{"product_id":"pravasamlo-pratighatana","title":"Pravasamlo Pratighatana","description":"\u003cp\u003e\u003cstrong\u003eఒక కవి దృష్టిలో ...\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e'కుండపోత వర్షంలో ఏదో ఉంది \/ నాకది ఏడవడం సరైందన్నట్టు చేస్తుంది .... అని, భారతదేశంలో దశాబ్దాలుగా శరణార్థిగా నివసించిన తన తల్లి మరణాన్ని గుర్తుచేసుకుంటూ త్రిభాషా కవయిత్రి సోనమ్ త్సోమో రాసింది. ప్రయాణ పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న సోనమ్, తన తల్లి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయింది.\u003c\/p\u003e\n\u003cp\u003e'వాస్తవం కారణంగా ఒంటరిగా ఉండటం మనకు తెలిసినవి చాలా ఉన్నప్పటికీ\/ పంచుకోగల వ్యక్తులు ఎవరూ లేక -\/ భవిష్యత్తు కోసం ఆశలు లేదా ప్రణాళికలు -\/ గత జ్ఞాపకాలైనా...' అని టిబెట్లో పుట్టి అరవై ఐదు సంవత్సరాలకు పైగా ప్రవాసంలో నివసించిన లాసాంగ్ త్సెరింగ్ రాశాడు.\u003c\/p\u003e\n\u003cp\u003e'పుట్టినప్పటి నుండి, మేము ఏడుస్తున్నాం. అంచాత మేము మా భారాలను మా వీపు మీదే మోస్తున్నాం. కానీ మేమిలా శాశ్వతంగా నడవలేం\/ ఎప్పుడో ఒక రోజు మేము భూమిమీద విశ్రాంతి తీసుకుంటాం,' అని చెబుతుంది అమెరికాలో పుట్టి పెరిగిన కవయిత్రి లెకీ, తాను ప్రతిరోజూ టిబెట్ భాష, సంస్కృతికి దూరంగా ఉన్నానని గుర్తుచేసుకుంటూ.\u003c\/p\u003e\n\u003cp\u003eరాజకీయ అణచివేత వలనో, ఆర్థిక పరిస్థితుల వలనో తమ స్వస్థలాన్ని విడిచిపెట్టి జీవించే వారికి, బాధను, తపనను, ఒంటరితనాన్ని వ్యక్తీకరించేందుకు - కవిత్వం ఒక కీలకమైన ఉపకరణం. సోనం, ల్సాసంగ్, లెకీ, ఇంకా అనేకమంది టిబెట్ శరణార్థుల కోసం, కవిత్వం ఒక దృఢమైన మాధ్యమంగా మారింది. వారి లోతైన అనుభవాలను పదబద్ధం చేసి, భావోద్వేగాలను సమగ్రంగా ప్రతిబింబించే శక్తిగా నిలుస్తోంది.......................\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":45433628491823,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/PRAVASAMLOPRATHIGHATANA.jpg?v=1780772546","url":"https:\/\/books.ataka.in\/products\/pravasamlo-pratighatana","provider":"అటక","version":"1.0","type":"link"}