{"product_id":"myna","title":"Myna","description":"\u003cp\u003e\u003cspan\u003eఈ నవలకు వస్తువు, ఒక మలుపుకూ, మరో మలుపుకూ మధ్యగల జీవితం. ఇతివృత్తాన్ని ఎన్నుకోవడం అనేది రచయిత దృష్టిని బట్టి ఉంటుంది. నది ఒడ్డునకూర్చున్న మనిషికి పూర్తిగా నది అంతా కనిపించదు. ఏ కొండ పక్కనో చటుక్కున మలుపు తిరిగిన చోట కనబడటం ప్రారంభించి, మనిషి ముందు నుండి వెళ్లి, ఏ చెట్ల గుబురుల పక్కకో మళ్ళి, మాయమైపోతుంది. కొండ మీద నిలబడి చూస్తే మరికాస్తా ఎక్కువ కనిపిస్తుంది. విమానం మీద నుండి మరీనీ. దృష్టిని బట్టి మారుతుంది. ఏ ఫోటోను తీసుకున్నా మూడూ నదిని చూపించేవే. రచయిత దేన్నైనా ఎన్నుకోవచ్చు. అయితే ఆ ఫోటోలు ఏవో రెండు మలుపుల మధ్యగల నదిని చుపించేవిగా ఉంటే చూడటానికి బాగుంటాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e       సాహిత్యపు పరిభాషలో వీటినే 'ట్విస్ట్'లు అంటారు. చక్కటి రెండు ట్విస్ట్ ల మధ్యగల జీవితం నవలకు పరిపూర్ణతను, అందాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ నవలలో ప్రధాన పాత్రను దాటుకుని వెళ్లి, అందమైన ఒక ట్విస్ట్ తో కథను ప్రారంభించాల్సి వచ్చింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e       ఈ నవలలో ఒక జీవితాన్ని యధాతథంగా చూపించడానికి ప్రయత్నించారు రచయిత. ఇది ఫోటో ధోరణిలో వేసిన చిత్రం. ఈ జీవిత చిత్రణలో ఆ వ్యక్తీ బాధలూ, సుఖాలూ, ఆశలూ, జీవిత సంగ్రామంలో నిలదొక్కుకునే ప్రయత్నాలూ, పరిణామాలూ - అన్నీ ఇందులో ఉన్నాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e       ఈ కథ ఎక్కడో జరగడం లేదు. మీ ముందే జరుగుతుంది. మీరు ప్రేక్షకులు. ఇందులోని ప్రతి కదలికను చిత్రంగా గీశాను. ఈ చిత్రాలన్నింటిని వరుసగా పేర్చి గబగబా ఒక వేగంతో చూసుకుంటూ వెళ్తే మీ ముందు ఒక సినిమా కదులుతుంది. తెలుగు సాహిత్యానికి కొత్తదైన ఒక తెలుగు జీవితం ఈ నవలలో ఉంది.  ఈ నవల కొత్తదనం కావాలనుకున్న వారి గురించి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e                                                                                                                       - శిలా వీర్రాజు   \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055014404143,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Maina.jpg?v=1773594622","url":"https:\/\/books.ataka.in\/products\/myna","provider":"అటక","version":"1.0","type":"link"}