{"product_id":"andhra-yuvakuda-dari-itu","title":"Andhra Yuvakuda-Dari Itu","description":"\u003cp\u003eచాలా జీవితాల్లో దారుణమైన సంఘటనలెన్నో వుంటాయి. కానీ మానవత్వం సిగ్గుపడాల్సిన సంఘటనలు ఎదురవటం అరుదు. డబ్బే జీవితంగా భావించిన భవానీప్రసాద్ జీవితంలో అలాంటి సంఘటన జరిగింది. మనసు సిగ్గుతో చచ్చిపోయి, మనిషిని జీవచ్ఛవంలా మార్చిన ఆ సంఘటన ఏమిటి? షేమ్-కథ చదవండి. తెలుస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eనిరుద్యోగం, కలసిరాని పరిస్థితులు గోపాలాన్ని పీల్చి పిప్పి చేశాయి. అసమర్థుడని అందరూ వేలెత్తి చూపించారు. తనకి జరిగిన అవమానాలెన్నో సహించిన గోపాలం, శాంతకీ జరిగిన అవమానాన్ని సహించలేకపోయాడు. అగ్నిజ్వాలలా జ్వలించాడు. ఫలితం ఏమిటో, ఏం జరిగిందో తెలిపేకథ-అసమర్థుడు.\u003c\/p\u003e\n\u003cp\u003eఆర్థిక అసమానతలతో, పెద్దవారి అధికారానికి బానిసల్లా బతుకులు వెళ్ళదీస్తున్న బడుగు బతుకుల్తో, రోజురోజుకీ దిగజారుతున్న తన గ్రామం ఒకవైపు… జీవితాన్ని సుఖప్రదంగా, మూడుపువ్వులు ఆరుకాయలుగా మార్చగలిగిన విదేశీ జీవితావకాశం ఒకవైపు… రవి ఏ మలుపు తిరిగాడో తెలుపుతూ, యీనాటి యువతరానికి దారి సూచించే కథ-ఆంధ్రయువకుడా! దారి ఇటు.\u003c\/p\u003e\n\u003cp\u003eఅనుకోని పరిస్థితులెదురై, భార్యనని చెప్పుకోలేకపోయినా భర్తనే అంటిపెట్టుకుని జీవితాన్ని జయించిన జయకథ – భార్య.\u003c\/p\u003e\n\u003cp\u003eప్రతి పదం దృశ్యంలా కళ్ళముందు కదిలేలా రాసిన కథలు రెండైతే విస్తృతమైన కథాసారాన్ని సంఘటనల్లా మలచి కూర్చిన కథలు రెండు. రచనా విధానంలో మార్పుని, రసస్పందన కలిగించటంలో నేర్పుని అవగతం చేసుకోటానికి\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503197577263,"sku":null,"price":50.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AndhraYuvakuda_DaariItu.jpg?v=1782031104","url":"https:\/\/books.ataka.in\/products\/andhra-yuvakuda-dari-itu","provider":"అటక","version":"1.0","type":"link"}