{"product_id":"savaari-kathalu","title":"Savaari Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eగమ్యం తెలియని బతుకు సవారీ ఈ 'గల్ఫ్ జిందగీ'\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఇది నా తొలి కథల సంపుటి. నిజంగా ఇదంతా ఒక కలలా ఉంది. నా మనసులోని ఘర్షణ నుండి పుట్టిన కథలన్నీ ఇలా అచ్చులో, ఒక పూర్తిస్థాయి పుస్తక రూపంలో నా కళ్లముందు చూసుకోవడం ఎంతో ఆనందంగానూ, అంతకుమించి కాస్త గర్వంగానూ ఉంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eమాది తెలంగాణ, ఖమ్మం జిల్లా, మధిర మండలంలోని ఖాజీపురం అనే చిన్న గ్రామం. మాది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం. నాకు తెలిసినంత వరకు మా కుటుంబంలో కానీ, మా ఊరిలో కానీ... సాహిత్య నేపథ్యం ఉన్నవాళ్లు ఎవరూ లేరు. మా గ్రామం నుండి ఒక పూర్తిస్థాయి పుస్తకాన్ని ప్రచురించిన మొదటి వ్యక్తి బహుశా నేనే కావచ్చు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచిన్నప్పుడు మా నాన్న ప్రతి ఆదివారం నన్ను మా ఇంటి పక్కనే ఉండే రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ చాంద్ గారి ఇంటికి 'ఈనాడు' పేపర్ తీసుకురమ్మని పంపేవారు. నేను ఆ పేపర్తో పాటు ఆదివారం అనుబంధం పుస్తకాన్ని కూడా ప్రత్యేకంగా అడిగి తెచ్చుకునేవాడిని. దాంట్లో వచ్చే కథలను ఎంతో ఆశగా, ఇష్టంగా చదవడం దగ్గర నుంచే నాకు తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి మొదలైంది. అలా మొదలైన ఆసక్తి కాలేజీకి వెళ్లాక ఇంకాస్త బలపడింది. నేను ఐఐఐటీ నూజివీడు (IIIT Nuzvid) లో ఇంటిగ్రేటెడ్ బీటెక్ చదువుతున్నప్పుడు మా అందరికీ కాలేజీ యాజమాన్యం లాప్టాప్ లు ఇచ్చింది. ఆ లాప్టాప్ నాకో సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. అందులో పీడీఎఫ్ (PDF) రూపంలో రకరకాల పుస్తకాలు, తెలుగు సాహిత్యం, ఇంగ్లీష్ నవలలు, ప్రపంచ కథలు... ఇలా ఒకటేమిటి, చేతికి దొరికిన ప్రతి పుస్తకాన్ని చదివేవాడిని. అలా సాహిత్యం పట్ల నాలో ఇష్టం మరింతగా పెరిగింది. కాలేజీ రోజుల్లో ఇంగ్లీషులో చిన్న చిన్న కథలు, కవితలు రాసుకునేవాడిని, కానీ వాటిని ఎవరికీ చూపించే ధైర్యం చేయలేదు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":45587215450159,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/savaarikathalu.jpg?v=1783693356","url":"https:\/\/books.ataka.in\/products\/savaari-kathalu","provider":"అటక","version":"1.0","type":"link"}