Skip to product information
Gulabi
1/2

Gulabi

Rs. 200.00
సాహిత్యం సమాజానికి అద్దం పడుతుందంటారు. ఈనాటి కొత్తతరం తెలుగు రచయితలు కేవలం అద్దం పట్టడమే కాదు, మన చుట్టూ జరుగుతున్న వాస్తవ సంఘటనలనే ఇతివృత్తాలుగా మలిచి, నవలా ప్రక్రియకు కొత్త ఊపిరి పోస్తున్నారు. కల్పన కంటే వాస్తవం ఎంత కఠినంగా ఉంటుందో, మన పక్కనే తిరిగే మనుషుల మనసుల్లో ఎలాంటి చీకటి కోణాలు ఉంటాయో ఈ కొత్త కథలు ప్రశ్నిస్తున్నాయి. ఆ కోవలోనే, తెలుగు నవలా ప్రపంచంలోకి అడుగుపెడుతున్న కొత్త రచయిత 'భువన్' తొలి ప్రయత్నమే ఈ 'గులాబి'. ప్రేమ గుడ్డిదని అంటారు. కానీ ఆ ప్రేమ వెనుక ఇంకేదైనా దాగుంటే? నమ్మకమే ఆయుధంగా మారితే? అమాయకత్వానికి, ఆశకు మధ్య జరిగే ఒక ఎమోషనల్ జర్నీ ఈ కథ. ప్రేమ పేరిట జరిగే పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ కథ. గుర్తుచేస్తుంది. కులమతాలు, అంతస్తుల అడ్డుగోడలు,మరియు చట్టానికి దొరకని నేరాల మధ్య నలిగిపోయే అమాయకపు ప్రాణాల వ్యధ ఇది. ఒకవైపు స్వచ్ఛమైన ప్రేమ కోసం పరితపించే మనసు, మరోవైపు పరువు, ప్రతీకారాల మధ్య జరిగే సంఘర్షణ ఈ నవల. వాస్తవ సంఘటనల ప్రేరణతో రాసిన ఈ నవల, పాఠకుడిని ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్కి తీసుకెళ్తుంది. మనం రోజు చూసే వార్తల్లోని నిజాలకు, కల్పన జోడించి రాసిన ఈ నవల మిమ్మల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. మనం నమ్మే ప్రేమ మనల్ని గెలిపిస్తుందా, లేక ప్రేమ పేరుతో మనుషులు -ఓడిపోతారా? అని ఆలోచించేలా చేసే ఒక ఆసక్తికరమైన పేజీర్నర్ ఈ 'గులాబి'.

More books from Anvikshiki Publications

You may also like