{"product_id":"kalala-kougili","title":"Kalala Kougili","description":"\u003cp\u003eకలల కౌగిలి యద్దనపూడి సులోచనారాణి\u003c\/p\u003e\n\u003cp\u003eభారతి విజిటర్స్ రూమ్ కి వచ్చింది. అక్కడ ఒక యువకుడు కూర్చుని వున్నాడు. అతని నుదిటిమీద. మోచేతి దగ్గర ప్లాస్టర్లు వున్నాయి. అతను అక్కడున్న పుస్తకం చూస్తున్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eభారతి \"ఎక్స్యూజ్ మీ\" అంది.\u003c\/p\u003e\n\u003cp\u003eఅతను చటుక్కున తలెత్తాడు. భారతిని చూడగానే కుర్చీలోనుంచి లేస్తూ\u003c\/p\u003e\n\u003cp\u003e\"మీరు-\" అన్నాడు సందేహంగా,\u003c\/p\u003e\n\u003cp\u003e\"నా పేరు భారతి.\"\u003c\/p\u003e\n\u003cp\u003eఆ పేరు వినగానే అతని కళ్ళలోకి అనందంలాటిది చెంగున ఎగిరి వచ్చింది.\u003c\/p\u003e\n\u003cp\u003eఅతని ముఖం చూస్తుండగానే సంతోషాతిశయంతో కాంతిమయంగా అయింది. అతను భారతిని ఆపాదమస్తకం. ఒక దేవతని చూసినట్టుగా పవిత్రంగా, శ్రద్ధగా చూసాడు.\u003c\/p\u003e\n\u003cp\u003e“మీరు-మీరేనా\" సంభ్రమంగా, తడబాటుగా అన్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003e\"మీరు-\" అతని దెబ్బలని చూస్తూ అనుమానంగా అడిగింది భారతి.\u003c\/p\u003e\n\u003cp\u003e\"నా పేరు సత్యజిత్. మీరు నన్ను స్కూటర్ యాక్సిడెంట్ అయినప్పుడు రక్షించారే...\"\u003c\/p\u003e\n\u003cp\u003e\"ఓ!\" ఈసారి భారతి కళ్ళు మెరిశాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eఆద్యంతం ఉత్కంఠతతో మిమ్మల్ని చదివించే ఈ నవలారాజం కేవలం రొమాంటిక్ థ్రిల్లరేకాదు!\u003c\/p\u003e\n\u003cp\u003eసస్పెన్స్ థ్రిల్లర్ కూడా\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504135233583,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kalalakougili_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782041341","url":"https:\/\/books.ataka.in\/products\/kalala-kougili","provider":"అటక","version":"1.0","type":"link"}