Skip to product information
అనంత్ ను భర్తగా పొందగానే అంతా అన్నపూర్ణను అదృష్టవంతురాలన్నారు. తీరా అనంత్ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత గాని ఆ అమ్మాయికి తన అదృష్టం ఏపాటిదో తెలిసిరాలేదు. అతనిచుట్టూ అతి భయంకరమైన గతం కోటగోడలా పటిష్టంగా ఉండిపోయింది. అనంత్ దగ్గరికి ప్రవేశం ఎలాగో అర్ధం గాని అన్నపూర్ణ అలాగే నిలబడిపోయింది. ఆ దుర్భేద్యమైన గోడను ఛేదింపగలదా ఆ మూగపిల్ల!