథల్లో తెలంగాణ పల్లె కళ్లముందు కదులుతుంది. చక్కటి శైలి మంచి కథా శిల్పంతో అరుదైన వస్తువులను తీసుకుని ఆగకుండా చదివించేలా రచన చేస్తారు. కథలు రాయడం పై వివిధ యునివర్సిటీలలో, డిగ్రీ కాలేజీలలో వర్క్ షాపులు నిర్వహించారు. పెద్దింటి సాహిత్యం పై ఇంతవరకు ఆరు ఎం.ఫిలు, మూడు పీ హెచ్ డీలు వచ్చాయి. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475511275567,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gundelovanaf.jpg?v=1756820355"},{"product_id":"ententa-dooram","title":"Ententa Dooram","description":"\u003cp\u003e\u003cspan\u003eఇవేం గొప్ప కథలు కాదు... తలకిందలయ్యే సంఘటనలూ లేవు... ఆశ్చర్యపరిచే మలుపులు లేవు... మెస్మరైజింగ్ ముగింపులు లేవు... కానీ ఒక్కొక్క కథ వెనక ఓ ఊపిరి ఉంది... ఓ నిశ్శబ్దం ఉంది... ఒక చిన్న తడబాటు ఉంది. మాటల్లో చెప్పలేని సున్నిత భావాలు, మౌనంగా మిగిలిపోయిన బరువైన క్షణాలు ఈ కథలు. లక్ష్మీ ప్రియాంక తన పుస్తకంలో నెమలిపించంతో పాటు పదునైన గాజు పెంకుని కూడా దాచుకుంది. ఇవి కథలు కావు... భావాలు! మన మనసుల్లో ఎన్నోసార్లు మాటలుగా రూపం దాల్చలేకపోయిన ఊహలు, ముగించలేక మిగిలిన కొన్ని బంధాలు, చెప్పలేక మిగిలిన కొన్ని ప్రేమలు, చిరునవ్వుల వెనక పడిపోయిన కొన్ని కన్నీటి చుక్కలు. మరెక్కడా చదవలేనంత కొత్త కథలేం కాదు, ఇంకెక్కడా అనుభవించలేనంత అనుభూతులు కావు, ఇవి పెద్ద ప్రకంపనలు కావు అనిపించే చిన్న కథలు. వేచిచూసే ఒక చూపు, తలవంచి ఆపుకున్న చిరునవ్వు, వదిలేసినా కాలంలో మిగిలిపోయిన చూపుల్లాగా మనల్ని గుచ్చుతూ ఉంటాయి. మనసుతో చదవాల్సిన కథలు. ఈ కథల్లో ఎక్కడో దాక్కున్న మిమ్మల్ని మీరు కలుసుకుంటారు, ఎప్పుడో కలిసిన ఓ ఆత్మీయుడ్ని గుర్తు చేసుకుంటారు. కొన్నింట్లో ప్రేమ మొదలవుతుంది. కొన్నింట్లో ప్రేమ సాగుతుంది. మరికొన్నింట్లో ప్రేమ ఆగిపోతుంది. కొన్ని కథలు పూర్తవ్వవు. కానీ అసంపూర్ణంగా మిగిలిన కథల్లోనే ఎక్కువగా భావాలు మిగిలిపోతాయి కదా! చెప్పాలనుకున్న చివరి మాటను ఒక చిరునవ్వుతో వదిలేసినట్టు. వదిలేసిన ఆ మాటే మనలో ఎక్కువకాలం నిలిచిపోతుంది. ఈ కథలు మీరు చదవకపోయినా ప్రపంచానికి ఏమీ జరుగదు. చదివాక మాత్రం ప్రియాంక మీ హృదయాన్ని తాకుతుంది... మీ మనసులో ఓ మూలన జ్ఞాపకాల పక్కన ఓ చిన్న కప్పు కాఫీ పెట్టి కూర్చుంటుంది. -భరత్ కమ్మ (డియర్ కామ్రేడ్ చిత్ర దర్శకులు)\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475609874479,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/enthenthadhuramf.jpg?v=1756821952"},{"product_id":"nallaregadi-nelallo","title":"Nallaregadi Nelallo","description":"\u003cp\u003e\u003cspan\u003eపాలగిరి విశ్వప్రసాద్ గ్రామ కక్ష అనే నిప్పులకొలిమిలో కాలి, వ్యవసాయమనే వైతరణిలో ఈది, స్వయంగా వాటిని అనుభవించి పలవరించి కథలు రాశాడు. సమాజాన్నీ రాజకీయాల్నీ నడిపించే ఆర్థిక మూలాలు, అగ్రకులాధిపత్యం, ఎస్సీ ఎస్టీల ఆక్రందన, మానవత్వం, అమానుషత్వం, స్త్రీ స్వేచ్ఛ, పురుషాధిక్యత - ఇవన్నీ కథల్లో చొప్పించి సజీవమైన మాండలికంలో రాశాడు. పాలగిరి విశ్వప్రసాద్ కు కరువెందుకొస్తుందో తెలుసు. రాయలసీమలో గ్రామ కక్షలకు కరువు కన్నతల్లి అని తెలుసు. రైతులు శ్రమకోడ్చి పండించే పంట తక్కువ ధరకు ఎందుకు తెగనమ్ముకుంటారో, పోలీసుల తాకిడి, కోర్టుకేసులు, రోడ్ల వెనకాల ప్రపంచీకరణ, హైవే ధాబాల చాటున జీవితాలు ఛిన్నాభిన్నం ఎందుకవుతాయో, దొంగతనాలకు పేరుపడ్డ కులాలు ఎవరివల్ల ఎందుకు అలాగే వుండిపోతాయో ఆ కారణాలన్నీ తెలుసు. అవేవీ తెలియని - ఒక ఒరవడిలో కొట్టుకుపోయే - అమాయక జీవుల్ని పాత్రలుగా చేసి సమకాలీన చరిత్ర సూక్ష్మంగా ఆవిష్కరింపజేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పాలగిరి విశ్వప్రసాద్ ప్రస్తుతంలో వుండి కథలు రాస్తున్న రచయిత. అందుకే పాలగిరి విశ్వప్రసాద్ కథలు నిజం చెబుతాయి. నిజాయితీగా చెబుతాయి. కథలు రాస్తున్న వాళ్ళు కూడా చదవాల్సిన కథలివి. -ఎన్. దాదాహయాత్, కథా రచయిత\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500016889903,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/NallaregadiNelallofrontcover.jpg?v=1757675052"},{"product_id":"chowrastha","title":"CHOWRASTHA","description":"\u003cp\u003e\u003cspan\u003e‘చౌరస్తా’.. పేరుకు తగ్గట్టే రకరకాల దారులు, రకరకాల కథలు ఒకచోట చేరే కూడలి. గమనాలు వేరైనా గమ్యం ఒక్కటే! రండి.. ఈ కథల చౌరస్తాలోకి అడుగుపెట్టి, ఈ కథలు చదివి చూడండి. 11 Stories Compilation by 11 Authors Genres inside (love, suspense, social, etc.) “Hyderabad Book Fair 2024 Best Seller” 💥 Book Fair Best Seller 2024 💫📖 500+ readers impressed already\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500029374511,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/CHOWRASTHA.jpg?v=1757675666"},{"product_id":"chinna-pedda-kahaneelu","title":"Chinna Pedda Kahaneelu","description":"","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44505175785519,"sku":null,"price":500.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/original_4fd79a16-891e-4265-8b09-5985673de937_IMG_20250913_083933.jpg?v=1757826907"},{"product_id":"nenu-manchidhannena","title":"Nenu Manchidhannena","description":"","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44511851151407,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/IMG_20250912_150055.jpg?v=1758035010"},{"product_id":"kathalu-kane-kallu","title":"kathalu kane kallu","description":"\u003cp\u003ekathalu kane kallu by Gayatri Pendyala.\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44511855706159,"sku":null,"price":140.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/IMG_20250912_150018.jpg?v=1758035179"},{"product_id":"amma-photo","title":"Amma Photo","description":"","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44511860097071,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/IMG_20250912_145952.jpg?v=1758035346"},{"product_id":"kadali-kathalu","title":"Kadali Kathalu","description":"\u003cp\u003eKadali Kathalu - Telugu Short Stories by Kadali\u003cbr\u003e\u003cspan\u003eకొన్ని మనం గుర్తుపెట్టుకోవాలనుకొని గుర్తుపెట్టుకున్న కథలు, కొన్ని గుర్తుపెట్టుకోవాలని అనుకొని కూడా తెలియకుండా మర్చిపొయే కథలు. గుర్తుండిపోయేవి, అప్పుడప్పుడూ గుర్తొచ్చేవి, వదిలించుకున్నవి, వదల్లేనివి, నీవి, నావి, మనందరివీ ఈ కథలు. ఓ కథలో ఏ విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా వదిలేస్తామో, అదే విషయం ఇంకో కథ రూపాన వచ్చి తెగ హింస పెడుతుంది. నిన్నటి కథలో బాగా నచ్చిన ఏదో సంగతి ఈ రోజుకి రోత పుట్టిస్తుంది. ఈ రోజు అంత అసహ్యం కలిగించిన అదే సంగతి రేపటికి బతకడానికి ఆశని కలిగిస్తుంది. అవన్ని పోగేసి మూట కట్టి కథల్లా మీ చెతికిచ్చాను..\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Kadali Writes and Publications","offers":[{"title":"Default Title","offer_id":44554676502575,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kadalikathalufrontcover.jpg?v=1759407933"},{"product_id":"sontha-ooru","title":"Sontha Ooru","description":"\u003cp\u003e\u003cspan\u003eమా సొంత ఊరు క్రాకుటూరు, పేరు చదవడానికి చిత్రంగా ఉన్నా , వినసొంపుగా ఉంటుంది మా ఊరి మనుషుల మాటల్లాగా. చూడటానికి షుమారుగా ఒక వంద నుంచి నూట యాభై గడపల పల్లెటూరే, కానీ పలికే ప్రతి మాటా, పెదాల పైనుంచి కాకుండా కడుపులోంచి వస్తుంది. అటువంటి ఊళ్ళో, అటువంటి మనుషుల మధ్య పెరిగిన నేను. నేను చూసిన, నాకు ఎదురైన సంఘటనలకు అక్షర రూపమే ఈ సొంత ఊరు కథలు. ప్రతి ఇంట్లో మనుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగానే చూసుకునేది మా పశువుల్ని , జివ్వాల్నే. ఇంట్లో ఎవరికైనా కాలికి ముల్లు గుచ్చుకుంటే, ముళ్ళ దగ్గరికి ఎందుకు పోయినవ్ అని కసురుకుంటారు అదే మందలో ఒక గొర్రి కాల్లో ముల్లు గుచ్చుకుంటే కీలకత్తి పెట్టి దాన్ని జాగ్రత్తగా తీసి, కిరసనాయిలు పోసి కడిగి, గాయపాకు తెచ్చి కట్టు కట్టి అది మానేంత వరకూ బిడ్డకంటే జాగ్రత్తగా చూసుకుంటారు. అది మా ఊరి మనుషులకూ, జివ్వాలకీ మధ్య పెనవేసుకున్న బంధం. ఎంత చెప్పినా తక్కువే మా ఊరి మనుషుల గురించి, వాళ్ళ మనసుల గురించి. మా ఊళ్ళోనే కాదు. మీ సొంత ఊళ్ళో కూడా, పొట్టేలును ప్రాణంగా చూసుకునే గంగయ్య లాంటి మట్టి మనిషి , తండ్రి చెప్పిన పని కంటే పాల కాయలే ఎక్కువనుకునే పిల్లోడు, తాత తెచ్చి ఇచ్చే మాయా పుల్ల కంటే, జేబులో కమ్మరకడ్డీలు పంచుకుని తినే స్నేహితుడే గొప్ప అనుకునే చిన్నోడు . ఇలా అందరూ తారసపడతారు ఒక సారి కళ్ళు మూసుకుని గుర్తుకు తెచ్చుకోండి. మీరు వెనక వదిలేసిన జ్ఞాపకాల్లో మీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44567403364399,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sonthaoorufrontcover.jpg?v=1759986405"},{"product_id":"dimki","title":"Dimki","description":"\u003cp\u003eDimki (Telugu) Paperback\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనేను పుట్టిన నేల, నాకు అనుభవంలోకి వచ్చిన కొన్ని సంఘటనలు, నా జీవన ప్రయాణంలో నాకు తారసపడిన వ్యక్తులు, లోతుగా పరిశీలించిన కొన్ని కోణాలు నేను రాయాల్సిన అవసరాన్ని తెలిపి నా చేత రాయించినవే ఈ కథలు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eసాహిత్యం సమాజాన్ని కచ్చితంగా ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. కథలు, నవలలు చదివి తమ సమస్యకు పరిష్కారం వెతుక్కునే వాళ్లు కొందరైతే, ఆ పాత్రలలో తమని చూసుకుని ఎమోషనల్ అయ్యే వాళ్ళు కొందరు. తెలియని విషయాలను గురించి తెలుసుకునేవాళ్ళు కొందరైతే, తెలిసిన విషయాన్నే వాళ్లకు తెలియని కొత్త కోణంలో తెలుసుకుని వాళ్ళ ఆలోచనా ధోరణిని మార్చుకునేవాళ్ళు కొందరు. అటువంటి మార్పులు తీసుకొచ్చిన కథలు, నవలలు కోకొల్లలు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eమన రచన మొత్తం సమాజాన్నే మార్చేయలేకపోవొచ్చేమో కానీ దాన్ని చదివే ఏ ఒక్కరినైనా కదిలించగలగి, ఒక ఆలోచనను రేకెత్తించగలిగి, ఆ ఆలోచనే రేపటి మార్పుకు పునాది కావాలి. ఒక రచయిత అక్షరానికి అంతకంటే గొప్ప గుర్తింపు, గౌరవం మరేదీ ఉండదని నా నమ్మకం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003e-స్ఫూర్తి కందివనం\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eరచయిత్రి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44609342865455,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/DimkiFrontcover.jpg?v=1761291149"},{"product_id":"pedaraasi-peddhamma-kathalu","title":"Pedaraasi Peddhamma Kathalu","description":"","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44666993573935,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/IMG_20251113_104250.jpg?v=1763011041"},{"product_id":"sri-krishnadevaraayala-kathalu","title":"Sri KrishnaDevaRaayala Kathalu","description":"","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44666994163759,"sku":null,"price":140.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/IMG_20251113_104231.jpg?v=1763011158"},{"product_id":"nadi-moodava-oddu","title":"Nadi Moodava Oddu","description":"\u003cp\u003e\u003cspan\u003eతెలుగు సాహితీలోకం నిర్మలానందగా పిలుచుకునే ముప్పన మల్లేశ్వరరావు గారు 5-6 కలంపేర్లతో (తెలుగుదాసు, విపుల్ చక్రవర్తి, విపుల్ రాజ్, వాత్సాయనుడు) విదేశీ, భారతీయ భాషల్లో విస్తృతంగా అనువాదాలు చేశారు. అనువాదంలో ఎందరికో చాలా గొప్ప స్పూర్తిగా, అందుకోవడం కష్టమైనంత పెద్ద కొలమానంగా నిలబడ్డారు. ఈ పుస్తకం ద్వారా ఆయన విదేశీ అనువాదాలు కొన్ని పాఠకుల దగ్గరికి చేరుస్తున్నాము.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44718636892207,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/NadiMoodavaoddu.jpg?v=1764328212"},{"product_id":"guns-and-monsoons","title":"GUNS AND MONSOONS","description":"\u003cp\u003e\u003cspan\u003eగన్స్ \u0026amp; మాన్సూన్స్ మహి బెజవాడ కథలు ఉద్దేశ్యాలు స్పష్టంగా ఉంచి కథనం తిరకాసు చేయడం అందరికీ రాదు. తిరగేసి కొట్టడం ఇది. చదరంగం అందరూ ఆడతారు. గడులకు ఇటుక రంగు, గోరింట రంగు పూసి ఆడుదాం అనుకోవడం ఇది. ప్లాస్టిక్ బాటిల్ మూతలను వాంతి చేసే హిమాలయాలు, వలస వచ్చి సముద్రంలో ఎప్పటికీ దిగని రొయ్యలు స్లమ్స్ తో నిండిన ఇసుక తీరాలు, సీలింగ్ ఫ్యాన్లను నెత్తి మీద పెట్టుకుని తిరిగే విద్యార్థులు, బంగారాన్ని విడిపించి ఇచ్చే వారున్నట్టుగానే తమ పాత జన్మలను ప్రభుత్వ ఖజానాల నుంచి విడిపించిమ్మని తిరిగే ఉద్యమకారులు, తాకట్టుకు సిఫార్సు చేయమని తిరిగే బుద్ధిజీవులు... ఇలాంటి సంకేతధారుల జాతర ఈ కథలేగానీ... వీరి మధ్య తిరుగుతూ కథకుడు అప్పుడప్పుడు ఉమ్మి ఎంగిలి తుడుచుకుంటున్నాడా అనిపిస్తుంది. అపభ్రంశ కథనంతో లాంగ్ ప్రోజ్ రాయడం చాలా కష్టం. సాధించాడు. బాగా తెలిసిన ముఖాన్ని మార్కెట్లోకి వచ్చిన సరికొత్త కెమెరాతో, ఫిల్టర్లతో అరె అనిపించేలా చేసే పనితనం ఈ కథనంలో ఉంది. నిన్నటి కొత్తలను నేడొక రోతలుగా చెప్పడం కూడా. మహి బెజవాడ తెలుగులో త్రిపుర, డా. వి. చంద్రశేఖరావు పరంపరను కొనసాగించగల కథకుడు అనిపిస్తున్నాడు. కథల ఎంపికలో ఇతని నిశ్చిత స్వభావం ఈ కలం గబుక్కున కుళాయి నీరు పట్టి రాయదు అని పరికించి చూసేలా చేస్తోంది. గుంపు నుంచి ఒక బాతు విడివడి బెకబెకమని ఇషారా చేస్తోంది. మడుగుల్లో చుట్ట చుట్టుకున్న పాముల గురించి ఏమో. ఇలాంటి కథకుడు ఉండాలి. - మహమ్మద్ ఖదీర్ బాబు\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44720282665007,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Gunsfront.jpg?v=1764417894"},{"product_id":"siya-hashiye","title":"Siya Hashiye","description":"\u003cp\u003eSaadat Hasan Manto and Purnima Tammireddy\u003cbr\u003e\u003cspan\u003eసాదత్ హసన్ మంటో ప్రముఖ ఉర్దూ కథా రచయిత. ఆయన 1938-1951 వరకు మతకల్లోలాలపై రాసిన కథలను, వ్యాసాలను, \"సియా హాషియే\" అనే 32 చిట్టి కథలు ఈ పుస్తకంలో ఉంటాయి. మంటో రచనల అనువాదంతో పాటు ఆనాటి సాహిత్య విమర్శకుల అభిప్రాయాలు కూడా ఇందులో పొందుపరిచారు. పూర్ణిమ తమ్మిరెడ్డి అనువాదం చేశారు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743873167407,"sku":null,"price":190.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/siyahashiyebymanto.jpg?v=1765032591"},{"product_id":"emotional-pregnancy","title":"Emotional Pregnancy","description":"\u003cp\u003eEmotional Pregnancy (Short Stories) [Paperback] Purnima Tammireddy\u003cbr\u003e\u003cspan\u003eప్రేమ, పాశం, విరహం, దుఃఖం - ఇలాంటి వాటి గురించి మనకు తెలిసిన అర్థాలను, ఉన్న అనుభవాలను సవాలు చేసే కథాంశాలివి. తెలుగులోనే రాసినా, తెలుగు సాహిత్యానికి అలవాటు లేని శైలి, వ్యక్తీకరణలు ఉన్న కథనాలివి. అర్బన్ జీవితాల్లోని కనిపించని, కనిపించనివ్వకుండా దాచే విషయాల గురించిన కథలివి. మొత్తం 25 కథలు. విలక్షమైన కథలు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743873953839,"sku":null,"price":290.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/EmotionalPregnancy.jpg?v=1765032730"},{"product_id":"nemarese-stories","title":"Nemarese Stories","description":"\u003cp\u003eNemarese Stories: Peddala kosam Pillala Kathalu\u003cbr\u003e\u003cspan\u003eMullapudi Sridevi has re-spun age-old children stories from the Panchatantra and Jataka tales for the new-age elders, especially moms and grandmoms. In this age of pervasive technology, a group of ladies come together in a neighbourhood park to share stories that they can relay to the kids at home. Sridevi's simple and effective storytelling combined with compelling illustrations by Anvit, Arnav and Ananya, this is a children's book that all adults can read and enjoy! ఈ పుస్తకంలో మొత్తం పదహారు కథలు ఉన్నాయి. పంచతంత్రం, జాతక కథలు, జానపద కథల్లో మనకి తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని. మనకు మామూలుగా పరిచయం ఉన్న పిల్లల పుస్తకాలకంటే ఈ పుస్తకం రెండు విధాల కొత్తది. అ) ఇందులో చిన్న పిల్లల కథలను పిల్లలకు కాకుండా పెద్దలకు చెప్పారు. ఆ) కుటుంబాలలో పరిమితమైన కథా సమయాన్ని కమ్యూనిటీ స్థాయిలోకి, పెద్దల మధ్య సాయకాలం వ్యాపకంగా రచయిత్రి తీసుకొచ్చారు. ఆన్విత్(10), ఆనవ్ (12), అనన్య గీసిన బొమ్మలు ఇందులో ఉన్నాయి. ఈ కథలు చదువుతూ మీరు కాసేపు చిన్నపిల్లలై పోవడానికి, ఆ పైన మీ చుట్టూ ఉన్న పిల్లలకు కథలు చెప్పడానికి, వెంటనే ఒక కాపీ సొంతం చేసుకోండి మరి!\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743874412591,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/NemareseStoriescover.jpg?v=1765032876"},{"product_id":"hamid-dalwai-kathalu","title":"Hamid Dalwai Kathalu","description":"\u003cp\u003eHamid Dalwai Kathalu [Paperback] Hamid Dalwai and Volga\u003cbr\u003e\u003cspan\u003eA collection of 12 stories written by Hamid Dalwai, the Marathi writer, translated to Telugu by Volga and published by Elami. హమీద్ దల్వాయి ప్రముఖ మరాఠీ రచయిత. ఆయన 1950,60లల్లో రాసిన కథలలో 12 కథలు ఓల్గా గారు తెలుగులోకి అనువాదం చేశారు. ఈ కథలు వేటికవే వైవిధ్యంగా, విభిన్నంగా ఉంది దల్వాయిలోని రచనా ప్రతిభకు అద్దం పడతాయి. తెలుగులో మొట్టమొదటి సారి వీరి కథలు ప్రచురితమయ్యాయి.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743875297327,"sku":null,"price":260.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Hamiddalwaikathalubyvolgabook.jpg?v=1765033177"},{"product_id":"manasu-nunchi-manasuki","title":"Manasu Nunchi Manasuki","description":"\u003cp\u003eManasu Nunchi Manasuki: Nainaji Smaranalo\u003cbr\u003e\u003cspan\u003eIn in this Telugu translation of Vidya Rao's \"Heart to Heart: Remembering Nainaji\", readers are taken through a journey of not just renowned Thumri and Dadra Singer, Naina Devi's life, but also touches upon many a women artists lives. Vidya Rao, a classical singer and Naina Devi's discipline, interweaves her lifestory of Naina ji and her memories with her guru. This work is part memoir, part biography and part social commentary.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743875919919,"sku":null,"price":230.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Manasununchimanasuki.jpg?v=1765033356"},{"product_id":"teru-itara-kathalu","title":"Teru - Itara Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eTelugu translation of Kannada Short Story Collection, \"Neelakurinji\" by Dadapeer Jyman, that won the Sahitya Akademy Yuva Puraskar Award for 2022. The Telugu translation is masterfully done by D.V. Subhashri. The collection contains 10 short stories dealing with urban migration, gender identities, and childhood stories.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743879426095,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Teru-Itarakathalubook.jpg?v=1765033701"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/short_stories.jpg?v=1754994667","url":"https:\/\/books.ataka.in\/collections\/short-stories.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}