{"product_id":"yaradakonda-ata-award-winning-novel","title":"YaradaKonda - ATA Award Winning Novel","description":"\n\u003cp\u003eజాలరుల కుగ్రామంగా మొదలైన విశాఖపట్నం , రెండో ప్రపంచ యుద్ధం తరువాత మహానగరంగా అవతరించడానికి మూలకారణమైన భౌగోళిక విశేషం యారాడ కొండ. విశాఖపట్నం ఎదుగుదలకు అదొక కొండగుర్తు. ఎంతో మందికి ఉపాధినీ, కొంత మందికి సంపదనూ ప్రసాదించిన బంగారు కొండ అది. ఆ కొండ విశాఖపట్నం కథను చెప్పుకొస్తే అది ఎలా ఉంటుంది? గడచిన వందేళ్ల కాలంలో అక్కడి మనుషులూ, వాళ్ల ఆశలు, ఆశయాలూ, వ్యధలూ, బాధలూ, సుఖ సంతోషాలనూ, అలాగే వీటన్నింటినీ నడిపించిన శక్తులనూ యారాడ కొండ నమోదుచేసి వినిపించిన గాథకు నవలా రూపం ఈ రచన. మూలాలను తెలుసుకున్నప్పుడే ఎదుగుదల అర్థవంతం కాగలదనే నమ్మికతో ఏరికూర్చిన సృజన ఈ 'యారాడ కొండ' నవల.\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44397769392175,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/yarada-konda-front-cover.webp?v=1754490206","url":"https:\/\/books.ataka.in\/products\/yaradakonda-ata-award-winning-novel","provider":"అటక","version":"1.0","type":"link"}