ధూమపానం, మద్యపానం నిషిద్ధం అని చెప్పాల్సిన సినిమాలలో అవే దృశ్యాలు చూపిస్తున్నారు. తెలివి తెలీయని వయస్సులో సినిమాలు, అందులోని పాత్రలు, సన్నివేశాలు పిల్లలమీద చాలానే ప్రభావం చూపుతాయి. వారు అందులో చూసిన ప్రతిదీ నిజమే అని, అనుకరించాలని అనుకుంటారు. అది వారి ప్రవర్తన, వ్యక్తిత్వం మీద ప్రభావం చూపుతుంది. సమాజంలో మనకు తెలియకుండానే ఎన్నో అఘాయిత్యాలు మనం సృష్టించుకున్నాం—ఉదాహరణకి అబ్బాయిలు పడవకూడదు, సున్నితంగా ఉండకూడదు, ఇంటిపని లో పాలుపంచుకోకూడదు... ఇలా ఎన్నో, ఎన్నెన్నో...
ఇటువంటివన్నీ మన పిల్లల మనస్తత్వాల మీద ప్రభావం చూపకుండా ఉండాలంటే తల్లిదండ్రులు సరైన దారిలో నడిపి చూపిస్తే వారు ఆ మార్గాన్నే ఎంచుకుంటారని చెప్పడమే ఈ కథ యొక్క ఉద్దేశ్యం.