{"title":"కథల గోదారి - వంశీ","description":"","products":[{"product_id":"evo-konni-gurthukostunnai","title":"Evo konni gurthukostunnai","description":"\u003cp\u003e\u003cspan\u003eవంశీగారు నాకే కాదు గోదావరిని, తెలుగుని, అమ్మని, అమ్మ చేతివంటని, ఇల్లాలిని, ఇల్లాలి అలకలని, కులకులని, పిల్లాపాపలని, పాడిపంటలని, బతకనేర్చినతనాలని, బడాయి ఫోజులని, కాలవగట్లని, కన్నెపడుచుల్ని, బోళాశంకరుల్ని, బోసినవ్వుల్ని, నిష్కపట హృదయాలని, ‘నిన్న’లకు సాక్ష్యంగా నిలిచిన ప్రతీ చెట్టుని, పుట్టని... ప్రేమించే అందరికీ ఆయన దగ్గరి చుట్టం.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058118254639,"sku":null,"price":600.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/eco_konni_guthukostunnai.jpg?v=1774330698"},{"product_id":"polamarina-jnapakalu","title":"Polamarina Jnapakalu","description":"\u003cp\u003e\u003cspan\u003eపొలమారిన జ్ఞాపకాలు  BY వంశీ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058126741551,"sku":null,"price":900.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Polamarinagnapakalu.jpg?v=1773677219"},{"product_id":"ma-diguva-godavari-kathalu","title":"Ma Diguva Godavari Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eఈ దిగువ గోదారి కథలు రాయడానికి ముందు వంశీగారు అధ్యయనం చేసుకోవడం కోసం కొన్ని నెలల పాటు కారుల్లోనూ, పడవల మీదా ప్రయాణం చేసి ఇక్కడున్న గ్రామాలు, పల్లెలు, లంకల్లో మకాం చేసి ఇక్కడి జీవితాన్ని కళ్ళారా చూసి వింతలు, విడ్డూరాలను అక్కడి ప్రజలు చెప్పగా చెవులారా విని, స్పందించి అందరికీ ఆసక్తికరంగా వుండేలా రాశారు. ఈ కథలన్నిటికీ బాపూ వేసిన బొమ్మలు మామూలు బొమ్మలు కావు. రూపానువాదాలు. టీకా తాత్పర్యాలు, అద్భుత వ్యాఖ్యానాలు. స్వాతి వారపత్రికలో 52 వారాలు ప్రచురింపబడిన ఈ కథలు దేనికదే మాస్టర్ పీస్. తప్పక చదవండి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058135883823,"sku":null,"price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/madiguvagodavarikathalu.jpg?v=1773677404"},{"product_id":"aakupacchani-gnapakam","title":"Aakupacchani Gnapakam","description":"\u003cp\u003e\u003cspan\u003eవంశీకున్న సమాజాన్ని వీక్షించే దృష్టికోణం గురించి, మానవ సంబంధాల పట్ల ఆర్తిగా స్పందించే గుణం గురించి అతి కొద్దిమందికే తెలుసు. ఆ కొద్దిమందికి తెలిసిన లక్షణాలు ఈ కథా సంపుటం ద్వారా అందరికీ తెలిసిపోతాయి. 31 కథలు, 1 నవలిక - ఇదీ ఆకుపచ్చని జ్ఞాపకం. ఇన్ని కథలు చదివాక, మనం చూడని ప్రాంతాలు చూసినట్లు, మనకు తెలియని జీవితాలు తెలిసిపోయినట్లు, అర్థంకాని మానవ హృదయపు లోతులు అర్థమైపోయినట్లు, ఆ ప్రాంతాల జీవితాల్లో మనమూ భాగమైపోయినట్లు అనిపిస్తుంది. మనసు ఆనందంతో తేలిపోతుంది. గుండె బాధతో బరువెక్కుతుంది. ఇదీ... వంశీ కథల ప్రత్యేకత.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058136342575,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AakupacchaniGnapakam.jpg?v=1773677547"},{"product_id":"manyamraani","title":"Manyamraani","description":"\u003cp\u003e\u003cspan\u003eమిగతా ఆడవాళ్ళకంటే ఎత్తుగా పుష్టిగా వుండే ఆమెది అల్ల నేరేడు పండు రంగు శరీరం. కంబాల చెరువుల్లాంటి కళ్ళు. ఆమె నవ్వితే గురు పౌర్ణమి నాటి వెన్నెల అక్కడ పరుచుకుంటుంది. ఏడిస్తే అఖండ గోదావరి అక్కడ పొంగి పొర్లిపోతుంది. సూర్యుడుదయించి అస్తమించేలోపు తనకెదురైన మనుషుల్తో రెండో మూడో ముక్కలు మాటాడే ఆమె అద్భుతంగా మాటాడేది అద్దంతో మాత్రమే. ఆ మనిషెవరంటే... రాణి...మన్యంరాణి...వెన్నెలరాణి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058143191087,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Manyamrani.jpg?v=1773677746"},{"product_id":"matlade-gnapakalu","title":"Matlade Gnapakalu","description":"\u003cp\u003e\u003cspan\u003e‘‘రాజోలు సెంటర్లో ఫస్టుక్లాసు బజ్జీల్తోపాటు పెసర పొణుకులు కూడా పెట్టిస్తా మీకు’’ అంటా నగరంలో ముస్లిం మిత్రుడు మిల్లుబాబు తమ్ముడు బాజానీ తగిల్తే అతన్తో కాసేపు మాటాడేక అతనిచ్చిన టీలు తాగి పొట్లాలు గట్టిన గరాజీలూ, నాన్రొట్లూ, కాస్టాలూ కార్లో పెట్టిన ఆ కుర్రోడికి బజ్జీల పొట్లాం ఇచ్చేశాక బండి ముందుక్కదిలింది. మొండెపులంకలో జీలకర్ర అట్టు, నాగుల్లంకలో సిట్రా సోడా తాగించిన అక్కిరాజు ‘‘టైముంటే రేపు పి. గన్నవరం వెళదావండి’’ అన్నాడు. ‘‘ఎందుకు సార్?’’ అన్నాడు వెంకటేష్. ‘‘ఆ వూళ్ళో సుబ్బారావు బాదంపాలు చాలా బాగుంటాయి’’ అంటా ఇంకా ఏదో మాటాడ్తుంటే రాజోలు సెంటర్లో ఆగింది ఇన్నోవా. ఆ బండి చుట్టూ ఒకటే జనం. మేవడిగిన పెసరపొణుకులు సందకాడే అయిపోయినియ్యంట. వంశీ అంటే గోదారి. గోదారంటే వంశీ. విడివిడిగా ఈ ఇద్దరినీ చూడలేము. గలగలపారే గోదారి లాంటి వంశీ ఎన్నో మలుపులు, ఎత్తు పల్లాలు తన అనుభవంలోంచి కొన్ని మనకూ చెప్పారు. చదవండి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058425159727,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/MatladeGnapakaalu-a_aa9f4df1-136e-4da3-8e8c-f18b7923c61c.jpg?v=1773683111"},{"product_id":"venditera-navalalu","title":"Venditera Navalalu","description":"\u003cp\u003e\u003cspan\u003eశంకరం లోనికొచ్చి కూర్చోబోతుండగా, కాళ్లకి చిన్న చిన్న ఇత్తడి బిందెలు రెండు తగిలాయ్. వాటిని కళ్ళకద్దుకొని, తల్లిచెప్తున్నా వినిపించుకోకుండా రెండుచేతుల్లోకి తీసుకొని లయగా వాయించసాగాడు. నిద్రరాని ఓ పెద్ద మనిషి అగ్గిపెట్టెని తీసుకుని వేళ్లతో దానిమీద తాళంవేస్తూ శంకరానికి మరింత హుషారు తెప్పిస్తుంటే బిందెలు పక్కనపెట్టి తన పక్కన కూర్చున్న ఆమెనుంచి తాళంగుత్తి తీసుకుని ఆ అగ్గిపెట్టె శబ్దాన్ని అనుకరించసాగాడు. ప్రయాణీకులందరూ ఆ చిన్న సైజు వాద్య కచేరీని ఆనందంగా తిలకిస్తుండగా సరంగు లాంచిని దగ్గరపడుతున్న రేవువైపు మళ్లించే నిమిత్తం చుక్కాని చక్రం తిప్పాడు.  గోపాదాల రేవు దిగిన తులసి నిద్రలో జోగుతున్న శంకరాన్ని, రేవు ఒడ్డునున్న ముసలి రావిచెట్టు చప్టామీద పడుకోబెట్టి దుప్పటికప్పి, వాడి పక్కనే కూర్చుని ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడసాగింది.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058430337071,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/venditeranavalalu.jpg?v=1773683345"},{"product_id":"rangularatnam","title":"Rangularatnam","description":"\u003cp\u003e\u003cspan\u003eగోదారెప్పుడూ అమ్మలాగే వుంది. గాలెప్పుడూ హాయి హాయిగా జాయి జాయిగా వుంది. ఆ తల్లి గోదావరి, ఆ చెల్లి గోదావరి, ఆ అక్క గోదావరి, ఆ పిల్ల గోదావరి, ఆ హాయి గోదావరిలోంచి హాయి హాయిగా వీస్తున్నాయి గాలులు. అటుపక్క జూస్తే కోటిపల్లి తీర్థవంతా కళకళ్ళాడిపోతుందా సాయంత్రం. ఆ తీర్థంలో, ఆ జనాల్లోంచి పరుగెట్టుకుంటావస్తున్నాడు లాటరీ టిక్కెట్లమ్మే రామప్రసాదు. పడతా లేస్తా అందర్నీ అన్నింటినీ తప్పించుకుంటా రంగులరాట్నం దగ్గరకొచ్చి, తిరుగుతున్నవాళ్ళంతా తిప్పుతున్న ఆ రాట్నాన్ని.... ఆ రంగులరాట్నాన్ని ఆపేసి వీర్రాజూ బుల్లెమ్మలతో ‘‘మీకు లాటరీ తగిలింది.... లక్షకాదు రెండు లక్షలు కాదు.... పదిలక్షలు’’ అంటా అరిచాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058432303151,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/rangularatnam.jpg?v=1773683575"},{"product_id":"galikondapuram-railway-gate","title":"Galikondapuram Railway Gate","description":"\u003cp\u003e\u003cspan\u003eమహారణ్యంలో చాలా ఎత్తయిన కొండల సమూహం మధ్యలోవున్న ఆ చిన్న స్టేషను పేరు గాలికొండపురం రైల్వేగేటు. స్టేషనుకి దిగువగా వుంది ఊరు.  అప్పుడు సమయం రాత్రి 12 గంటలు. వచ్చే రైళ్ళేమీ లేకపోవడంతో నిశ్శబ్దంగా వుందా ప్రాంతం. చేతితో తాకితే చీకటి పొడి రాలుతుందా అనిపించేటంతటి కటిక చీకటి. నిద్రపోని రుషిపక్షుల అరుపులు. ప్రేతాత్మగొంతులా ఎత్తయిన గాలికొండ మీంచి సుళ్ళు తిరుగుతూ వీస్తున్న గాలులు. ఎదుటి మనిషి స్పష్టంగా కన్పించనంత దట్టంగా మూసుకుపోయిన మంచు. కేన్సర్లా నరాలు కొరుకుతున్న చలికి మెలికలు తిరుగుతున్న ప్రకృతి కన్య, చీకటి దుప్పటి నిలువునా కప్పుకుంది. గడ్డ కట్టిన ఆ అందంలో చాలా పొద్దు గడిచింది. హఠాత్తుగా శబ్దాలు… స్టేషను మధ్య రైలుపట్టాల మధ్యనున్న ఉడెన్ స్లీపర్స్ మీద వేగంగా పరిగెడ్తున్న బలిష్టమైన ముగ్గురు వ్యక్తుల్ని చేతిలో రివాల్వర్తో ఛేజ్ చేస్తున్నాడతను. కొంతదూరం వెళ్లాక రైలుబాట పక్కనే లోయలోకి వెళ్ళడానికి వున్న చిన్న కంకర దారిలోకి దిగి జరజరా జారి, దొర్లి, క్షణాల్లో మాయమయ్యారు ముగ్గురూ. అది గమనించని అతను తిన్నగా ముప్ఫైఏడో నెంబరు టన్నల్లో పరుగెట్టి, అలా కొంతదూరం వెళ్ళాక ఆగి వాళ్ళు ఎటువెళ్ళారో అర్థంగాక అటు ఇటు తచ్చాడుతూ కొన్ని క్షణాలు ఒకచోట ఆగాడు. అంతే- రింగ్ ఆకారంలో వుండి గుప్పెటికి సరిపడే చుట్టుకొలతతో వున్న తాడొకటి మెరుపువేగంతో అతని మెడలో పడటం, విడదీసుకునే ప్రయత్నం చేసేలోపే అది బలంగా బిగుసుకుపోవడం జరిగిపోయాయి. ఊపిరాడక గిలగిల్లాడుతున్న అతని ముక్కుకి క్లోరోఫాం నింపిన తెల్లటి సిల్కు గుడ్డ మెత్తగా అద్దబడడంతో క్షణాల్లో స్పృహతప్పి పట్టాలమీద క్రాస్గా పడిపోయాడు. సిగ్నల్లో ఎర్రదీపం ఆరి పచ్చదీపం వెలగడంతో ముగ్గురూ అక్కడ్నుంచీ పరుగుపెడ్తూ వెళ్ళిపోయారు.  కాస్సేపటికి అతను పడున్న పట్టాలమీదుగా ఏభై లోడు వేగన్లు బిగించివున్న పొడుగాటి గూడ్సు ట్రైను శరవేగంగా ప్రయాణిస్తూ వస్తోంది. పడివున్న అతనిలో కదలిక లేదు. బాగా దగ్గరకొచ్చేసిన ట్రైను అతన్ని ముక్కలుగా చీల్చుకుపోవడానికి ఇక పది అడుగుల దూరం మాత్రమే ఉంది. అతనికి క్లోరోఫాం మత్తు వదలడానికి ఇంకా రెండు గంటలు పడ్తుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058433876015,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/GalikondapuramRailwayGate.jpg?v=1773683980"},{"product_id":"mahallo-kokila","title":"Mahallo Kokila","description":"\u003cp\u003eమహల్లో కోకిల వంశీ\u003c\/p\u003e\n\u003cp\u003eగండశిలని చేద్దామనుకుంటుంది తన హృదయాన్ని. కానీ, ప్రతిక్షణం, ప్రతిసంఘటన ఆమెని స్పందింప చేస్తూనే వుంటాయి.  ఆమెకి  జీవితం  మీద  ఏమాత్రం  ఆశా, తాపత్రయాలు లేవు. ఊహల ఉయ్యాలలతో వెన్నెలపల్లకి నిర్మించాలనే  కోరిక  ఆమెకు  లేదు.  కానీ,  దేన్ని కాదంటుందో, ఏది చెయ్యకూడదనుకుంటుందో అదే చెయ్యాల్సిన పరిస్థితి ఆమెది. ఆమె గతం చిత్రవిచిత్రాలతో నిండిన ఓ వ్యజియం. అందులో ఎన్నో భయానకమైన ఉదంతాలు నిండి ఉన్నాయ్. ఆ గతం ప్రపంచానికి తెలిస్తే తనకి మానసికక్షోభ. ఆర్తితో తను విలవిల్లాడి చనిపోతుంది. అందుకే గత చరిత్ర ఛాయా మాత్రంగా కూడా తెలీకుండా భూగర్భంలో నిధిలా దాచేసింది మన మహల్లో కోకిల.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058435219503,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/MahalloKokila-a.jpg?v=1773684214"},{"product_id":"gokulamlo-radha","title":"Gokulamlo Radha","description":"\u003cp\u003e\u003cspan\u003eప్రభాత కాంతిలో నీ సున్నితమైన దేహాన్ని తడిపి తడిపి నీలి శిరోజాల్ని జగమంతా పరిచి పరిచి నీ నీడలో నా నీడ కలిసే మధురక్షణం కోసం మన కలల జలతారుని కప్పుకుని నిశ్శబ్దంగా నాకోసం జపిస్తూ తపిస్తూన్న ప్రియా! నీ సుదీర్ఘ లేఖలన్నీ అందాయి…  యుగయుగాలుగా నాకోసం వేచి చూస్తున్న ఒక శోకవనితవైన నిన్ను శరవేగంతో వచ్చి అందుకుని నీ గాఢ పరిష్వంగంలో ఐక్యం అయ్యి, నీలో నేనుగా, నాలో నువ్వుగా జీర్ణమయ్యి నీ చిలిపి కలహాల్ని ఆరగించి, నీ విరహ వేదనని శ్వాసించి, మన కేళీ విన్యాసాల ఉద్గృంధ గవాక్షాలు తెరచి, ఓసారి పరిభ్రమించి అనంతరం క్రమించి, రమించి, ఉపశమించి, అలసటతో దగ్ధమై, ఒక విశేషమూర్తిగా  రూపాంతరం చెందాలని నా ప్రగాఢమయిన తపన, యాతన, వేదన. కానీ కాలం? నన్ను నువ్వు, నిన్ను నేను అందుకోవాలని కాంక్షతో ఎంతగా కాలిపోతున్నామో అంతగానూ దూరం చేస్తుందీ కాలం. ఔను. నేను కాలానికి ఎదురీదలేక, రాసే రాతల్లోనే స్వర్గసౌధాల్ని నిర్మించి, ప్రేరేపించి నిన్ను శోకింపజేస్తున్న  పిరికివాడ్ని, నీచుడ్ని, అర్భకుడ్ని ఔనా? లేకుంటే, నీకంటే ఈ ప్రపంచంలో ఎవరూ అధికులు కారని తెలిసికూడా వందల మైళ్ళు దూరం పారిపోయి ఉద్యోగం, ధర్మమంటూ నిన్ను ఆ నది ఒడ్డున ఒంటరిగా వదిలివేయడం నేరంకదూ? పాపం కదూ? నీ లేఖల్లో జాలిగా జారే కన్నీటి ధారలు ఇక చూడలేను. నీకోసం నేను వచ్చే సమయం ఆసన్నమయింది. మరో పది రోజులు పోయాక ఇంకో ఉత్తరం రాసారు. జవాబు రాలేదు. రెండు వారాలు పోయాక ఇంకో ఉత్తరం రాసారు.జవాబు రాలేదు. \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058439512111,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gokulamloradha-a.jpg?v=1773684382"},{"product_id":"ravvala-konda","title":"Ravvala Konda","description":"\u003cp\u003e\u003cspan\u003e‘‘రాత్రంతా నాకు నిద్రరాలేదు. మనసునిండా చీకటి. ఆ చీకట్లో నిన్న రాత్రి మనం కన్న ఆ కల ఎక్కడయినా కనిపిస్తుందేమోనని వెలిగించిన ప్రమిదని అరచేతుల్లో పట్టుకుని వెతికాను. ఎక్కడా కనిపించలేదు మనం ప్రసవించిన ఆ అపురూపమైన కల, చివరికి  తెలిసింది నువ్వు లేనప్పుడు ఆ కల నాకెందుకు కనిపిస్తుందీ అన్న సత్యం.  చూడూ! నువ్వు నా ఆరోప్రాణం. ఇన్నాళ్ళు ఎలా బ్రతికానో నాకు తెలీదు. నువ్వు లేకుండా ఇక ముందు బతకడం మాత్రం నాకు సాధ్యం కాదు.’’ ఆ వెన్నెల రాత్రి వెలగచెట్టు నీడలో అలా చాలాసేపు మాట్లాడింది రాజకుమారి.  ‘అంత గొప్పమనిషి అనుకోకుండా నా ప్రాణంలో ప్రాణం అయింది. ఈ మనిషికి దగ్గరయ్యాను. సరే దక్కించు కోగలనా చివరికి?’ అనుకున్నాడు రవ్వలకొండ.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058451308591,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ravvalakonda.jpg?v=1773684557"},{"product_id":"manchu-pallaki","title":"Manchu Pallaki","description":"\u003cp\u003e\u003cspan\u003e”సృష్టిలో రకరకాల సౌందర్యాలు. కొన్నింటిని దూరాన్నుంచే చూస్తూ ఆనందించాలి. అవసరం కలిగేదాకా వాటికి దగ్గరవ్వకూడదు. ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తే ఏమౌతుంది? అంతే అవుతుంది. వాటి ప్రత్యేకత, ప్రాముఖ్యత నశిస్తాయి. అవును. ఇక ఇంటికెళ్ళకూడదు.  ఎంతకాలం వరకూ? కొన్ని సంవత్సరాల వరకూ. కృష్ణుడికోసం నీరజ ఎదురుచూసి చూసి కడకి ఆ తమాలవృక్షాల ఛాయల్లోనే సమాధి కాలేదూ???. ”అంతకాలం వరకూ జయ ఎదురుచూస్తుందా???”.\\nమల్లెల ముగ్ధత్వానికీ, మంచి ముత్యాల తెలుపుకీ ప్రాణం పోసింది కారుణ్య. గులాబీల పరిమళానికీ, సంపెంగల సౌరభానికీ ఆయుష్షునిచ్చింది కారుణ్య. తేనెలో తియ్యదనానికీ, వెలగపండులో వగరుదనానికీ జీవితాన్నిచ్చింది కారుణ్యే. చెప్పడం చేతకాదుకానీ ఎంతందంగా వుంటుంది కారుణ్య.  మీరా చాలా విచిత్రమైన మనిషి. ప్రతీ విషయం కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడుతుంది. కేంటీన్కి రమ్మని పదిసార్లు పోరుపెడితే ఒక్కసారి మాత్రం వస్తున్నందుకు తనని చెడామడా తిట్టేస్తుంది. తన దగ్గర ఏదైనా పుస్తకం తీసుకుంటే తిరిగి ఆమె నుంచి తీసుకునే నాటికి లోపలా, పైనా ”మీరా… మీరా” సంతకాలు ముగ్గుల్లా నిండిపోయి వుంటాయి. తన రూమ్కి వస్తే అలారం ఫుల్ కీ ఇచ్చేస్తుంది. కర్ కర్ మనిపిస్తుంది. ట్రాన్షిష్టరు ఆన్ చేసి వాల్యూమ్ వీల్ ఆఫ్ చెయ్యకుండానే బాండ్ మార్చేస్తుంది. ఇలా అల్లరి చేస్తుంది మీరా. తన జీవితంలో ఓ అధ్యాయం ముగిసింది. మళ్ళీ కొత్తది మొదలవ్వబోతుంది. జీవితంలో ఎవరి ఆదరణా ప్రేమాభిమానాలు పొందలేకపోయాడు. ప్రతీ జీవరాశికీ శత్రువయ్యాడు. అడుగడుగునా ఓటమి నెదుర్కుంటూ, ఎవరికీ అర్థం కాలేకపోయాడు. అందరిచేతా అసహ్యించుకోబడ్డాడు. అయితేనేం… తను గెల్చాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058500493359,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ManchuPallaki-a.jpg?v=1773685768"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/vamsy.jpg?v=1774075273","url":"https:\/\/books.ataka.in\/collections\/vamsy.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}