{"product_id":"screenplay","title":"Screenplay","description":"\u003cp\u003e\u003cspan\u003eసుజాత సార్ నాకు స్కూల్ రోజుల నుంచే తెలుసు. ఓ పాఠకుడిగా ఆయనవి ఎన్నో కథలని చదివాను. చాలా కథలు నాకెంతో ఇష్టం కూడా. ముఖ్యంగా కొన్ని చిన్నకథలు. మేమిద్దరం కలిసి 4 సినిమాలు రాశాం - ‘రోజా’, ‘తిరుడా తిరుడా’ (దొంగ దొంగ)’, ‘దిల్ సే’, ‘అమృత’. ఓ దర్శకుడికి ఉండే శైలిని ఆయన అర్థం చేసుకోగలగడం వల్ల, ఆయనతో పని చేయడం ఆనందంగా ఉండేది. కానీ నన్ను ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేసేది – ‘ఎన్నెన్నో విభిన్నమైన విషయాల గురించి రాయగలిగే ఆయన శక్తి.’ అంతా తెలిసివుండవచ్చు, తెలిసినదాన్ని మాట్లాడవచ్చు, కానీ వాటిని కలం పట్టి కాగితంపై సజావుగా వ్రాయడం అంత సులభం కాదు. దీనికి స్పష్టమైన ఆలోచనతో పాటు, పాఠకుడి మనసు దోచుకునే శైలి అవసరం. ఈ స్క్రీన్ప్లేపుస్తకం నన్ను ఆశ్చర్యపరిచింది. స్క్రీన్ప్లేనిర్మాణం, దాని మూలతత్వాన్ని ఇలా స్పష్టంగా, అర్థమయ్యేలా ఆయన రాయగలిగారు. నేను నా మొదటి సినిమా తీసే సమయానికి ఈ పుస్తకాన్ని ఆయన ఎందుకు రాయలేదు? భారతీయ సినిమాకి, భారతీయ స్క్రీన్ప్లేలకు ఎన్నాళ్లుగానో ఉన్న లోటుని తీర్చే తొలి అడుగు ఇదే, పెద్ద అడుగు కూడా ఇదే. --మణిరత్నం\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44474691485743,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Screenplaybookf.jpg?v=1756780848","url":"https:\/\/books.ataka.in\/products\/screenplay","provider":"అటక","version":"1.0","type":"link"}