{"product_id":"arakappu-allam-tea","title":"Arakappu Allam Tea","description":"\u003cp\u003eఉణుదుర్తి సుధాకర్ ఆధునిక తెలుగు సాహిత్యంలో చారిత్రక రచనలకు గుర్తింపు పొందారు. గతాన్ని వర్తమానంతో అర్ధవంతంగా సంధించడం ఆయన రచనల విశిష్టత. అయితే ఈ సంకలనంలో మొదటిదైన 'పూర్ణచంద్రోదయం' తప్ప మిగతా ఏడు కథలూ సమకాలీనమైనవే. కళింగాంధ్రలో బౌద్ధం క్షీణించాక కూడా, ఒక ప్రత్యామ్నాయంగా కొనసాగిన తీరును గురించి ఆ కథ చెబుతుంది. మిగతా కథలన్నీ స్వాతంత్య్రం వచ్చిన కాలం నుండి నేటి వరకూ తూర్పు కోస్తా ప్రాంతంలో వచ్చిన మార్పులకు అద్దం పడతాయి. చివరిదైన 'గుండ్రటి అక్షరాలు' భవిష్యత్తుని ఊహిస్తూనే, వర్తమాన పరిణామాలపై లోతైన పరిశీలనలు చేస్తుంది. ఈ ఇంతకు ముందు వెలువడ్డ ఉణుదుర్తి సుధాకర్ కథా సంకలనాలు, 'తూరుపు గాలులు, 'చలిచీమల కవాతు' రెండింటినీ, ఛాయ సంస్థ ప్రచురించింది. మూడవ సంకలనానికి కూడా పాఠకులనుండి విశేషమైన ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం. ఛాయ ప్రచురణలు\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":67589357699252,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/arakappuallamtea.jpg?v=1791910189","url":"https:\/\/books.ataka.in\/products\/arakappu-allam-tea","provider":"అటక","version":"1.0","type":"link"}