A
Anonymous I'm impressed with the packing ✨
A
Anonymous Goodwriting
కష్టం వచ్చినా, ఆపదొచ్చినా దేవుడు ప్రతిసారి ప్రత్యక్షంగా తోడుగా నిలవలేకపోవచ్చు. కానీ, కొన్నిసార్లు ఆ దేవుడు మనిషి రూపంలో నీతో తోడుగా ఉంటాడు. మనం గుర్తించాలి అంతే. నా ఈ ప్రయత్నం ...జీవితంలో ఆశ , నమ్మకం కోల్పోయిన ప్రతీ ఒక్కరికోసం. కష్టాల్ని దాటి నిలబడే దైర్యం కోసం. మీ మొహంపై ఒక చిరునవ్వు కోసం. మీకు కష్టం వస్తే మీ మనసులో గుర్తుచేసుకోను రెండు పదాలు నాదైతే చాలు అనేదే నా స్వార్థం. మీతో ఎవరూ లేరు అనిపించినప్పుడు, ఎక్కడో మీ బుక్ షెల్ఫ్ లో "నీకూ ఓ కృష్ణుడు ఉన్నాడు చూడు" అని గుర్తు చేయాలన్న ఆశ. మనకీ ఓ కృష్ణుడు దొరకాలి అని చెప్పాను కదా.... రండి నా ప్రయాణంలో నాకు దొరికిన కృష్ణుడిని మీకు కూడా పరిచయం చేస్తాను.