{"product_id":"palukudari-payanam","title":"Palukudari Payanam","description":"\u003cdiv class=\"x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a\"\u003e\n\u003cdiv dir=\"auto\"\u003eజీవితమంటే విసుగ్గా అనిపించిన క్షణం ఏదైనా ఉందా మీకు? పోనీ ఈ సమాజం, దాని చుట్టూ ఉండే రకరకాల గోడలూ లాంటి పదాల మీద ఆసక్తి ఎప్పుడైనా కలిగిందా? అవేమిటో మీలో ఉన్నాయో లేదో తెలుసుకోవాలని కూడా అనిపించే ఉంటుంది...\u003c\/div\u003e\n\u003cdiv dir=\"auto\"\u003eఅలాంటప్పుడే మనకు కొంత స్పేస్ కావాలనిపిస్తుంది, మనకు ఓ మాట తోడిచ్చే మెంటార్ అవసరం అనిపిస్తుంది. జీవితం మీద స్పష్టత కోసం వెతుక్కుంటున్న సమయంలో ఇలాంటి పుస్తకం దొరికితే కొంతైనా ఆ వెలితి తీరినట్టే. బవా చెల్లదురై పేరు తెలుగువాళ్లకి సుపరిచితం కాదుగానీ తమిళ సినిమా, సాహిత్యంలో బవా చాలా పరిచితుడు. సున్నితమైన భావంతో జీవితాన్ని విశ్లేషించింట్టుగా అనిపించే ఈ వ్యాసాలు అన్నీ ఒకదగ్గర చదివితే బవా మనకు ఏం చెప్పదలుచుకున్నదీ, మనం జీవితంలో ఎలా ఉండాలనుకున్నదీ కొంత అర్థమవుతుంది.\u003c\/div\u003e\n\u003cdiv dir=\"auto\"\u003eఅలాగని ఇదంతా ఏ అర్థం కాని ఫిలసఫీనో, మరే ఆధ్యాత్మికమార్గాన్నో చెప్పదు. అచ్చంగా మన చుట్టూ ఉండే జీవితాలని చెబుతూనే ఈ ప్రపంచన్ని మనకు అర్థం చేయిస్తుంది. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనిపించినప్పుడు, ఈ ప్రపంచమంటే ఏమిటో కొంత పరిచయం చేసుకోవాలనిపించినప్పుడూ ఈ పుస్తకంలోని ఏదో ఒక వ్యాసాన్ని అలా తెరిచి చూస్తే చాలు... ఏదో ఊరట దొరుకుతుంది.\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv class=\"x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a\"\u003e\n\u003cdiv dir=\"auto\"\u003eతమిళంలో ఉన్న ఈ వ్యాసాలని తెలుగువాళ్లకి పరిచయం చేసిన జిల్లేళ్ల బాలాజీ గారి అనువాదం మిమ్మల్ని కట్టి పడేస్తుంది. ఇది కేవలం పుస్తకం కాదు ఈ ప్రపంచాన్ని మీకు అర్థం చేయించే ఒక మిత్రుడు..\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Balabooks","offers":[{"title":"Default Title","offer_id":45463595286575,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Palukudaripayanamfront.jpg?v=1781250965","url":"https:\/\/books.ataka.in\/products\/palukudari-payanam","provider":"అటక","version":"1.0","type":"link"}