{"title":"యద్దనపూడి","description":"\u003cp\u003eWelcome to the ultimate online Telugu bookstore collection for Yaddanapudi Sulochana Rani, the legendary queen of romantic fiction and social drama. Whether you are looking to buy iconic Telugu books online like Agni Poolu, Secretary, Meena, and Keerthi Kireetalu, or exploring classic vintage literature, Ataka offers premium, high-quality reprints of her finest works.\u003c\/p\u003e\n\u003cp\u003eSourced directly for modern readers and the global NRI diaspora, our curated Telugu book store ensures you get beautifully bound physical editions of her timeless novels. Explore our Yaddanapudi collection today and reclaim the joy of authentic Telugu literature.\u003c\/p\u003e","products":[{"product_id":"aaradhana","title":"Aaradhana","description":"\u003cp style=\"text-align: left;\"\u003e\u003cspan\u003eఅనంత్ ను  భర్తగా  పొందగానే   అంతా   అన్నపూర్ణను\u003c\/span\u003e\u003cspan\u003e అదృష్టవంతురాలన్నారు. తీరా  అనంత్  జీవితంలోకి  అడుగు\u003c\/span\u003e\u003cspan\u003eపెట్టిన  తర్వాత  గాని  ఆ అమ్మాయికి  తన  అదృష్టం ఏపాటిదో \u003c\/span\u003e\u003cspan\u003e తెలిసిరాలేదు.\u003c\/span\u003e\u003cspan\u003e      అతనిచుట్టూ   అతి   భయంకరమైన   గతం   కోటగోడలా\u003c\/span\u003e\u003cspan\u003e పటిష్టంగా  ఉండిపోయింది.  అనంత్   దగ్గరికి   ప్రవేశం  ఎలాగో\u003c\/span\u003e\u003cspan\u003e అర్ధం   గాని  అన్నపూర్ణ  అలాగే  నిలబడిపోయింది.\u003c\/span\u003e\u003cspan\u003e  \u003c\/span\u003e\u003cspan\u003eఆ  దుర్భేద్యమైన   గోడను  ఛేదింపగలదా  ఆ  మూగపిల్ల! \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055034490927,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Aaradhana.jpg?v=1773595084"},{"product_id":"agni-poolu","title":"Agni Poolu","description":"\u003cp\u003e\u003cspan data-mce-mark=\"1\"\u003e  ఆ రోజు ఆకాశం ఎంతో నీలంగా, నిర్మలంగా ఉంది. దాని క్రింద ఎకరాల కొద్దీ ఉన్న చేలమీద హరితవర్ణం ఎన్నడూ చూడనంత అందంగా చూడముచ్చటగా ఉంది. ఆ చేలకి దూరంగా, వలయాకారంగా కొండలు ఉన్నాయి. వాటిమీద నుంచి చల్లటి గాలి, సాయంకాలపు షికారుకి బయలుదేరినట్లుగా మెల్లమెల్లగా వస్తోంది. ఆ గాలి సంతోషంతో నాట్యం చేస్తూ వస్తున్నట్లుగా, ఆ కొండమీద నుంచి జారి అక్కడవున్న ఎత్తయిన చెట్ల శిఖరాగ్రాలని తాకి, పచ్చటి చేలమీదుగా ఆ ఊరి చివరగా ఉన్న పెద్ద చెరువు మీదకి వస్తోంది. ఆ చెరువు ఆ ఊరి పొలాలకి  అమృతభాండంలాంటిది!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e               దాని సాగు క్రిందనే వందల ఎకరాలు సాగు అవుతూ, ఆ చుట్టు ప్రక్కల ఊళ్ళని సుసంపన్నం చేస్తున్నాయి. ఆ చెరువుకి దూరంగా, ఒకనాటి వైభవానికి చిహ్నంగా, పాతకాలపు నగలా, అపురూపంగా, అద్దాల తలుపులున్న పెద్ద కిటికీలతో, పొడుగాటి వరండాలతో, చక్కగా అల్లుకున్న రకరకాల - రంగు రంగు పూలతీగలతో ఒక పెద్ద మేడ ఉంది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055037243439,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/agnipoolu.jpg?v=1773595318"},{"product_id":"jeevana-sourabham","title":"Jeevana Sourabham","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055041208367,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/jeevasaurabham.jpg?v=1773595450"},{"product_id":"krishna-lohitha","title":"Krishna Lohitha","description":"\u003cp\u003e\u003cspan data-mce-mark=\"1\"\u003e  స్పెషల్ వార్డులో ఉన్న గది తలుపులు నిశ్శబ్దంగా తెరుచుకున్నాయి. అవంతి లోపలకు అడుగుపెట్టింది! గదిలో మంచం మీద తరుణ్ నిద్రలో ఉన్నాడు. అతని రెండు చేతులు మణికట్టు దగ్గర కట్టు కట్టి ఉన్నాయి. వాటిని చూడగానే, అవంతి కళ్ళనుంచి నీళ్ళు జలజలా రాలినాయి! నిన్న \"ఇదేమిటి?\" అని తను అడిగినందుకు 'జవాబు'గా అతను మణి కట్ల దగ్గర నరాలు బ్లేడుతో కోసుకుని చచ్చిపోవటానికి సిద్ధం అయ్యాడు. అవంతి పరుగెత్తి మంచం దగ్గర మోకాలి మీద కూలబడి అతని చేతి దగ్గర తల దాచుకుంది. తరుణ్ కి మెలకువ వచ్చింది. \"అవంతీ! నీకు... నీకు.. కృష్ణలోహిత... అంటే తెలుసా?\" అన్నాడు అస్పష్టంగా.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e           తెలియదన్నట్టు తల తిప్పింది. \"కృష్ణలోహిత.. అంటే నలుపు వర్ణం కలిసిన ఎరుపురంగు. నలుపు అంటే చీకటి. శూన్యం! ఎరుపు అంటే రక్తం! హత్య. నా మనసు ఈ రెండింటిలో ఎటు వెళ్ళాలో తెలియక కొట్టుమిట్టాడుతోంది. నాకు మూడో దోవ లేదు. లేదు అవంతీ..\" ఇది వినగానే, నీళ్ళునిండిన అవనతి కళ్ళలో ఆశ్చర్యం. అయోమయం. భయం. ఏమిటి దీని అర్థం. ఆంధ్రుల ఆరాధ్య రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి మరో నవలా రాజం 'కృష్ణలోహిత' తప్పక చదవండి! \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055057657903,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/krishnalohitha.jpg?v=1773595652"},{"product_id":"secretary","title":"Secretary","description":"\u003cp\u003e\u003cspan\u003eఅందం, పరువం, పొగరుమోత్తనంగా కనిపించే ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్ల జయంతి. హుందా, ఠీవి, డబ్బు, పదిమందిలో పలుకుబడి ఉండి, ఆడవాళ్ళని సమ్మోహనపరిచే రూపున్న నిండైన వ్యక్తి రాజశేఖరం. పైకి చెప్పుకోలేకపోయినా జయంతి అంటే అంతరంగంలో అమితమైన అనురాగం రాజశేఖరానికి. అమాయకత్వాన్నీ, అంతస్తుల భేదాన్నీ అధిగమించలేని జయంతి ఆడమనసుకి రాజశేఖరం అంటే అసహ్యం. అందమైన రాజశేఖరం, మరీ అందమైన అతని సెక్రటరీ జయంతి ఈ కథ ఆంధ్రులకు కొత్తదేం కాదు. మనసు లోపల పొరల్లోని ఇష్టాయిష్టాల్ని, రాగద్వేషాల్ని మదించి సునిశితంగా, సుందరంగా చిత్రించే సులోచనారాణి నవలా రచన తెలియంది కాదు! కానీ ఎన్నిసార్లు చదివినా, తిరిగి చదవాలనిపించే 'సెక్రటరీ' అందించే అనుభూతి మాత్రం నవ్యాతి నవ్యం.. చదవండి, మీకే తెలుస్తుంది!!\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055064375343,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/secretary.jpg?v=1773595811"},{"product_id":"sougandhi","title":"Sougandhi","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055069028399,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sougandhi.jpg?v=1773595962"},{"product_id":"girija-kalyanam","title":"Girija Kalyanam","description":"\u003cp\u003e\u003cspan\u003eగిరిజా కళ్యాణం - యద్దనపూడి సులోచనా రాణి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057565851695,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/girijakalyanam.jpg?v=1773671836"},{"product_id":"vijetha","title":"Vijetha","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057567096879,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/vijetha.jpg?v=1773672296"},{"product_id":"nenu-rachaitrini-kanu","title":"Nenu Rachaitrini Kanu","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057569882159,"sku":null,"price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nenurachyitrinikanu.jpg?v=1773672448"},{"product_id":"rutuvulu-navvaayi","title":"Rutuvulu Navvaayi","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057877966895,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/rutuvulunavayyi.jpg?v=1773675721"},{"product_id":"abhijaatha","title":"Abhijaatha","description":"\u003cp\u003eఅభిజాత\u003c\/p\u003e\n\u003cp\u003eమన సంప్రదాయాలు,మన సంఘం శాసించే హద్దులని నేను గౌరవిస్తాను. కానీ ఇవేవి నన్నురక్షించలేదు.మనకి ఒక ఐ.ఏ.యస్.ఆఫిసరు,ఒక ఇంజనీరు,డాక్టర్,టీచర్,ఒక సోషల్ వర్కర్ ఇలా ఆయా వృత్తులలో నిష్ణాతులుగా అవటానికి శిక్షణా కేంద్రాలున్నాయి. ఒక గృహిణి తన సమస్యలని,అన్యాయాలని ఎదుర్కోవటానికి పెళ్ళికి ముందే నిష్ణాతురాలు అవటానికి మనకి ట్రయినింగ్ సెంటర్స్ ఎందుకు లేవు? శిక్షణ యివ్వకుండా గృహిణిని చేసి, సమస్యలసాలెగూడులో స్త్రీని బంధించి యీ సంఘం ఎందుకిలా శిక్షిస్తోంది? ఇది చాలా అన్యాయం.\u003c\/p\u003e\n\u003cp\u003eతప్పక చదవండి.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503101730863,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/abhijaata.jpg?v=1782030343"},{"product_id":"abhisaapam","title":"Abhisaapam","description":"\u003cp\u003eఅభిశాపం యద్దనపూడి సులోచనారాణి\u003c\/p\u003e\n\u003cp\u003e“మధ్యలో వచ్చిన వాడిని నేను మీ మధ్యలేకుండా వెళ్ళిపోవటమే న్యాయం”అన్నాడు ప్రశాంత్.\u003c\/p\u003e\n\u003cp\u003eగాయత్రి రెచ్చిపోయినట్లుగా అంది – “ఏమిటా న్యాయం? నీ న్యాయానికి కళ్ళూ,చెవులూ లేవా? చేసుకున్న భార్యని వదిలేయటమేనా నీన్యాయం? దీనికంతటికి కారణం నువ్వు. అప్పుడే నన్ను వదిలేసి ఉంటే ఏ బాధా వుండేదికాదు! ఇలా నడిసముద్రంలో వదిలేయటానికేనా నన్ను పెళ్ళి చేసుకుంది? అసలు ఇదంతా నాతోనేగా చుట్టుకుని వున్నది. నేను చచ్చిపోతే అన్ని సమస్యలూతీరిపోతాయి.”\u003c\/p\u003e\n\u003cp\u003eమౌనంగా వున్న మీ మానసవీణను కదిలించే యద్దనపూడి సులోచనారాణి నవలారాజం- అభిశాపం\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503133188143,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/abhishapam.jpg?v=1782030556"},{"product_id":"amara-hrudayam","title":"Amara Hrudayam","description":"\u003cp\u003eఅమర హృదయం యద్దనపూడి సులోచనారాణి\u003c\/p\u003e\n\u003cp\u003e“నేను యిప్పడు  విద్యాశాఖ చీఫ్ సెక్రటరీని. కాని చిన్నప్పుడు నా అల్లరి చూసిన ఎవరూ నేను యింతవాడిని అవుతానని కలలోకూడా అనుకోలేదు.పల్లెటూరులో చిన్నప్పుడు స్కూలుకి వెళ్ళమంటే ఏడ్చి రాగాలు పెట్టేవాడిని,స్కూలు ఎగ్గొట్టి ఆటలు ఆడేవాణ్ణి. మార్కులు సున్నా రావటంత,మానాన్న పేను బెత్తంతో నా వీపు చీరేసేవాడు.ఎండలో నిలబెట్టేవాడు. అబ్బో!ఇప్పడు ఆ తన్నులు తలచుకుంటే”,హాలంతా నవ్వులకెరటంగా మారిపోయింది. ఆయన గంభీర స్వరంతో చెప్పసాగాడు “అలాంటి నేను, ఒక్క మేష్టారి వల్ల, ఏడాదిలో పూర్తిగా మారిపోయాను. ఆయనవల్ల నాజాతకం,నా జీవనగమ్యమే మారిపోయింది…\u003c\/p\u003e\n\u003cp\u003eకాబట్టి ఉపాధ్యాయుడు ఎంతోమంది విద్యార్థుల మనసుల్లో జ్ఞానజ్యోతి వెలిగించగలడు.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ మెర్రీ గోల్డ్ స్కూలు చరిత్రలో అలాంటి ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503162253359,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/amarahrudayam.jpg?v=1782030727"},{"product_id":"amruthadhaara","title":"Amruthadhaara","description":"\u003cp\u003eఅమృతధార యద్దనపూడి సులోచనారాణిమనోజ్ అమూల్యని పరీక్షగా చూస్తూ అడిగాడు. \"అట్లా అయితే నువ్వు చెప్పేదే నిజమైతే శివా చనిపోయిన వెంటనే నా దగ్గరకు వెంటనే ఎందుకు రాలేదు\".\u003c\/p\u003e\n\u003cp\u003e\"రెండున్నర సంవత్సరాలు ఒంటరిగా నేను, నేనుగా బ్రతకగలనేమో అని ప్రయత్నించాను. దాదాపు శక్తికి మించి పోరాడాను. కాని నావల్ల కాలేదు. మీ దగ్గరికి రాక తప్పలేదు\". అమూల్య కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టే ఆగిపోయింది.\u003c\/p\u003e\n\u003cp\u003eఒక్క క్షణం తర్వాత తనను తాను నిగ్రహించుకుని, దించిన తల ఎత్తి దిన దిన గండంగా నేను బ్రతకలేను. ఎంత ధైర్యం ఉన్నా ఆడపిల్లగా ఈ సమాజంలో ఎదుర్కోలేనివి చాలా ఉన్నాయి. అందుకే మీ దగ్గరికి రాక తప్పలేదు.\u003c\/p\u003e\n\u003cp\u003eఅమూల్యకి వచ్చిన ఆపద ఏది? మనోజ్ దానిని ఎలా పరిష్కరించాడు?\u003c\/p\u003e\n\u003cp\u003eఅద్భుతమైన కథనంతో, అపురూప సంఘటనలతో హృదయానికి హత్తుకునేలా మలచిన అపురూపమైన నవల\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503189418031,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Amruthadhaara.jpg?v=1782030907"},{"product_id":"andhra-yuvakuda-dari-itu","title":"Andhra Yuvakuda-Dari Itu","description":"\u003cp\u003eచాలా జీవితాల్లో దారుణమైన సంఘటనలెన్నో వుంటాయి. కానీ మానవత్వం సిగ్గుపడాల్సిన సంఘటనలు ఎదురవటం అరుదు. డబ్బే జీవితంగా భావించిన భవానీప్రసాద్ జీవితంలో అలాంటి సంఘటన జరిగింది. మనసు సిగ్గుతో చచ్చిపోయి, మనిషిని జీవచ్ఛవంలా మార్చిన ఆ సంఘటన ఏమిటి? షేమ్-కథ చదవండి. తెలుస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eనిరుద్యోగం, కలసిరాని పరిస్థితులు గోపాలాన్ని పీల్చి పిప్పి చేశాయి. అసమర్థుడని అందరూ వేలెత్తి చూపించారు. తనకి జరిగిన అవమానాలెన్నో సహించిన గోపాలం, శాంతకీ జరిగిన అవమానాన్ని సహించలేకపోయాడు. అగ్నిజ్వాలలా జ్వలించాడు. ఫలితం ఏమిటో, ఏం జరిగిందో తెలిపేకథ-అసమర్థుడు.\u003c\/p\u003e\n\u003cp\u003eఆర్థిక అసమానతలతో, పెద్దవారి అధికారానికి బానిసల్లా బతుకులు వెళ్ళదీస్తున్న బడుగు బతుకుల్తో, రోజురోజుకీ దిగజారుతున్న తన గ్రామం ఒకవైపు… జీవితాన్ని సుఖప్రదంగా, మూడుపువ్వులు ఆరుకాయలుగా మార్చగలిగిన విదేశీ జీవితావకాశం ఒకవైపు… రవి ఏ మలుపు తిరిగాడో తెలుపుతూ, యీనాటి యువతరానికి దారి సూచించే కథ-ఆంధ్రయువకుడా! దారి ఇటు.\u003c\/p\u003e\n\u003cp\u003eఅనుకోని పరిస్థితులెదురై, భార్యనని చెప్పుకోలేకపోయినా భర్తనే అంటిపెట్టుకుని జీవితాన్ని జయించిన జయకథ – భార్య.\u003c\/p\u003e\n\u003cp\u003eప్రతి పదం దృశ్యంలా కళ్ళముందు కదిలేలా రాసిన కథలు రెండైతే విస్తృతమైన కథాసారాన్ని సంఘటనల్లా మలచి కూర్చిన కథలు రెండు. రచనా విధానంలో మార్పుని, రసస్పందన కలిగించటంలో నేర్పుని అవగతం చేసుకోటానికి\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503197577263,"sku":null,"price":50.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AndhraYuvakuda_DaariItu.jpg?v=1782031104"},{"product_id":"anuraga-ganga","title":"Anuraga Ganga","description":"\u003cp\u003eఅందమైన పాలరాతి బొమ్మకి ప్రాణం వచ్చినట్టుగా,పాలనురగ లాంటి తెల్లటి దుస్తులతో,మెల్లగా మెట్లు దిగివస్తున్న ప్రీతి చేతిలో నవనవలాడుతున్న పసుపుపచ్చటి గులాబి పువ్వు ఉంది. క్రింది హాలులో పార్టీకి వచ్చిన ఆహుతులందరి కళ్ళూ ఆ అమ్మాయి మీదనే నిల్చినా, తన కళ్ళుమాత్రం ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా చూస్తున్నాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eప్రీతి పాదం ఆఖరి మెట్టు మీదకు రాగానే శరత్ చంద్ర అక్కడికి వచ్చాడు. ప్రీతి క్షణం సేపు తదేకంగా అతన్ని చూసింది. ఆ తర్వాత చేతిలో గులాబి అతనికి అందిస్తూ తగ్గు స్వరంతో “మీ ఉత్తరానికి జవాబు ఇదే!”అంది. మగసిరి నిండిన అతని చేతివేళ్ళు ఆపువ్వుని అందుకున్నాయి.”థ్యాంక్ యూ”అతను అస్పష్టంగా అన్నాడు. ప్రీతి ఆ పువ్వుని వదల లేదు. అతనివైపే చూస్తోంది. అతను కూడా ప్రీతి వైపే చూస్తున్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eదూరం నుంచి ఒక వయససుమళ్ళిన వ్యక్తి వీళ్ళిద్దరినీ రెప్పవాల్చకుండా చూస్తున్నాడు.అతని ముఖంనిండా దెబ్బలు తగిలి మానినట్లుగా గాట్లు,మచ్చలు ఉన్నాయి.మొరటుగా వున్న అతనిపెదవులమీద క్రూరమైన చిరునవ్వు మెదలింది. ఆనవ్వు అతని ముఖంలో వున్న భీకరత్వాన్ని రెట్టింపు చేసింది.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503209340975,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AnuragaGanga.jpg?v=1782031283"},{"product_id":"jeevana-geetham","title":"Jeevana Geetham","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eజీవనగీతం యద్దనపూడి సులోచనారాణి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eపెళ్ళి అయిన తరువాత జీవిత భాగస్వాముల్లో ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు,అభిమానం వుంటాయి.కానీ, కొన్ని కారణాల వల్ల ముఖ్యంగా వారి వారి వ్యక్తిత్వంలోని అహం వల్లనో,స్వార్థం వల్లనో, వారి మనస్సుల్లో బానిసత్వం వల్లనో,దైనందిన జీవితంలోని చాలా అల్ప సమస్యలు, వారి జీవన మాధుర్యాన్ని చీడక్రీముల్లా హరిస్తూ, ‘హరిత వనం’లా వుండాల్సిన యింటిని ‘శిథిలగృహం’లా మార్చేస్తున్నాయి.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503219433519,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/JeevanaGeetham.jpg?v=1782031430"},{"product_id":"ardhastitha","title":"Ardhastitha","description":"\u003cp\u003e\u003cspan\u003e \u003c\/span\u003eఅర్థస్థిత యద్దనపూడి సులోచనా రాణి\u003c\/p\u003e\n\u003cp\u003eపూజకి ఒక్క క్షణం ఈ సృష్టి అంతా సర్వానందజంత్ర సమ్మేళనంగా అన్పించింది! సిద్దార్థని మరింత దగ్గరకు తీసుకుంది. శరీరం అంతా ఆనందపు వెలుగుమైకంలా కమ్మేస్తుంది. ఈ  ప్రపంచంలో ఇతను తప్ప తనకి యింకేం అవసరంలేదు అన్పిస్తుంది. ఈ ఆనందంలో ఏదో శక్తి! అది ఆమె మనసులోని సంకోచపు గొలుసుల్ని తెగ్గొట్టేసి,ఆమెకి స్వచ్ఛమైన,నిర్మలమైన ఆనందపు అమృతాల్ని దోసిలితో తాగిస్తోంది!\u003c\/p\u003e\n\u003cp\u003eఎక్కడో బీటలు వారిన మనసు క్షేత్రంలో ఆ అమృతపు చినుకులు రాలుతున్నాయి! ఆమెలోని ఏదో నిరుపేదతనం, దాని తాలుకు వ్యథ….! ఎండిన ఆకుల్లా రాలిపోతున్నాయి. ఒక సుమధురమైన గాలి! ఒక కొత్తపథం  వైపు పయనం! సిద్దార్థ భుజాల చుట్టూ చేయివేసి దగ్గరగా పట్టుకుని, ఆ వెలుగుపుంత వైపు తను నిస్సంకోచంగా నడవటానికి సిద్ధం అవుతుంది. అడుగు ముందుకు పడ్తోంది.తనని ఎవ్వరూ ఆపలేరు! అభిజిత్ కూడా అడ్డుకోలేడు! ఆమెకి అర్థం అయిపోతుంది.తను పుట్టిందీ,బ్రతుకుతోందీ యీ దివ్యక్షణాల కోసమే! ఇతని కోసమే!\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503225397295,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ArdhaStitha_bc75f888-afc9-4678-ab52-3f2968b5b691.jpg?v=1782031692"},{"product_id":"atmeeyulu","title":"Atmeeyulu","description":"\u003cp\u003e\u003cspan\u003eఆత్మీయులు \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eకష్టపడి చదువుకుని పైకివచ్చి,పోలిసు ఆఫీసరయిన సూర్యానికి రెండో ప్రాణం చెల్లెలు సీత. ఆమెలక్షాధికారికి కోడలై అష్టయిశ్వర్యాలు అనుభవిస్తుంటే ఆ అదృష్టమంతా తనదే అని కొండెక్కిపోతాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eసీత భర్తకి అంతకు పూర్వం సరోజతో సంబంధం ఉందని తెలుసుకుని,ఆవేశంతో సరోజ ఇంటికి వెళ్ళిన సూర్యం సరోజ దయనీయ చరిత్రవిని నీరైపోతాడు.చెల్లెలిమీద,సరోజమీద సూర్యం జాలి; అతని జాలి గుండెకి ఎదురైన సమస్యకి సినెమెటిక్ పరిష్కారం….?\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503230378031,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/atmeeyulu.jpg?v=1782031955"},{"product_id":"avyaktyam","title":"Avyaktyam","description":"\u003cp\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Yaddanapoodi%20Sulochanarani\"\u003e \u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eహేమ మరణించిన ఆనంద్ ని తదేకంగా చూస్తున్న విజయ భుజం మీద చెయి ఆనించింది.విజయ్ మనసులో ఏర్పడిన లోటు బాగానే అర్థం అవుతోంది. హేమ విజయ్ తలమీద చెయి వేసింది. ఒక్క క్షణం తర్వాత రెండు చేతులతో అతని తలని పొట్టకి ఆనించుకుంది.”హేమా! “విజయ్ దుఃఖభారంతో అన్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eహేమ అతని తలని నమురుతూ తగ్గు స్వరంతో అంది.”విజయ్” ఈ జీవితం వుందే! ఇది ఎప్పుడు మనకి ఏ కానుక యిస్తుందో తెలియదు.మళ్ళీ ఎప్పుడు హఠాత్తుగా మననుంచి మనకి ప్రియమైనది ఏది మననుంచి తీసుకుంటుందో తెలియదు. ఆ అదృశ్య మహాశక్తి ముందు తలవంచటమే మనకర్తవ్యం!\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503233916975,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/avyaktam.jpg?v=1782032092"},{"product_id":"bahumathi","title":"Bahumathi","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eబహుమతి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003cspan\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనవలాదేశపు రాణి, చెయ్యి తిరిగిన రచయిత్రి, యద్దనపూడి సులోచనా రాణి\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకలం నుండి జాలువారిన నులివెచ్చని కథల మాలిక.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఐ లవ్ యూ, నమ్ముతాను, బహుమతి, గెలుపెవరిది?, నాకీ పెళ్ళివద్దు, తెలిసిన విలువలు లాంటి కథల సమాహారం.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503238504495,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bahumathi.jpg?v=1782032247"},{"product_id":"bandhee","title":"Bandhee","description":"\u003cp\u003eబందీ - యద్దనపూడి సులోచనా రాణి\u003c\/p\u003e\n\u003cp\u003e“ఇందులో సిగ్గు పడాల్సిందేముంది?”\u003c\/p\u003e\n\u003cp\u003e“ఎందుకు లేదు? సుందరేకాదు ఏ ఆడపిల్లయినా,నాలో ఏం చూసి నాకు చేరువ అవుతుంది? ఈ జ్ఞానం నాకెందుకు లేకపోయింది!” అతని  ముఖంలో గాయపడిన అబిమానం స్పష్టంగా కన్పిస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003e“ఇందులో నాక్కూడా భాగం వుంది కాబట్టి నేను చెప్పాను.నిన్ను చూస్తుంటే నేను చేసింది మంచిపని అని అన్పించటం లేదు.”…\u003c\/p\u003e\n\u003cp\u003eకవిత బలవంతంగా అతని చెయ్యిపట్టుకుని,ఉంగరం తొడగబోయింది.\u003c\/p\u003e\n\u003cp\u003e“క్షమించు కవితా!”అతను చెయ్యి వదిలించుకున్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003e“నిజం చెప్పినందుకా  నాకీ శిక్ష?”\u003c\/p\u003e\n\u003cp\u003e“అదేం మాట?”\u003c\/p\u003e\n\u003cp\u003e“ఆత్మీయతతో ,స్నేహపూర్వకంగా ఇచ్చిన దానిని ఎందుకు తిరస్కరిస్తున్నావు మరి?”\"ఆత్మీయత,స్నేహం- ఆరెండూ పొందే అర్హత,అదృష్టం నాకు లేవు కవితా!?”\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503242403887,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bandhee.jpg?v=1782032395"},{"product_id":"cheekatilo-chuirudeepam","title":"Cheekatilo Chuirudeepam","description":"\u003cp\u003e\u003cb\u003eChikatlo Chirudeepam\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e“రోహిత్! నువ్వు.. నువ్వు ప్రయత్నం చేస్తే ఈ యగకూపంలో నుంచి బైటకి రాగలవు..”అనునయంగా అంది.ఆమె కంఠంలో ఆత్మీయతో,ఆమె చేతి స్పర్షలో అనురాగమో కానీ,అతను వెంటనే ఆమె ఒడిలోకి ఒదిగిపోయి,ఆమె గుండెలకి తల ఆనించుకున్నాడు. “స్రవంతీ! నాకు తెలుసు.. ఈ ప్రపంచంలో వెన్నెలకాంతి ఎంత అందంగా ఉంటుందో,సూర్యోదయం ఎంత అద్భుతంగా వుంటుంది! కానీ,కానీ, ఆ  అందచందాలు ఆనందించేందుకు నేను ఆ రోహిత్ ని కాను! నేను… నేను… ఒకజీవచ్ఛవాన్ని!” అతను హఠాత్తుగా ఏడ్చేశాడు.”ఐ వాంట్ టు డై!ఐ వాంట్ టు డై!”\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503245123631,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/CheekatiloChiruDeepam.jpg?v=1782032495"},{"product_id":"jahnavi","title":"Jahnavi","description":"\u003cp\u003e\u003cspan\u003eజాహ్నవి యద్దనపూడి సులోచనారాణి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503249023023,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/jahnavi.jpg?v=1782032625"},{"product_id":"kalala-kougili","title":"Kalala Kougili","description":"\u003cp\u003eకలల కౌగిలి యద్దనపూడి సులోచనారాణి\u003c\/p\u003e\n\u003cp\u003eభారతి విజిటర్స్ రూమ్ కి వచ్చింది. అక్కడ ఒక యువకుడు కూర్చుని వున్నాడు. అతని నుదిటిమీద. మోచేతి దగ్గర ప్లాస్టర్లు వున్నాయి. అతను అక్కడున్న పుస్తకం చూస్తున్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eభారతి \"ఎక్స్యూజ్ మీ\" అంది.\u003c\/p\u003e\n\u003cp\u003eఅతను చటుక్కున తలెత్తాడు. భారతిని చూడగానే కుర్చీలోనుంచి లేస్తూ\u003c\/p\u003e\n\u003cp\u003e\"మీరు-\" అన్నాడు సందేహంగా,\u003c\/p\u003e\n\u003cp\u003e\"నా పేరు భారతి.\"\u003c\/p\u003e\n\u003cp\u003eఆ పేరు వినగానే అతని కళ్ళలోకి అనందంలాటిది చెంగున ఎగిరి వచ్చింది.\u003c\/p\u003e\n\u003cp\u003eఅతని ముఖం చూస్తుండగానే సంతోషాతిశయంతో కాంతిమయంగా అయింది. అతను భారతిని ఆపాదమస్తకం. ఒక దేవతని చూసినట్టుగా పవిత్రంగా, శ్రద్ధగా చూసాడు.\u003c\/p\u003e\n\u003cp\u003e“మీరు-మీరేనా\" సంభ్రమంగా, తడబాటుగా అన్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003e\"మీరు-\" అతని దెబ్బలని చూస్తూ అనుమానంగా అడిగింది భారతి.\u003c\/p\u003e\n\u003cp\u003e\"నా పేరు సత్యజిత్. మీరు నన్ను స్కూటర్ యాక్సిడెంట్ అయినప్పుడు రక్షించారే...\"\u003c\/p\u003e\n\u003cp\u003e\"ఓ!\" ఈసారి భారతి కళ్ళు మెరిశాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eఆద్యంతం ఉత్కంఠతతో మిమ్మల్ని చదివించే ఈ నవలారాజం కేవలం రొమాంటిక్ థ్రిల్లరేకాదు!\u003c\/p\u003e\n\u003cp\u003eసస్పెన్స్ థ్రిల్లర్ కూడా\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504135233583,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kalalakougili_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782041341"},{"product_id":"manobhiramam","title":"Manobhiramam","description":"\u003cp\u003eమనోభిరామం\u003c\/p\u003e\n\u003cp\u003eశౌరి యశస్విల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది! కాని శ్రీశైల ప్రయాణంలో ఎదురైన ప్రమాదం వారిద్దరి మధ్య వున్న అపోహలను తొలగించింది.\u003c\/p\u003e\n\u003cp\u003eతీరా తిరిగి హైదరాబాదు చేరుకోగానే శౌరి పినతండ్రి మూలంగా వారిద్దరి మధ్యా మనఃస్పర్థలు కలుగుతాయి. ఓ ఇరవై లక్షలు, సేఠ్ పన్నాలాల్ దగ్గర అప్పు తీసుకుని అది తీర్చకుండానే శౌరి తండ్రి మరణిస్తాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eఆ డబ్బు యశస్వి కోసమేనని పినతండ్రి చెబుతాడు. ఆ డబ్బు ఎక్కడ కట్టాలో అని యశస్వి శౌరిని కలుసుకోవటం లేదని ఎక్కిస్తాడు. అసలు వీరిద్దరి మధ్యా వున్న ఆ అపోహలేమిటి? అవి ఎట్లా తొలగిపోతాయి? శౌరి పినతండ్రి మూలంగా వచ్చిన మనఃస్పర్థలు ఏమౌతాయి?\u003c\/p\u003e\n\u003cp\u003eశౌరి జీవిత పోరాటాన్ని యశస్వి ఎట్లా తన పోరాటంగా స్వీకరించాడు?\u003c\/p\u003e\n\u003cp\u003eఇవన్నీ తెలుసుకోవాలంటే అశేష ఆంధ్ర పాఠకుల అభిమాన రచయిత్రి.\u003c\/p\u003e\n\u003cp\u003eయద్దనపూడి సులోచనారాణి సుమధుర నవల \"మనోభిరామం\" చదవండి!\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504141426735,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Manobhiramam_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782041632"},{"product_id":"mohitha","title":"Mohitha","description":"\u003cp\u003eతెలుగులో నవలా సాహిత్యంలో పాపులర్ రీడింగ్ కు నాంది పలికిన రచయిత్రి ఆమె. ఆమె తీర్చిదిద్ధన ప్రతిపాత్రలోనూ తన ఐడింటిటిని చూసుకోవాలని ప్రతి చదువరీ చేసే ప్రయత్నమే ఆమె అసాధారణ ప్రతిభకు నిదర్శనము.\u003c\/p\u003e\n\u003cp\u003eనవలాదేశపు రాణి యద్దనపూడి సులోచనా రాణి కీర్తి కిరీటంలో చేర్చతగ్గ కోహినూర్ వజ్రపు స్థాయి నవల మోహిత.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504145653807,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Mohitha_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782041815"},{"product_id":"mounabashyam","title":"Mounabashyam","description":"\u003cp\u003e\u003ca\u003e\u003cb\u003eమౌనభాష్యం \u003c\/b\u003e\u003c\/a\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E2%80%8C%E0%B0%AF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%A8%E0%B0%AA%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF%20%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B%E0%B0%9A%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BF\"\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e“విద్యాధర్ తో పెళ్ళి చేసేయ్యాలి.”\u003c\/p\u003e\n\u003cp\u003e“పెళ్ళా! అయిపోయిందిగా ఇంకా ఏమిటి?”అంది విసుగ్గా.\u003c\/p\u003e\n\u003cp\u003e”అది ఒక పెళ్ళా! అబద్దపు పుట్ట.నేను మీ ఇద్దరికీ లక్షణంగా చేస్తాను.లీగల్ గా మీ ఇద్దరూ భార్యాభర్తలవాలి.”\u003c\/p\u003e\n\u003cp\u003e‘దానికోసం నువ్వు తగిలేసే డబ్బు నాకివ్వు.’\u003c\/p\u003e\n\u003cp\u003e“ఇవ్వను. ఒక్కపైసా కూడా ఇవ్వను. విద్యాతో పెళ్ళి చేసి డబ్బు విషయం మొత్తం విద్యాకి కంట్రోలు ఇచ్చేస్తాను.”\u003c\/p\u003e\n\u003cp\u003e“ఏమిటీ!”గుమ్మం దాటబోతున్న సమీర వెనక్కి తిరిగి వచ్చి ఆయన టేబుల్ కెదురుగా నిలబడింది.నడం మీద చేయి ఆనించుకుని ఆయనని తీక్షణంగా చూసింది.\u003c\/p\u003e\n\u003cp\u003e“ఇదా! నా పెళ్ళిలో నవ్వు చేయాలనుకున్న పరమార్థం. నన్ను,ఆస్తిని విద్యాకి కట్టబట్టాలని అనుకుంటున్నావా నువ్వు!” అడిగింది.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504153550895,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/MounaBashyamYaddanapudiSulochanarani.jpg?v=1782041994"},{"product_id":"mouna-tarangaalu","title":"Mouna Tarangaalu","description":"\u003cp\u003e\u003ca\u003eమౌనతరంగాలు\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eనవలా దేశపు రాణి యద్దన పూడి సులోచరాణి కలనుండి జాలువారిన మరో నవలా మాలిక.\u003cbr\u003eమౌనతరంగాలు\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504160333871,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Mouna_Tarangaalu_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782042293"},{"product_id":"nishantha","title":"Nishantha","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eనిశాంత\u003c\/a\u003e\u003c\/b\u003e\u003cspan\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eమనిషికి ఇప్పుడు కావల్సింది ఆమె శరీరం కాదు,ఆమె మేధస్సు! ఆమె మేధస్సు కూడా తనకి తోడైత ఇద్దరూ కలిసి, ఈ సృష్టిమీద ఇంకా సునాయసంగా, ఇంకా ధైర్యంగా యుద్ధం సాగించవచ్చు. మనిషి ఎంత సేపూ ఆమె కళ్ళకి,మనస్సుకి,’రొమాన్స్’అనే బురఖావేసి యీ ప్రపంచాని్న పూర్తిగా అధ్యయనం చేయనీయకుండా పక్కదోవ పట్టిస్తున్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eనిశా!నీకు తెలుసు కదా!\u003c\/p\u003e\n\u003cp\u003eమేధస్సుకి స్త్రీపురుషబేధం లేదు\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504172556335,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Nisantha_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782042684"},{"product_id":"prema","title":"Prema","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eప్రేమ\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e“ఏ చెల్లెలయినా మా అన్న మంచివాడు కాదు అని నోరారా చెబుతుందా?అందులో మన ఆంధ్రా ఆడపడుచు” అంది.\u003c\/p\u003e\n\u003cp\u003e“పోదూ!నీ బోడి రాయల్టీ నువ్వూను”అంది.\u003c\/p\u003e\n\u003cp\u003e“ఎలాగూ రేపు వెళ్ళిపోతున్నాలేవే అమ్మ”అంది ఛాయ.\u003c\/p\u003e\n\u003cp\u003e“వెళ్ళకు ఛాయా!నువ్వు వచ్చినట్టే లేదు” అంది సంహిత.\u003c\/p\u003e\n\u003cp\u003e“నాకు అంతే” అంది ఛాయ. “మనిద్దరం ఒకచోట వుండే బంధం ఏదయినా దొరికితే బాగుండును.”\u003c\/p\u003e\n\u003cp\u003e“అలాంటిదం కుదరదు” ఖచ్చితంగా చెప్పేసింది సంహిత.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504186482735,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Prema_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782042904"},{"product_id":"prema-deepika","title":"Prema Deepika","description":"\u003cp\u003e\u003cspan\u003eప్రేమదీపిక యద్దనపూడి సులోచనారాణి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504189497391,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Premadeepika_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782043263"},{"product_id":"premapeetam","title":"Premapeetam","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eప్రేమపీఠం యద్దనపూడి సులోచనారాణి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eవిశాఖపట్టణానికి 30 కి.మీ. దూరంలో సముద్రంలో క్రొత్తగా ఓ దీవి బయటపడింది. దానిని కొంతమంది సుప్రసిద్ధ వ్యక్తులు, ప్రవాస భారతీయులు కలిసి ఒక అద్భుతమైన విహారయాత్రా కేంద్రంగా మార్చేసి ”ప్లెజర్ ఐలండ్” అని పేరుపెట్టారు. తన కుమార్తె ప్రజ్ఞ కోరిక మేరకు ప్రముఖ వ్యాపారవేత్త గజకర్ణం తన కాబోయే అల్లుడు అరవిందుతోపాటు ”ప్లెజర్ ఐలండ్”కు విహారయాత్రకు పంపిస్తాడు. వీళ్ళు బయలుదేరిన స్టీమరులోనే వ్యాఘ్రమూర్తి అనే ఒక ప్రభుత్వ అధికారి, ఆయన గర్ల్ఫ్రెండ్ అమృత, ప్లెజర్ ఐలండ్లో ఏమైనా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయేమో అని పరిశోధించడానికి జ్ఞానేశ్వరిదేవి అనే ”స్త్రీ సంక్షేమాధికారి” తన స్టెనో మోహన్తో కలిసి బయలుదేరుతారు. వీళ్ళుకాక ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయిని అయిన భారతి, ప్రఖ్యాత పాప్సింగర్ సుమన్, ఒక పత్రిక నిర్వహించిన పోటీలో విజేతలుగా ఎంపికచేయబడి, ”ప్లెజర్ ఐలండ్” ట్రిప్కు బయలుదేరతారు. వీళ్ళందరూ ”ప్లెజర్ ఐలండ్”కు బయలుదేరినప్పటినుంచి జరిగిన సంఘటనల సమాహారమే… యద్దనపూడి సులోచనారాణి అందిస్తున్న చక్కటి రొమాంటిక్ థ్రిల్లర్ నవల ”ప్రేమపీఠం”\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504192938031,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Premapeetam_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782043494"},{"product_id":"sukumari","title":"Sukumari","description":"\u003cp\u003e\u003ca\u003e\u003cb\u003eసుకుమారి\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e\u003c\/a\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E2%80%8C%E0%B0%AF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%A8%E0%B0%AA%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF%20%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B%E0%B0%9A%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BF\"\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఇంతలో కాలింగ్ బెల్ మోగింది!\u003c\/p\u003e\n\u003cp\u003eనేను వెళ్ళితలపుతీశాను.\u003c\/p\u003e\n\u003cp\u003eఎదురుగా బ్రహ్మీ!!\u003c\/p\u003e\n\u003cp\u003eనేను అతన్నే చూస్తున్నాను. నా కళ్ళలోలీలగా వద్దన్నా అశృవులు నిండుకుంటున్నాయి. అతను ఒక్కక్షణం నా కళ్ళలోకి సునిశితంగా వెతుకుతున్నట్లుగా చూశాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eవెంటనే రెండు చేతులలో ఎత్తి మా పడక గదిలోకి తీసుకవచ్చాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eఇదీ నా కథ!\u003c\/p\u003e\n\u003cp\u003eనా యీ జీవిత కథ నా చుట్టూ వున్న లక్షలాది మందిలో ఏ ఒక్క వ్యక్తికైనా ఓదార్పు గాని,మనోధైర్యం గానీ కలిగిస్తే అంతకుమించి ఆనందం….\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504196935727,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Sukumari_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782043792"},{"product_id":"swetha-gulabi","title":"Swetha Gulabi","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eశ్వేతగులాబి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఅతను మెల్లగా తన నడుంచుట్టూ పడిన చేతులను బలవంతంగా విడదీసాడు. తన గుండెల్లోకి ఒదిగిపోయిన ఆ అమ్మాయి భుజాలు పట్టుకుని,వెనక్కి ఆనించి దిండుమీద పడుకోబెట్టాడు.  ఆ పడుకో బెట్టడంలో అన్నూ పయిట జారిపోయింది….\u003c\/p\u003e\n\u003cp\u003eఅతను లాకెట్ చూడగానే సర్పద్రష్టలా ఆగిపోయాడు. వంగి,ఆ లాకెట్ చేతుల్లోకి పట్టుకొని మరింత శ్రద్ధగా పరీక్షగా చూసాడు. సందేహం లేదు. ఆ పక్క పాపిడి, ఆ అంచున్న పొట్టి చేతుల జాకెట్టు,కనుబొమ్మల మధ్య చిన్నబొట్టు, అరవిరసిన మొగ్గలాంటి ఆ చిరునవ్వు యింకెవరు? పారిజాతమే! నిశ్చేష్టుడయ్యాడు. అతని చూపులు ఆ లాకెట్టుకు అతుక్కు పోయినట్టుగా నిల్చిపోయినాయి.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504199721007,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Swetha_Gulabi_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782043979"},{"product_id":"vennello-mallika","title":"Vennello Mallika","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eవెన్నెల్లో మల్లిక\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eవిజయ్,వైజయంతి మల్లికనిలీగల్ గా దత్తత తీసుకుని ఇంటికి వచ్చారు.\u003c\/p\u003e\n\u003cp\u003eమల్లిక చెరో చెయ్యి పట్టుకుని విజయ్,వైజయంతి గుమ్మంలో కాలు పెడ్తుంటే “ఆగండి… ఆగండి… గృహప్రవేశం అలా కాదు చేయాల్సింది” అంటూ వరమ్మ ఎర్రనీళ్ళు వారి చుట్టూతిప్పి పారబోసింది.\u003c\/p\u003e\n\u003cp\u003eముగ్గురు ఇంట్లోకి వస్తుంటే “స్వాగతం” అని వ్రాసి,మేరీ అట్టలు పట్టుకుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eవాసు ఆనాడు విజయ్ వేసిన మూడు కుందేళ్ళ ముఖాలతో వున్న డ్రాయింగ్ రెండుచేతులతో పట్టుకుని ఎదురువచ్చాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eవైజయంతి నవ్వేసింది. విజయ్ నవ్వాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eనేను ఇక “అమ్మగారు,అయ్యగారు అని పిలవకూడదట”అంది కళ్ళు పెద్దవి చేసి చూపిస్తూ మల్లిక. విజయ్,వైజయంతి చెరో చెయ్యి చాపి మల్లికని దగ్గరకి తీసుకున్నారు.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504202899503,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Vennello_Mallika_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782044141"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/Yaddanapudi_Sulochana_Rani.png?v=1774075918","url":"https:\/\/books.ataka.in\/collections\/yaddanapoodi.oembed?page=2","provider":"అటక","version":"1.0","type":"link"}