Skip to product information
Illidisina tommidi kathalu
1/2

Illidisina tommidi kathalu

Rs. 160.00

సీమమట్టిని తడిపిన ‘కన్నీటిమేఘం’:

మారుతీ పౌరోహితం కథాసంపుటి రాయలసీమ ప్రాంతపు భాషా పరిమళాలను వెదజల్లుతూ, అక్కడి జీవనాన్ని దర్శింపజేస్తూ, గ్రామీణప్రాంత వ్యక్తుల వ్యధలను అత్యంత సన్నిహితంగా చూపిస్తాయి ఈ సంపుటిలోని మారుతి పౌరోహితం అందించిన తొమ్మిది కథలు. ఇవన్నీకూడా రచయిత అత్యంత సమీపంగా చూసిన వ్యక్తుల వాస్తవ జీవిత కథలు. ఈ రచయిత జీవిత చిత్రణతో ఆగిపోకుండా, ఆయా వ్యక్తుల జీవితాల్లో, వాళ్లెదుర్కొన్న సమస్యల్లో కలగజేసుకొని, తన వంతు సహాయ సహకారాలను అందజేసిన క్షేత్రస్థాయి కార్యకర్తకూడా కావడం విశేషం. అదే ఈ కథలకున్నజీవశక్తి. అయితే ఇవన్నీ కథలేగనుక నిజజీవిత చిత్రాలుగానే మనకు దర్శనమిస్తాయి.

  • ఉణుదుర్తి సుధాకర్
    (రచయిత, నవలాకారుడు, విమర్శకుడు)

     


రాయలసీమ నేలనీనుడినీ సాధన చేసుకొని మారుతీ పౌరోహితంనిష్టూరభరితమైన మానవ సంబంధాల చిత్రణ చేస్తున్నాడు. పల్లెటూరి నుంచి ఎదిగివచ్చి పల్లెను మరువని తనమూబడిపంతులి ఆదర్శమూ కలగలిపి బడీ- చదువూ – బాల్యం అనే త్రయాన్ని అన్ని కథలకూ వనరుగా చేసుకుంటూ పాఠకులకు విభిన్నమైన అనుభవాల్ని అందిస్తున్నాడు. మన చుట్టూ దట్టంగా ద్వేషం కమ్ముకుంటున్న తరుణంలో ఓ పాకిస్తానీ ప్రవాసీ ప్రేమకథను చెప్పి మెప్పించే సాహసం కూడా చేస్తున్నాడు. తరుణ ప్రాయపు ప్రాణసమానమైన కొడుకు మరణాన్ని జీర్ణించుకుంటూ శిథిలమవుతున్న ఒక తల్లి హృదయ కంపననీకడుపుకోతనీ ఎంతో ఆర్ద్రంగా మన కళ్లకు కడుతున్నాడు. వెరసిరాయలసీమ కథకు తనదైన చేర్పును అందిస్తున్నాడు.

  • జి. వెంకటకృష్ణ
    కవి, రచయిత, విమర్శకుడు.

More books from Chaaya Publications

You may also like