{"product_id":"jajimalli","title":"Jajimalli","description":"\u003cp\u003e\u003cspan\u003eపువ్వులను చూస్తే ఆనందపడని బాలిక ఎవరు? పువ్వులు జన్మ చాలించి పూబోడులై పుడతాయో, పూబోడులే అవతారాలు చాలించి పూవులై పుడతారో! పద్దాలు చిన్న బాలిక. వాళ్ళింటి దగ్గరవున్న నాగమల్లి చెట్టు పువ్వులు వానాకాలంలో జల్లులు జల్లులుగా రాలుతూన్నప్పుడు, తెల్లవారుతూనే లేచి, ఆ చిరిగిపోరున తాటాకు బుట్టలో పోగుచేసి ఏవేవో అర్థంకాని, అర్థానికి అతీతమైన చిన్న బిడ్డల వెర్రిపాటలు పాడుకుంటూ పోగుచేసేది. 'అమ్మా! రుయాళ ఎన్ని పూవులు దొరికాయో! ఏంటనుకున్నావు. ఈయేళ ఈ పువ్వులన్నీ ఎట్టి జడేసుకుంటానమ్మా!' అని వాళ్ళ పూరిగుడిసెలో గంతులు వేసేది.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45809446584367,"sku":null,"price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/jaajimalli.jpg?v=1786456431","url":"https:\/\/books.ataka.in\/products\/jajimalli","provider":"అటక","version":"1.0","type":"link"}