{"product_id":"geetanjali","title":"Geetanjali","description":"\u003cp\u003e\u003cspan\u003eనీ నుంచి నేనేమీ కోరలేదు. నా పేరుకూడా\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనీ చెవిని వేయలేదు. వెళ్లివస్తానని నీవు సెలవు\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eతీసుకొని వెళ్ళేటప్పుడు నేను మౌనంగా ఒక్కమాటైనా\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eమాట్లాడకుండా నిల్చున్నాను, వాలుగా పడిన\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచెట్టునీడలో బావిగట్టున ఒంటిగా నిల్చున్నాను. మట్టి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eకుండలలో నీరు నింపుకుని ఆడంగులు యిళ్ళకు\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవెళ్లిపోయారు. \"ప్రొద్దెక్కింది. నువ్వు రావూ?\" అని\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనన్ను పిలిచారు. కాని నేను యేదేదో కలలు\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eకంటూ యిక్కడే నిల్చిపోయాను.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనీవు వచ్చేటప్పుడు నీ అడుగుల చప్పుడు నాకు \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవినిపించలేదు. దీనంగా వున్న కళ్ళతో నా వైపు\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచూచావు. అలసిన కంఠస్వరంతో నీవు మెల్లగా\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనాతో మాట్లాడావు. \"నేనొక పాంధున్ని.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనాకు దాహం వేస్తూంది\" అన్నావు. పగటి కలలలో\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eమునిగివున్న నేను నీ మాటలు విని ఉలిక్కిపడి లేచి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనా కుండలో నుంచి నీ దోసిట్లో నీరుపోశాను. పైన\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచెట్ల ఆకులు గలగలలాడాయి. చెట్ల కొమ్మలలో\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eదాగిన కోకిల కూజితం చేసింది. \"బాబ్లా\" పూల\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eపరిమళం త్రోవ కొననుంచి తేలుతూ వచ్చింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనా పేరేమిటో చెప్పమని నీవు అడిగినప్పుడు\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనేను సిగ్గుతో తలవంచుకొని నిల్చున్నాను.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅవును, నీవు నన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకోటానికి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనీకు నేను చేసిందేమిటి? కాని నీ దాహం\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eతీర్చటానికి నీరిచ్చానన్న జ్ఞాపకం యెప్పుడూ నా \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eహృదయంలో పచ్చగా వుంటుంది. నా హృదయాన్ని\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఎల్లప్పుడూ మాధుర్యంతో నింపివేస్తుంది. చాలా\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eప్రొద్దెక్కింది. వేపచెట్టు ఆకులు గాలికి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eగలగలలాడుతున్నాయి. అలాగే బావిగట్టున\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eకూచుని కలలు కంటున్నాను.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057546780719,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/geethanjali.jpg?v=1773666594","url":"https:\/\/books.ataka.in\/products\/geetanjali","provider":"అటక","version":"1.0","type":"link"}