మీనాక్షి పాత్ర... పుస్తకం పూర్తయ్యాక కూడా మనసును వెంటాడుతూనే ఉంటుంది. రామ్ మీనాక్షిల ప్రేమను మాటల్లో చెప్పలేం. అది చదివి అనుభవించాల్సిన భావం. అదొక మధురాతి మధురమైన ప్రేమ. ఇక అనుదీప్ మల్లికల కథ... ఈ నవలకు ఊపిరి. వారి ప్రయాణం కథకు మరింత లోతును, భావోద్వేగాన్ని జోడించి, పాఠకుడి మనసులో చాలా కాలం నిలిచిపోతుంది. పుస్తకం ముగిసినా, ఆ పాత్రలు మాత్రం మనతోనే ఉంటాయి.
రచయిత ఎంతో బాగా రాశారు కథను దానిలోని పాత్రలను. ప్రతి ఒక్కరి జీవితం లోని ఒక మల్లికా మరియు అంకిత లాటి స్నేహితులు ఉండాలి. అలాగే రాజేశ్వరి లాటి అమ్మ ఉండాలి. ఈ నవల నేటి తరానికి ఎంతో సందేశాత్మక ఉంది. ఎప్పుడో ఎవరికో ఏదో జరిగితే మనకు అదే జరుగుతుంది. అనుకోవడం మరియు దాని నుండి పారిపోవడం సరికాదు.
ఇంకా
నవల ఇంత బాగుంది అంటున్నావు మరి దీనికి ఎందుకు ఇంత తక్కువ రేటింగ్ ఇచ్చావు అని అనవచ్చు.
దానికి కారణం
నవల అయితే బాగుంది. కానీ ఇది తెలుగు నవలో లేదా ఆంగ్లమో తెలియలేదు. చాలా సందర్భాలలో ఇంగ్లీష్ అవసరం లేకపోయినా ఎక్కువ వాడేశారు.
ఇంకా డైరీ విషయం లో మాత్రం మన తెలుగు సాహిత్యం చాలా గొప్పది రాయడానికి, చదవడానికి చాలా బాగుంటుంది. కానీ రచయిత దాన్ని కూడా ఇంగ్లీషు లో ఇవ్వడమే నాకు నచ్చలేదు.
నవల చదువుతున్న అంత సేపు ఆ ఆంగ్లం నేను విసుగు పుట్టి చేది.
కాస్త తెలుగు పుస్తకాల ను తెలుగు పదాలు, సాహిత్యం నీ వాడి రాయండి.