{"product_id":"purnathvapu-polimeralo","title":"Purnathvapu Polimeralo","description":"\u003cp\u003eమహాభారతంలో అవతారమూర్తి శ్రీ వ్యాస మహర్షి మానవజాతికోసం భీష్ముడి పాత్ర ద్వారా అందించిన మహోన్నతమైన 'మానవ సంబంధాల దివ్యౌషధం' ఈ శ్లోకం. ఈ శ్లోక స్ఫూర్తిని స్పృశించేముందు చేంబోలు శ్రీరామశాస్త్రి చేసిన ఈ సంకలనం చదవగానే ఏమనిపించిందో చెప్పాలి.\u003c\/p\u003e\n\u003cp\u003eఇప్పటి రోజుల్లో ఆత్మకథలుగానీ, ఎవరెవరో రాసిపెట్టే జీవితకథలుగానీ - అధిక శాతం - వాస్తవాల్ని మరుగుపర్చి, లేదా నిజాయితీకి ముసుగు వేసి, అవలక్షణాలున్న మనిషిని కూడా మహానుభావుడిగా ప్రదర్శించే ప్రయత్నాలే. అలాంటి రచనలు చూసి చూసి, జీవితకథలు అంటే తేనెలద్దిన ఆయుర్వేదపు గుళికల్లాంటి చేదుమందులే అన్న అభిప్రాయం కలుగుతున్న రోజులివి.\u003c\/p\u003e\n\u003cp\u003eఇలాంటి రోజుల్లో ... 'సమ్మాన్యుడు' అయిన యోగి గారి కుటుంబంలో చేంబోలు శ్రీరామశాస్త్రి అనే ఓ తమ్ముడు తాను జన్మించిన దగ్గరనుంచి చాలా దగ్గరనుంచి చూసిన తన అన్నగారి జీవిత శైలి గురించి, జీవనగమన రీతి గురించి, ఆలోచనా సరళి గురించి... ఇలా పలు కోణాల్లో విశ్లేషించి, ఉన్నది ఉన్నట్లుగా నిక్కచ్చిగా రాయటం ఓ సాహసం.\u003c\/p\u003e\n\u003cp\u003eఅన్నగారు స్వర్గస్థులయ్యాకనే ఆ తమ్ముడు ఈ రచన చేసి ఉంటే, దీని నిజాయితీ\u003c\/p\u003e\n\u003cp\u003eఉండేదేమో! కాని 2015 లోనే ప్రారంభించిన ఈ రచనని ఆయనకే చూపించి \"నీ గురించి నా విశ్లేషణ ఇది అన్నయ్యా\" అని చెబితే, ఆ అన్నగారు దాన్ని ఆసాంతం చదివి, \"నా వ్యక్తిత్వాన్ని భలే బాగా పట్టుకున్నావురా అబ్బాయి\" అన్నాడు. ప్రశంసాపూర్వకంగా.\u003c\/p\u003e\n\u003cp\u003eఏమిటా వ్యక్తిత్వం?\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45054965940271,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/poornatvapupolimeralo.jpg?v=1773593127","url":"https:\/\/books.ataka.in\/products\/purnathvapu-polimeralo","provider":"అటక","version":"1.0","type":"link"}