{"product_id":"illidisina-tommidi-kathalu","title":"Illidisina tommidi kathalu","description":"\u003cp\u003e\u003cem\u003e\u003cstrong\u003eసీమమట్టిని తడిపిన ‘కన్నీటిమేఘం’:\u003c\/strong\u003e\u003c\/em\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eమారుతీ పౌరోహితం కథాసంపుటి రాయలసీమ ప్రాంతపు భాషా పరిమళాలను వెదజల్లుతూ, అక్కడి జీవనాన్ని దర్శింపజేస్తూ, గ్రామీణప్రాంత వ్యక్తుల వ్యధలను అత్యంత సన్నిహితంగా చూపిస్తాయి ఈ సంపుటిలోని మారుతి పౌరోహితం అందించిన తొమ్మిది కథలు. ఇవన్నీకూడా రచయిత అత్యంత సమీపంగా చూసిన వ్యక్తుల వాస్తవ జీవిత కథలు. ఈ రచయిత జీవిత చిత్రణతో ఆగిపోకుండా, ఆయా వ్యక్తుల జీవితాల్లో, వాళ్లెదుర్కొన్న సమస్యల్లో కలగజేసుకొని, తన వంతు సహాయ సహకారాలను అందజేసిన క్షేత్రస్థాయి కార్యకర్తకూడా కావడం విశేషం. అదే ఈ కథలకున్నజీవశక్తి. అయితే ఇవన్నీ కథలేగనుక నిజజీవిత చిత్రాలుగానే మనకు దర్శనమిస్తాయి.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cstrong\u003eఉణుదుర్తి సుధాకర్\u003c\/strong\u003e\u003cbr\u003e\u003cstrong\u003e(రచయిత, నవలాకారుడు, విమర్శకుడు)\u003c\/strong\u003e\u003cstrong\u003e\u003cbr\u003e\u003c\/strong\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003chr\u003e\n\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003cp\u003e\u003cspan\u003eరాయలసీమ నేలనీ\u003c\/span\u003e\u003cspan\u003e, \u003c\/span\u003e\u003cspan\u003eనుడినీ సాధన చేసుకొని మారుతీ పౌరోహితం\u003c\/span\u003e\u003cspan\u003e, \u003c\/span\u003e\u003cspan\u003eనిష్టూరభరితమైన మానవ సంబంధాల చిత్రణ\u003c\/span\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan\u003eచేస్తున్నాడు. పల్లెటూరి నుంచి ఎదిగివచ్చి పల్లెను మరువని తనమూ\u003c\/span\u003e\u003cspan\u003e, \u003c\/span\u003e\u003cspan\u003eబడిపంతులి ఆదర్శమూ కలగలిపి బడీ- చదువూ – బాల్యం అనే త్రయాన్ని అన్ని కథలకూ వనరుగా చేసుకుంటూ పాఠకులకు విభిన్నమైన అనుభవాల్ని అందిస్తున్నాడు. మన చుట్టూ దట్టంగా ద్వేషం కమ్ముకుంటున్న తరుణంలో ఓ పాకిస్తానీ ప్రవాసీ ప్రేమకథను చెప్పి మెప్పించే సాహసం కూడా చేస్తున్నాడు. తరుణ ప్రాయపు ప్రాణసమానమైన కొడుకు మరణాన్ని జీర్ణించుకుంటూ శిథిలమవుతున్న ఒక తల్లి హృదయ కంపననీ\u003c\/span\u003e\u003cspan\u003e, \u003c\/span\u003e\u003cspan\u003eకడుపుకోతనీ ఎంతో ఆర్ద్రంగా మన కళ్లకు కడుతున్నాడు. వెరసి\u003c\/span\u003e\u003cspan\u003e, \u003c\/span\u003e\u003cspan\u003eరాయలసీమ కథకు తనదైన చేర్పును అందిస్తున్నాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\u003cstrong\u003eజి. వెంకటకృష్ణ\u003cbr\u003eకవి, రచయిత, విమర్శకుడు.\u003c\/strong\u003e\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":45433616072751,"sku":null,"price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/illidisinattommidikathalu.jpg?v=1780771278","url":"https:\/\/books.ataka.in\/products\/illidisina-tommidi-kathalu","provider":"అటక","version":"1.0","type":"link"}