{"product_id":"ardhastitha","title":"Ardhastitha","description":"\u003cp\u003e\u003cspan\u003e \u003c\/span\u003eఅర్థస్థిత యద్దనపూడి సులోచనా రాణి\u003c\/p\u003e\n\u003cp\u003eపూజకి ఒక్క క్షణం ఈ సృష్టి అంతా సర్వానందజంత్ర సమ్మేళనంగా అన్పించింది! సిద్దార్థని మరింత దగ్గరకు తీసుకుంది. శరీరం అంతా ఆనందపు వెలుగుమైకంలా కమ్మేస్తుంది. ఈ  ప్రపంచంలో ఇతను తప్ప తనకి యింకేం అవసరంలేదు అన్పిస్తుంది. ఈ ఆనందంలో ఏదో శక్తి! అది ఆమె మనసులోని సంకోచపు గొలుసుల్ని తెగ్గొట్టేసి,ఆమెకి స్వచ్ఛమైన,నిర్మలమైన ఆనందపు అమృతాల్ని దోసిలితో తాగిస్తోంది!\u003c\/p\u003e\n\u003cp\u003eఎక్కడో బీటలు వారిన మనసు క్షేత్రంలో ఆ అమృతపు చినుకులు రాలుతున్నాయి! ఆమెలోని ఏదో నిరుపేదతనం, దాని తాలుకు వ్యథ….! ఎండిన ఆకుల్లా రాలిపోతున్నాయి. ఒక సుమధురమైన గాలి! ఒక కొత్తపథం  వైపు పయనం! సిద్దార్థ భుజాల చుట్టూ చేయివేసి దగ్గరగా పట్టుకుని, ఆ వెలుగుపుంత వైపు తను నిస్సంకోచంగా నడవటానికి సిద్ధం అవుతుంది. అడుగు ముందుకు పడ్తోంది.తనని ఎవ్వరూ ఆపలేరు! అభిజిత్ కూడా అడ్డుకోలేడు! ఆమెకి అర్థం అయిపోతుంది.తను పుట్టిందీ,బ్రతుకుతోందీ యీ దివ్యక్షణాల కోసమే! ఇతని కోసమే!\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503225397295,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ArdhaStitha_bc75f888-afc9-4678-ab52-3f2968b5b691.jpg?v=1782031692","url":"https:\/\/books.ataka.in\/products\/ardhastitha","provider":"అటక","version":"1.0","type":"link"}