Skip to product information
హంటర్ వైట్, ట్వాల్ స్ట్రీట్‌లో ఒక పెద్ద స్టాక్ బ్రోకర్. ఆఫ్రికాలో ‘బిగ్ ఫైవ్’ అనే ఐదు మృగాలను వేటాడటం హంటర్ వైట్ లక్ష్యం. అందులో ఆఖరిదైన రైనోను వేటాడి తన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆఫ్రికాకు బయలుదేరుతాడు. అయితే విధి మరో మలుపు తీసుకుంటుంది. వేట, ఆ తర్వాత జరిగే పరిణామాలు హంటర్‌కు తనలోనే దాగిన ఓ కొత్తవ్యక్తిని పరిచయం చేస్తాయి.
ఆఫ్రికా ఆదివాసీ సంస్కృతి గత రెండు వందల ఏళ్ళుగా ఎలా విధ్వంసానికి గురవుతోందో వేట నేపథ్యంలో ఆసక్తికరంగా వివరిస్తుందీ నవల. డచ్ భాషలో ప్రసిద్ధ రచయిత్రి గేయ స్కోటర్స్ రాసిన ఈ నవల ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు భాషల్లోకి అనువాదం అయ్యింది.