{"product_id":"ambedkar-manavadu","title":"Ambedkar Manavadu","description":"\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eఅది పాఠ్యమైనా పాఠమైనా జీవితాన్ని తొలుచుకొని వచ్చినప్పుడు మాత్రమే సత్యావిష్కరణకు దారితీస్తుంది. ప్రామాణికంగా నిలుస్తుంది. సాహిత్యమై పరిమళిస్తుంది. జీవితానికి దూరంగా జరిగిన రచన బతికి బట్టకట్టదు. సిద్ధాంతాలూ వాటి ప్రమేయాలూ పరికల్పనలూ జీవితం నుంచి పుట్టి ఆచరణలో రుజువైనప్పుడు వాటి సారమే రచనలో కళాత్మకంగా ప్రతిఫలిస్తుంది. ఆ రచయిత ప్రాపంచిక దృక్పథంగా పాఠకులకు చేరుతుంది. మంచికంటి కొత్త కథాసంపుటి 'అంబేద్కర్ మనవాడు' యీ ఆలోచనల్ని బలపరుస్తుంది. ఈ కథల్లో మంచికంటి గొంతు మారింది. భాష మారింది. శైలి మారింది. కథన రీతి మారింది. కొన్ని కథలు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ అది ప్రాథమ్యం కాలేదు. భౌతికంగా కొంతమేరకు అతను ఆధునికుడయ్యాడు. కానీ తన మూలాలకు దూరం కాకుండా వుండటానికి తపించాడు. సంఘర్షించాడు. ఆ తపన ఘర్షణ వివిధ సందర్భాల్లో ప్రత్యక్షంగానే కనిపిస్తాయి. చదువు మెరుగైన జీవితాన్ని అందిస్తుంది అన్న విశ్వాసం కార్పొరేట్ వ్యాపారీకరణలో ధ్వంసమైపోతుంటే అలవికాని వివశతకు గురౌతున్నాడు. వ్యావసాయిక సంస్కృతి నుంచి అందిపుచ్చుకుని ఆచరించిన విలువలు కళ్ళముందే పతనమైపోతుంటే కలవరానికి లోనవుతున్నాడు. ఈ అలజడి కథల్లో వాచ్యంగానో ధ్వన్యాత్మకంగానో వినిపిస్తుంది. రచయితగా మంచికంటి లోపలా బయటా వొక యెడతెగని సంవాదం నడుస్తోంది. అది ప్రజాస్వామికంగా వుంది. దాన్నుంచి వొక సమన్వయ పాఠాన్ని పరిష్కరించే ప్రయత్నంలోనే యీ కథలు రూపొందాయి. - ఏ.కే ప్రభాకర్ మంచికంటి ఒక పాతికేళ్ళపైగా ఎరిగున్న మనిషిని ఎన్నో పేర్లతో, బహుముఖీన వ్యక్తిత్వంతో ఒక ప్రాంత సామూహిక సామాజిక చింతనలో పెనవేసుకున్న కార్యాచరణతో పెనుగులాడుతున్న అనేక సందర్భాలను ఈరాత్రి పోగు చేసుకుంటున్నాను. మంచికంటిలో సృజనాత్మకతను మించిన కార్యశీల ప్రవాహ గుణం ఉంది. తాను ఎక్కడికైనా వెళ్ళగలడు. ఎందులోనైనా ఇమడగలడు. ఒక స్వప్నం గురించి, నిరంతర అన్వేషణ గురించి తపనపడే ఒక కార్యసాధకుడి అంతర్మధనం ఈ కథలు.. మరోసారి మంచికంటి సాహిత్య కార్యశీలత్వంలోకి ప్రయాణం చేయండి. ఒక స్వాప్నికుడి నిరంతర పథికుడి ఆలోచనల సృజనత్వాన్ని ఆకళింపు చేసుకోండి . -కాట్రగడ్డ దయానంద్\u003c\/span\u003e\u003c\/div\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":45080717885487,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AmbedkarManavadu_0f8f8d0c-0ca6-46f5-9b17-8fad51ccd704.jpg?v=1774089963","url":"https:\/\/books.ataka.in\/products\/ambedkar-manavadu","provider":"అటక","version":"1.0","type":"link"}