{"product_id":"uppugali-kaburlu","title":"Uppugali Kaburlu","description":"\u003cp\u003eఆంధ్రదేశానికి సుదీర్ఘమైన సముద్రతీరం ఉన్నది; ప్రాచీనకాలం నుండి సాగిన వాణిజ్య నౌకాయాన చరిత్రా ఉన్నది. నౌకా వర్తకుల సహకారంతోనే బౌద్ధం, ఇరుగుపొరుగు దేశాలకు వ్యాప్తి చెందింది. అయినప్పటికీ, తెలుగువారి నౌకాయాన అనుభవాలు ఎక్కడా నమోదు అయినట్టు లేదు. పదిహేనేళ్లపాటు వాణిజ్య నౌకలపై మెరైన్ ఇంజినీరుగా, ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణాలు సాగించిన ఉణుదుర్తి సుధాకర్ అనుభవాల సంగ్రహం ఈ పుస్తకం. అయితే ఇది సుమారు ఏభై ఏళ్లనాటి నౌకారంగ సంగ్రహావలోకనం, ఒక్కమాటలో చెప్పాలంటే అది ఇంటర్నెట్ కన్నా ముందరి కాలం. రచయిత సందర్శించిన సోవియట్ యూనియన్, మావో కాలపు చైనా, షా పాలనలోని ఇరాన్, సైనిక నియంతృత్వంలోని అర్జెంటీనా, చే గెవారా జన్మస్థలం, పాకిస్తాన్లో శివలింగ దర్శనం ఇందులోని కొన్ని విశేషాలు. పాఠకుడిని వెంటబెట్టుకొని ఆయా ప్రదేశాలను సందర్శింపజేస్తూనే, అక్కడి చారిత్రక విశేషాలను ఆవిష్కరిస్తాడు రచయిత. తెలుగులో వస్తున్న యాత్రా సాహిత్యానికిది అద్వితీయమైన చేర్పు. • ఛాయ ప్రచురణలు\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":67589356683444,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/uppugaalikaburlu.jpg?v=1791910095","url":"https:\/\/books.ataka.in\/products\/uppugali-kaburlu","provider":"అటక","version":"1.0","type":"link"}