Skip to product information
Venditera Navalalu

Venditera Navalalu

Rs. 200.00

శంకరం లోనికొచ్చి కూర్చోబోతుండగా, కాళ్లకి చిన్న చిన్న ఇత్తడి బిందెలు రెండు తగిలాయ్. వాటిని కళ్ళకద్దుకొని, తల్లిచెప్తున్నా వినిపించుకోకుండా రెండుచేతుల్లోకి తీసుకొని లయగా వాయించసాగాడు. నిద్రరాని ఓ పెద్ద మనిషి అగ్గిపెట్టెని తీసుకుని వేళ్లతో దానిమీద తాళంవేస్తూ శంకరానికి మరింత హుషారు తెప్పిస్తుంటే బిందెలు పక్కనపెట్టి తన పక్కన కూర్చున్న ఆమెనుంచి తాళంగుత్తి తీసుకుని ఆ అగ్గిపెట్టె శబ్దాన్ని అనుకరించసాగాడు. ప్రయాణీకులందరూ ఆ చిన్న సైజు వాద్య కచేరీని ఆనందంగా తిలకిస్తుండగా సరంగు లాంచిని దగ్గరపడుతున్న రేవువైపు మళ్లించే నిమిత్తం చుక్కాని చక్రం తిప్పాడు.  గోపాదాల రేవు దిగిన తులసి నిద్రలో జోగుతున్న శంకరాన్ని, రేవు ఒడ్డునున్న ముసలి రావిచెట్టు చప్టామీద పడుకోబెట్టి దుప్పటికప్పి, వాడి పక్కనే కూర్చుని ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడసాగింది.

You may also like