Maa Amma Anadha

Maa Amma Anadha

Rs. 299.00
Skip to product information
Maa Amma Anadha
1/2

Maa Amma Anadha

Rs. 299.00
ఈ పుస్తకం ఒక పాత గులాబీ రంగు పట్టుచీర — తాకితే పట్టులా మెత్తగా ఉంటుంది, లోపలికి దిగితే గుండెని కోసేస్తుంది. సత్యం — 84% రికవరీ రేట్ ఉన్న పక్కా లోన్ రికవరీ ఏజెంట్. ఎదుటివాడి బతుకుని లాక్కోవడంలో ఎక్స్పర్ట్. అలాంటివాడు తన లైఫ్ కొలాప్స్ అవుతున్నప్పుడు, ఈ లోకంలో అందరికంటే ఈజీగా ఎవరిని మోసం చేయొచ్చో చూశాడు. కనిపించింది ఒకే ఒక్క ఆప్షన్ — 'అమ్మ'. ఏదో ఒకటి దోచుకుందామని ఇంటికి వెళ్ళాడు. కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టాక — తన ముప్పై ఎనిమిదేళ్ల జీవితంలో ఒక మనిషిగా అమ్మ గురించి తనకేం తెలీదన్న భయంకరమైన నిజం వాడి మెడ మీద కత్తిలా దిగబడింది. అమ్మ MSc Mathematics చదివిందని తెలీదు. లెక్చరర్ ఆఫర్ వస్తే కాదనుకుందని తెలీదు. అసలు వాడికి స్వేచ్ఛ అంటే తెలీదు. స్వార్థం అంటే తెలీదు. ప్రేమించడం తెలీదు. చిన్నప్పటి నుంచి అమ్మానాన్నలకి దూరంగా ఉండడం వల్ల — ఆఖరికి కన్న ప్రేమ లోతెంతో కూడా తెలీదు. అన్నయ్య ఉనికినే మర్చిపోయిన సొంత చెల్లి. "నీ స్వార్థం ఏంటో నీకే తెలియాలి సత్యం" అనే తాతయ్య. "నీకు మీ అమ్మ లాంటి అమ్మాయి కావాలి" అని కోపంగా వెళ్లిపోయే అంజలి. ఇలాంటి మనుషుల మధ్య తన తల్లి విలువని చాలా ఆలస్యంగా తెలుసుకున్న సత్యం కథ ఇది. ఈ నవలలో రెండే రంగులు ఉంటాయి. బ్లూ అంటే సముద్రం — ఎంత వెనక్కి నెట్టినా మళ్లీ పాదాలను హత్తుకునే అల లాంటి అమ్మ. బ్లాక్ అంటే ఆ ఒడ్డున మొద్దుబారి పడివున్న నల్ల బండరాయి — ఎన్ని తరంగాలు తాకినా స్పందించని కొడుకు స్వార్థం. తీరా వాడు వెనక్కి తిరిగి చూసేసరికి సముద్రం ఇంకిపోయింది. అలలు మూగబోయాయి. చేతిలో ఓ పాత స్టీలు గ్లాసుతో ఒడ్డున పశ్చాత్తాపంలా మిగిలాడు. "బతికున్నప్పుడు గుక్కెడు నీళ్లు ఇవ్వని చేతులు — పోయాక గంగనంతా తెచ్చి పోసినా ఆ దాహం తీరదు." మీరు కొడుకైతే — ఈ పుస్తకం చదువుతూ పేజీల మధ్య తలపెట్టి కాసేపు ఆగిపోతారు. కూతురైతే — చేతిలో ఉన్న ఫోన్ తీసి, కన్నీళ్లతో అమ్మకి వెంటనే కాల్ చేస్తారు. తల్లైతే — మీ గుండెల్లో ఇన్నేళ్లుగా దాచుకున్న గాయం తడిసి ముద్దవుతుంది. తండ్రైతే — మీ ఇల్లే ఒక మనిషిని ఎలా అనాథను చేసిందో చూసి నిలువునా వణికిపోతారు. మీరు పైవేవీ కాకపోతే — కనీసం ఒక మనిషిగా మిగలడానికి ఈ పుస్తకం చదవాలి. మా అమ్మ అనాథ. నా కథ. మీ కథ. మనందరి కథ. — రచయిత గణ

You may also like