{"product_id":"jandhyala-jokes-1","title":"Jandhyala Jokes - 1","description":"\u003cp\u003e\u003cb\u003e\u003cstrong\u003eహాస్యం పరమౌషధం\u003c\/strong\u003e\u003cbr\u003eతెలుగుకవిత్వం అంటే నన్నయ్య, నాటకం అంటే బళ్ళారిరాఘవ, కార్టూన్ అంటే బాపుగారు గుర్తొచ్చినట్లుగా\u003cbr\u003eహాస్యచిత్రాలంటే జంధ్యాలగారి పేరు చిరస్మరణీయం. తెలుగుచిత్రాల్లో హాస్యం భ్రష్టుపడిపోతున్న సమయంలో\u003cbr\u003eజంధ్యాల రంగప్రవేశంచేసి నాలుగుస్తంభాలాట, రెండురెళ్ళుఆరు, అహనా పెళ్ళంట! లాంటి 40 సినిమాలకి\u003cbr\u003eదర్శకత్వంవహించి సిసలైన హాస్యాన్ని తెలుగువారికి మళ్ళీ గుర్తుచేశారు. ''జంధ్యాల జోక్స్'లోని జోకులన్నీ\u003cbr\u003eఆయనకు నచ్చినవి, మెచ్చినవి. జెమినీ టీవీలో ప్రసారమైన 'జోక్షో'లో  వీటిలోని కొన్ని దృశ్యరూపకంగా\u003cbr\u003eవచ్చి లక్షలాది తెలుగు నవ్వులను చూశాయి, కాబట్టి మీరు కూడా  ఇవిచదివి మనసారా నవ్వుకోండి. మీరు\u003cbr\u003eనవ్వకూడదని నిర్ణయించుకున్నా, ఈ జోకులేం చిన్నబుచ్చుకోవు,  ఎందుకంటే వాటిసత్తాఏమిటో వాటికి\u003cbr\u003eతెలుసు. ఈ పుస్తకంలో అబ్బాయి అమ్మాయిల జోకుల నుండి అత్తగారూ ఆఫీసర్ల దాకా ఉన్నాయి. అందరికీ\u003cbr\u003eఇది చక్కని టానిక్. కాబట్టి నిరభ్యంతరంగా నవ్వుకోండి.\u003cbr\u003eఈ పుస్తకం చదివేముందు చిన్న షరా. ఇది స్వంతడబ్బుతో కొన్నవారికే నవ్వుగ్యారంటీ ఇవ్వబడుతుంది.\u003cbr\u003eఉచితంగా చదివేవారికి ప్రచురణకర్తలు ఎటువంటి హామీ ఇవ్వలేరు. సైకాలజిస్టులు వత్తిడి తగ్గించుకోడానికి\u003cbr\u003eలాఫింగ్ థెరపీని సిఫార్సు చేస్తుంటారు. అందుకే వత్తిడి ఉన్నవారికి ఇది  పరమౌషధం.\u003c\/b\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45061148966959,"sku":null,"price":50.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/jandhyalajokes1.jpg?v=1773772551","url":"https:\/\/books.ataka.in\/products\/jandhyala-jokes-1","provider":"అటక","version":"1.0","type":"link"}