Arakappu Allam Tea

Arakappu Allam Tea

Rs. 150.00
Skip to product information
Arakappu Allam Tea

Arakappu Allam Tea

Rs. 150.00

ఉణుదుర్తి సుధాకర్ ఆధునిక తెలుగు సాహిత్యంలో చారిత్రక రచనలకు గుర్తింపు పొందారు. గతాన్ని వర్తమానంతో అర్ధవంతంగా సంధించడం ఆయన రచనల విశిష్టత. అయితే ఈ సంకలనంలో మొదటిదైన 'పూర్ణచంద్రోదయం' తప్ప మిగతా ఏడు కథలూ సమకాలీనమైనవే. కళింగాంధ్రలో బౌద్ధం క్షీణించాక కూడా, ఒక ప్రత్యామ్నాయంగా కొనసాగిన తీరును గురించి ఆ కథ చెబుతుంది. మిగతా కథలన్నీ స్వాతంత్య్రం వచ్చిన కాలం నుండి నేటి వరకూ తూర్పు కోస్తా ప్రాంతంలో వచ్చిన మార్పులకు అద్దం పడతాయి. చివరిదైన 'గుండ్రటి అక్షరాలు' భవిష్యత్తుని ఊహిస్తూనే, వర్తమాన పరిణామాలపై లోతైన పరిశీలనలు చేస్తుంది. ఈ ఇంతకు ముందు వెలువడ్డ ఉణుదుర్తి సుధాకర్ కథా సంకలనాలు, 'తూరుపు గాలులు, 'చలిచీమల కవాతు' రెండింటినీ, ఛాయ సంస్థ ప్రచురించింది. మూడవ సంకలనానికి కూడా పాఠకులనుండి విశేషమైన ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం. ఛాయ ప్రచురణలు

More books from Chaaya Publications

You may also like