Skip to product information
అమృతధార యద్దనపూడి సులోచనారాణిమనోజ్ అమూల్యని పరీక్షగా చూస్తూ అడిగాడు. "అట్లా అయితే నువ్వు చెప్పేదే నిజమైతే శివా చనిపోయిన వెంటనే నా దగ్గరకు వెంటనే ఎందుకు రాలేదు".
"రెండున్నర సంవత్సరాలు ఒంటరిగా నేను, నేనుగా బ్రతకగలనేమో అని ప్రయత్నించాను. దాదాపు శక్తికి మించి పోరాడాను. కాని నావల్ల కాలేదు. మీ దగ్గరికి రాక తప్పలేదు". అమూల్య కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టే ఆగిపోయింది.
ఒక్క క్షణం తర్వాత తనను తాను నిగ్రహించుకుని, దించిన తల ఎత్తి దిన దిన గండంగా నేను బ్రతకలేను. ఎంత ధైర్యం ఉన్నా ఆడపిల్లగా ఈ సమాజంలో ఎదుర్కోలేనివి చాలా ఉన్నాయి. అందుకే మీ దగ్గరికి రాక తప్పలేదు.
అమూల్యకి వచ్చిన ఆపద ఏది? మనోజ్ దానిని ఎలా పరిష్కరించాడు?
అద్భుతమైన కథనంతో, అపురూప సంఘటనలతో హృదయానికి హత్తుకునేలా మలచిన అపురూపమైన నవల