{"product_id":"dimki","title":"Dimki","description":"\u003cp\u003eDimki (Telugu) Paperback\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనేను పుట్టిన నేల, నాకు అనుభవంలోకి వచ్చిన కొన్ని సంఘటనలు, నా జీవన ప్రయాణంలో నాకు తారసపడిన వ్యక్తులు, లోతుగా పరిశీలించిన కొన్ని కోణాలు నేను రాయాల్సిన అవసరాన్ని తెలిపి నా చేత రాయించినవే ఈ కథలు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eసాహిత్యం సమాజాన్ని కచ్చితంగా ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. కథలు, నవలలు చదివి తమ సమస్యకు పరిష్కారం వెతుక్కునే వాళ్లు కొందరైతే, ఆ పాత్రలలో తమని చూసుకుని ఎమోషనల్ అయ్యే వాళ్ళు కొందరు. తెలియని విషయాలను గురించి తెలుసుకునేవాళ్ళు కొందరైతే, తెలిసిన విషయాన్నే వాళ్లకు తెలియని కొత్త కోణంలో తెలుసుకుని వాళ్ళ ఆలోచనా ధోరణిని మార్చుకునేవాళ్ళు కొందరు. అటువంటి మార్పులు తీసుకొచ్చిన కథలు, నవలలు కోకొల్లలు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eమన రచన మొత్తం సమాజాన్నే మార్చేయలేకపోవొచ్చేమో కానీ దాన్ని చదివే ఏ ఒక్కరినైనా కదిలించగలగి, ఒక ఆలోచనను రేకెత్తించగలిగి, ఆ ఆలోచనే రేపటి మార్పుకు పునాది కావాలి. ఒక రచయిత అక్షరానికి అంతకంటే గొప్ప గుర్తింపు, గౌరవం మరేదీ ఉండదని నా నమ్మకం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003e-స్ఫూర్తి కందివనం\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eరచయిత్రి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44609342865455,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/DimkiFrontcover.jpg?v=1761291149","url":"https:\/\/books.ataka.in\/products\/dimki","provider":"అటక","version":"1.0","type":"link"}