Through these stories I want to make people feel seen, heard. I want to make them feel that they are not alone. వాళ్ళ బాధ, నొప్పి.. ఇదంతా చెప్పాలని అనిపించింది. ప్రతి కథ వెనకాల ఎవరో ఒకరి బాధ ఉంటుంది. ఎవరో ఒకరు దాన్ని అనుభవించి ఉంటారు. అందుకే ఈ కథలు చదువుతున్నప్పుడు ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారనేది నా నమ్మకం. ఈ పుస్తకం ద్వారా ఏం చెప్పాలని అనుకుంటున్నా అంటే, నేను చెప్పేది ఒకటే! ఒక కథ.. అందులో ఒక లైన్ ఎక్కడో ఒకరి మీద ఎఫెక్ట్ చూపించి, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తే చాలు. అలాగైనా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ట్రీట్ చేసే విధానం మారుతుందేమోనని నా చిన్న ఆశ. - C.P.గ్రేస్