{"product_id":"balkaav-backpack-kathalu","title":"Balkaav - Backpack Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eBalkaav (Backpack Stories) by Sri Uha\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈ పుస్తకం మీకో ట్రైన్ టికెట్. బస్ టికెట్. ఫ్లయిట్ టికెట్. మీరు ఏ సాయంత్రం వేళలోనో బాల్కనీలో కూచుని తెరిస్తే అమాంతం అక్కణ్ణుంచి మాయమయ్యి మాయా లేపనంతో ఒక కథాస్థలికి చేరుకుంటారు. గోవాలో ఒక కథ చూస్తారు. వరంగల్లులో ఒక కథ వింటారు. జైపూర్ దగ్గర పల్లె బయట రాత్రయితే నులక మంచం వాల్చే ఆనవాయితీ ఏమిటా అని తెలుసుకుని కలత చెందుతారు. హెూటల్ రూముల్లో దిగాల్సిన పని లేదు. కాని చెక్ఇన్ మధ్యాహ్నం రెండు గంటలకే అని హెూటల్వాడు హటాయిస్తే ఏం తోచక కొత్త ఈ ఊళ్లో తిరుగుతామే అలా ఈ పుటల మధ్య తిరగొచ్చు. నిజంగా రెక్కలతో ఎగిరి కొత్త ప్రాంతాల జనగాథలను వినాలని కోరుకునే అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. కథకులు, కవులు, సృజనకారులు తమ సిరాచుక్కల దారి పరిచి అట్టివారిని మోసుకెళతారు. శ్రీ ఊహ అలాంటి పని చేసింది ఈ కథల్లో.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003e- మహమ్మద్ ఖదీర్ బాబు\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sri Uha","offers":[{"title":"Default Title","offer_id":44943560441903,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Balkaavtelugubook.jpg?v=1770402088","url":"https:\/\/books.ataka.in\/products\/balkaav-backpack-kathalu","provider":"అటక","version":"1.0","type":"link"}