{"product_id":"rekkachatu-akasham","title":"Rekkachatu Akasham","description":"\u003cp\u003e\u003cspan\u003e\"Each time a woman stands up for herself, without knowing it possibly, without claiming it, she stands up for all women.\" — Maya Angelou ప్రతి స్త్రీ జీవితం భిన్నమైనట్లే వారి సమస్యలు కూడా అంతే విభిన్నం. ఎన్నో ప్రశ్నలు, ప్రశ్నార్థకాలు.నేనెవరు అన్న ఒక ప్రశ్న నుండి మేమెవరు అన్న సామూహిక ప్రశ్న ఎదురయినప్పుడు అది అసహాయత్వాన్ని చీల్చుకుని బయటకి వచ్చే ఉరుము అవుతుంది. ఈ నవలలోని పాత్రలు తమ చెదిరిన జీవితాలను, దాని తాలూకు చీలిన ముక్కల్ని ఏరుకుని తిరిగి పునర్నిర్మించుకుంటాయి. ఆ స్త్రీల బాధ ఒక మౌనం. వాళ్ళు పడి లేస్తారు, కానీ ఒంటరిగా కాదు. ఎందుకంటే, ప్రతి స్త్రీకి అసలైన బలం—ఇంకొక స్త్రీ చేతిని పట్టుకోవడంలో ఉంటుంది. అందుకే సిస్టర్ హుడ్ అనేది ఈ నవల్లో కేవలం ఒక పదం కాదు. అది ఊపిరి. అది బలహీనతలోంచి పుట్టిన సామూహిక శక్తి. మనం ఎప్పుడైనా పూర్తిగా మన లాగ కావాలంటే, మనతో పాటు ఉండే మరొకరినీ పూర్తిగా మన స్నేహితురాలిగా అంగీకరించాలి. చదువుకుని, ఆర్థిక స్వావలంబన కల్గిన మధ్య తరగతి స్త్రీలను సమాజం \"భద్ర జీవులు\" గా ముద్ర వేస్తుంది. ఆ భద్ర జీవులు పురుష స్వామ్యం తమ నెత్తిన పెట్టిన భారాలను మోస్తూ లక్ష సమస్యల్ని నిత్యం ఎదుర్కొంటున్నా, సమాజం వారి సమస్యల్ని గుర్తించడానికి వెనకడుగు వేస్తుంది. సొంత సంపాదన ఉన్న స్త్రీలందరూ విముక్తులే అని భావిస్తుంది. సమకాలీన సాహిత్యం సైతం వారి జీవితాలను ప్రతిబింబించడానికి సుముఖంగా లేదు. ఈ నవల అన్ని వర్గాల స్త్రీలకూ ప్రాతినిధ్యం వహించదు. ఆ మాటకొస్తే ఏ నవలా అన్ని వర్గాలనూ ప్రతిబింబించదు. మన ఇంట్లోనూ, మన చుట్టూ నవ్వుతూ ఉల్లాసంగా కనిపించే కొందరు స్త్రీలను, వారి ఉల్లాసం వెనుక వారు మౌనంగా, ధైర్యంగా చేస్తున్న పోరాటాలను గురించి ఈ నవల మాట్లాడుతుంది. మన మధ్యన ఉన్న అటువంటి కొద్ది మంది కథే ఈ \"రెక్క చాటు ఆకాశం\". పురుష స్వామ్యం వేసిన చిక్కుముళ్ళ ను విదిలించుకుని రెక్కలు విప్పి ఆకాశానికి ఎగరగలిగిన స్త్రీల కథ.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44779657592879,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/rekkachatuaakasamtelugubook.jpg?v=1766082676","url":"https:\/\/books.ataka.in\/products\/rekkachatu-akasham","provider":"అటక","version":"1.0","type":"link"}