{"product_id":"agni-poolu","title":"Agni Poolu","description":"\u003cp\u003e\u003cspan data-mce-mark=\"1\"\u003e  ఆ రోజు ఆకాశం ఎంతో నీలంగా, నిర్మలంగా ఉంది. దాని క్రింద ఎకరాల కొద్దీ ఉన్న చేలమీద హరితవర్ణం ఎన్నడూ చూడనంత అందంగా చూడముచ్చటగా ఉంది. ఆ చేలకి దూరంగా, వలయాకారంగా కొండలు ఉన్నాయి. వాటిమీద నుంచి చల్లటి గాలి, సాయంకాలపు షికారుకి బయలుదేరినట్లుగా మెల్లమెల్లగా వస్తోంది. ఆ గాలి సంతోషంతో నాట్యం చేస్తూ వస్తున్నట్లుగా, ఆ కొండమీద నుంచి జారి అక్కడవున్న ఎత్తయిన చెట్ల శిఖరాగ్రాలని తాకి, పచ్చటి చేలమీదుగా ఆ ఊరి చివరగా ఉన్న పెద్ద చెరువు మీదకి వస్తోంది. ఆ చెరువు ఆ ఊరి పొలాలకి  అమృతభాండంలాంటిది!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e               దాని సాగు క్రిందనే వందల ఎకరాలు సాగు అవుతూ, ఆ చుట్టు ప్రక్కల ఊళ్ళని సుసంపన్నం చేస్తున్నాయి. ఆ చెరువుకి దూరంగా, ఒకనాటి వైభవానికి చిహ్నంగా, పాతకాలపు నగలా, అపురూపంగా, అద్దాల తలుపులున్న పెద్ద కిటికీలతో, పొడుగాటి వరండాలతో, చక్కగా అల్లుకున్న రకరకాల - రంగు రంగు పూలతీగలతో ఒక పెద్ద మేడ ఉంది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055037243439,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/agnipoolu.jpg?v=1773595318","url":"https:\/\/books.ataka.in\/products\/agni-poolu","provider":"అటక","version":"1.0","type":"link"}